India-Russia
-
ధరలు అదుపులో భారత్ విజయం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని మెరుగ్గా నిర్వహించడంలో భారతదేశం విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వ్యక్తం చేశారు. ఆహార ధరలపై సరఫరా వైపు ఒత్తిడిని పరిష్కరించడానికి కేంద్రం ఇప్పటికే పలు చర్యలతో కూడిన చక్కటి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందని అన్నారు. వెర్చువల్‌గా జరిగిన ‘రాయిటర్స్ నెక్ట్స్’ ఈవెంట్లో ఈ మేరకు ఆమె చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్లే ద్రవ్యోల్బణం తీవ్రమవుతోంది. ముఖ్యంగా క్రూడ్ ధరల తీవ్రతను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ► ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయగలమన్న విశ్వా సం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఇందుకు తగిన సమాచారం ఉంది. వచ్చే ఏడాది ప్రారంభం లేదా మధ్యలో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపునకు ద్రవ్యోల్బణం దిగివస్తుందని భావిస్తున్నాం. ► భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటుందని భావిస్తున్నాం. ► రష్యా నుంచి భారత్‌కు దిగుమతులు పెరిగాయి. పశ్చిమ దేశాల కూడా రష్యా నుంచి ఇంధనం వంటి దిగుమతులను ప్రస్తుతం పెంచుకుంటున్నాయి. భారత్–రష్యా సంబంధాలపై ఇలా... భారతదేశం నుండి కొన్ని వస్తువులను దిగుమతి చేసుకోవడానికి రష్యా ఆసక్తి గురించి అడిగినప్పుడు ఆమె మాట్లాడుతూ, భారతదేశం ఇప్పటికే రూపాయి ట్రేడ్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిందని మంత్రి చెప్పారు. ‘‘నిజానికి ఈ తరహా ఫ్రేమ్‌వర్క్ కొత్తది కాదు. ఇది చాలా దశాబ్దాలుగా ఉంది. అయితే మనకు అవసరమైనప్పుడు దానిని ఉపయోగిస్తాము. ఈ ఫ్రేమ్‌వర్క్ కింద మనం కొనడం– అమ్మడం వంటి చర్యలను నిర్వహించవచ్చు. మనం కొనుగోలు చేసే ఎరువులు లేదా ఇంధనాలకు సంబంధించి ఆ దేశంతో వాణిజ్య సమతుల్యతా అవసరమే. ఇందులో భాగంగా మనం ఖచ్చితంగా కొన్ని ఉత్పత్తులు ఆ దేశానికి విక్రయించాలి’’ అని సీతారామన్ ఈ సందర్భంగా అన్నారు. ద్రవ్యోల్బణం తీరిది.. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సీపీఐ కట్టడిచేయడంలో వైఫల్యం ఎందుకు చోటుచేసుకుందన్న అంశంపై గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఇటీవలే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించి కేంద్రానికి సమర్పించాల్సిన నివేదికాంశాలపై చర్చించింది. మే తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా రెపో రేటును నాలుగు దఫాలుగా 4 నుంచి 5.9 శాతానికి పెంచింది. తదుపరి ద్వైమాసిక సమావేశం డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ మధ్య జరగనుంది. మరోదఫా రెపో రేటు పెంపు ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. -
‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్‌ను ఆదివారం భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విజయవంతంగా పరీక్షించింది. స్టెల్త్ డెస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ చెన్నై’నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని అధికారులు తెలిపారు. ‘సముద్ర జలాలపై లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా ఉన్న బ్రహ్మోస్ యుద్ధ నౌక అజేయశక్తిని మరింత ఇనుమడింపజేసిందని, భారత నేవీ వద్ద ఉన్న మరో ప్రమాదకర అస్త్రాల్లో ఒకటిగా మారిందని రక్షణ శాఖ తెలిపింది. భారత్–రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో రూపొందిన బ్రహ్మోస్ క్షిపణులను జలాంతర్గాములు, యుద్ధనౌకలు, విమానాలతో పాటు నేలపై నుంచి కూడా ప్రయోగించే వీలుంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో), బ్రహ్మోస్ ఏరోస్పేస్, భారత నేవీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. క్షిపణి ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు, సిబ్బందిని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్ రెడ్డి కూడా అభినందించారు. మన సైనిక పాటవం బ్రహ్మోస్ క్షిపణితో మరింత పెరుగుతుం దన్నారు. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్.. నేలపై నుంచి నేలపైకి బ్రహ్మోస్‌ను, యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం–1ను, లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్‌ను, అణు సామర్థ్యం ఉన్న శౌర్య క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. -
రష్యా వ్యాక్సిన్ వయా డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 వ్యాక్సిన్ విషయంలో భారత్‌లో పెద్ద ముందడుగు పడింది. ఈ ఏడాదే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వి వ్యాక్సిన్ దేశంలో అడుగు పెట్టనుంది. ఈ వ్యాక్సిన్ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీకై హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్డీఐఎఫ్ సరఫరా చేయనుంది. పరీక్షలు విజయవంతం అయి, వ్యాక్సిన్ నమోదు ప్రక్రియ పూర్తి అయితే.. ఈ ఏడాది చివరి నుంచే దేశంలో వ్యాక్సిన్ల డెలివరీ ఉండే అవకాశం ఉందని రెడ్డీస్ బుధవారం ప్రకటించింది. రష్యాకు చెందిన గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ స్పుత్నిక్–వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. నమ్మదగిన ఎంపిక... రష్యాలో 25 ఏళ్లుగా డాక్టర్ రెడ్డీస్‌కు సుస్థిర, గౌరవప్రద స్థానం ఉందని ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రీవ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. హ్యూమన్ ఎడినోవైరస్ డ్యూయల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశామని, ఇది సురక్షితమైందని వివరించారు. వ్యాక్సిన్‌ను భారత్‌కు తీసుకు వచ్చేందుకు ఆర్డీఐఎఫ్తో భాగస్వామ్యం సంతోషంగా ఉందని డాక్టర్ రెడ్డీస్ కో–చైర్మన్, ఎండీ జి.వి.ప్రసాద్ అన్నారు. మొదటి, రెండవ దశ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని గుర్తు చేశారు. భద్రత, సమర్థత తెలుసుకునేందుకు, అలాగే భారత నియంత్రణ సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా మూడవ దశ ఔషధ పరీక్షలు దేశంలో జరుపనున్నట్టు వెల్లడించారు. భారత్‌లో కోవిడ్–19పై పోరులో స్పుత్నిక్–వి వ్యాక్సిన్ నమ్మదగిన ఎంపిక అని చెప్పారు. ఈ ఏడాది చివరిలో భారత్‌లో టీకా సరఫరా జరగవచ్చునని, మానవ ప్రయోగాలు వచ్చే నెల నుంచి మొదలుకావచ్చునని ఆర్డీఐఎఫ్ అధ్యక్షుడు దిమిత్రీవ్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ చెప్పారు. ప్రయోగాల ఫలితాల ఆధారంగా భారత్‌లో టీకా పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. స్పుత్నిక్–విపై ప్రస్తుతం రష్యాలో సుమారు 40 వేల మందిపై మూడో దశ మానవ ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటి ఫలితాలు అక్టోబర్/నవంబర్ నెలల్లో తెలిసే అవకాశం ఉంది. వయో వృద్ధులు, కోవిడ్–19 బారిన పడేందుకు అవకాశమున్న వారికి అత్యవసర పరిస్థితుల్లో స్పుత్నిక్–వి టీకా అందించే ఆలోచన చేస్తున్నట్లు భారత్ గత వారమే తెలిపిన నేపథ్యంలో తాజా పరిణామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా టీకాపై ఇప్పటివరకూ జరిగిన ప్రయోగాలు మెరుగైన పలితాలే ఇచ్చినట్లు మెడికల్ జర్నల్ ద లాన్సెట్ ఇటీవలే స్పష్టం చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. దూసుకెళ్లిన షేరు.. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో భాగస్వామ్యం వార్తల నేపథ్యంలో రెడ్డీస్ షేరు ధర దూసుకెళ్లింది. క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం షేరు ధర బీఎస్ఈలో 4.24 శాతం అధికమై రూ.4,631.55 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో షేరు ధర 4.69 శాతం ఎగసి రూ.4,651.95 వరకు వెళ్లింది. ఎన్ఎస్ఈలో కంపెనీ షేరు ధర 4.17 శాతం అధికమై రూ.4,442.35 వద్ద స్థిరపడింది. మళ్లీ మొదలైన ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలు కరోనా కట్టడికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాలు భారత్‌లో మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాల తరఫున భారత్‌లో సీరమ్ ఇన్స్టిట్యూట్ (సీఐఐ) నిర్వహిస్తున్న ఈ ప్రయోగాలకు అనుమతి ఇస్తూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) డాక్టర్. వి.జి.సోమాని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. టీకా తీసుకున్న ఓ యూకే మహిళ అస్వస్థతకు గురైన నేపథ్యంలో సెప్టెంబ ర్ 11న ప్రయోగాలపై తాత్కాలిక నిషేధం విధించడం తెలిసిందే. అనారోగ్యానికి గురైన మహిళ సమాచారాన్ని మొత్తం సమీక్షించిన తరువాత యూకేలోనూ ప్రయోగాలను పునరుద్ధరించేందుకు అనుమతి లభించగా.. డీసీజీఐ కొన్ని నిబంధనలతో టీకాలు చేపట్టవచ్చునని సీఐఐకు ఆదేశాలు ఇచ్చారు. సీఐఐ ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని మంగళవారమే డీసీజీఐకి అందించగా అదే రోజుల ప్రయోగాల పునరుద్ధరణకు ఆదేశాలూ జారీ అయ్యాయి. కాకపోతే మరింత క్షుణ్ణంగా పరిశీలించాకే టీకా ఎవరికి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని, కార్యకర్తల అనుమతి పత్రాల్లో కొన్ని మార్పులు సూచించింది. -
మోదీకి గేట్స్ ఫౌండేషన్ అవార్డు
న్యూయార్క్: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ గోల్‌కీపర్’ అవార్డుకు ఎంపికయ్యారు. పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి గుర్తింపుగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆయన సతీమణి మెలిండాల పేరుతో ఏర్పాటైన ట్రస్ట్ బెల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేయనుంది. ఈ నెల 24న బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ వేదికగా జరగనున్న ఓ కార్యక్రమంలో మోదీ ఈ అవార్డు అందుకోనున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు ప్రధాని త్వరలో అమెరికా వెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పరిష్కరించే ప్రయత్నాలు చేపట్టిన రాజకీయ నేతలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవం నాటికి దేశానికి బహిరంగ మలవిసర్జన రహితం చేయాలన్న లక్ష్యంతో మొదలైన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే తొమ్మిది కోట్ల మరుగుదొడ్లను నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం దేశంలో 98 శాతం గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితయ్యాయి. నాలుగేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 38. గాంధీ పార్కు ఆవిష్కరణ? గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఏర్పాటైన ‘గాంధీ పీస్ గార్డెన్’ను మోదీ ప్రారంభించనున్నారు. న్యూయార్క్‌లోని భారతీయ కాన్సులేట్ జనరల్, లాంగ్ ఐలాండ్ కేంద్రంగా పనిచేస్తున్న శాంతి ఫండ్, న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీలు కలిసికట్టుగా నాటే 150 మొక్కలు ఈ పార్కులో ఉంటాయి. పార్కులో తమకిష్టమైన వారి జ్ఞాపకార్థం మొక్కలు పెంచుకోవచ్చు. 2014 ఎన్నికల తరువాత మోదీ తొలిసారి ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించగా.. రెండోసారి గెలిచాక మరోసారి ఈ చాన్సు వచ్చింది. రష్యాతో సంబంధాలను విస్తరిస్తాం వ్లాడివోస్టోక్/న్యూఢిల్లీ: రష్యాలోని వ్లాడివో స్టోక్‌లో జరిగే ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం (ఈఈఎఫ్) సదస్సు సందర్భంగా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్‌తో పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నట్లు మోదీ తెలిపారు. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానంపై ఈ నెల 4వ తేదీన వ్లాడివోస్టోక్ చేరుకోనున్న ప్రధాని ఈఈఎఫ్ 5వ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అక్కడే జరిగే భారత్–రష్యా 20వ వార్షిక భేటీలోనూ పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరిం చడంతోపాటు, బలోపేతం చేసుకోవాలన్న రెండు దేశాల ఆకాంక్షలకు అనుగుణంగా తన పర్యటన కొనసాగుతుందన్నారు.. సృజనాత్మకత పెంచుకోండి: ఉపాధ్యాయులకు ప్రధాని సూచన సృజనాత్మకత, ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచుకుని సాంకేతికతను బోధనలో ఉపయోగించుకోవాలని మోదీ ఉపాధ్యాయులను కోరారు. ఢిల్లీలో తనను కలిసిన జాతీయ అవార్డు గ్రహీతలైన ఉపాధ్యాయులనుదేశించి ప్రధాని మాట్లాడారు. ఆవిష్కరణలకు అవసరమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వారికి ఆయన వివరించారు. -
‘ప్రత్యేక భాగస్వామ్యం’ మనది
సోచి: భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేరాయని, ఇది ఇరు దేశాలు సాధించిన భారీ విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు నాటిన వ్యూహాత్మక భాగస్వామ్యమనే విత్తనాలు ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పుతిన్‌తో చర్చలు విజయవంతంగా సాగాయని, భారత్–రష్యాల మధ్య సంబంధాలతో పాటు అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయని మోదీ తెలిపారు. రష్యాలోని నల్లసముద్ర తీరప్రాంత నగరమైన సోచిలో ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌తో సోమవారం మోదీ అనధికారికంగా భేటీ అయ్యారు. ప్రధాని మోదీని పుతిన్ ఆహ్వానిస్తూ.. మోదీ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. నాలుగు నుంచి ఆరు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాల కంటే అంతర్జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపైనే ఎక్కువ సమయం చర్చించారు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, అఫ్గానిస్తాన్, సిరియాల్లో పరిస్థితి, ఉగ్రవాద ముప్పు, త్వరలో జరగనున్న ఎస్సీవో, బ్రిక్స్ సదస్సులు సహా పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై మోదీ, పుతిన్‌ల మధ్య చర్చ జరిగింది. పుతిన్‌కు ప్రత్యేక స్థానం: మోదీ భేటీ అనంతరం మోదీ మాట్లాడుతూ.. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయితో కలిసి రష్యాలో పర్యటించడాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక కలుసుకున్న మొట్టమొదటి ప్రపంచ నాయకుడు పుతిన్. నా రాజకీయ జీవితంలో పుతిన్, రష్యాలకు ప్రత్యేక స్థానం ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘భారత్, రష్యాలు ఎప్పటినుంచో మిత్రదేశాలు., ఆ రెండింటి మధ్య ఇంతవరకూ విభేదాలు లేని మైత్రి కొనసాగింది. ఇరు దేశాల మధ్య ఎన్నో ఏళ్ల స్నేహ సంబంధాల్లో ఈ అనధికారిక భేటీ ఒక కొత్త కోణం. దీనిని ప్రత్యేక సందర్భంగా భావిస్తున్నాను’ అని మోదీ చెప్పారు. భారత్, రష్యాల మధ్య సంబంధాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా గత 18 ఏళ్లలో అనేక అంశాలపై పుతిన్‌తో చర్చించే అవకాశం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్‌ను అభినందించారు. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఇరు దేశాల సంబంధాలు చరిత్రాత్మక స్థాయికి చేరాయని మోదీ ప్రశంసిం చారు. సోచిలో బొకారెవ్ క్రీక్ నుంచి ఒలింపిక్ పార్కు వరకూ ఇరువురు బోటు షికారు చేశారు. ఇరు దేశాలకు ప్రయోజకరంగా..: రష్యా సోమవారం నాటి చర్చలు చాలా ఉత్సుకతతో, ఇరు దేశాలకు ఉపయోగకరంగా సాగాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను ఉద్దేశించి ఆ దేశ అధికారిక వార్తాపత్రిక టాస్ పేర్కొంది. రష్యాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా–భారత్ మధ్య సైనిక సహకారంపై చర్చలు జరుగుతాయని పెస్కోవ్ చెప్పారు. రష్యా పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ సోమవారం రాత్రి భారత్‌కు పయనమయ్యారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి పుతిన్ వీడ్కోలు పలికారు. -
భారత్‌కు ‘ట్రయంఫ్’ రక్షణ!
