India ranks
-
35 దేశాల్లో భారత్‌కు ఆరో స్థానం
లండన్: మెరుగైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది. వారి కృషికి గుర్తింపు ఇవ్వడంతో, గౌరవించడంలో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. బ్రిటన్‌కు చెందిన వార్కీ ఫౌండేషన్ గత వారం ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో భాగంగా ఒక్కో దేశంలో వెయ్యి మందిని ప్రశ్నించారు. టీచర్లను మీరు విశ్వసిస్తున్నారా? వారు మీలో స్ఫూర్తిని నింపుతున్నారా? మీ టీచర్లు ప్రజ్ఞావంతులా? తదితర ప్రశ్నలు సంధించారు. టీచర్లకు గుర్తింపు ఇవ్వడంలో చైనా, ఘనా, సింగపూర్, కెనడా, మలేసియా, భారత్ దేశాలు తొలి ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఉపాధ్యాయులను గౌరవించడం మన నైతిక బాధ్యత అని వార్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వార్కీ చెప్పారు. భారత్‌లో ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో విద్యపై 14శాతం ఖర్చు పెడుతోంది. రెండో స్థానంలో నిలిచిన ఘనాలో 22.1 శాతాన్ని విద్యపై వెచ్చిస్తున్నారు. -
పత్రికా స్వేచ్ఛలో భారత్ స్థానం 133
కాంపిటీటివ్ గెడైన్స్ కరెంట్ అఫైర్స్ రాష్ట్రీయం ఆదర్శ ఆరోగ్య జిల్లాలుగా మెదక్, మహబూబ్‌నగర్ తెలంగాణలోని మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలను ఆదర్శ ఆరోగ్య జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద ఆయా జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు అన్నింటినీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దనున్నారు. అమెరికాకు చెందిన మాండలెజ్ ఇంటర్నేషనల్‌లో భాగమైన మాండలెజ్ ఇండియా... శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన ప్లాంటులో తొలిదశ ఉత్పత్తిని ఏప్రిల్ 25న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. స్పోర్ట్స్ లారెస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా జకోవిచ్ ఆస్కార్ ఆఫ్ స్పోర్ట్స్‌గా పిలిచే లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులను బెర్లిన్‌లో ఏప్రిల్ 18న ప్రదానం చేశారు.అవార్డు విజేతలు: స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్: నొవక్ జకోవిచ్ (టెన్నిస్). స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్: సెరెనా విలియమ్స్ (టెన్నిస్). బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్: జోర్డాన్ స్పీథ్ (గోల్ఫ్). టీం ఆఫ్ ద ఇయర్: ఆల్ బ్లాక్స్ (రగ్భీ యూనియన్). లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు: నికీ లాడా (ఫార్ములావన్). బార్సిలోనా ఓపెన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ (స్పెయిన్) గెలుచుకున్నాడు. ఏప్రిల్ 24న బార్సిలోనాలో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కీ నిషికోరి (జపాన్)ను నాదల్ ఓడించాడు. నాదల్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం ఇది తొమ్మిదోసారి. తాజా టైటిల్ విజయంతో క్లే కోర్టులపై 49 సార్లు టైటిల్ నెగ్గిన గిలెర్మో విలాస్ రికార్డును సమం చేశాడు. మొత్తంగా నాదల్కు ఇది 69వ సింగిల్స్ టైటిల్. భారత రెజ్లర్ సందీప్ తోమర్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మంగోలియాలో ఏప్రిల్ 24న జరిగిన ప్రపంచ క్వాలిఫయింగ్ తొలి టోర్నమెంట్లో 57 కిలోల విభాగంలో సందీప్ మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత