breaking news
India vs UAE
-
చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు చేరాలంటే..
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా ఇప్పటికే సూపర్-4 దశకు అర్హత సాధించింది. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత జట్టు తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ని ఓడించింది. యూఏఈ విధించిన లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఛేదించి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.సూపర్-4 బెర్తు ఖరారైంది ఇలా..ఇక రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన.. దాయాది పాకిస్తాన్ (Ind vs Pak)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో నాలుగు పాయింట్లు సంపాదించిన టీమిండియా.. యూఏఈ- ఒమన్‌ను ఓడించి.. ఎలిమినేట్ చేయగానే సూపర్-4 బెర్తు ఖరారు చేసుకుంది. ఇక గ్రూప్-‘ఎ’ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్- యూఏఈ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి మ్యాచ్‌లో ఇరుజట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి. కాగా యూఏఈ- పాకిస్తాన్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రెండు జట్లు ఒమన్‌ను ఓడించి చెరో రెండు పాయింట్లు సాధించాయి.గెలిచిన జట్టుకే అవకాశంఈ క్రమంలో దుబాయ్ వేదికగా జరిగే బుధవారం జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. తద్వారా మొత్తంగా నాలుగు పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది.అంటే.. పాకిస్తాన్ యూఏఈని ఓడిస్తే.. నేరుగా సూపర్-4లో అడుగుపెడుతుంది. ఒకవేళ యూఏఈ గెలిస్తే.. టీమిండియాతో కలిసి గ్రూప్-‘ఎ’ నుంచి సూపర్-4కు అర్హత సాధిస్తుందన్న మాట.ఫలితం తేలకుంటే మాత్రంఒకవేళ మ్యాచ్ గనుక ‘టై’ అయినా.. ఏదేని కారణాల చేత ఫలితం తేలకపోయినా ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు నెట్ రన్‌రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టుకు బెర్తు ఖరారు అవుతుంది. ప్రస్తుతం నెట్ రన్‌రేటు పరంగా పాకిస్తాన్ (+1.649).. యూఏఈ కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి ఈ సమీకరణ ఆధారంగా పాకిస్తాన్‌కే సూపర్-4 చేరే అవకాశం ఉంటుంది.AI ఆధారిత టేబుల్ఒమన్, హాంకాంగ్ ఎలిమినేట్యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పాల్గొంటున్నాయి. ఇప్పటికే గ్రూప్-‘ఎ’ నుంచి ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి హాంకాంగ్ ఎలిమినేట్ అయ్యాయి.చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్‌కు ఊరట?! -
అందుకే అతడిని ఆడించలేదు.. సంజూ మాత్రం హ్యాపీ: టీమిండియా కోచ్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక స్పెషలిస్టు పేసర్‌తో బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్‌లో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సేవలు వినియోగించుకుంది.ఇక ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), శివం దూబేలను పార్ట్‌టైమ్ సీమ్ బౌలర్లుగా వాడుకుంది. మరోవైపు.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిని ఆడించింది. వీరికి తోడుగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను కూడా బరిలోకి దించింది.అర్ష్‌దీప్‌నకు మొండిచేయిఓవరాల్గా బౌలింగ్ విభాగంలో బుమ్రా, కుల్దీప్, వరుణ్ సేవలను ఉపయోగించుకున్న యాజమాన్యం.. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను మాత్రం పక్కనపెట్టింది. నిజానికి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్నది అర్ష్‌దీప్. ఇప్పటి వరకు ఈ లెఫ్టార్మ్ పేసర్ 63 మ్యాచ్‌లలో కలిపి 99 వికెట్లు కూల్చాడు.యూఏఈతో మ్యాచ్‌లో ఇలాంటి ఆటగాడిని పక్కనపెట్టడం పట్ల విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించాడు. ‘‘కెప్టెన్, హెడ్‌కోచ్‌తో చర్చ తర్వాతే తుదిజట్టు కూర్పుపై స్పష్టత వస్తుంది.అందుకే అతడిని ఆడించలేదుజట్టులోని 15 మంది ఇందుకు అర్హులే. కానీ పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు ఉంటాయి. ఒక ఆటగాడికి తుదిజట్టులో చోటు దక్కనపుడు అతడు నిరాశకు గురికావడం సహజం. అయితే, ఇదొక టీమ్ స్పోర్ట్. ఎజెండా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇందులో వ్యక్తిగత ఇష్టాలు, అయిష్టాలకు తావు ఉండదు.ఆరోజు అత్యుత్తమ జట్టు ఏది అనిపిస్తుందో.. కెప్టెన్, హెడ్‌కోచ్ దానినే ఎంపిక చేసుకుంటారు. ఆడే అవకాశం రాని వాళ్లు కూడా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్న ప్లేయర్లకు సహకారం అందిస్తారు’’ అని సితాన్షు కొటక్ స్పష్టం చేశాడు.సంజూ సంతోషంగా ఉన్నాడుఅదే విధంగా.. చాన్నాళ్లుగా టీమిండియా టీ20 ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ను మిడిలార్డర్‌కు పంపడంపై కూడా సితాన్షు కొటక్ స్పందించాడు. ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో ఐదు లేదంటే ఆరో స్థానంలో సంజూ ఎక్కువగా బ్యాటింగ్ చేయలేదు. దీనర్థం అతడు ఆ స్థానంలో ఆడలేడని కాదు.ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. ముందుగా చెప్పినట్లు జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే హెడ్‌కోచ్, కెప్టెన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సంజూ కూడా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసేందుకు సంతోషంగా ఉన్నాడు’’ అని కొటక్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ తదుపరి సెప్టెంబరు 14న దాయాది పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఇందుకు దుబాయ్ వేదిక.చదవండి: పాక్‌ను ఓడించడానికి వైభవ్ సూర్యవంశీ వంటి వాళ్లు చాలు! -
