Indian-American doctor
-
భారతీయ–అమెరికన్ వైద్యులకు కీలక పదవులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇద్దరు ప్రముఖ భారతీయ–అమెరికన్ వైద్యులను తన ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కీలక స్థానాల్లో నియమించారు. వెస్ట్ వర్జీనియా మాజీ హెల్త్ కమిషనర్ డాక్టర్ రాహుల్ గుప్తాను ‘ఆఫీసు ఆఫ్ ద నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ’ తదుపరి డైరెక్టర్‌గా నామినేట్ చేశారు. ప్రఖ్యాత సర్జన్, రచయిత అతుల్ గవాండేను యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్లో ‘బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్’ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు. రాహుల్ గుప్తా వెస్టు వర్జీనియాలో ఇద్దరు గవర్నర్ల హయాంలో హెల్త్ కమిషనర్‌గా సేవలందించారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ప్రజారోగ్య పాలసీపై పలు సంస్థలు, టాస్క్‌ఫోర్సులకు సలహాదారుడిగా పనిచేశారు. భారత దౌత్యవేత్త కమారుడైన డాక్టర్ రాహుల్ గుప్తా భారత్‌లో జన్మించారు. వాషింగ్టన్ డీసీలో పెరిగారు. ఇక అతుల్ గవాండే రాసిన ద చెక్‌లిస్టు మేనిఫెస్టో, బీయింగ్ మోర్టల్, కాంప్లికేషన్స్ తదితర పుస్తకాలు న్యూయార్క్ టైమ్స్ బెస్టు–సెల్లింగ్ బుక్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ‘బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్’ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా తనను నియమించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అతుల్ గవాండే చెప్పారు. -
కరోనా చికిత్సకు మార్గం కనుగొన్న తెలుగు సైంటిస్ట్
వాషింగ్టన్: కోవిడ్–19 చికిత్సకు ఉపయోగపడే ఓ మార్గాన్ని తెలంగాణకు చెందిన సైంటిస్ట్ డాక్టర్ తిరుమల దేవి కన్నెగంటి కనుగొన్నారు. ఈమె అమెరికాలోని సెయింట్ జూడ్ రీసెర్చ్ ఆస్పత్రిలో గత 13 ఏళ్లుగా పని చేస్తున్నారు. ఈమె పరిశోధనకు సంబంధించిన వివరాలు సెల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కోవిడ్–19 సోకిన తర్వాత శరీరంలోని వివిధ అవయవాలు వైరస్ వల్ల దెబ్బ తింటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ అవయవాలను దెబ్బతీస్తున్న మూలాలపై ఆమె పరిశోధనలు చేశారు. (భారత్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందా?) ఇందులో ప్రత్యేకించి వైరస్ కారణంగా కొన్ని కణాలు మరణిస్తున్నాయని కనుగొన్నారు. ఈ కణాల మరణం వల్ల ఇతర అవయవాలు దెబ్బ తింటున్నాయని ఆమె గుర్తించారు. కణాల మరణానికి కారణమవుతున్న సైటోకైనిన్‌లను సైతం ఆమె గుర్తించగలిగారు. ఈ పరిశోధన వల్ల నిర్ణీత సమస్యకు కచ్చితమైన సమాధానం కనుగొనవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఇతర వ్యాధుల చికిత్సకూ ఈ పరిశోధన ఉపయోగపడుతుందన్నారు. (కరోనా టీకాపై భారత్ ఆశలు.. తేల్చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్) -
ఎన్నారై వైద్యుడుకి ప్రతిష్టాత్మక పురస్కారం
అమెరికాలో ఎన్నారై వైద్యుడు, ప్రముఖ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ రాహుల్ జిందాల్ ప్రతిష్టాత్మక 'అవుట్ స్టాండింగ్ అమెరికన్ బై ఛాయస్' పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌లో వైద్య రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆ అవార్డుకు ఎంపిక చేసినట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) శనివారం వెల్లడించింది. యూఎస్‌లోని భారతీయ సమాజాన్నే కాకుండా అమెరికన్ ప్రజలకు కూడా రాహుల్ అందించిన సేవలు నభూతోనభవిష్యత్తు అని ఆ సంస్థ పేర్కొంది. ఈ నెల 13న వర్జీనియాలోని అర్లింగ్టన్ నేషనల్ సిమెట్రిలో జరిగే కార్యక్రమంలో ఆ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని రాహుల్ కు అందజేస్తామని వివరించింది. ఇటీవలే ఇంటర్నేషనల్ లీడర్ షిప్ ఫౌండేషన్ నుంచి రాహుల్ జిందాల్ లీడర్షిప్ అవార్డుకు కూడా అందుకున్నారు. సర్వీస్ అండ్ వాలంటరీజమ్ కమిషనర్‌గా రాహుల్ జిందాల్ ను ఆ ఫౌండేషన్ నియమించిన సంగతి తెలిసిందే. వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్లో ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే జార్జీయా వాషింగ్టన్ యూనివర్శిటీలో క్లీనికల్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీలో ఎండీ విద్యను రాహుల్ జిందాల్ అభ్యసించారు. అనంతరం ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లారు. ఆ క్రమంలో అమెరికాలో స్థిరపడ్డారు. సమాజసేవలో భాగంగా ఉత్తర అమెరికాలో దాదాపు 600 దేవాలయాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు.