breaking news
India vs Oman
-
ఆసియా కప్-2025: ఇది కరెక్ట్ కాదు సూర్య!.. మేమిలాగే చేస్తాం
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా మరోసారి తమ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసింది. లీగ్ దశలో ఒమన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ దిగని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ (Abhishek Sharma)- శుబ్‌మన్ గిల్ (Shubman Gill)లను మినహా దాదాపుగా అందరి స్థానాలు మార్చాడు.అపుడు అలా.. ఇపుడు ఇలాసంజూ శాంసన్ (Sanju Samson)ను వన్‌డౌన్‌లో.. ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌లను బరిలోకి దించాడు. తాజాగా సూపర్-4లో బంగ్లాదేశ్‌తో కీలకమైన బుధవారం నాటి మ్యాచ్‌లోనూ భారత బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరిగాయి.ఓపెనర్లుగా అభి (37 బంతుల్లో 75)- గిల్ (19 బంతుల్లో 29)లను కొనసాగించిన యాజమాన్యం.. ఆల్‌రౌండర్, ఫినిషర్ శివం దూబే (2)ను వన్‌డౌన్‌లో పంపగా విఫలమయ్యాడు. తనదైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య (5) కూడా విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా (38) ఐదు, తిలక్ వర్మ (5) ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయగా.. అక్షర్ పటేల్ (10 నాటౌట్) ఏడో ఆటగాడిగా వచ్చాడు.ఇక సంజూ శాంసన్‌ను ఎనిమిది.. ఆ తర్వాతి స్థానాల్లో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి బ్యాటింగ్ చేయాల్సింది. అయితే, నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. వీరంతా మైదానంలో అడుగుపెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది.ఇదెలాంటి క్రికెట్ లాజిక్?అయితే, బంగ్లాదేశ్‌తో ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో భారత్ నామమాత్రపు స్కోరు చేయడం.. ఆ తర్వాత 41 పరుగుల తేడాతో గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలపై కెప్టెన్ సూర్యకుమార్‌పై విమర్శలు వచ్చాయి.ముఖ్యంగా ఓ వైపు వికెట్లు పడుతున్నా సంజూ శాంసన్ ఎనిమిదో స్థానంలో దింపాలనుకోవడంపై భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ విస్మయం వ్యక్తం చేశాడు. ‘‘సంజూ శాంసన్ ఎనిమిదో స్థానంలో రావడమా? ఇదెలాంటి క్రికెట్ లాజిక్. ఇది ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదు’’ అంటూ సూర్య నిర్ణయాన్ని తప్పుబట్టాడు.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌పై విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. విమర్శలకు బదులు ఇచ్చాడు. ‘‘ఈ టోర్నీలో మాకు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు. ఒమన్‌పై మొదట బ్యాటింగ్ చేశాం. మళ్లీ ఇప్పుడు. సూపర్-4లో అనుకున్నట్లుగానే ముందుకు సాగుతున్నాం.మేమిలాగే చేస్తాంబంగ్లా బౌలింగ్ లైనప్ చూసిన తర్వాతే మా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకున్నాం. వారి జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ ఉన్నారు. దూబే స్పిన్ బాగా ఆడతాడనే అతడిని ముందుగా పంపించాం.కానీ ఈసారి అది వర్కౌట్ కాలేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. అంతమాత్రాన మా ప్రణాళికలను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అవుట్‌ఫీల్డ్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే మేమే 180- 185 పరుగులు చేసేవాళ్లం. ఇక 12- 14 ఓవర్లు బాగా బౌలింగ్ చేసిన సందర్భాల్లోనూ మేము మెజారిటీ మ్యాచ్‌లలో గెలుపొందాం’’ అని తన నిర్ణయాన్ని సూర్య సమర్థించుకున్నాడు. కాగా బంగ్లాదేశ్‌పై విజయంతో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక.. టీమిండియా తదుపరి శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. ఇందుకు దుబాయ్ వేదిక. The moment India stormed into the Asia Cup Final 🌟 Watch #DPWorldAsiaCup2025 from September 9-28, 7 PM onwards, Live on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvBAN pic.twitter.com/7VN6tJ0rwa— Sony Sports Network (@SonySportsNetwk) September 24, 2025చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
IND vs OMAN: అద్భుతం.. నమ్మశక్యం కాని రీతిలో అదరగొట్టారు: సూర్య