మా జట్టుకు మాత్రం.. గిల్ ఎప్పుడూ ఇలా ఆడడు: కోచ్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీతో అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్ (Shubman Gil). దాదాపు ఏడాది విరామం తర్వాత యూఏఈతో మ్యాచ్ సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన గిల్ ధనాధన్ దంచికొట్టాడు.గిల్ ధనాధన్యూఏఈ విధించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. పసికూనపై ఆది నుంచే ఎదురుదాడి ఆరంభించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతి (రెండో ఓవర్ మొదటి బంతి)నే ఫోర్‌గా మలిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అదే ఓవర్లో ఓ సిక్సర్ కూడా బాదాడు.టీమిండియా ఘన విజయం ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా తొమ్మిది బంతులు ఆడిన శుబ్‌మన్ గిల్.. రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్ట్రైక్‌రేటు 222.22. ఇదిలా ఉంటే.. గిల్‌తో పాటు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్) రాణించడంతో 4.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది టీమిండియా. యూఏఈని తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ బ్యాటింగ్ కోచ్ పార్థివ్ పటేల్.. తమ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టైటాన్స్‌కు ఆడేటపుడు గిల్లో ఇలాంటి దూకుడు చూడలేదని అన్నాడు. ‘‘తొలి బంతి నుంచే గిల్ అటాకింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు.మా జట్టుకు మాత్రం.. గిల్ ఇలా ఆడడుఆ తర్వాత వెంటనే.. క్రీజు బయటకు వచ్చి మరీ ఫోర్ బాదాడు. అదే ఓవర్లో సిక్స్ కూడా కొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌కు ఆడేటపుడు అతడిలో ఇలాంటి దూకుడు ఎప్పుడూ చూడలేదు. నిజానికి ఇక్కడ కుదురుకునేందుకు గిల్ కాస్త సమయం తీసుకుంటాడు.కానీ టీమిండియా తరఫున ఈ మ్యాచ్‌లో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్న కారణంగా ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. అద్భుతంగా ఆడాడు కూడా!’’ అని పార్థివ్ పటేల్ గిల్‌ను ప్రశంసించాడు. టీ20 జట్టు వైస్ కెప్టెన్గాకాగా టైటాన్స్‌కు సారథ్యం వహించడంతో పాటు ఓపెనర్‌గానూ గిల్ సేవలు అందిస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా బ్యాట్‌తో ఇరగదీసిన ఈ పంజాబీ బ్యాటర్.. కెప్టెన్‌గానూ 2-2తో సిరీస్ సమం చేయగలిగాడు.ఇక భవిష్యత్తులో టీమిండియా మూడు ఫార్మాట్లలో గిల్‌ను కెప్టెన్‌ను చేయాలనే ఉద్దేశంతో.. ఇటీవలే టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ తిరిగి నియమించింది. ప్రస్తుతం టీమిండియాకు వన్డేల్లో రోహిత్ శర్మ, టీ20లలో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్‌మన్ గిల్ కెప్టెన్లుగా పనిచేస్తున్నారు.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
ఇలాంటివి మనకు అవసరమా సూర్య?.. గట్టిగానే ఇచ్చిపడేశాడు!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వ్యవహార శైలిపై భారత మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. సూర్య తీరు విమర్శలకు దారితీసే విధంగా ఉందన్నాడు. అయితే, మాజీ కెప్టెన్ అజింక్య రహానే మాత్రం సూర్య చేసింది సరైన పనేనంటూ మద్దతు పలికాడు.అసలేం జరిగిందంటే... ఆసియా కప్-2025 (Asia Cup) టీ20 టోర్నమెంట్లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో బుధవారం తలపడింది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.57 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత బౌలర్లు యూఏఈని 57 పరుగులకే ఆలౌట్ చేశారు. కుల్దీప్ యాదవ్ నాలుగు, శివం దూబే మూడు వికెట్లు కూల్చగా.. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్ అలీషాన్ షరాఫూ (22) పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.సూర్యకుమార్ యాదవ్ క్రీడాస్ఫూర్తిఇదిలా ఉంటే.. యూఏఈ పదో నంబర్ బ్యాటర్ జునైద్ సిద్దిఖీ విషయంలో సూర్యకుమార్ యాదవ్ క్రీడాస్ఫూర్తి కనబరిచాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌ను శివం దూబే వేశాడు. ఒకటో బంతికి ధ్రువ్ పరాశర్ (1)ను దూబే అవుట్ చేయగా జునైద్ క్రీజులోకి వచ్చాడు.ఈ క్రమంలో దూబే షార్ట్ డెలివరీ సంధించగా.. దానిని షాట్ ఆడబోయి జునైద్ విఫలమయ్యాడు. అయితే, దూబే బౌలింగ్ కోసం రన్ మొదలుపెట్టిన సమయంలో అతడి టవల్ జారి పడగా.. జునైద్ అటు వైపు చూసి సైగ చేశాడు. ఇంతలో బంతిని అందుకున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ దానిని వికెట్లకు గిరాటేశాడు.అప్పీలును వెనక్కి తీసుకుని.. అప్పటికి జునైద్ క్రీజు బయట ఉండగా.. అంపైర్ అతడిని అవుట్‌గా ప్రకటించాడు. అయితే, కెప్టెన్ సూర్య మాత్రం తమ అప్పీలును వెనక్కి తీసుకుని.. జునైద్‌ను తిరిగి బ్యాటింగ్‌కు రావాల్సిందిగా ఆహ్వానించాడు. ఇలాంటివి అవసరమా సూర్య?ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘పాకిస్తాన్‌తో సెప్టెంబరు 14 నాటి మ్యాచ్‌లో మాత్రం ఇలా అస్సలు జరిగి ఉండేది కాదు. సల్మాన్ ఆఘా.. 14 ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నపుడు మ్యాచ్ రసవత్తరంగా ఉన్న వేళ.. సూర్య అస్సలు ఇలాంటి పని చేసి ఉండేవాడు కాదు. సంజూ అద్భుతంగా స్పందించి వికెట్లను గిరాటేశాడు. అతడు చేసింది సరైన పని.బ్యాటర్ క్రీజు బయట ఉన్నాడు కాబట్టి అది కచ్చితంగా అవుటే అని నా అభిప్రాయం. కానీ సూర్య ఇలా చేయడం వల్ల మున్ముందు పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయి. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇలాంటివి జరిగితే అప్పుడు సూర్య అలా చేశాడు.. ఇలా చేశాడు అనే విమర్శలు వస్తాయి’’ అని పేర్కొన్నాడు.ఇచ్చిపడేసిన రహానేఅయితే, అజింక్య రహానే మాత్రం సూర్యను సమర్థించాడు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినందుకు అతడిని ప్రశంసించాలని సూచించాడు. క్రికెట్లో ఇలాంటి ఘటనలు తరచూ జరగవని.. ఏదేమైనా టీమిండియా మంచి పనే చేసిందని కితాబులు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. యూఏఈ విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 4.3 ఓవర్లలో ఛేదించి.. తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
‘ఇలాంటి జట్లపై ఎవరైనా ఆడతారు.. అతడికి మున్ముందు కఠిన సవాలు’
ఆసియా కప్-2025 (Asia Cup) టీ20 టోర్నమెంట్లో తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), మిస్టరీ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాలను ఆడించింది.ఇక యూఏఈతో మ్యాచ్‌లో కేవలం ఏడు పరుగులే ఇచ్చి కుల్దీప్ నాలుగు వికెట్లు కూల్చగా.. బుమ్రా, వరుణ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. అయితే ఆల్‌రౌండర్ల కోటాలో బరిలోకి దిగిన అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయగా.. శివం దూబే (Shivam Dube) అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. రెండు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు.ఇలాంటి జట్లపై ఎవరైనా ఆడతారుఈ నేపథ్యంలో శివం దూబే గురించి టీమిండియా మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ (Sadagopan Ramesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20లలో హార్దిక్ పాండ్యా భారత మూడో సీమర్‌గా సేవలు అందించేవాడు. అయితే, ఇప్పుడు శివం దూబే మూడో సీమర్‌గా ఉన్నాడు.యూఏఈతో మ్యాచ్‌లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే, అలాంటి జట్టులపై ఎవరైనా రాణించగలరు. మున్ముందు కాస్త పటిష్ట జట్లను ఎదుర్కొంటున్నపుడు అతడికి కఠిన సవాలు ఎదురవుతుంది.PC: BCCIనమ్మకం నిలబెట్టుకుంటేనే రింకూ సింగ్‌ను కాదని శివం దూబేను జట్టులోకి తీసుకోవడానికి కారణం.. అతడు మూడో సీమింగ్ ఆప్షన్‌గా అందుబాటులో ఉంటాడని మాత్రమే కదా!.. ఏదేమైనా శివం దూబేపై మేనేజ్మెంట్ నమ్మకం ఉంచుతున్న విషయం స్పష్టమవుతోంది. అతడు దానిని నిలబెట్టుకుంటేనే పరిస్థితులు మున్ముందు ఎలా ఉంటాయో తెలుస్తుంది’’ అని సదగోపన్ రమేశ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.తొలి మ్యాచ్‌లో ఘన విజయంకాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9న ఆసియా కప్-2025 టోర్నీ ఆరంభమైంది. ఈ ఖండాంతర ఈవెంట్లో టీమిండియా.. పాకిస్తాన్, ఒమన్, యూఏఈతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో ఆడిన టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి .. శుభారంభం అందుకుంది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్ యూఏఈని 57 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత కేవలం 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తదుపరి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సెప్టెంబరు 14న టీమిండియా తలపడనుంది.చదవండి: ఆకాశమే హద్దుగా చెలరేగిన అర్జున్ టెండుల్కర్.. సానియా చందోక్ రాకతో.. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి జట్టుగా
ఆసియాకప్-2025ను టీమిండియా అద్బుతమైన విజయంతో ఆరంభించింది. ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో యూఏఈను 9 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. యూఏఈ నిర్ధేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలోనే చేధించింది.భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30), శుబ్‌మన్ గిల్(9 బంతుల్లో 20 నాటౌట్) దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది.భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, శివమ్ దూబే మూడు వికెట్లు పడగొట్టగారు. వీరితో పాటు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు.ఇక ఈ మ్యాచ్‌లో కేవలం 4.3 ఓవర్లను టార్గెట్‌ను ఫినిష్ చేసిన భారత్ పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. చరిత్ర సృష్టించిన భారత్..ఆసియాకప్ టీ20 టోర్నీలో బంతులు పరంగా భారీ విజయం సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 93 బంతులు మిగిలుండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ పేరిట ఉండేది.ఆసియాకప్-2022లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 59 బంతులు మిగిలూండగానే అఫ్గాన్ గెలుపొందింది. తాజా మ్యాచ్‌తో అఫ్గాన్ అల్‌టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఓవరాల్‌గా టీ20ల్లో టీమిండియాకు బంతులు పరంగా ఇదే భారీ విజయం కావడం గమనార్హం. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2021లో స్కాట్లాండ్పై 81 బంతుల్లో మిగిలూండగా భారత్ విజయం సాధించింది. అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంతవేగంగా రన్ ఛేజ్ చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. అగ్రస్దానంలో ఇంగ్లండ్ ఉంది. టీ20 ప్రపంచకప్-2024లో ఒమన్‌పై కేవలం 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేధించింది. -
టీమిండియా సూపర్ విక్టరీ.. 27 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్
ఆసియాకప్-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల ధాటికి 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది.టీమిండియా స్పిన్ ఉచ్చులో యూఏఈ బ్యాటర్లు చిక్కుకున్నారు. ఓపెనర్లు అలీషన్ షరాఫు(22), కెప్టెన్ వసీం మహ్మద్(19) ఆరంభంలో పర్వాలేదన్పించారు. షరాఫూను బుమ్రా ఔట్ చేశాక యూఏఈ వికెట్ల పతనం మొదలైంది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2.1 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ శివమ్ దూబే మూడు, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలా వికెట్ సాధించారు.అభిషేక్ ధానాధన్..అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలో ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్(20), సూర్యకకుమార్ యాదవ్(7) ఆజేయంగా నిలిచారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ ఒక్క వికెట్ సాధించాడు. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది.చదవండి: Asia Cup 2025: జస్ప్రీత్ బుమ్రా సూపర్ యార్కర్.. దెబ్బకు బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
జస్ప్రీత్ బుమ్రా సూపర్ యార్కర్.. దెబ్బకు బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన మార్క్ చూపించాడు. ఆసియాకప్-2025లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్బుతమైన యార్కర్‌తో మెరిశాడు. అతడి వేసిన బంతికి యూఏఈ బ్యాటర్ అలీషన్ షరాఫు వద్ద సమాధానమే లేకుండా పోయింది.యూఏఈ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన బుమ్రా.. నాలుగో డెలివరీని అలీషన్కు సూపర్ యార్కర్‌గా సంధించాడు. అలీషన్ షరాఫు తన బ్యాట్‌ను కిందకు దించే లోపు బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దెబ్బకు యూఏఈ బ్యాటర్ బిత్తర పోయాడు. దీంతో అలీషన్(17 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22) ధానాదన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఇంగ్లండ్ పర్యటనలో మధ్యలోనే వచ్చేసిన బుమ్రాకు ఇదే తొలి మ్యాచ్. అయితే యూఏఈతో మ్యాచ్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ టీమ్‌మెనెజ్‌మెంట్ బుమ్రాకు మొదటి మ్యాచ్‌లో ఆడించి యువ పేసర్ అర్ష్‌దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 19 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శివమ్ దూబే మూడు, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ సాధించాడు. యూఏఈ బ్యాటర్లలో అలీషన్ షరాఫు(22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.Jasprit Bumrah and knocking stumps over — name a better combo 💥Watch #DPWORLDASIACUP2025 - LIVE on #SonyLIV & #SonySportsNetwork TV Channels 📺#AsiaCup #INDvUAE pic.twitter.com/q3wrec57d2— Sony LIV (@SonyLIV) September 10, 2025 -