న్యూఢిల్లీ: రష్యా నుంచి ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు సంబంధించిన తుది చర్చలను కేంద్రం తాజాగా ప్రారంభించింది. ఇప్పటికే భారత్‌కు ఆకాశ్, బరాక్–8 తదితర క్షిపణి వ్యవస్థలుండగా..ఎస్–400 ట్రయంఫ్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకు కారణం ఇది అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి కావడమే. ఈ నేపథ్యంలో ఎస్–400 ట్రయంఫ్ క్షిపణుల గురించి క్లుప్తంగా.. రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్–400 ట్రయంఫ్ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను 39 వేల కోట్ల రూపాయలు (5 బిలియన్ అమెరికన్ డాలర్లు) వెచ్చించి కొనుగోలు చేయాలని భారత్ 2015లోనే నిర్ణయించింది. ఆ ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే ఎస్–400 ట్రయంఫ్ క్షిపణుల కొనుగోలు ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించింది. ప్రస్తుతం తుది చర్చలను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. 2018–19 ఆర్థిక సంవత్సరం చివరిలోపు ఒప్పందాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఒప్పందం ఖరారైతే చైనా తర్వాత ఈ క్షిపణులను కొనుగోలు చేయనున్న రెండో దేశంగా భారత్ నిలవనుంది. చైనా 2014లోనే ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఎప్పటికి వస్తాయి? మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుండగా, డీల్ కుదిరిన వెంటనే తొలి క్షిపణి వ్యవస్థ భారత్‌కు చేరనుంది. అయితే దీనికి అనుబంధంగా ఉండే కొన్ని యుద్ధ నిర్వహణ పరికరాలు రావడానికి మాత్రం రెండేళ్ల సమయం పడుతుంది. మొత్తం ఐదు క్షిపణులు భారత అమ్ములపొదిలో చేరడానికి నాలుగున్నరేళ్ల వ్యవధి అవసరమని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్–రష్యాల మధ్య కుదిరిన భారీ ఆయుధ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఇవీ ప్రత్యేకతలు.. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 600 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్–400 ట్రయంఫ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు. ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు. ఎస్–300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్–400 ట్రయంఫ్‌ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు. భారత్‌కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు. ఆయుధ సంపత్తి విషయంలో పాక్‌పై భారత్ పైచేయి సాధించడంతోపాటు, చైనాతో సరిసమానంగా నిలిచేందుకు ఎస్–400 ట్రయంఫ్ దోహదపడనుంది. పాకిస్తాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణి నాస్ర్ను ఇది దీటుగా ఎదుర్కొంటుంది. వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది. భారత్ వద్ద ఉన్న క్షిపణులు స్పైడర్ ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారైన దీని పరిధి 15 కిలోమీటర్లు. వాయుసేన 4 క్షిపణులను సమకూర్చుకుంటోంది. పరిధిని 30 కిలో మీటర్లకు పెంచేందుకు డీఆర్డీవో ప్రయత్నిస్తోంది. ఆకాశ్ డీఆర్డీవో, బీడీఎల్, బీఈఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 25 కిలోమీటర్లు. వాయుసేన 15 ఆకాశ్ స్క్వాడ్రన్లు, ఆర్మీ నాలుగు ఆకాశ్ రెజిమెంట్లను సమకూర్చుకుంటోంది. బరాక్–8 డీఆర్డీవో–ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 70 కిలో మీటర్లు. వాయుసేన 9 క్షిపణులను సమకూర్చుకుంటోంది. యుద్ధనౌకలకు ఈ క్షిపణి వ్యవస్థలను నౌకాదళం అమర్చుకుంటోంది. -
ఉగ్రపోరులో సహకారానికి రష్యా అంగీకారం
మాస్కో: ఉగ్రవాదం పోరులో సహకరించుకోవాలని భారత్, రష్యాలు నిర్ణయించాయి. ఆ మేరకు ఉగ్రవాదంపై పోరులో సహకరించుకునేలా ఒప్పందంపై భారత హోం మంత్రి రాజ్‌నాథ్, రష్యా అంతర్గత మంత్రి కోలోకొత్సేవ్‌లు సంతకం చేశారు. 1993లో భారత్, రష్యాల మధ్య జరిగిన ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది. రష్యా పర్యటనలో భాగంగా సోమవారం రష్యా మంత్రితో రాజ్‌నాథ్ పలు అంశాలపై చర్చలు జరిపారు. సమాచార మార్పిడి విస్తృతం చేయడంతో పాటు డేటాబేస్, పోలీసు, దర్యాప్తు విభాగాలకు శిక్షణలో సహకారానికి కూడా భారత్, రష్యాలు అంగీకరించాయి. -
