
ప్రొఫెషనల్ బాక్సర్‌గా సోమ్ బహదూర్
మాంచెస్టర్ 2002 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన భారత బాక్సర్ సోమ్ బహదూర్ పూన్ ఇక ప్రొఫెషనల్‌గా మారనున్నాడు. భారత బాక్సింగ్ మండలి (ఐబీసీ) నుంచి అనుమతి తీసుకున్న సోమ్ బహదూర్ ఈనెల 29న ఇంఫాల్‌లో జరిగే ఐబీసీ ఫైట్ ఈవెంట్‌లో లైట్ హెవీ వెయిట్ విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన మనోప్ సిత్తినెమ్‌తో తలపడతాడు.