టీమిండియా లీడింగ్ వికెట్ టేకర్.. కట్ చేస్తే! తుది జట్టులో నో ఛాన్స్
అర్ష్‌దీప్ సింగ్.. టీ20 క్రికెట్లో 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. ఆసియాకప్-2025లో బుధవారం దుబాయ్ వేదికగా భారత్-యూఏఈ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ వంద వికెట్ల మైలు రాయిని అందుకుంటాడని అంతా భావించారు. కానీ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో అర్ష్‌దీప్‌కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అతడి స్ధానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు టీమ్ మెనెజ్‌మెంట్ అవకాశమిచ్చింది. తుది జట్టులో ప్రధాన పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఒక్కడికే చోటు దక్కింది. అతడితో పాటు మీడియం పేస్ బౌలర్ హార్దిక్ పాండ్యా బంతిని పంచుకోనున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు స్పిన్నర్లగా ఉన్నారు. అయితే పిచ్ కండీషన్స్ దృష్ట్యా కెప్టెన్ సూర్య కుమార్ అండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. వికెట్ మధ్యలో చిన్న చిన్న పగుళ్లు ఉండడంతో స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడానికి గల కారణాన్ని అయితే కెప్టెన్ సూర్య వెల్లడించలేదు. కాగా అర్ష్‌దీప్ గత కొంతకాలంగా భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా టీమిండియా తరపున టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్ కూడా అర్ష్‌దీప్(97)నే కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. -
ఆసియాకప్‌లో భారత్ బోణీ.. యూఏఈ చిత్తు
Asia Cup 2025 Ind vs Uae live Updates and Highlights:భారత్ ఘన విజయం..ఆసియాకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా యూఏఈ జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్(20), సూర్యకకుమార్ యాదవ్(7) ఆజేయంగా నిలిచారుయూఏఈ బౌలర్లలో సిద్దుఖీ ఒక్కడే వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, శివమ్ దూబే మూడు వికెట్లు పడగొట్టగారు. వీరితో పాటు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడుతున్న గిల్,అభిషేక్58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. రెండు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(13), అభిషేక్ శర్మ(11) ఉన్నారు.57 పరుగులకే యూఏఈ ఆలౌట్..దుబాయ్ వేదికగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు.అతడితో పాటు శివమ్ దూబే మూడు, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ సాధించాడు. యూఏఈ బ్యాటర్లలో అలీషన్ షరాఫు(22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఆలౌట్ దిశగా యూఏఈ..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ ఆలౌట్ దిశగా సాగుతోంది. 57 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆతిథ్య యూఏఈ పీకల్లోతు కష్టాల్లో పడింది. కుల్దీప్ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో 3 వికెట్లుకుల్దీప్ యాదవ్ స్పిన్ మయాజాలానికి యూఏఈ ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయింది. 9వ ఓవర్లో తొలి బంతికి రాహుల్ చోప్రా ఔట్ కాగా.. నాలుగో బంతికి కెప్టెన్ మహ్మద్ వసీం(19),.. ఆఖరి బంతికి హర్షిత్ కౌశిక్(2) పెవిలియన్‌కు చేరారు. 9 ఓవర్లకు యూఏఈ స్కోర్: 50/57 ఓవర్లకు యూఏఈ స్కోర్: 45/27 ఓవర్లు ముగిసే సరికి యూఏఈ రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ వసీం(18), రాహుల్ చోప్రా(2) ఉన్నారు.యూఏఈ రెండో వికెట్ డౌన్..29 పరుగుల వద్ద యూఏఈ రెండో వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు చేసిన ముహమ్మద్ జోహైబ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. యూఏఈ తొలి వికెట్ డౌన్..27 పరుగుల వద్ద యూఏఈ తొలి వికెట్ కోల్పోయింది. అలీషన్ షరాఫు(22)ను బుమ్రా అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. 4 ఓవర్లకు యూఏఈ స్కోర్: 27/0రెండు ఓవర్లకు యూఏఈ స్కోర్: 16/0రెండు ఓవర్లు ముగిసే సరికి యూఏఈ వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ వసీం(1),అలీషన్ షరాఫు(14) ఉన్నారు.ఆసియాకప్-2025లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా యూఏఈతో తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పిచ్‌పై గ్రాస్ ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత కెప్టెన్ సూర్యకుమార్ కుమార్ యాదవ్ వెల్లడించాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో తీవ్రంగా శ్రమించినట్లు సూర్య చెప్పుకొచ్చాడు. కాగా భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. అయితే సంజూ మిడిలార్డర్ బ్యాటింగ్‌కు రానున్నాడు. ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా సైతం ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు.తుది జట్లుభారత్అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తియునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ : ముహమ్మద్ వసీమ్(కెప్టెన్), అలీషాన్ షరాఫు, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా(వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, హైదర్ అలీ, ధ్రువ్ పరాశర్, ముహమ్మద్ రోహిద్ ఖాన్, జునైద్ సిద్ధిక్, సిమ్రంజీత్ సింగ్ -
అభిషేక్, బుమ్రా, సంజూ.. వావ్.. ఎవరిని తప్పిస్తారు?: అక్తర్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా మంగళవారం మొదలైంది. గ్రూప్-‘బి’ మ్యాచ్‌లో భాగంగా హాంకాంగ్‌పై అఫ్గనిస్తాన్ 94 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా టాపర్‌గా నిలిచి.. రన్‌రేటు పరంగా (+4.700)నూ పటిష్ట స్థితిలోకి వెళ్లింది.ఈ క్రమంలో గ్రూప్-‘ఎ’ తొలి మ్యాచ్‌లో భాగంగా టీమిండియా- యూఏఈ (IND vs UAE)తో తలపడనుంది. దుబాయ్‌లో బుధవారం నాటి ఈ మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఎంపిక ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.అభిషేక్, బుమ్రా, సంజూ.. వావ్.. ఎవరిని తప్పిస్తారు?భారత్ పటిష్ట జట్టుగా పేర్కొన్న అక్తర్.. ఉన్న పదిహేను మంది సూపర్ అని.. వారిలో ఎవరిని పక్కనపెడతారో అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. ఓ యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘అచ్చా.. అభిషేక్ వచ్చేశాడు. బుమ్రా (Jasprit Bumrah) ఉన్నాడు. అంతేకాదు సంజూ కూడా ఉన్నాడు. తిలక్ ఉన్నాడు.హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్ కూడా ఉండనే ఉన్నారు. శుబ్‌మన్ ఉన్నాడు. సూర్య ఉన్నాడు. శివం దూబేతో పాటు మన అక్షర్ పటేల్ కూడా!.. ఇందులో ఎవరిని తప్పించగలరు మిత్రమా!’’ అంటూ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో కామెంట్లు చేశాడు.కత్తిమీద సాములాప్రస్తుత పరిస్థితుల్లో భారత తుదిజట్టు కూర్పు మేనేజ్మెంట్కు కత్తిమీద సాములా మారిందంటూ టీమిండియా అత్యంత పటిష్టంగా ఉందని అక్తర్ చెప్పకనే చెప్పాడు. ఇక తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన విజయం నల్లేరు మీద నడకేనన్న అక్తర్.. యూఏఈ కూడా మంచి జట్టేనని కితాబులు ఇచ్చాడు.ఓటమి ఖాయమే.. కానీ కనీసం‘‘టీమిండియా చేతిలో యూఏఈ ఓడిపోతుందని తెలుసు. అయితే, తక్కువ తేడాతో ఓడిపోవాలని ఆకాంక్షిస్తున్నా. తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ చేతిలో హాంకాంగ్ చిత్తుగా ఓడింది. కనీసం మీరైనా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. కాస్తైనా పోరాట పటిమ కనబరచండి. విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయినా పర్లేదు. అది కూడా గొప్ప అచీవ్మెంట్ లాంటిదే’’ అని అక్తర్ యూఏఈ జట్టుకు సూచించాడు.దాయాదితో ఆరోజే పోరుఇదిలా ఉంటే.. రెండో మ్యాచ్‌లో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొడుతుంది. సెప్టెంబరు 14న ఈ హై వోల్టేజీ మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైంది. ఇక లీగ్ దశలో ఆఖరిగా భారత జట్టు.. సెప్టెంబరు 19న ఒమన్‌తో తలపడుతుంది. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో నిలిచాయి. ఇక ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా అత్యధికంగా ఎనిమిదిసార్లు గెలవగా.. శ్రీలంక ఆరు, పాకిస్తాన్ రెండుసార్లు గెలిచాయి. మిగతా జట్లలో బంగ్లాదేశ్ రెండుసార్లు ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆసియా కప్-2025కి టీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: పక్షవాతం.. నొప్పి భరించలేకపోయా: టీమిండియా స్టార్ క్రికెటర్ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
ఆసియా కప్-2025: ‘యువీకి అప్‌గ్రేడ్ వర్షన్ అతడు’
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో టీమిండియా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టీ20 టోర్నీ మంగళవారం మొదలైంది. అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవగా.. బుధవారం టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది.అనంతరం సెప్టెంబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, సెప్టెంబరు 19న ఒమన్‌తో మ్యాచ్‌తో సూర్యకుమార్ సేన తమ లీగ్ దశను పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా యువ స్టార్లు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అరంగేట్రంలోనే డకౌట్.. ఆ తర్వాతకాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఐపీఎల్లో సత్తా చాటి.. గతేడాది జూలైలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అరంగేట్రంలోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్‌లో 47 బంతుల్లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు.ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో ఓపెనర్‌గా పాతుకుపోయిన అభిషేక్.. ఇప్పటి వరకు 17 మ్యాచ్‌లలో కలిపి 33కు పైగా సగటుతో 193కు పైగా స్ట్రైక్‌రేటుతో 535 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీఇక మరోవైపు.. దాదాపు ఏడాది కాలం తర్వాత వైస్ కెప్టెన్‌గా టీమిండియా టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు శుబ్‌మన్ గిల్. టెస్టుల్లో ఇప్పటికే సారథిగా పగ్గాలు చేపట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది.యువీకి అప్‌గ్రేడ్ వర్షన్ అతడుఇక ఆసియా కప్-2025లో తొలి మ్యాచ్‌కు అభిషేక్, గిల్ సిద్ధమవుతున్న వేళ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘యూఏఈ పిచ్‌లపై కూడా అభిషేక్ శర్మ దూకుడైన ఆట కొనసాగుతుందో లేదో చూడాలి. ఏదేమైనా అతడో సూపర్ ప్లేయర్. యువరాజ్ సింగ్ అప్‌గ్రేడ్ వర్షన్ లాంటోడు.గిల్‌కు మంచి అవకాశంఇక ఈ టోర్నీలో పరుగులు చేయాలనే ఒత్తిడి శుబ్‌మన్ గిల్‌పై తప్పక ఉంటుంది. 140- 150కి పైగా స్ట్రైక్‌రేటుతో అతడు పరుగులు రాబట్టాల్సి ఉంటుంది. ఈసారి ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల వీరుడు అయ్యేందుకు గిల్‌కు మంచి అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025లో అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్‌గా.. 14 మ్యాచ్‌లలో కలిపి 439 పరుగులు సాధించాడు. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. 15 మ్యాచ్‌లు ఆడి 650 పరుగులతో టాప్-4లో నిలిచాడు.చదవండి: టెంబా బవుమాకు ఘోర అవమానం.. వరుసగా రెండోసారి..! -
Asia Cup 2025: శివం దూబే మాకు కీలకం: భారత బౌలింగ్ కోచ్