‘కూడంకుళం’కు గ్రీన్‌సిగ్నల్
-
‘కూడంకుళం’కు గ్రీన్‌సిగ్నల్
5, 6 యూనిట్ల నిర్మాణానికి రష్యా అంగీకారం - ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందం - భారత్–రష్యా 70 ఏళ్ల బంధం మరింత విస్తృతానికి కార్యాచరణ - ఐదు ఒప్పందాలపై ఇరుదేశాల సంతకాలు - సంయుక్తంగా ఉగ్రవాదంపై పోరు సెయింట్ పీటర్స్బర్గ్: భారత–రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా పలు కీలకాంశాలపై ఇరుదేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుదుత్పత్తి కేంద్రంలోని 5,6 యూనిట్ల నిర్మాణానికి రష్యా అంగీకరించింది. అణుశక్తి, రక్షణ, ఉగ్రవాదం, వాణిజ్యంతోపాటు పలు రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ద్వైపాక్షిక వార్షిక సదస్సులో ఉగ్రవాదంపై పోరాటంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని మోదీ–రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించారు. మొదట వ్యూహాత్మక చర్చలు జరిపిన మోదీ–పుతిన్ ఆ తర్వాత ఐదు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. అనంతరం పలు అంశాలపై ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ‘21వ శతాబ్దపు దార్శనికత’ పేరుతో విజన్ డాక్యుమెంటును విడుదల చేశారు. పరస్పర గౌరవాన్ని, విశ్వాసాన్ని కొనసాగిస్తూ ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తృతం చేసుకోనున్నట్లు ఈ విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధాలతోపాటు, అంతర్జాతీయ అంశాల్లోనూ భారత్–రష్యాలు ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ సిద్ధాంతంతో సంయుక్తంగా ముందుకెళ్తున్నాయని మోదీ చెప్పారు. ఈ ఏడాదితో భారత్–రష్యా సంబంధాలకు ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఒకే ఆలోచనతో..: అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు సంయుక్త విలేకరుల సమావేశంలో మోదీ తెలిపారు. ‘సంస్కృతి నుంచి భద్రత వరకు మా సంబంధాలపై ఒకే ఆలోచనతో ముందుకెళ్లనున్నాం. ఇందుకోసం కార్యాచరణనూ నిర్ణయించాం’ అని మోదీ వెల్లడించారు. భారత–రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యమే రెండు గొప్ప దేశాల బంధం ప్రత్యేకత. రాజకీయ సంబంధాలు, భద్రత, వాణిజ్యం, ఆర్థిక, మిలటరీ, సాంకేతిక, విద్యుత్, సాంస్కృతిక, మానవ వనరులతోపాటు విదేశాంగ విధానంలోనూ మా బంధం మరింత విస్తృతం అవుతుంది’ అని దార్శనిక పత్రంలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఇంద్ర–2017 పేరుతో త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహించాలని కూడా మోదీ–పుతిన్ నిర్ణయించారు. ఒక్కో యూనిట్ వెయ్యి మెగావాట్లు జనరల్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్ (జీఎఫ్ఏ)పై సంతకం కావటంతో కూడంకుళం అణుకేంద్రం 5, 6వ యూనిట్ల నిర్మాణానికి ఒప్పందం పూర్తయింది. ‘జీఎఫ్ఏకు ఆమోదాన్ని మేం స్వాగతిస్తున్నాం’ అని ఇరు దేశాధినేతలు దార్శనిక పత్రంలో పేర్కొన్నారు. భారత అణుశక్తి కార్పొరేషన్ (ఎన్పీసీఐఎల్), రష్యాకు చెందిన ఆటం స్టోరీ ఎక్స్పోర్ట్ (రష్యా న్యూక్లియర్ కాంప్లెక్స్ అనుబంధ సంస్థ) అణు రియాక్టర్ల నిర్మాణాన్ని చేపడతాయి. ఒక్కో యూనిట్ సామర్థ్యం వెయ్యి మెగావాట్లు. ఉగ్రవాదంపై సంయుక్తంగా.. అన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని పక్కనపెట్టి.. ప్రపంచ భద్రతకు సవాల్‌గా మారిన ఉగ్రవాదంపై పోరాటంలో అంతర్జాతీయ సమాజానికి మద్దతుగా నిలవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వనీతితో వ్యవహరించొద్దని సూచించారు. ఇటీవల యురోపియన్ యూనియన్ దేశాల్లో ఉగ్రదాడులు, ఉగ్రవాద ఛాయలు పెరుగుతున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్ఎస్జీ, ‘భద్రతామండలి’ కోసం మేమున్నాం ఎన్ఎస్జీ, భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్‌కు సంపూర్ణ మద్దతుంటుందని పుతిన్ స్పష్టం చేశారు. బ్రిక్స్, డబ్ల్యూటీవో, జీ20 