India - West Indies
-
ప్రేక్షకులను అలరిస్తా : గేల్
కింగ్ స్టన్: ఏడాది తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన టీ20 విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను రంజింప చేస్తానని తెలిపాడు. ఆదివారం భారత్‌తో జరిగే ఎకైక టీ20కి విండీస్ జట్టులోకి తిరిగి వచ్చిన గేల్ బ్యాటింగ్‌తో రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి రావడం సంతోషంగా ఉందన్న గేల్, హోం గ్రౌండ్లో భారత్‌తో ఆడటం మరింత ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఇక 37 ఏళ్ల జమైకన్ ముందు రిటైర్మెంట్ ప్రస్తావన తీయగా అభిమానులు తన ఆటను కోరుకుంటున్నారని, మరి కొన్ని సంత్సరాలు ఆడుతాననే నమ్మకం ఉందని తెలిపాడు. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ ఆడటమే తన లక్ష్యమని గేల్ పేర్కొన్నాడు. ఇక సీనియర్ ఆటగాళ్లను కూడా విండీస్ బోర్డు జట్టులోకి ఆహ్వానిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. జట్టుకు సీనియర్లు అవసరమని, అదే విధంగా భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్లను సిద్ధం చేయాలని తెలిపాడు. ఇక వన్డేల్లో భారత్‌పై తమ ఆటగాళ్లు తమ పరిధి మేరకు రాణించారని గేల్ వెనుకేసుకొచ్చాడు. భారత్ ఎప్పుడూ మా ఫేవరేట్ అని వారి నుంచి యువ ఆటగాళ్లు చాలా నేర్చుకున్నారని పేర్కొన్నాడు. భారత్ 3-1తో వన్డే సిరీస్ నెగ్గగా నేడు ఎకైక టీ20 ఆడనుంది. -
ఏ స్థానంలో ఆడడానికైనా సిద్ధం..
కింగ్స్టన్: భవిష్యత్తు గురించి ఆలోచించనని జట్టు యాజమాన్యం ఏ స్థానంలో ఆడమంటే ఆ స్థానంలో ఆడుతానని భారత క్రికెటర్ అజింక్యా రహానే స్పష్టం చేశాడు. విండీస్ టూర్ లో ఓపెనర్‌గా చెలరేగిన ఈ స్టైలీష్ క్రికెటర్ ఆదివారం జరిగే ఏకైక టీ20లో రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే విండీస్ పర్యటన అనంతరం అజింక్యా రహానేకు జట్టులో స్థానంపై ఆందోళన నెలకొంది . గత చాంపియన్స్ ట్రోఫీలో పూర్తిగా బెంచ్‌కే పరిమితమైన రహానేకు ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో అవకాశం లభించింది. అయితే ఈ సిరీస్ అనంతరం భారత్ శ్రీలంకతో 3టెస్టులు, 5 వన్డే, 2 టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు రోహిత్ అందుబాటులోకి రానున్నాడు. దీంతో జట్టులో స్థానం కోసం రహానేకు పోటి నెలకొంది. ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన రహానే భవిష్యత్తు గురించి ఆలోచించనని, ప్రస్తుతం వన్డే, టీ20లపైనే దృష్టి పెట్టానని తెలిపాడు. ఓపెనర్‌గానే కాకుండా టీం మేనేజ్మెంట్ కోరితే నెం.4 , నెం.2, నెం.1 స్థానాల్లోనైనా ఆడటానికి సిద్ధమన్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదని, నా వంతుగా జట్టు విజయం కోసం వంద శాతం కృషి చేస్తానని తెలిపాడు. ఇక వన్డే, టీ20లో స్థిరంగా రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రహానే పేర్కొన్నాడు. గత వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాపై నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి రాణించానని గుర్తు చేశాడు. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో తెలుసన్నాడు. ఇది పెద్ద సమస్యకాదని రహానే పేర్కొన్నాడు. విండీస్ పర్యటనపై స్పందిస్తూ.. ఈ సిరీస్ నాకు చాల ముఖ్యమైనది. చాలా రోజుల తర్వాత నాకు అవకాశం లభించింది. చాంపీయన్స్ ట్రోఫీలో నాకు అవకాశం లభించలేదు. ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడుతావని విరాట్ చెప్పాడంతో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. బ్యాట్‌తో నాప్రతిభను చూపించాలని నిర్ణయించుకున్నాను. ఈ సిరీస్ మొత్తం బ్యాటింగ్ ఆస్వాదిస్తూ రాణించానని రహానే తెలిపాడు. టీ20 మ్యాచ్‌లో క్రిస్ గేల్ రాకపై స్పందిస్తూ ప్రత్యర్ధి జట్టులో గేల్ ఒకరే లేరు..11 మంది ఆటగాళ్లు ఉంటారు. మేము మా బలంపైనే దృష్టి పెట్టామని రహానే చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్ లో రహానే ఒక సెంచరీ 3 అర్ధ సెంచరీలతో ఓపెనర్‌గా రాణించాడు. -
వన్డేలో అయిపోయాయ్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: భారత్- వెస్టిండీస్ మధ్య విశాఖలో ఈ నెల 24న జరగనున్న రెండో వన్డే క్రికెట్ మ్యాచ్‌కు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. వర్షం కురుస్తున్నా క్రీడాభిమానులు మీ సేవా కేంద్రాలతో పాటు స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద గురువారం వేకువజాము నుంచే బారులు తీరారు. దాదాపు 12 వేల టికెట్లను జిల్లా రెవెన్యూ యంత్రాంగం పర్యవేక్షణలో జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి, భీమిలి, తగరపువలస, నగరంలోని 20 మీ సేవా కేంద్రాల ద్వారా టికెట్లు విక్రయించారు. ఉద యం ఎనిమిది గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. లోయ ర్ డినామినేషన్లలోనే కాక హయ్యర్ డినామినేషన్లోనూ టికెట్లు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి మీ సేవా కేంద్రంలో రూ.400లవి 75, రూ.750వి 200, రూ.1250వి 100 టికెట్లు విక్రయానికి ఉంచగా రూ.2 వేలు, రూ. 3వేల టికెట్లను కేవలం పదిహేనేసి మాత్రమే ఉంచారు. ఇవి వెంటనే అమ్ముడయ్యాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటలకల్లా టికెట్లు అయిపోయి కౌంటర్లు బోసిపోయాయి. రూ.5 వేల టికెట్లను పదేసి చొప్పున ఇవ్వగా ఒకటో రెండో మిగిలి ఉన్నాయి. స్టేడియంలోని కౌంటర్లో హై డినామినేషన టికెట్లను మాత్రమే ఉంచారు. తొలి వన్డేలో భారత్ విజయం సాధించడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. విశాఖలో జరిగే రెండో వన్డేలో కూడా విజయం సాధిస్తే సిరీస్ సొంతమవుతుందన్న ఆనందం అందరిలో ఉంది.