ఒమన్ క్రికెట్ జట్టుపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ ఆద్యంతం అద్బుత పోరాటపటిమ కనబరిచారని కొనియాడాడు. ఇందుకు ప్రధాన కారణం వారి కోచ్ సులక్షణ్ కులకర్ణి అంటూ సూర్య ప్రశంసించాడు.ఆసియా కప్-2025 టీ20 టోర్నీలో భారత్, పాకిస్తాన్, యూఏఈతో పాటు ఒమన్ గ్రూప్-ఎ నుంచి పోటీపడింది. పాక్, యూఏఈ చేతిలో ఓడిన ఒమన్.. శుక్రవారం నాటి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో మరో పరాజయాన్ని చవిచూసింది. అయితే, పటిష్ట భారత జట్టుతో ఒమన్ బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా రాణించి గట్టిపోటీనివ్వడం విశేషం.నమ్మశక్యం కాని రీతిలో..ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఒమన్ అద్భుతంగా ఆడింది. వారి ఆట నన్ను ఆకట్టుకుంది. నమ్మశక్యం కాని రీతిలో ఆడారు. వారి కోచ్ సులూ సర్ వల్లే ఇది సాధ్యమైంది.ఆయన వారిలో పట్టుదలకు కారణం. ప్రత్యర్థి ముందు తేలికగా తలవంచకూడదనే ధైర్యాన్ని నూరిపోశారు. ఒమన్ జట్టు బ్యాటింగ్ చేస్తుంటూ చూడముచ్చటగా అనిపించింది’’ అని కితాబు ఇచ్చాడు.కాస్త కష్టంగానే ఉంటుందిఇక యూఏఈ, పాక్ జట్లతో మ్యాచ్‌లతో బెంచ్‌కే పరిమితమైన పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ఒమన్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో ఆడిన విషయం తెలిసిందే. అర్ష్‌దీప్ నాలుగు ఓవర్ల కోటాలో 37 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా.. హర్షిత్ మూడు ఓవర్ల బౌలింగ్‌లో 25 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఒమన్ వంటి జట్టుకు కూడా వీరు పరుగులు ధారాళంగా సమర్పించుకోవడంతో విమర్శలు వచ్చాయి. అయితే, సూర్య మాత్రం వారిద్దరికి అండగా నిలిచాడు. ‘‘అకస్మాత్తుగా బెంచ్ నుంచి వచ్చి ఆడటం కాస్త కష్టంగానే ఉంటుంది’’ అని అర్ష్‌దీప్, హర్షిత్‌లను వెనకేసుకువచ్చాడు. ఇక తదుపరి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు తాము పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.ఆసియా కప్-2025: భారత్ వర్సెస్ ఒమన్ స్కోర్లు👉వేదిక: షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి👉టాస్: భారత్.. తొలుత బ్యాటింగ్👉భారత్ స్కోరు: 188/8 (20)👉ఒమన్ స్కోరు: 167/4 (20)👉ఫలితం: ఒమన్‌పై 21 పరుగుల తేడాతో భారత్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్ (45 బంతుల్లో 56)చదవండి: IND vs OMAN: సూర్యకుమార్ అనూహ్య నిర్ణయం.. గావస్కర్ స్పందన ఇదేAamir Kaleem, take a bow 🫡An innings that will go down in Oman cricket history 🇴🇲Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/4nqXWJCDYH— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. పాకిస్తాన్‌ను దాటేసి సోలోగా ప్రపంచ రికార్డు
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్‌లో భారత్ పసికూన ఒమన్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా ఓ చారిత్రక రికార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక దేశాలపై (19) విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు భారత్, పాకిస్తాన్ (18) పేరిట సంయుక్తంగా ఉండేది.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక దేశాలపై విజయాలు సాధించిన జట్లుభారత్- 19 దేశాలు (166 విజయాలు)పాకిస్తాన్- 18 దేశాలు (156 విజయాలు)న్యూజిలాండ్- 17 దేశాలు (123 విజయాలు)ఆస్ట్రేలియా- 16 దేశాలు (119 విజయాలు)సౌతాఫ్రికా- 15 దేశాలు (112 విజయాలు)ఇంగ్లండ్- 15 దేశాలు (110 విజయాలు)అంతర్జాతీయ టీ20ల్లో భారత్ టెస్ట్ హోదా కలిగిన దేశాలతో పాటు చాలా అసోసియేట్ సభ్య దేశాలను మట్టికరిపించింది.టీ20ల్లో టీమిండియా విజయాలు నమోదు చేసిన దేశాలుఆస్ట్రేలియా- 32 మ్యాచ్‌ల్లో 20 విజయాలుశ్రీలంక- 32 మ్యాచ్‌ల్లో 21 విజయాలుసౌతాఫ్రికా- 31 మ్యాచ్‌ల్లో 18 విజయాలువెస్టిండీస్- 30 మ్యాచ్‌ల్లో 19 విజయాలుఇంగ్లండ్- 29 మ్యాచ్‌ల్లో 17 విజయాలున్యూజిలాండ్- 25 మ్యాచ్‌ల్లో 12 విజయాలుపాకిస్తాన్- 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలుజింబాబ్వే- 13 మ్యాచ్‌ల్లో 10 విజయాలుబంగ్లాదేశ్- 17 మ్యాచ్‌ల్లో 16 విజయాలుఆఫ్ఘనిస్తాన్- 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలుఐర్లాండ్- 8 మ్యాచ్‌ల్లో 8 విజయాలుహాంగ్కాంగ్- 1 మ్యాచ్‌లో 1 విజయంనమీబియా- 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలుయూఏఈ- 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలుస్కాట్లాండ్- 1 మ్యాచ్‌లో 1 విజయంనెదర్లాండ్స్- 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలుఒమన్- 1 మ్యాచ్‌లో 1 విజయంనేపాల్- 1 మ్యాచ్‌లో 1 విజయంకెన్యా- 1 మ్యాచ్‌లో 1 విజయంమొత్తంగా 19 దేశాలపై 250 మ్యాచ్‌లు ఆడి 166 విజయాలు సాధించిన భారత్, పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా, అత్యధిక విజయాల శాతం (66) కలిగిన జట్టుగా చలామణి అవుతుంది.పొట్టి ఫార్మాట్లో రెండు ప్రపంచకప్‌లు (2007, 2024) గెలిచిన భారత్ ప్రస్తుతం ఈ ఫార్మాట్లో నంబర్ వన్ జట్టుగా (ర్యాంకింగ్స్‌లో) కొనసాగుతుంది. అలాగే ఈ ఫార్మాట్లో అన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లే టాప్ ర్యాంక్‌ల్లో ఉన్నారు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా నంబర్ వన్‌గా ఉన్నారు. -
సంజూ ఎందుకు?.. అతడిని ఇంకెప్పుడు ఆడిస్తారు?