టీమిండియా స్టార్ శివం దూబే (Shivam Dube)ను ఉద్దేశించి బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morney Morkel) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో అతడి సేవలను పూర్తిగా వినియోగించుకుంటామని తెలిపాడు. ఈ టీ20 టోర్నీలో శివంను పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా ఉపయోగించుకుంటామని పేర్కొన్నాడు.ఎనిమిది జట్ల మధ్య పోటీ కాగా యూఏఈ వేదికగా భారత్ ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పాల్గొంటుండగా.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ తలపడుతున్నాయి.రెండు నైపుణ్యాలపై దృష్టి ఉండాలిఇక అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో మంగళవారం (సెప్టెంబరు 9) ఈ టోర్నీ మొదలుకానుండగా.. బుధవారం టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను యూఏఈతో ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియా సమావేశంలో మాట్లాడాడు.ఈ సందర్భంగా.. ‘‘నాలుగు ఓవర్లు బౌల్ చేసే ఆటగాడిగా శివంను మేము ఉపయోగించుకుంటాము. నా దృష్టిలో ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఆల్‌రౌండర్లు బ్యాటర్, బౌలర్‌గా తమకున్న రెండు నైపుణ్యాలపై దృష్టి సారించాలని నేను ఎల్లప్పుడూ చెబుతూ ఉంటా.ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలికొంతమంది ప్రాక్టీస్ సమయంలో ఏదో ఒక దానిపై మాత్రమే ఫోకస్ చేస్తారు. కానీ మేము మాత్రం వారు రెండు విధాలుగా రాణించాలని కోరుకుంటాము. ఇక.. మ్యాచ్ రోజున అందరి కంటే అతడికే పరిస్థితులు ఎక్కువగా అనుకూలించవచ్చు. కాబట్టి అందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని చెప్తాము’’ అని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు.ఆల్‌రౌండర్లు మెరుగ్గా రాణిస్తే కెప్టెన్‌కు పని సులువు అవుతుందన్న మోర్నీ.. ఫ్రంట్‌లైన్ బౌలర్లతో పాటు ఆల్‌రౌండర్ల సేవలు కూడా బౌలింగ్ విభాగంలో ఉపయోగించుకుంటామని మరోసారి స్పష్టం చేశాడు. కాగా ఆసియా కప్ టోర్నీలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ రూపంలో ముగ్గురు కీలక ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి టీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్ కెప్టెన్.. సూర్య, రషీద్ ఖాన్ ఏం చేశారంటే? -
టీమిండియా ఫేవరెటా?.. అతడి గురించి బెంగ వద్దు: సూర్యకుమార్
ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నమెంట్ నేపథ్యంలో ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియాతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత వారమే మేము యూఏఈకి చేరుకున్నాము. ఇక్కడ గట్టిగానే ప్రాక్టీస్ చేశాము.వాళ్లు మరింత గొప్పగా రాణించాలిఆసియాలోని అత్యుత్తమ జట్లతో పోటీ పడనుండటం సంతోషంగా ఉంది. యూఏఈతోనే తొలి మ్యాచ్ ఆడబోతున్నాం. ఆ జట్టు బ్రాండ్ క్రికెట్ ఆడుతోంది. ఇటీవలే ఓ టోర్నీలోనూ పాల్గొన్నారు. తాము ఉత్తమంగా రాణించి గెలుపు అంచుల వరకు వెళ్లామని యూఏఈ కెప్టెన్ చెప్పాడు.ఆసియా కప్‌లో కూడా వాళ్లు మరింత గొప్పగా రాణించి.. ఈసారి అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలో సఫలం కావాలి. ఆ జట్టుతో ఆడేందుకు మేము ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రత్యర్థి జట్టుకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు.టీమిండియా ఫేవరెటా?.. నేనైతే వినలేదుఇక ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఫేవరెట్ కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఈ విషయం మీకెవరు చెప్పారు. నేనైతే ఎక్కడా వినలేదు. మేము సుదీర్ఘకాలంగా టీ20లలో అత్యుత్తమంగా రాణిస్తున్నాం. ఏదేమైనా పూర్తి స్థాయిలో టోర్నీకి సిద్ధంగా ఉన్నామని మాత్రం చెప్పగలను.మైదానంలో దూకుడుగా ఉండటం అన్నికంటే ముఖ్యం. అసలు అగ్రెషన్ లేకుండా గ్రౌండ్‌కు ఎలా వెళ్లగలం?.. మేము ఈసారి కూడా అలాగే చేస్తాం’’ అని సూర్య పేర్కొన్నాడు. ఇక టీమిండియా ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్- సంజూ శాంసన్‌లలో ఎవరు వస్తారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. అతడి గురించి బెంగ వద్దు‘‘తుదిజట్టు ప్రకటన సమయంలో నేనే చెప్తాను. అతడి గురించి బెంగ వద్దు. మేము అతడి గురించి ఆలోచిస్తున్నాం. బుధవారం నాటి మ్యాచ్‌లో మేము సరైన నిర్ణయమే తీసుకుంటామని హామీ ఇస్తున్నా’’ అని సూర్య తెలిపాడు.ఇక తాము జనవరి- ఫిబ్రవరి తర్వాత కలిసి టీ20లు ఆడలేదన్న సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్ ద్వారా టీమిండియా ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించిందని తెలిపాడు. జూన్ నుంచి తాము టీ20లు ఆడలేదని.. టోర్నీలో మున్ముందు ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్నాడు.కాగా భారత్.. యూఏఈ వేదికగా ఆసియా కప్-2025 టోర్నీకి ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబరు 9- 28 వరకు పొట్టి ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగనుంది. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడుతుండగా.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో ఉన్నాయి. చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
గిల్ చిన్నప్పటి నుంచే తెలుసు.. గుర్తుపడతాడో లేదో!: యూఏఈ క్రికెటర్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) స్పిన్నర్ సిమ్రన్‌జీత్ సింగ్ (Simranjeet Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్ననాడు గిల్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేశానని.. అయితే, ఇప్పుడు అతడికి తాను గుర్తున్నానో లేదో తెలియదని అన్నాడు. కాగా పంజాబ్‌లోని లుథియానాకు చెందిన సిమ్రన్‌జీత్ సింగ్ ఊహించని పరిస్థితుల్లో యూఏఈకి చేరుకున్నాడు.ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో అక్కడే ఉండిపోయాడు. జూనియర్లకు కోచ్‌గా వ్యవహరిస్తూనే.. యూఏఈ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో పన్నెండు టీ20 మ్యాచ్‌లు ఆడిన సిమ్రన్‌జీత్ సింగ్ పదిహేను వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పుడు ఆసియా కప్-2025 రూపంలో మేజర్ టోర్నీ ఆడేందుకు అతడు సిద్ధమయ్యాడు.తొలి మ్యాచ్‌లోనే టీమిండియాతో ఢీకాగా సొంతగడ్డపై జరుగనున్న ఈ ఖండాంతర టోర్నీలో యూఏఈ.. టీమిండియాతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఇరుజట్లు సెప్టెంబరు 10న తమ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సిమ్రన్‌జీత్ సింగ్ గిల్‌తో తనకున్న జ్ఞాపకాలు, తన క్రికెట్ ప్రయాణం గురించి తెలిపాడు.