
మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భాగంగా నేడు పూల్ ‘బి’ లో చైనా జట్టుతో భారత్ ఆడనుంది. గోల్‌కీపర్ సవిత పూనియా నాయకత్వంలోని టీమిండియా చైనాపై గెలిస్తే క్వార్టర్ ఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. ఇప్పటివరకు చైనాతో 21 సార్లు తలపడిన భారత్ 11 సార్లు గెలిచి, ఒకసారి ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిదిసార్లు చైనా నెగ్గింది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–3, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.