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. లీగ్ దశలో తొలుత యూఏఈ, పాకిస్తాన్లను ఓడించిన సూర్యకుమార్ సేన.. శుక్రవారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లో ఒమన్‌పై 21 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా గ్రూప్-ఎ టాపర్‌గా కొనసాగుతూ సూపర్-4 దశను ఆదివారం మొదలుపెట్టనుంది.ఓపెనర్లు మినహాఇదిలా ఉంటే.. ఒమన్‌తో మ్యాచ్‌లో టీమిండియా తమ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38)- శుబ్‌మన్ గిల్(5) మినహా మిగతా వారి ఆర్డర్‌ను మార్చింది. వన్‌డౌన్‌లో సంజూ శాంసన్ (45 బంతుల్లో 56), నాలుగో నంబర్లో హార్దిక్ పాండ్యా (1).. ఆ తర్వాతి స్థానాల్లో అక్షర్ పటేల్ (13 బంతుల్లో 26), తిలక్ వర్మ (18 బంతుల్లో 29), హర్షిత్ రాణా (8 బంతుల్లో 13 నాటౌట్), అర్ష్‌దీప్ సింగ్ (1), కుల్దీప్ యాదవ్ (1 నాటౌట్)లను ఆడించింది.బ్యాటింగ్‌కు రాని సూర్యఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్‌కు రానేరాలేదు. మరోవైపు.. గత రెండు మ్యాచ్‌లలోనూ బ్యాటింగ్ చేసే అవకాశమే పొందని వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson).. తాజాగా టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూకు బదులు జితేశ్ శర్మను వికెట్ కీపర్‌గా బరిలోకి దించాల్సిందని అభిప్రాయపడ్డాడు. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లు ముగిసినా జితేశ్‌కు అవకాశం రాలేదని.. అతడొక్కడినే వదిలేశారని పేర్కొన్నాడు.వికెట్ కీపర్‌గా సంజూ ఎందుకు?‘‘తిలక్ వర్మ మరీ లోయర్ ఆర్డర్లో వచ్చాడు. సూర్య అసలు బ్యాటింగ్‌కు రాలేదు. అలాంటపుడు జితేశ్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించాల్సింది కదా!.. జితేశ్‌ను ఆడిస్తారనే అనుకున్నా. ఇప్పటి వరకు.. అతడిని తప్ప అందరినీ ఆడించారు. వందకు వంద శాతం సూపర్ పవర్ హిట్టర్‌ను మాత్రం వదిలేశారు.అతడికి ఒక అవకాశమైతే ఇవ్వాలి కదామిడిలార్డర్లో వికెట్ కీపర్ అవసరం ఉంటుంది. కానీ మీరు సంజూను ఆ స్థానంలో ఆడించాలని ఫిక్సయిపోయారు కాబట్టి జితేశ్‌ను పక్కనపెట్టారు. వికెట్ కీపర్ రేసులో ఉండాలన్న.. సంజూతో పోటీపడాలన్నా అతడికి ఒక అవకాశమైతే ఇవ్వాలి కదా!’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.సంజూ సూపర్ఏదేమైనా ఒమన్‌తో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ.. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని ఆకాశ్ చోప్రా అభినందించాడు. ఆరంభంలో ఫాస్ట్‌బౌలర్ల కారణంగా కాస్త ఇబ్బందిపడినప్పటికీ.. తర్వాత పరుగులు రాబట్టాడని పేర్కొన్నాడు. వికెట్లు పడుతున్న వేళ విలువైన అర్ధ శతకంతో రాణించాడని ప్రశంసించాడు. కాగా తదుపరి సూపర్-4 దశలో తొలుత టీమిండియా ఆదివారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇందుకు దుబాయ్ వేదిక.చదవండి: IND vs OMAN: సూర్యకుమార్ అనూహ్య నిర్ణయం.. గావస్కర్ స్పందన ఇదేThe Sanju Show was in full swing tonight! 👌Watch #INDvOMAN LIVE now on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/ZYT9ptqCKR— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025 -
IND vs OMAN: గర్వంగా ఉంది.. మా వాళ్లు సూపర్: ఒమన్ కెప్టెన్
భారత్ వంటి పటిష్ట జట్టుపై పసికూన ఒమన్ (IND vs OMAN) అద్బుత ఆట తీరుతో ఆకట్టుకుంది. వరల్డ్ నంబర్ వన్ టీమిండియా చేతిలో ఓటమిని అంతతేలికగా అంగీకరించకుండా ఆఖరి వరకు పోరాటం చేసింది. చివరికి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైనా.. ఈ మ్యాచ్ ఒమన్ చరిత్రలో గుర్తుంచుకోదగ్గదిగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు.ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్ తర్వాత ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ (Jatinder Singh) మాట్లాడుతూ.. తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘మా వాళ్ల ఆట తీరును చూస్తుంటే గర్వంగా అనిపించింది. మా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాం,.గర్వంగా ఉంది.. మా వాళ్లు సూపర్ఎలాంటి పరిస్థితుల్లోనూ మా వాళ్లు పోరాట పటిమను వదల్లేదు. చివరి వరకు అద్భుతంగా పోరాడారు. ఇది నాకు గర్వకారణం. నిజానికి మా జట్టులో అంతగా అనుభవం ఉన్న ఆటగాళ్లులేరు. మా గురించి ఏమాత్రం హైప్ కూడా లేదు.