గెలిచేది మన జట్టే..!
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కీలకమైన సెమీఫైన్ పోరుకు వేదికైన బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో భారత క్రికెట్ ప్రేమికుల అభిమానం పరవళ్లు తొక్కుతోంది. గురువారం రెండో సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎడ్జ్‌బాస్టన్ మైదానానికి పెద్ద ఎత్తున చేరుకున్న భారత క్రికెట్ ప్రేమికులు మైదానంలో మువన్నెల రెపరెపలతో టీమిండియాకు మద్దతు ప్రకటిస్తున్నారు.
ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాను భారత్ చిత్తుచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాపై భారత జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంటుందని, ఫైనల్లో 2013 నాటి విజయం పునరావృతం అవుతుందని టీమిండియా వీరాభిమాని సుధీర్ గౌతం ఆశాభావం వ్యక్తం చేశాడు.