పొందాడు. అవార్డులు తారా గాంధీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్‌ను మహాత్మాగాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాచార్జీ ఏప్రిల్ 20న న్యూఢిల్లీలో అందుకున్నారు. శాంతి, సామరస్యం, సంస్కృతి, విద్య రంగాల్లో చేసిన కృషికి గానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది. తారా గాంధీ గత 28 ఏళ్లుగా గాంధీజీ స్థాపించిన కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, పిల్లలకు సేవలందిస్తున్నారు. జాతీయం సివిల్స్ సర్వీసెస్ డే న్యూఢిల్లీలో ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డేను నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వచ్ఛ విద్యాలయ అవార్డు: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్; దాద్రానగర్ హవేలీలు స్వచ్ఛ విద్యాలయ అవార్డుకు ఎంపికయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంలో ముందున్న జిల్లాల అధికారులకు సివిల్ సర్వీసెస్ డేలో ప్రధాని అవార్డులను అందజేశారు. పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 133వ స్థానం పత్రికా స్వేచ్ఛపై జరిపిన సర్వేలో భారత్..133వ స్థానంలో నిలిచింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ఏప్రిల్ 19న విడుదల చేసిన పత్రికా స్వేచ్ఛ సూచీలో ఫిన్లాండ్ వరుసగా ఆరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. తర్వాత స్థానాల్లో నెదర్లాండ్స్ (2), నార్వేలు (3) ఉన్నాయి. మొత్తం 180 దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. దేశంలో 10.38 కోట్ల మంది వృద్ధులు దేశంలో 60 ఏళ్ల వయసు పైబడిన వారి సంఖ్య పెరుగుతోంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 22న విడుదల చేసిన భారత్‌లో వృద్ధాప్యం-2016 నివేదిక ప్రకారం 2011 నాటి జనాభా లెక్కల నాటికి మొత్తం జనాభాలో 10.38 కోట్ల మంది (8.6 శాతం) వృద్ధులున్నారు. 2001లో వీరి సంఖ్య 7.66 కోట్లు (5.6 శాతం). దేశంలోని మొత్తం వృద్ధుల్లో 71 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ స్టెల్త్ యుద్ధవిమానాన్ని పరీక్షించిన జపాన్ జపాన్ తొలిసారిగా అభివృద్ధి చేసిన స్టెల్త్ యుద్ధవిమానాన్ని ఏప్రిల్ 22న ప్రయోగించింది. శత్రుదేశాల రాడార్లకు అందకుండా ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న దీనికి ఎక్స్-2 అని పేరు పెట్టింది. ఇప్పటి వరకు ఇలాంటి స్టెల్త్ యుద్ధవిమానాలను అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే రూపొందించాయి. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా ఏప్రిల్ 23న విజయవంతంగా పరీక్షించింది. ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరిగింది. అంతర్జాతీయం పారిస్ ఒప్పందంపై 171 దేశాల సంతకాలు గ్రీన్ హౌస్ ఉద్గారాల తగ్గింపునకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఏప్రిల్ 22న భారత్ సంతకం చేసింది. 2015 డిసెంబర్లో కుదిరిన ఈ ఒప్పందంపై భారత్ తరఫున కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంతకం చేశారు. ఈ ఒప్పందంపై భారత్‌తో పాటు 171 దేశాలు సంతకాలు చేశాయి. ఒక అంతర్జాతీయ ఒప్పందంపై ఒకే రోజు అత్యధిక దేశాలు సంతకాలు చేయడం ఇదే తొలిసారి. వార్తల్లో వ్యక్తులు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందానికి సల్మాన్ ఖాన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఏప్రిల్ 22న ప్రకటించింది. బాలీవుడ్ నటుడిని ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించడం ఇదే తొలిసారి. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తన అధికార పరిధి విస్తరణలో భాగంగా ఏప్రిల్ 20న సర్వసైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. జిన్‌పింగ్ ఇప్పటికే అధికార కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ, సైన్యాన్ని నియంత్రించే కేంద్ర సైనిక కమిషన్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 22న క్రీడలు, కళలు, సామాజికసేవ, సాహిత్యం, సైన్స్ రంగాల నుంచి మొత్తం ఆరుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. ఎంపికైన వారిలో బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్, మాజీ క్రికెటర్ నవ్ జోత్‌సింగ్ సిద్ధూ, నరేంద్ర జాదవ్ (ఆర్థికం) తదితరులున్నారు. ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు -
సూపర్ స్టూడెంట్స్
ఐసీడబ్ల్యూఏలో ఆలిండియా ర్యాంకులు సాధించిన సూపర్‌విజ్ విద్యార్థులు ఫైనల్లో 47వ ర్యాంకు సాధించిన నగరానికి చెందిన అంధుడు నాగరవితేజ కలలు అందరూ కంటారు.. వాటిని సాకారం చేసుకునే వారే నిజమైన విజేతలవుతారు. ఒకరు ప్రపంచాన్ని చూడలేని అంధుడు.. మరొకరు సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు.. ఇంకొకరు తల్లిదండ్రుల ఆశలనే ఊపిరిగా భావించి ముందుకు కదులుతున్నారు.. దారులు వేరైనా వీరి గమ్యం మాత్రం ఒక్కటే. అదే ఐసీడబ్ల్యూఏ. నిరంతర కృషి, సత్తా ఉంటే గానీ సాధించలేని లక్ష్యాన్ని ఈ ముగ్గురు అలవోకగా ఛేదించారు. నగరంలోని సూపర్‌విజ్‌లో చదువుకుంటున్న ఈ విద్యార్థులు ఐసీ డబ్ల్యూఏలో ఆలిండియా స్థాయిలో ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. తల్లిదండ్రుల సహకారం, సూపర్‌విజ్ కృషితోనే తాము ఈ విజయం సాధించామని చెబుతున్న ఈ ‘సూపర్’ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే.. - లబ్బీపేట కళ్లు లేకపోయినా అందరి ప్రోత్సాహంతో.. నేను లయోల కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు సూపర్‌విజ్ టాలెంట్ టెస్ట్ నిర్వహించింది. ఆ టెస్ట్‌లో నన్ను చూసిన గుప్తాగారు (సూపర్‌విజ్ ఎండీ) అంధత్వం మనిషికే కానీ మనసుకు కాదని, ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా నిరాశపడకుండా ప్రయత్నాన్ని కొనసాగించాలని చెప్పిన మాటలకు ఆకర్షితుడనై సీఏ చేయాలని నిర్ణయించుకున్నా. సీఏ సీపీటీ శిక్షణలో చేరినపుడు మొదట్లో కొంత ఇబ్బందే ఎదురైనా గుప్తాగారు ప్రత్యేకంగా రీసెర్చి చేసి రూపొందించిన బ్లైండ్ టెక్నిక్స్ నాలో నూతనోత్సాహాన్ని నింపాయి. దీంతో సీఏ, సీపీటీ, ఐపీసీసీ పూర్తిచేసి ఫైనల్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ఐసీడబ్ల్యూఏ కోర్సును పూర్తిచేసి ఫైనల్లో ఆలిండియా స్థాయిలో 47వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ర్యాంకు సాధించడానికి సూపర్విజ్తో పాటు మా అమ్మానాన్న, సోదరి కృషి కూడా ఎంతో ఉంది. నాన్న సాంబశివరావు ఆర్టీసీలో పనిచేసి పదవీ విరమణ చేశారు. అమ్మ గృహణి, సోదరి ప్రస్తుతం ఎంటెక్ చేస్తోంది. నాకు చూపు లేకపోయినా వారి ప్రోత్సాహంతో ముందుకుసాగుతున్నా. ఇదే స్ఫూర్తితో సీఏ పూర్తిచేసి మంచి ఉద్యోగం చేయాలనేదే నా ఆకాంక్ష. అందుకు నిరంతరం కృషిచేస్తా. అమ్మానాన్న, గుప్తాగారు, ఇతర అధ్యాపకులకు కృతజ్ఞతలు. - కంచర్లపల్లి నాగరవితేజ, ఐసీడబ్ల్యూఏ ఫైనల్ 47వ ర్యాంకర్, విజయవాడ, అంధుడు కన్నవారి