అయినా సరే మేము ఇలా ఆడటం గొప్పగా అనిపించింది. మా దేశంలోనే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ జరుగబోతున్నాయి. ఇందుకు మా వాళ్లు సిద్ధంగా ఉన్నారు. పపువా న్యూగినియా, సమోవా జట్లను మేము ఎదుర్కోబోతున్నాము.అతడు హైలైట్ఏదేమైనా టీమిండియాతో మ్యాచ్‌లో మా వాళ్లు సూపర్. ముఖ్యంగా జితేన్ రామ్నంది రనౌట్లతో హైలైట్ అయ్యాడు. అతడు టీమ్ మ్యాన్. జట్టు కోసం ఏమైనా చేస్తాడు’’ అని జతీందర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా టీమిండియాతో మ్యాచ్‌లో ఒమన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జితేన్ రామ్నంది రెండు వికెట్లు తీయడంతో పాటు.. హార్దిక్ పాండ్యా (1), అర్ష్‌దీప్ సింగ్ (1)లను రనౌట్ చేశాడు.ఇక ఒమన్ బ్యాటర్లలో కెప్టెన్ జతీందర్ సింగ్ (32) ఓ మోస్తరుగా రాణించగా.. మరో ఓపెనర్ ఆమిర్ ఖలీమ్ (46 బంతుల్లో 64), వన్‌డౌన్ బ్యాటర్ హమ్మద్ మీర్జా (33 బంతుల్లో 51) మెరుపులు మెరిపించారు. అయితే, 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఒమన్ 167 పరుగులకే పరిమితమైంది.టీమిండియా వర్సెస్ ఒమన్ స్కోర్లు👉వేదిక: షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి👉టాస్: టీమిండియా.. తొలుత బ్యాటింగ్👉టీమిండియా స్కోరు: 188/8 (20)👉ఒమన్ స్కోరు: 167/4 (20)👉ఫలితం: ఒమన్‌పై 21 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్ (టీమిండియా- 45 బంతుల్లో 56).Awww… we agree with you @sanjaymanjrekar 😊Sending some virtual hugs from us too Jatinder! 🤗Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/A6ZIElXmhl— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025చదవండి: పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్! -
IND vs OMAN: సూర్య అనూహ్య నిర్ణయం.. గావస్కర్ స్పందన ఇదే
ఆసియా కప్-2025లో ఒమన్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నామమాత్రపు మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌కు రాలేదు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. సూర్య మాత్రం డగౌట్లోనే ఉండిపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేస్తూ.. ఆల్‌రౌండర్లతో పాటు బౌలర్లను ముందుకు పంపాడు.ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38)- శుబ్‌మన్ గిల్(5)లను అలాగే కొనసాగించిన సూర్య.. వన్‌డౌన్‌లో సంజూ శాంసన్ (45 బంతుల్లో 56)ను పంపాడు. నాలుగో స్థానంలో హార్దిక్ పాండ్యా (1), ఐదో స్థానంలో అక్షర్ పటేల్ (13 బంతుల్లో 26)లను ఆడించాడు.ఆ తర్వాత వరుసగా తిలక్ వర్మ (18 బంతుల్లో 29), హర్షిత్ రాణా (8 బంతుల్లో 13 నాటౌట్), అర్ష్‌దీప్ సింగ్ (1), కుల్దీప్ యాదవ్ (1 నాటౌట్)లను పంపాడు. ఈ క్రమంలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత ఒమన్‌ను 167 పరుగులకు పరిమితం చేసి విజయం సాధించింది.ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో సూర్య తీసుకున్న నిర్ణయంపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ స్పందించాడు. ‘‘ఈ మ్యాచ్‌లో సూర్య బ్యాటింగ్ వస్తే కాసేపు ఫోర్లు, సిక్సర్లు కొట్టేవాడు. అతడికి అది మంచిది కూడా.అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా సూర్యకు కావాల్సినంత బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరికింది. తదుపరి అన్నీ కీలక మ్యాచ్‌లే. అందుకే ఒకవేళ టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోతే బ్యాటింగ్ పరిస్థితి ఏమిటన్నది చెక్ చేసేందుకు సూర్య ఈ నిర్ణయం తీసుకున్నాడు.కుల్దీప్ యాదవ్‌ను కూడా అందుకే బ్యాటింగ్‌కు పంపాడు. నిజంగా సూర్య వినూత్నమైన ఆలోచనలు గలవాడు. శ్రీలంకతో గతంలో ఓ మ్యాచ్‌లో తాను కూడా బౌలింగ్ చేశాడు. రింకూ చేతికి కూడా బంతినిచ్చాడు. తన నిర్ణయాలతో చేజారే మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించాడు.ఇప్పుడు కూడా ప్రయోగం చేశాడు. తాను బ్యాటింగ్‌కు వెళ్లకుండా బౌలర్లు అర్ష్‌దీప్, కుల్దీప్లను ముందుకు పంపించాడు’’ అంటూ గావస్కర్ సూర్య నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రశంసలు కురిపించాడు. కాగా లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన టీమిండియా తదుపరి సూపర్-4 దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడనుంది. -
‘అతడి’ని హగ్ చేసుకున్న సూర్య.. ఎందుకిలా చేశావు?
