న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ ఫిట్‌నెస్ సమస్యలతో ప్రపంచకప్ ఆడే జట్టుకు దూరమైంది. సీనియర్ గోల్ కీపర్ సవిత సారథ్యంలోని మహిళల భారత హాకీ జట్టును హాకీ ఇండియా (హెచ్‌ఐ) సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. తొడ కండరాల గాయం నుంచి రాణి పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆమెను ఎంపిక చేయలేదని హెచ్‌ఐ వర్గాలు వెల్లడించాయి. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ను తొలిసారి నాలుగో స్థానంలో నిలిపిన ఘనత రాణిది.
ఆ తర్వాత గాయం కారణంగా ఆమె ఏ టోర్నీ ఆడలేదు. ఇటీవలే ప్రొ లీగ్ మ్యాచ్‌లకు ఎంపిక చేసినా... పూర్తి ఫిట్‌నెస్ లేక తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయింది. దీంతో భారత ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించారు. నెదర్లాండ్స్, స్పెయిన్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ వచ్చే నెల 1 నుంచి 17 వరకు జరుగుతుంది.
భారత జట్టు: సవిత (కెప్టెన్, గోల్‌కీపర్), దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెప్టెన్), బిచూ దేవి, గుర్జీత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, నిషా, సుశీల చాను, మోనిక, నేహా, జ్యోతి, నవ్‌జ్యోత్ కౌర్, సోనిక, సలిమా టేటే, వందన కటారియా, లాల్‌రెమ్సియామి, నవ్‌నీత్ కౌర్, షర్మిలా దేవి.
Comments
Please login to add a commentAdd a comment