గిల్ చిన్నప్పటి నుంచే తెలుసు‘‘శుబ్‌మన్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచే నాకు తెలుసు. అయితే, ప్రస్తుతం తనకు నేను గుర్తున్నానో లేదో తెలియదు. 2011-12లో మొహాలీలో ఉన్న పంజాబ్ క్రికెట్ అకాడమీలో ఉదయం ఆరు నుంచి పదకొండు వరకు మేము ప్రాక్టీస్ చేసేవాళ్లం.శుబ్‌మన్ వాళ్ల నాన్నతో కలిసి పదకొండు గంటలకు అక్కడికి వచ్చేవాడు. నేను కాసేపు ఎక్కువ సమయం అక్కడే ఉండేవాడిని గనుక గిల్‌కు బౌలింగ్ చేసేవాడిని. అయితే, ఇప్పుడు తను నన్ను గుర్తుపట్టగలడో లేదో తెలియదు’’ అని 35 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సిమ్రన్‌జీత్ సింగ్ గుర్తు చేసుకున్నాడు.అనూహ్య పరిస్థితుల్లోఅదే విధంగా.. ‘‘పంజాబ్ జట్టుకు జిల్లా స్థాయిలో చాలా మ్యాచ్‌లే ఆడాను. 2017 రంజీ ప్రాబబుల్స్‌లోనూ నాకు చోటు దక్కింది. అంతేకాదు ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ మొహాలీలో మ్యాచ్ ఆడినప్పుడల్లా నెట్స్‌లో బౌలింగ్ చేసేవాడిని.అయితే, 2021 ఏప్రిల్‌లో దుబాయ్‌లో ఇరవై రోజుల పాటు ప్రాక్టీస్ చేసేందుకు నాకు ఆఫర్ వచ్చింది. అప్పుడే కోవిడ్ రెండో దశ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇండియాలో మరోసారి లాక్డౌన్ విధించారు. దీంతో నేను దుబాయ్‌లోనే మరి కొన్నినెలల పాటు ఉండిపోవాల్సి వచ్చింది.సెంట్రల్ కాంట్రాక్టు కూడాఅప్పటి నుంచి దుబాయ్‌లోనే సెటిల్ అయ్యాను. జూనియర్ ఆటగాళ్లకు కోచింగ్ ఇవ్వడం ద్వారా మంచిగానే సంపాదించాను. క్లబ్ క్రికెట్ ఆడేవాడిని కూడా!.. అలా కుటుంబాన్ని పోషించుకునేవాడిని.ఈ క్రమంలోనే యూఏఈ జట్టులోకి వచ్చాను. యూఏఈ బోర్డు నాకు సెంట్రల్ కాంట్రాక్టు కూడా ఇచ్చింది. అప్పటి నుంచి నా ఆర్థిక పరిస్థితి మరింత మెరుగైంది’’ అని సిమ్రన్‌జీత్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం టెస్టుల్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న గిల్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఇటీవలే తిరిగి నియమితుడయ్యాడు. ఇక సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీ జరుగనుంది.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ఖండాంతర క్రికెట్ టోర్నమెంట్ ఆసియా కప్ (Asia Cup). ఈసారి పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టీమిండియా (2023 వన్డే ఫార్మాట్ విజేత) బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ కూడా పాల్గొంటున్నాయి.ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌వే అయినా.. పాక్ కూడా ఈ ఈవెంట్లో భాగమైనందున తటస్థ వేదికైన యూఏఈలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మరి.. ఆసియా కప్-2025 టోర్నీ పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారం తదితర వివరాలు తెలుసుకుందామా!!గ్రూపులు- రెండుగ్రూప్-‘ఎ’- భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్గ్రూప్-‘బి’- శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్‌కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు 👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్‌కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్- అబుదాబి- సాయంత్రం 5.30 నిమిషాలకు👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్‌కాంగ్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 23: A2 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 24: A1 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 25: A2 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 26: A1 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 28: ఫైనల్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు.జట్లు ఇవేటీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్యూఏఈముహమ్మద్ వసీం (కెప్టెన్), అలిశాన్ షరాఫూ, ఆర్యాంశ్ శర్మ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఈథన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మతీఉల్లా ఖాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), రోహిద్ ఖాన్, సిమ్రన్‌జీత్ సింగ్, సాఘిర్ ఖాన్.ఒమన్జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా, సూఫియాన్ యూసుఫ్, ఆశిష్ ఒడెదెరా, అమీర్ కలీమ్, మహ్మద్ నదీమ్, సూఫియాన్ మెహమూద్, ఆర్యన్ బిష్త్, కరణ్ సోనావాలే, జిక్రియా ఇస్లాం, హస్నైన్ అలీ షా, ఫైసల్ షా, మహమ్మద్ ఇమ్రాన్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ.శ్రీలంకచరిత్ అసలంక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగ, నువానీదు ఫెర్నాండో, దునిత్ వెల్లాలగే, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో.బంగ్లాదేశ్లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, సైఫ్ హసన్, తౌహిద్ హ్రిదోయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, షరీఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్స్టాండ్బై ప్లేయర్లు: సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహమాన్, అల్లాహ్ గజన్ఫార్. నూర్ అహ్మద్, ఫారిక్ అహ్మద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీరిజర్వ్ ఆటగాళ్లు: వఫివుల్లా తారఖాల్, నంగ్యాల్ ఖరోటే, అబ్దుల్లా అహ్మద్జాయ్హాంకాంగ్యాసిమ్ ముర్తాజా (కెప్టెన్), బాబర్ హయత్, ఆదిల్ మెహమూద్, జీషన్ అలీ (వికెట్ కీపర్), ఎహ్సాన్ ఖాన్, అనాస్ ఖాన్, షాహిద్ వాసిఫ్ (వికెట్ కీపర్), కల్హన్ చల్లు, హరూన్ అర్షద్, నిజకత్ ఖాన్, ఆయుశ్ శుక్లా, అలీ హసన్, నస్రుల్లా రానా, ఐజాజ్ ఖాన్, ఎండీ ఘజన్ఫర్, మార్టిన్ కోయెట్జి, అతీక్ ఇక్బాల్, మహ్మద్ వాహిద్, అన్షుమన్ రథ్, కించిత్ షా.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..ఆసియా కప్-2025 టీ20 మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ)లో వీక్షించవచ్చు. డిజిటల్ యూజర్ల కోసం సోనీలివ్ వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.ప్రైజ్ మనీ ఎంతంతంటే?ఆసియాకప్-2022(టీ20 ఫార్మాట్) ఛాంపియన్స్‌గా నిలిచిన శ్రీలంకకు దాదాపు 200,000 డాలర్ల( సుమారు రూ. 1.6 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది. ఈ ఏడాది ఆసియా విజేతగా నిలిచే జట్టుకు 300,000 డాలర్లు (దాదాపు రూ. 2.6 కోట్లు) నగదు బహుమతి ఏసీసీ అందజేయనున్నట్లు సమాచారం. గత ఎడిషన్‌తో పోలిస్తే ఇది 50 శాతం అధికం. రన్నరప్‌గా నిలిచే జట్టు 150,000 డాలర్లు (సుమారు రూ. 1.3 కోట్లు) ప్రైజ్‌మనీ సొంతం చేసుకోనుంది. మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచే జట్లు వరుసగా రూ. 80, 60 లక్షలు దక్కించుకోనున్నాయి.చదవండి: కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. కేఎల్ రాహుల్ కాల్ చేసి: క్రిస్ గేల్ -