టీమిండియాతో మ్యాచ్‌లో ఒమన్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. అంచనాలకు మించి రాణించి.. గెలుపు కోసం సూర్యుకుమార్ సేనను శ్రమించేలా చేసింది. పటిష్ట భారత జట్టుకు గట్టి పోటీనిచ్చి సత్తా చాటి ప్రశంసలు అందుకుంటోంది.ఆసియా కప్-2025 టీ20 టోర్నీలో భాగంగా శుక్రవారం టీమిండియాను ఢీకొట్టింది ఒమన్. అబుదాబి వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో అభిషేక్ శర్మ మరోసారి ధనాధన్ (15 బంతుల్లో 38) దంచికొట్టగా.. శుబ్‌మన్ గిల్ (Shubman Gill- 5) మరోసారి నిరాశపరిచాడు.సంజూ శాంసన్ అర్ధ శతకంఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) అర్ధ శతకం (56)తో రాణించి భారత ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అతడికి తోడుగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేట్ (13 బంతుల్లో 26), తిలక్ వర్మ (18 బంతుల్లో 29), హర్షిత్ రాణా (8 బంతుల్లో 13 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, జితేన్ రామనంది, ఆమిర్ ఖలీమ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఒమన్ టాపార్డర్ సూపర్ హిట్ఇక టీమిండియా విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ శుభారంభం అందుకుంది. ఓపెనర్లలో కెప్టెన్ జతీందర్ సింగ్ (32) ఫర్వాలేదనిపించగా.. ఆమిర్ ఖలీమ్ అద్భుత అర్ధ శతకం (46 బంతుల్లో 64, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ హమ్మద్ మీర్జా సైతం హాఫ్ సెంచరీ (33 బంతుల్లో 51) చేశాడు. అయితే, జతీందర్ను కుల్దీప్ యాదవ్, ఆమిర్‌ను హర్షిత్ రాణా, మీర్జాను హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు పంపడంతో ఒమన్ జోరుకు బ్రేక్ పడింది. మిగిలిన వారిలో వికెట్ కీపర్ వినయ్ శుక్లా (1)ను అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేశాడు.అంచనాలు తలకిందులుఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయిన ఒమన్.. 167 పరుగుల వద్ద నిలిచింది. దీంతో టీమిండియా 21 పరుగుల తేడాతో గెలిచి.. లీగ్ దశను అజేయంగా ముగించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఒమన్‌పై భారత జట్టు ఏకపక్ష విజయం సాధిస్తుందని అంతా ఊహించారు.కానీ అంచనాలు తలకిందులు చేస్తూ సూర్యసేనకు జతీందర్ సింగ్ బృందం గట్టి పోటీనిచ్చింది. టీ20 ఫార్మాట్లోని మజాను పంచింది. ఒమన్ ఆట తీరుకు భారత జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ కూడా ఫిదా అయ్యాడు. మ్యాచ్ అనంతరం ఒమన్ ఆటగాళ్లతో ముచ్చటిస్తూ వారిపై ప్రశంసలు కురిపించాడు.ఆమిర్ ఖలీమ్‌ను హగ్ చేసుకున్న సూర్యఅంతేకాదు.. ఒమన్‌పై గెలిచిన తర్వాత ఇరుజట్లు ఆటగాళ్లు కరచాలనం చేసే సమయంలో సూర్య చేసిన పని వైరల్‌గా మారింది. 43 ఏళ్ల వయసులో అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన ఆమిర్ ఖలీమ్‌ను సూర్య ఆలింగనం చేసుకున్నాడు. అయితే, అతడు పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన వాడు కావడం గమనార్హం.ఇలా ఎందుకు చేశావు? నీకిది తగునా?ఈ నేపథ్యంలో ఆమిర్‌ను అభినందిస్తూ సూర్య చేసిన పనిని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం .. ‘‘పాక్‌కు చెందిన వ్యక్తిని ఎలా హత్తుకుంటావు?’’ అని ప్రశ్నిస్తున్నారు.కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో ముఖాముఖి తలపడిన టీమిండియా.. ఆ జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. బాధితులకు అండగా మెగా వేదికగా ఇలా నిరసన తెలిపింది. అయితే, సూర్య ఇప్పుడిలా అదే దేశానికి చెందిన ఆటగాడిని హగ్ చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. జట్టంతా ఒకే కుటుంబమని..కాగా యూఏఈతో పాటు ఒమన్ క్రికెట్ జట్లలో భారత్, పాక్‌కు చెందిన ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయం గురించి యూఏఈ కెప్టెన్ మొహమ్మద్ వసీమ్ మాట్లాడుతూ.. తమ జట్టంతా ఒకే కుటుంబమని.. యూఏఈనే తమ దేశమని.. తమలో భారత్, పాక్ అనే మాట వినిపించవని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమిర్‌ను సూర్య హత్తుకోవడం నేరమేమీ కాదంటూ అతడి ఫ్యాన్స్ సపోర్టు చేసుకుంటున్నారు.చదవండి: PKL 12: తెలుగు టైటాన్స్ గెలుపుబాట𝘚𝘶𝘳𝘺𝘢 𝘋𝘢𝘥𝘢, 𝘦𝘬 𝘩𝘪 𝘥𝘪𝘭 𝘩𝘢𝘪𝘯, 𝘬𝘪𝘵𝘯𝘦 𝘣𝘢𝘢𝘳… 💙Encouraging words from India’s captain to Oman’s heroes ✨Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/Mng5zOIrOH— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025 -
పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్!