వంటి వేదికలపై భారత్‌లో కలిసిపనిచేస్తున్న రష్యా.. భవిష్యత్తులో మరిన్ని వేదికలపై భాగస్వామ్యాన్ని కొనసాగించనున్నట్లు తెలిపింది. ‘ఐక్యరాజ్యసమితిలో మరీ ముఖ్యంగా భద్రతామండలిలో సంస్కరణలు రావాల్సి అవసరం ఉందని భావిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు, సవాళ్లపై స్పందించేందుకు శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచాలి. అణుసరఫరా బృందం, వాసెనార్ ఒప్పందం, భద్రతామండలిలో భారత సభ్యత్వానికి రష్యా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది’ అని దార్శనిక పత్రం పేర్కొంది. పౌరవిమానయాన రంగంలో ద్వైపాక్షిక సహకారానికి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. భారత్, ఐదుదేశాల యురేషియన్ ఎకనమిక్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా చర్చలను మరింత త్వరగా ప్రారంభించాలని భారత్, రష్యా నిర్ణయించాయి. ఎస్సీవోలో భారత్‌కు సభ్యత్వం! వారం రోజుల్లోగా షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో)లో భారత్‌కు సభ్యత్వం రాబోతోందని ఇరుదేశాల 70వ వార్షిక సదస్సు సందర్భంగా పుతిన్ స్పష్టం చేశారు. సదస్సుకు మోదీని ఆహ్వానించిన పుతిన్.. ‘ఇరుదేశాలు, ప్రజల మధ్య విశ్వాసం, స్నేహమే మా బలమైన బంధానికి నిదర్శనం’ అని అన్నారు. అంతర్జాతీయ అంశాల సహకారం విషయంలో భారత్‌కు తోడుగా ఉంటామన్నారు. ‘త్యాగాల కుటుంబం మీది’ రెండో ప్రపంచయుద్ధంలో లెనిన్గ్రాడ్ సందర్భంగా అమరులైన 5లక్షల మంది రష్యన్ల అంత్యక్రియలు జరిగిన పిస్కారియోవ్స్కోయ్ స్మారకాన్ని సందర్శించిన మోదీ అమరులకు నివాళులర్పించారు. ‘రష్యాకోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పించే గొప్ప అవకాశం కలిగింది’ అని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా మోదీ కాస్త మనసువిప్పి మాట్లాడటంతో పుతిన్ భావోద్వేగానికి గురయ్యారు. ‘త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు మీరు’ అని పుతిన్‌ను ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు. 70 ఏళ్ల క్రితం జరిగిన రెండో ప్రపంచయుద్ధంలో పుతిన్ సోదరుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. రష్యన్ ప్రజల గుండెల్లో ప్రత్యేక గుర్తింపున్న ఈ స్మారకాన్ని సందర్శించినందుకు మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. 1941–44 మధ్య లెనిన్గ్రాడ్ అనే పట్టణాన్ని నాజీ సేనలు దిగ్బంధించి 28 నెలలపాటు తిండి, నీరు కూడా అందకుండా చేయటంతో 5 లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోయారు. ఈ సందర్భంగా జర్మన్లతో జరిగిన పోరాటంలో పుతిన్ ఐదుగురు చిన్నాన్నలతోపాటు తల్లి తరపు బంధువులు కూడా హతమయ్యారు. ‘త్యాగాల కుటుంబం మీది’ రెండో ప్రపంచయుద్ధంలో లెనిన్గ్రాడ్ సందర్భంగా అమరులైన 5లక్షల మంది రష్యన్ల అంత్యక్రియలు జరిగిన పిస్కారియోవ్స్కోయ్ స్మారకాన్ని సందర్శించిన మోదీ అమరులకు నివాళులర్పించారు. ‘రష్యాకోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పించే గొప్ప అవకాశం కలిగింది’ అని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా మోదీ కాస్త మనసువిప్పి మాట్లాడటంతో పుతిన్ భావోద్వేగానికి గురయ్యారు. ‘త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు మీరు’ అని పుతిన్‌ను ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు. 70 ఏళ్ల క్రితం జరిగిన రెండో ప్రపంచయుద్ధంలో పుతిన్ సోదరుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. రష్యన్ ప్రజల గుండెల్లో ప్రత్యేక గుర్తింపున్న ఈ స్మారకాన్ని సందర్శించినందుకు మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. 1941–44 మధ్య లెనిన్గ్రాడ్ అనే పట్టణాన్ని నాజీ సేనలు దిగ్బంధించి 28 నెలలపాటు తిండి, నీరు కూడా అందకుండా చేయటంతో 5 లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోయారు. ఈ సందర్భంగా జర్మన్లతో జరిగిన పోరాటంలో పుతిన్ ఐదుగురు చిన్నాన్నలతోపాటు తల్లి తరపు బంధువులు కూడా హతమయ్యారు. -
అణు విద్యుత్ ఉత్పత్తి ఆరంభమైంది.
కూడంకులం అణు విద్యుత్ కేంద్రంలో మంగళవారం వేకువజామున ఉత్పత్తి ఆరంభమైంది. తొలిరోజు 160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ఉత్పత్తిని బుధ వారం నుంచి క్రమంగా పెంచనున్నామని వెల్లడించారు. అయి తే ఇదంతా ఓ నాటకమంటూ ఉద్యమకారులు కొట్టిపారేశారు. సాక్షి, చెన్నై:తిరునల్వేలి జిల్లా కూడంకులంలో భారత్, రష్యా సంయుక్తంగా అణు విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. తొలి యూనిట్ పనులు ముగిశాయి. రెండో యూనిట్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా ఇడిందకరై వేదికగా పెద్ద ఉద్యమమే సాగింది. ఫలితంగా తొలి యూనిట్లో అధికారిక ఉత్పత్తికి బ్రేక్ పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకుల్ని అధిగమించి జూలైలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అణు విద్యుత్ క్రమబద్ధీకరణ కమిషన్ గత నెలలో కూడంకులంలో పర్యటించింది. ఈ కేంద్రం సురక్షితమని ప్రకటించింది. ప్రస్తుతం ప్రధాని మన్మోహన్ సింగ్ రష్యా పర్యటనలో ఉండడాన్ని పురస్కరించుకుని అధికారిక ఉత్పత్తికి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని అణు కేంద్రం డెరైక్టర్ సుందర్ మీడియాకు ప్రకటించారు. 160 మెగావాట్ల ఉత్పత్తి మంగళవారం వేకువజామున 2.45 గంటలకు అణు విద్యుత్ కేంద్రంలో అధికారిక ఉత్పత్తికి శ్రీకారం చుట్టామని సుందర్ వెల్లడించారు. తొలి విడతగా రెండు గంటలు ఉత్పత్తి జరిగిందని వివరించారు. అణు రియాక్టర్లు, టర్బైన్, జనరేటర్ల పనితీరు అద్భుతమని ప్రకటించారు. మొత్తం 70 మెగావాట్లతో ప్రారంభమై 160 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి చేరుకుందని వివరించారు. ఈ విద్యుత్‌ను సదరన్ గ్రిడ్‌కు పంపించామన్నారు. అక్కడ పరిశీలన అనంతరం ప్రజా వినియోగానికి అణు విద్యుత్ ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. నేటి నుంచి పెంపు విద్యుత్ ఉత్పత్తి బుధవారం నుంచి క్రమంగా పెరగనుంది. తొలి విడతగా 400 మెగావాట్ల ఉత్పత్తికి అణు విద్యుత్ క్రమబద్ధీకరణ కమిషన్ అనుమతి ఇచ్చింది. మరో వారం పదిరోజుల్లో ఉత్పత్తి మరింత పెంపునకు అనుమతి ఇవ్వడం తథ్యమని తెలుస్తోంది. తొలి యూనిట్ ద్వారా పూర్తిస్థాయిలో వెయ్యి మెగావాట్లు మరో నెల రోజుల్లో ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రెండో యూనిట్లో ఉత్పత్తికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు యూనిట్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి అయిన పక్షంలో 1025 మెగావాట్లు రాష్ట్రానికి, 266 మెగావాట్లు కేరళకు, 442 మెగావాట్లు కర్ణాటకకు, 67 మెగావాట్లు పుదుచ్చేరికి అందించనున్నారు. అంతా నాటకం విద్యుత్ ఉత్పత్తి ఆరంభమైందన్న అధికారుల ప్రకటనను నాటకమంటూ ఉద్యమకారులు కొట్టిపారేశారు. ఉద్యమనేత ఉదయకుమార్ మీడియాతో మాట్లాడుతూ రష్యా ప్రధానిని మెప్పించేందుకు ఈ నాటకం సాగుతోందని ఆరోపించారు. మూడు, నాలుగో యూనిట్ ఒప్పందాల్లోని న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించేందుకు, నష్ట పరిహారం చెల్లింపును దృష్టిలో ఉంచుకునే ఆగమేఘాలపై ఉత్పత్తి ఆరంభమైనట్లు ప్రకటించుకున్నారని పేర్కొన్నారు. రష్యా ప్రధానిని మోసం చేయడం లక్ష్యంగా ఉత్పత్తి ప్రకటన వెలువడిందని ఆరోపించారు. అనుమానం కూడంకులంలో అణు విద్యుత్ ఉత్పత్తికి నిజంగానే శ్రీకారం చుట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రయల్ రన్లో టర్బైన్ పనిచేస్తున్న సమయంలో ఆ కేంద్రం నుంచి పెద్ద శబ్దం వచ్చేది. అలాగే అక్కడి గొట్టాల నుంచి తెల్లరంగుతో ఉబరి నీరు, పొగ వెలువడేది. అయితే మంగళవారం తమకు శబ్దం వినబడలేదని, పొగ కనిపించలేదని పరిసర వాసులు పేర్కొన్నారు. ట్రయల్ రన్ వేరు, అధికారిక ఉత్పత్తి వేరని అణు కేంద్రం వర్గాలు పేర్కొంటున్నాయి.