భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) పేరిట టోర్నీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య మాజీ కార్యదర్శి జనరల్ బ్రిగేడ్ పీకే మురళీధరన్ రాజా దీనికి రూపకల్పన చేశారు.
ఇన్ఫినిటి ఆప్టిమల్ సొల్యుషన్స్ (ఐఓఎస్) ఈ టోర్నీని మార్కెటింగ్ చేయనుంది. ఐబీసీతో ఒప్పందం చేసుకుంటే బాక్సర్‌కు ఏడాదికి నాలుగు బౌట్లను ఏర్పాటు చేస్తారు. విజేతలకు రూ. 6 లక్షలు చెల్లించనున్నారు. అయితే బాక్సర్ హోదాను బట్టి ఇందులో మార్పు ఉంటుందని ఐఓఎస్ సీఈఓ నీరవ్ తోమర్ చెప్పారు. సెప్టెంబర్ చివరి వారం, లేదా అక్టోబర్ మొదటి వారంలో తొలి బౌట్ జరగొచ్చు.