ఆసియా కప్-2025 టోర్నమెంట్ లీగ్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. ఆఖరిగా శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచి.. గ్రూప్-ఎ టేబుల్ టాపర్‌గా తన స్థానాన్ని నిలుపుకొంది. తదుపరి సూపర్-4 దశలో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా భారత్.. దాయాది పాకిస్తాన్‌తో తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది.అయితే, దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఒమన్‌తో మ్యాచ్ సందర్భంగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel Injury) గాయపడ్డాడు. భారత్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ వన్‌డౌన్ బ్యాటర్ మహ్మద్ మీర్జా (33 బంతుల్లో 51) దూకుడగా ఆడాడు.మైదానానికి బలంగా కొట్టుకున్న తలఈ క్రమంలో పదిహేనో ఓవర్లో శివం దూబే (Shivam Dube) బౌలింగ్‌లో మీర్జా బంతిని గాల్లోకి లేపగా.. మిడాఫ్ నుంచి పరిగెత్తుకుని వచ్చిన అక్షర్.. క్యాచ్ పట్టేందుకు విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడిన అక్షర్ తల మైదానానికి బలంగా కొట్టుకుంది.దీంతో ఫిజియో వచ్చి పరీక్షించి.. అతడిని మైదానం నుంచి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత అక్షర్ మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. అయితే, ఈ విషయం గురించి స్పందించిన భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ అప్డేట్ అందించాడు. అక్షర్ పటేల్ బాగానే ఉన్నాడని చెప్పాడు.స్పష్టత లేదుకానీ అక్షర్ గాయం తీవ్రతపై పూర్తి స్పష్టతనివ్వలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దత నెలకొంది. కాగా యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచింది. యూఏఈ, పాకిస్తాన్, ఒమన్లను ఓడించి అజేయంగా నిలిచింది. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు రెండు వికెట్లు తీయడంతో పాటు.. 26 పరుగులు సాధించాడు. చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు -
చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. భారత తొలి బౌలర్‌గా..
టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్లో చేరిన తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భాగంగా ఒమన్‌తో మ్యాచ్ సందర్భంగా అర్ష్‌దీప్ సింగ్ ఈ ఘనత సాధించాడు.గత కొంతకాలంగా అర్ష్‌దీప్ సింగ్ బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడని భావించినా.. ఐదు టెస్టుల్లో అతడికి ఒక్కదాంట్లోనే ఆడే అవకాశం రాలేదు. ఫిట్నెస్ సమస్యలు కూడా ఇందుకు కారణం.స్పిన్నర్లకు పెద్దపీటఅయితే, ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ టోర్నీలో మాత్రం అర్ష్‌దీప్ సింగ్ ఆడటం ఖాయమని విశ్లేషకులు భావించారు. కానీ ఈ ఈవెంట్ యూఏఈ వేదికగా జరుగుతోంది కాబట్టి.. మేనేజ్మెంట్ స్పిన్నర్లకు పెద్దపీట వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే తుదిజట్టులో దక్కించుకోగా.. అర్ష్ బెంచ్ మీదే ఉన్నాడు.బుమ్రాకు విశ్రాంతి.. అర్ష్‌దీప్‌నకు అవకాశంఇక ఈ టోర్నీలో యూఏఈ, పాకిస్తాన్ జట్లను ఓడించి సూపర్-4కు అర్హత సాధించిన టీమిండియా.. లీగ్ దశలో ఆఖరిగా ఒమన్‌తో శుక్రవారం తలపడింది. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం అర్ష్‌దీప్‌ను ఆడించింది.అబుదాబిలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్.. ఒమన్ బ్యాటర్ వినాయక్ శుక్లా (1)ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వందో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అర్ష్ బౌలింగ్‌లో వినాయక్ ఇచ్చిన క్యాచ్‌ను రింకూ సింగ్ పట్టడంతో ఇది సాధ్యమైంది.వంద వికెట్ల క్లబ్లోఈ నేపథ్యంలో టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన వీరుడిగా అర్ష్‌దీప్ సింగ్ తన రికార్డును నిలబెట్టుకోవడంతో పాటు.. వంద వికెట్ల క్లబ్లో చేరిన భారత తొలి బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు.. తక్కువ మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానం సంపాదించాడు.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ (173) మొదటి స్థానంలో ఉన్నాడు. రషీద్ 53 మ్యాచ్‌లలో ఈ ఫీట్ అందుకోగా.. 26 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 64 మ్యాచ్‌లలో వంద వికెట్లు సాధించాడు.భారత్ వర్సెస్ ఒమన్ స్కోర్లు👉వేదిక: షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి👉టాస్: భారత్.. తొలుత బ్యాటింగ్👉భారత్ స్కోరు: 188/8 (20)👉ఒమన్ స్కోరు: 167/4 (20)👉ఫలితం: ఒమన్‌పై 21 పరుగుల తేడాతో భారత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్ (45 బంతుల్లో 56)చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలుArshdeep Singh shines with a milestone to remember! 🤩 He becomes the first Indian player to take 100 wickets in men's T20Is.Watch #DPWorldAsiaCup2025 from Sept 9-Sept 28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/jzIgYcKQV4— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025 -
