indian arm y
-
భారత ఆర్మీతో పోలికా! అంత సీన్ లేదు.. కుండ బద్దలు కొట్టిన పాక్ ఆర్మీ మాజీ చీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ కమర్ జావెద్ బద్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత సైన్యం సత్తాపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. భారత్ సైన్యంతో పారాడే శక్తి సామర్థ్యాలు, ఆయుధ సంపత్తి పాకిస్తాన్ ఆర్మీకి లేదని కుండబద్దలు కొట్టారు. బ్రిటన్‌లోని పాకిస్తాన్ మీడియా జర్నలిస్టులు హమీద్ మీర్, నజీం జెహ్రాలకు ఇచ్చిన ఇంటర్వూలో జావెద్ ఈ వాఖ్యలు చేశారు. 'భారత ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ సరితూగలేదు. భారత్‌తో పాక్ యుద్ధం చేసే పరిస్థితి లేదు. ట్యాంకులు కూడా పనిచేయడం లేదు. ఫిరంగులను తరలించడానికి డీజిల్ కూడా లేదు' అని బజ్వా తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ఆ దేశ సైనిక సామర్థ్యాలపై ప్రశ్నలు లేవెనత్తేలా, సైన్యం నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయి. ఏదేమైనా ఆయన చెప్పిన దాంట్లో మాత్రం వాస్తవం ఉంది. భారత సైన్యం వీరపరక్రమాల ముందు పాక్ సైన్యం సరితూగదని జగమెరిగిన సత్యం. పాకిస్తాన్ కమాండర్స్ సదస్సులోనే బజ్వా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భారత్‌తో పాకిస్తాన్ శుత్రుత్వం పెంచుకోకుండా స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరుచుకుంటేనే మంచిదని ఆయన అన్నారు. భారత్‌తో సుదీర్ఘ విరోధం పాకిస్తాన్‌ను హరించివేస్తుందని పేర్కొన్నారు. భారత్‌తో పోరాడేందుకు అవసరమైన ఆయుద సంపద, ఆర్థిక బలం పాకిస్తాన్‌కు లేవని, అందుకే కశ్మీర్ సమస్యపై ఇరుదేశాలు శాశ్వత పరిష్కారానికి వచ్చే విషయంపై ఆలోచిస్తున్నట్లు కూడా బజ్వా పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ సంక్షోభంతో ప్రజల జీవితాలు దుర్బరంగా మారాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చి, ఉద్యోగాలు పోయి అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. చదవండి: సూడాన్ ఆర్మీ-పారామిలిటరీ బలగాల పోరు.. 72 గంటలపాటు కాల్పుల విరమణ! -
అగ్గిరాజేస్తున్న అగ్నిపథ్.. పోలీసులు వర్సెస్ నిరసనకారులతో ఉద్రిక్తత
-
సాప్ట్ వేర్ నుంచి సమర రంగంలోకి..
ఆర్మీలో చేరుతున్న టెకీలు, ఇంజినీర్లు చెన్నై: దేశసేవ, సాహసం చేయాలన్న కోరికతో పలువురు సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ ఉద్యోగులు సైన్యం వైపు ఆకర్షితులవుతున్నారు. కళ్లు చెదిరే జీతాలు, విలాసాలు అరచేతిలో ఉన్నా వాటిని కాదని, మనసుకు నచ్చిన జవాన్ కొలువుల్లో చేరుతున్నారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న జెంటిల్మెన్ కేడెట్స్, లేడీ కేడెట్స్లో పలువురు సాఫ్టవేర్, ఇంజనీరింగ్, జర్నలిజం వంటి రంగాల నుంచి వచ్చిన వారే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో మంచి ఉద్యోగం వదులుకుని ఆర్మీలో చేరినవి. శరణ్య కమిషన్డ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ‘ఎన్సీసీలో ఉన్నప్పటి నుంచే ఆర్మీలో చేరాలన్న కోరిక ఉండేది. సైన్యం మనోధైర్యాన్ని ఇస్తుంది. నాకు ఏ విధులు ఇచ్చినా పూర్తి చేస్తానన్న నమ్మకం ఉంది’ అని ఆమె చెప్పారు. మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేసిన ఆర్. సతీశ్ కుమార్ కూడా లాభదాయకమైన ఉద్యోగం వదులుకుని సైన్యంలో చేరారు. ప్రముఖ ఇంగ్లిష్ దిన పత్రికలో విలేకర్లుగా పనిచేసిన జాక్స్ జోస్, ప్రశాంత్ విజయ్‌కుమార్ అనే యువకులు కూడా సాహసోపేతమైన విధులు నిర్వహించడానికి ఆర్మీలో చేరామని చెప్పారు. ‘జర్నలిజం కూడా సాహసంతో కూడుకున్నదే. అయితే జవాన్ల విధులు మరింత సాహ సంతో కూడుకుని ఉంటాయి కాబట్టి ఆర్మీలో చేరాను’ అని జోస్ చెప్పారు.