IND vs UAE: భయమేమీ లేదు.. బాగా ఆడిన జట్టుదే గెలుపు: యూఏఈ కోచ్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కోచ్, భారత మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని.. మ్యాచ్ రోజున బాగా ఆడిన వాళ్లనే విజయం వరిస్తుందని పేర్కొన్నాడు. కాగా పొట్టి క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు ఆసియా కప్ టోర్నీ సిద్ధమైపోయింది.టీమిండియా వర్సెస్ యూఏఈఈసారి టీ20 ఫార్మాట్లో యూఏఈలో జరిగే ఈ ఖండాంతర టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్- ‘ఎ’ నుంచి భారత్ , పాకిస్తాన్లతో పాటు పసికూనలు యూఏఈ, ఒమన్.. గ్రూప్- ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీ పడతాయి. సెప్టెంబరు 9న అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుండగా.. సెప్టెంబరు 10న యూఏఈ టీమిండియాను ఢీకొట్టనుంది.మేము ఫియర్లెస్ క్రికెట్ ఆడతాముఈ నేపథ్యంలో యూఏఈ కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ మీడియాతో మాట్లాడాడు.. ‘‘టీమిండియా పటిష్ట జట్టు. గత టీ20 ప్రపంచకప్‌లో చాంపియన్. అలాంటి జట్టుతో ఆడే అవకాశం రావడం గొప్ప విషయం.అయితే, టీ20 ఫార్మాట్లో మ్యాచ్ రోజున ఏ జట్టైతే బాగా ఆడుతుందో అదే గెలుస్తుంది. ఒక్క బ్యాటర్ లేదంటే బౌలర్ మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. మేము ఫియర్లెస్ క్రికెట్ ఆడతాము.అన్నింటికీ సిద్ధంగా ఉన్నారుమా జట్టు బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. బౌలింగ్ యూనిట్లో మంచి స్పిన్నర్లు ఉన్నారు. యూఏఈలో మ్యాచ్‌లు ఆడిన అనుభవం వారికి ఉంది. అయితే, పటిష్ట జట్టు అయిన టీమిండియాతో ఎలా ఆడతారో చూద్దాం.ప్రతి ఒక్క జట్టుకు టీమిండియాతో ఆడాలని ఉంటుంది. మేము కూడా అంతే. అయితే, కాస్త ఆందోళనగానే ఉంది. ఏదేమైనా మా ఆటగాళ్లు అన్నింటికీ సిద్ధంగా ఉన్నారు’’ అని లాల్‌చంద్ రాజ్‌పుత్ పేర్కొన్నాడు. కాగా యూఏఈ జట్టు ఇటీవల పాకిస్తాన్- అఫ్గనిస్తాన్‌లతో కలిసి ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. అయితే, ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు.ఆసియా కప్-2025 టోర్నీకి యూఏఈ జట్టు:ముహమ్మద్ వసీం (కెప్టెన్), అలిశాన్ షరాఫూ, ఆర్యాంశ్ శర్మ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఈథన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మతీఉల్లా ఖాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), రోహిద్ ఖాన్, సిమ్రన్‌జీత్ సింగ్, సాఘిర్ ఖాన్.చదవండి: కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. కేఎల్ రాహుల్ కాల్ చేసి: క్రిస్ గేల్ -
ఆసియా కప్-2025: జట్టును ప్రకటించిన యూఏఈ
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తమ జట్టును ప్రకటించింది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి పదిహేడు మంది సభ్యులను ఎంపిక చేసినట్లు గురువారం వెల్లడించింది. ముహమ్మద్ వసీం కెప్టెన్సీలో యూఏఈ ఈ టోర్నీ ఆడనుంది. ఇందులో ఆర్యాంశ్ శర్మ (Aryansh Sharma), ధ్రువ్ పరాశర్, రాహుల్ చోప్రా (Rahul Chopra) తదితర భారత సంతతి ఆటగాళ్లు కూడా ఉన్నారు.ఆతిథ్య హక్కులు భారత్‌వి.. వేదిక యూఏఈకాగా ఈ ఖండాంతర ఈవెంట్ ఆతిథ్య హక్కులను ఈసారి భారత్ దక్కించుకుంది. అయితే, పాకిస్తాన్ కూడా ఈ టోర్నీలో భాగమైనందున గత ఒప్పందం ప్రకారం.. తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యూఏఈలో ఆసియా కప్ టోర్నీని పూర్తి చేయనుంది.ఈ టోర్నమెంట్లో ఎనిమిది జట్లు పాల్గొననుండగా.. రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ పోటీపడుతున్నాయి.సూపర్ ఫోర్ దశకు చేరాలంటే..ఇక సొంతగడ్డపై టోర్నీ జరుగనుండటం యూఏఈకి సానుకూలాంశంగా మారనుంది. భారత్, పాకిస్తాన్, ఒమన్‌లతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉన్న యూఏఈ.. లీగ్ దశలో కనీసం రెండు గెలిస్తే సూపర్ ఫోర్ దశకు చేరుకునే అవకాశం ఉంటుంది. టీమిండియా వంటి పటిష్ట జట్టుపై గెలిచే అవకాశం లేకపోయినా.. ప్రస్తుతం బలహీనంగా ఉన్న పాకిస్తాన్‌తో పాటు పసికూన ఒమన్‌పై గెలవడం ద్వారా యూఏఈ తన కలను నెరవేర్చుకోవచ్చు.ఇక సెప్టెంబరు 10న టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా ఆసియా కప్ టోర్నీలో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న యూఏఈ.. తదుపరి సెప్టెంబరు 17న పాకిస్తాన్‌తో తలపడనుంది. కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ఆ మరుసటి రోజే ఒమన్ జట్టుతో యూఏఈ మ్యాచ్ ఆడుతుంది. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ ఇటీవలే యూఏఈ హెడ్‌కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. ఆసియా కప్ టోర్నీలో లాల్‌చంద్ ఆ జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు.ఇదిలా ఉంటే.. ఈ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా యూఏఈ ప్రస్తుతం.. పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌లతో కలిసి టీ20 ముక్కోణపు సిరీస్ ఆడుతోంది. ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఆడి పాకిస్తాన్, అఫ్గన్ జట్ల చేతిలో ఓడిపోయింది. అయితే, మెగా టోర్నీకి ముందు కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం లభించింది.ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు యూఏఈ జట్టు ఇదేముహమ్మద్ వసీం (కెప్టెన్), అలిశాన్ షరాఫూ, ఆర్యాంశ్ శర్మ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఈథన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మతీఉల్లా ఖాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), రోహిద్ ఖాన్, సిమ్రన్‌జీత్ సింగ్, సాఘిర్ ఖాన్.చదవండి: సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?: రాజస్తాన్ రాయల్స్ స్టార్