Asia Cup 2025: ఒమన్‌పై టీమిండియా విజయం
ఒమన్‌పై టీమిండియా విజయంఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబర్ 19న జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగనప్పటికీ.. భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని శభాష్ అనిపించుకుంది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. నత్త నడకన సాగుతున్న ఒమన్ బ్యాటింగ్189 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఒమన్ బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. ఈ జట్టు బ్యాటర్లు వికెట్లు కాపాడుకోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తున్నారు. గెలుపు కోసం ఆడుతున్నట్లు కనబడటం లేదు. 14 ఓవర్లు ముగిసే సమయానికి వారి స్కోర్ 100/1గా ఉంది. హమ్మద్ మీర్జా (24), ఆమిర్ కలీమ్ (39) క్రీజ్‌లో ఉన్నారు.ఆచితూచి ఆడుతున్న ఒమన్189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 27/0గా ఉంది. ఓపెనర్లు కలీమ్ (13), జతిందర్ సింగ్ (13) ఆచితూచి ఆడుతున్నారు. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన టీమిండియాటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు మాత్రమే చేసింది. భారత మేనేజ్మెంట్ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసి విఫలమైంది. హార్దిక్ పాండ్యా (1), శివమ్ దూబే (5) ప్రమోషన్ లభించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. సంజూ శాంసన్ (56) అర్ద సెంచరీ చేసి టీమిండియాను ఆదుకున్నాడు. అభిషేక్ శర్మ (38), అక్షర్ పటేల్ (26), తిలక్ వర్మ (26) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చివరి వరకు బ్యాటింగ్‌కు దిగలేదు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్ (4-1-23-2), జితేన్ రామనంది (4-0-33-2), ఆమిర్ కలీమ్ (3-0-31-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. సంజూ హాఫ్ సెంచరీసంజూ శాంసన్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రామనంది బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ మార్కును చేరుకున్నాడు. 17 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 167/5గా ఉంది. సంజూకు జతగా తిలక్ వర్మ (27) క్రీజ్‌లో ఉన్నాడు. సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా13.2వ ఓవర్- టీమిండియా 130 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కలీమ్ బౌలింగ్‌లో శివమ్ దూబే (5) ఔటయ్యాడు. సంజూ శాంసన్‌కు (45) జతగా తిలక వర్మ క్రీజ్‌లోకి వచ్చాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్11.2వ ఓవర్- 118 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఆమిర్ కలీమ్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (26) ఔటయ్యాడు. అక్షర్ అంతకముందు బంతికి సిక్సర్ బాది జోరు మీదున్నట్లు కనిపించాడు. సంజూ శాంసన్‌కు (38) జతగా శివమ్ దూబే క్రీజ్‌లోకి వచ్చాడు. సెంచరీ పూర్తి చేసిన టీమిండియాటీమిండియా 10 ఓవర్లలో 100 పరుగుల మార్కును (3 వికెట్లు కోల్పోయి) తాకింది. సంజూ శాంసన్ (37), అక్షర్ పటేల్ (10) క్రీజ్‌లో ఉన్నారు. మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియాజితేన్ రామనంది వేసిన 8వ ఓవర్లో టీమిండియాకు వరుస షాక్‌లు తగిలాయి. తొలి బంతికి అభిషేక్ శర్మ (38) వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. మూడో బంతికి హార్దిక్ పాండ్యా (1) రనౌటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 75/3గా ఉంది. సంజూ శాంసన్ (27), అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నారు. అభిషేక్ జోరురెండో ఓవర్లోనే శుభ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయినా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన సహజ శైలిలో జోరు కొనసాగిస్తున్నాడు. పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సమయానికి అతను 14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. అభిషేక్‌కు జతగా క్రీజ్‌లో ఉన్న సంజూ శాంసన్ (14 బంతుల్లో 13; సిక్స్) నిదానంగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 60/1గా ఉంది.టీమిండియాకు ఆదిలోనే షాక్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్ మూడో బంతికే భారత్ శుభ్‌మన్ గిల్ (5) వికెట్ కోల్పోయింది. గిల్‌ను షా ఫైసల్ అనే బౌలర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అభిషేక్‌కు (0) జతగా సంజూ శాంసన్ క్రీజ్‌లోకి వచ్చాడు. 1.3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 6/1గా ఉంది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ఆసియా కప్ 2025లో ఇవాళ (సెప్టెంబర్ 19) నామమాత్రపు మ్యాచ్ జరుగుతుంది. ఇదివరకే సూపర్-4కు చేరిన భారత్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ఒమన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. స్టార్ పేసర్ బుమ్రా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానాల్లో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాను బరిలోకి దించింది. తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, సంజు శాంసన్ (wk), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ఒమన్: అమీర్ కలీమ్, జతిందర్ సింగ్ (c), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (WK), షా ఫైసల్, జిక్రియ ఇస్లాం, ఆర్యన్ బిస్ట్, మొహమ్మద్ నదీం, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితేన్ రామనంది -
ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ఖండాంతర క్రికెట్ టోర్నమెంట్ ఆసియా కప్ (Asia Cup). ఈసారి పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టీమిండియా (2023 వన్డే ఫార్మాట్ విజేత) బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ కూడా పాల్గొంటున్నాయి.ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌వే అయినా.. పాక్ కూడా ఈ ఈవెంట్లో భాగమైనందున తటస్థ వేదికైన యూఏఈలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మరి.. ఆసియా కప్-2025 టోర్నీ పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారం తదితర వివరాలు తెలుసుకుందామా!!గ్రూపులు- రెండుగ్రూప్-‘ఎ’- భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్గ్రూప్-‘బి’- శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్‌కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు 👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్‌కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్- అబుదాబి- సాయంత్రం 5.30 నిమిషాలకు👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్‌కాంగ్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 23: A2 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 24: A1 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 25: A2 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 26: A1 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 28: ఫైనల్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు.జట్లు ఇవేటీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్యూఏఈముహమ్మద్ వసీం (కెప్టెన్), అలిశాన్ షరాఫూ, ఆర్యాంశ్ శర్మ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఈథన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మతీఉల్లా ఖాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), రోహిద్ ఖాన్, సిమ్రన్‌జీత్ సింగ్, సాఘిర్ ఖాన్.ఒమన్జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా, సూఫియాన్ యూసుఫ్, ఆశిష్ ఒడెదెరా, అమీర్ కలీమ్, మహ్మద్ నదీమ్, సూఫియాన్ మెహమూద్, ఆర్యన్ బిష్త్, కరణ్ సోనావాలే, జిక్రియా ఇస్లాం, హస్నైన్ అలీ షా, ఫైసల్ షా, మహమ్మద్ ఇమ్రాన్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ.శ్రీలంకచరిత్ అసలంక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగ, నువానీదు ఫెర్నాండో, దునిత్ వెల్లాలగే, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో.బంగ్లాదేశ్లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, సైఫ్ హసన్, తౌహిద్ హ్రిదోయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, షరీఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్స్టాండ్బై ప్లేయర్లు: సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహమాన్, అల్లాహ్ గజన్ఫార్. నూర్ అహ్మద్, ఫారిక్ అహ్మద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీరిజర్వ్ ఆటగాళ్లు: వఫివుల్లా తారఖాల్, నంగ్యాల్ ఖరోటే, అబ్దుల్లా అహ్మద్జాయ్హాంకాంగ్యాసిమ్ ముర్తాజా (కెప్టెన్), బాబర్ హయత్, ఆదిల్ మెహమూద్, జీషన్ అలీ (వికెట్ కీపర్), ఎహ్సాన్ ఖాన్, అనాస్ ఖాన్, షాహిద్ వాసిఫ్ (వికెట్ కీపర్), కల్హన్ చల్లు, హరూన్ అర్షద్, నిజకత్ ఖాన్, ఆయుశ్ శుక్లా, అలీ హసన్, నస్రుల్లా రానా, ఐజాజ్ ఖాన్, ఎండీ ఘజన్ఫర్, మార్టిన్ కోయెట్జి, అతీక్ ఇక్బాల్, మహ్మద్ వాహిద్, అన్షుమన్ రథ్, కించిత్ షా.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..ఆసియా కప్-2025 టీ20 మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ)లో వీక్షించవచ్చు. డిజిటల్ యూజర్ల కోసం సోనీలివ్ వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.ప్రైజ్ మనీ ఎంతంతంటే?ఆసియాకప్-2022(టీ20 ఫార్మాట్) ఛాంపియన్స్‌గా నిలిచిన శ్రీలంకకు దాదాపు 200,000 డాలర్ల( సుమారు రూ. 1.6 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది. ఈ ఏడాది ఆసియా విజేతగా నిలిచే జట్టుకు 300,000 డాలర్లు (దాదాపు రూ. 2.6 కోట్లు) నగదు బహుమతి ఏసీసీ అందజేయనున్నట్లు సమాచారం. గత ఎడిషన్‌తో పోలిస్తే ఇది 50 శాతం అధికం. రన్నరప్‌గా నిలిచే జట్టు 150,000 డాలర్లు (సుమారు రూ. 1.3 కోట్లు) ప్రైజ్‌మనీ సొంతం చేసుకోనుంది. మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచే జట్లు వరుసగా రూ. 80, 60 లక్షలు దక్కించుకోనున్నాయి.చదవండి: కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. కేఎల్ రాహుల్ కాల్ చేసి: క్రిస్ గేల్