India womens hockey
-
ఒలింపిక్స్ బెర్త్ లక్ష్యంగా.. నేడు పటిష్టమైన జర్మనీతో భారత్ 'ఢీ'
Women's Hockey Olympic Qualifiers: మరో మ్యాచ్ కోసం ఎదురు చూడకుండా... పటిష్టమైన జర్మనీపై గెలిచి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో భారత మహిళల హాకీ జట్టు ఉంది. రాంచీలో జరుగుతున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఈరోజు జర్మనీతో భారత్; అమెరికాతో జపాన్ తలపడనున్నాయి. సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ చేరిన రెండు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో ఓడిన జట్ల మధ్య మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో నెగ్గిన జట్టుకు మాత్రమే చివరిదైన మూడో బెర్త్ ఖరారవుతుంది. దాంతో భారత్‌తోపాటు మిగతా మూడు జట్లు కూడా సెమీఫైనల్లో గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. 2006 నుంచి జర్మనీతో ఏడుసార్లు తలపడ్డ భారత్ ఐదుసార్లు ఓడిపోయి, కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో జర్మనీపై గెలవాలంటే భారత్ సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
కీలకపోరులో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్
మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు నేడు పూల్ ‘బి’లో పటిష్టమైన న్యూజిలాండ్‌తో కీలక సమరానికి సిద్ధమైంది. నెదర్లాండ్స్ వేదికగా జరిగిన గత రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గోల్‌కీపర్ సవితా పూనియా కెప్టెన్సీలో భారత్.. ఇంగ్లండ్‌తో, చైనాతో మ్యాచ్‌లను 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే... లేదంటే కనీసం ‘డ్రా’ చేసుకుంటేనే క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉంటాయి. -
Hockey World Cup 2022: చైనాతో భారత్ ఢీ.. ఎప్పుడంటే..?
మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భాగంగా నేడు పూల్ ‘బి’ లో చైనా జట్టుతో భారత్ ఆడనుంది. గోల్‌కీపర్ సవిత పూనియా నాయకత్వంలోని టీమిండియా చైనాపై గెలిస్తే క్వార్టర్ ఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. ఇప్పటివరకు చైనాతో 21 సార్లు తలపడిన భారత్ 11 సార్లు గెలిచి, ఒకసారి ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిదిసార్లు చైనా నెగ్గింది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–3, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
‘రాణి’ లేని జట్టుతో ప్రపంచకప్‌కు..
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ ఫిట్నెస్ సమస్యలతో ప్రపంచకప్ ఆడే జట్టుకు దూరమైంది. సీనియర్ గోల్ కీపర్ సవిత సారథ్యంలోని మహిళల భారత హాకీ జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. తొడ కండరాల గాయం నుంచి రాణి పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆమెను ఎంపిక చేయలేదని హెచ్ఐ వర్గాలు వెల్లడించాయి. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ను తొలిసారి నాలుగో స్థానంలో నిలిపిన ఘనత రాణిది. ఆ తర్వాత గాయం కారణంగా ఆమె ఏ టోర్నీ ఆడలేదు. ఇటీవలే ప్రొ లీగ్ మ్యాచ్‌లకు ఎంపిక చేసినా... పూర్తి ఫిట్నెస్ లేక తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయింది. దీంతో భారత ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించారు. నెదర్లాండ్స్, స్పెయిన్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ వచ్చే నెల 1 నుంచి 17 వరకు జరుగుతుంది. భారత జట్టు: సవిత (కెప్టెన్, గోల్‌కీపర్), దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెప్టెన్), బిచూ దేవి, గుర్జీత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, నిషా, సుశీల చాను, మోనిక, నేహా, జ్యోతి, నవ్‌జ్యోత్ కౌర్, సోనిక, సలిమా టేటే, వందన కటారియా, లాల్రెమ్సియామి, నవ్‌నీత్ కౌర్, షర్మిలా దేవి. -
అమెరికా చేతిలో భారత్ ఓటమి
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల జట్టు మరోసారి నిరాశ పరిచింది. గ్రూప్-బీ లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున అమెరికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పరాజయం పాలైంది. అమెరికా చేతిలో భారత మహిళల జట్టు 3-0 తేడాతో ఓటమి చెందింది. భారత జట్టు తొలి క్వార్టర్స్ నుంచి తప్పిదాలు చేస్తూ అమెరికాకు పెనాల్టీ కార్నర్ అవకాశాలను ఇచ్చింది. మరోవైపు మొదటి క్వార్టర్ నుంచి మ్యాచ్ ముగిసే వరకూ అమెరికా మహిళల జోరు కొనసాగింది. కాథలీన్ బామ్(14వ, 42వ నిమిషాలలో) రెండు గోల్స్ చేయగా, మెలిస్సా గొంజాలెజ్(52 నిమిషం) అమెరికా తరఫున గోల్స్ సాధించారు. ఇప్పటికే గ్రూప్ నుంచి చివరి స్థానంలో నిలిచిన భారత మహిళల జట్టు క్వార్టర్స్ అవకాశాలు దాదాపు గల్లంతయ్యాయి. ఏదైనా సంచలనం నమోదైతే తప్ప భారత్ తర్వాతి రౌండ్ కు వెళ్లే సూచనలు కనిపించడంలేదు. జపాన్, అర్జెంటీనా లు తమ తదుపరి మ్యాచ్ లో ఓడి, భారత్ తమ చివరి మ్యాచ్ లో నెగ్గితేనే క్వార్టర్స్ కు దూసుకెళ్తుంది. ఇప్పటికే గ్రూప్ నుంచి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు క్వార్టర్స్ చేరుకున్న విషయం తెలిసిందే. చివరి మ్యాచ్ లోనూ ఓడితే భారత మహిళలు గెలుపు ఖాతా తెరవకుండానే ఇంటిదారి పట్టినట్లు అవుతుంది.