కార్తి చిదంబరంపై వేటు
బెంగళూరు: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) నుంచి ఉపాధ్యక్షుడు కార్తి చిదంబరాన్ని తొలగించారు. శనివారం ఇక్కడ జరిగిన ‘ఐటా’ ఏజీఎంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘ఐటా’ రాజ్యాంగాన్ని అనుసరించే కార్తిపై వేటు వేశామని, నిబంధనల ప్రకారం తమ ఆఫీస్ బేరర్లు రెండు జాతీయ క్రీడా సమాఖ్యల్లో పదవులు అనుభవించరాదని అధ్యక్షుడు అనిల్ ఖన్నా తెలిపారు. కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడైన కార్తి టెన్పిన్ బౌల్ సమాఖ్య అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. రెండు పదవుల్లో ఒకదానిని వదులుకోవాలని గతంలోనే కార్తికి సూచించినా పట్టించుకోలేదని గుర్తుచేశారు.