కల నెరవేరింది.. ప్రకాశం జిల్లా వేములపాడుకు చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ఇంటర్మీడియెట్ చదువుతున్నపుడు సీఏ చేయాలన్న ఆకాంక్ష కలిగింది. నాన్న కృష్ణయ్య వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ రమణమ్మ గృహిణి. ఈ విషయాన్ని వారికి చెప్పగా, నువ్వేమి కోరుకుంటున్నావో దానినే కష్టపడి సాధించాలని ఆశీర్వదించి పంపించారు. వారి ఆకాంక్షను ఎన్నడూ విస్మరించలేదు. అమ్మానాన్న పడిన కష్టాల నుంచి పొందిన స్ఫూర్తితో, సూపర్‌విజ్ టెక్నిక్స్‌తో నేడు ఐసీడబ్ల్యూఏ ఇంటర్లో ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాను. ఈ విషయాన్ని అమ్మానాన్నకు ఫోన్‌చేసి చెప్పాను. వారి ఆనందానికి అవధుల్లేవు. నాకు తగిన ప్రేరణ ఇచ్చి ఎలాగైనా పాస్ అవ్వాలనే పట్టుదల కలిగించిన గుప్తాగారి కృషిని నేను జీవితాంతం మరిచిపోలేను. గుప్తాగారు చెప్పిన టెక్నిక్స్ ఎవరు పాటించినా కచ్చితంగా ర్యాంకులు సాధించగలరు. ఈ ఫస్ట్ ర్యాంకును అమ్మానాన్నకు బహు మతిగా ఇవ్వడంతో నా కల నెరవేరింది. సీఏ ఫైనల్ పూర్తిచేసి మంచి ఉద్యోగం సంపాదించడమే నా లక్ష్యం. - మద్దినేని లక్ష్మీనారాయణ, ఐసీడబ్ల్యూఏ ఇంటర్ ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ మంచి ఉద్యోగం సాధిస్తా.. మాది ఉయ్యూరు. మా నాన్న ధనరాజ్ చిరు వ్యాపారం చేస్తుంటారు. నన్ను చార్టెడ్ అకౌంటెంట్‌గా చూడాలనేది మా అమ్మానాన్న ఆకాంక్ష. అందుకే నగరంలోని సూపర్‌విజ్‌లో చేర్చారు. ఇక్కడ ఇస్తున్న శిక్షణ, వారు చెప్పే టెక్నిక్స్ పాటిస్తూ ప్రతి పరీక్షలో విజయం సాధించా. ప్రస్తుతం సీఏ సీపీటీ, ఐపీసీసీ పూర్తిచేశాను. ఐపీసీసీలో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించా. ఇప్పుడు ఐసీడబ్ల్యూఏ ఇంటర్లో ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం ద్వారా నా తల్లిదండ్రుల కలలను నిజం చేశా. ఇదే స్ఫూర్తితో సీఏ, ఐసీడబ్ల్యూఏ ఫైనల్స్ పూర్తిచేసి మంచి ఉద్యోగం సాధిస్తా. సూపర్‌విజ్‌లో చేరిన సాధారణ విద్యార్థులు సైతం ర్యాంకులు సాధించగలరని నేను నిరూపించాను. ఈ ర్యాంకు సాధించడానికి తోడ్పాటునిచ్చిన అమ్మానాన్న, సూపర్‌విజ్ అధ్యాపకులకు నా కృతజ్ఞతలు. - కంతేటి ఉపేంద్ర, ఐసీడబ్ల్యూఏ ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్, ఉయ్యూరు రోజుకు 13 గంటలు చదివా.. మధురానగర్‌లోని పసుపుతోటలో ఉంటున్న సాధారణ కుటుంబానికి చెందిన తాపీమేస్త్రి కుమార్తె ముక్కామల స్వాతి ఐసీ డబ్ల్యూఏలో జాతీయస్థాయిలో రెండోర్యాంకు సాధించింది. దీంతో తండ్రి శ్రీనివాసరావు, తల్లి విజయలక్ష్మి ఆనందంతో మంగళవారం పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వాతి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ఉన్నత స్థానానికి చేరుకుంటానన్నారు. ఈ ర్యాంకు రావటానికి తాను రోజుకు 13 గంటల చదివానని, సూపర్‌విజ్ డెరైక్టర్ గుప్తా టెక్కిక్స్, తల్లిదండ్రుల పోత్సాహంతోనే ఈ ఘనత సాధించానని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకుంటానని ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా స్వాతిని స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతిని నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తన నియోజకవర్గంలో ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆమెకు ప్రభుత్వపరంగా అవసరమైన సహాయ సహ కారాలు అందజేస్తానని బొండా ఉమా హామీ ఇచ్చారు. - మధురానగర్