indian bride
-
భారతదేశంలో టాప్ 10 వంతెనలు
-
అమెరికా అబ్బాయి.. ఇందూరు అమ్మాయి
నిజామాబాద్ కల్చరల్ : అమెరికా అబ్బాయి.. ఇందూరు అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. మూడు ముళ్లు.. ఏడడుగులతో ఏకమయ్యారు. ఖండాంతరాలు దాటిన వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో గురువారం నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్‌రోడ్‌లో గల శ్రావ్యగార్డెన్‌లో వివాహం జరిగింది. అమెరికాలో ప్రేమించు కున్న జంట తెలుగు సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల సాక్షిగా వావాహం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడకు చెందిన సామలేటి సోమే శ్వర్ వరలక్ష్మీల ప్రథమ పుత్రిక అర్చన 2010లో ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లారు. 2014లో చదువు పూర్తి చేసి ఎంఫార్మసీ డ్రగ్ విభాగంలో ఉద్యోగంలో చేరి స్థిరపడి గ్రీన్‌కార్డు సంపాదించారు. ఈ క్రమంలో మ్యాట్రిమోని సైట్ ద్వారా అమెరికాలోని డెట్రాయిట్ మిచిగన్ సిటీకి చెందిన యానిమేషన్ డిజైనర్ శాన్ విన్ డ్యగ్ (వరుడు) పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి మే 2019లో అమెరికాలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. గురువారం శ్రావ్య గార్డెన్లో హిందూ సంప్రదాయ ప్రకారం వీరద్దరు ఏకమయ్యారు. వివాహానికి వరుడి తల్లి సిసిలియా, తండ్రి జాఫఫ్ హాజరయ్యారు. వీరు సైతం తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించి వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇబ్బందిపెట్టిన కరోనా.. అర్చన, శాన్ విన్ డ్యగ్ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వరుడి తల్లిదండ్రులు ఇండియా రావడానికి విమానాశ్రయ వైద్య బృందం కరోనా వైరస్‌కు సంబంధించిన టెస్టులు చేయడం వలన ఇబ్బందులకు గురియ్యామని అందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 6న ఇండియాకు రావాల్సి ఉండగా, వీరు కరోనా టెస్టుల వల్ల 48 గంటలు ఆలస్యంగా 8న తేదీన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్లు వరుడి తల్లిదండ్రులు తెలిపారు. వీరు తిరిగి ఈనెల 15న అమెరికా వెళ్లనున్నారు. -
తెనాలి అమ్మాయి... జర్మనీ అబ్బాయి..
వివాహ బంధానికి ఎల్లలు లేవనే నిజం మరోసారి రుజువైంది. మనసుకు నచ్చిన అమ్మాయిని.. ఖండాలు దాటి వచ్చి మరీ మూడుముళ్ళ బంధంతో ఒక్కటి చేసుకున్నాడా యువకుడు. ఈ సంఘటన తెనాలిలో శనివారం తెల్లవారుజామున జరిగింది. తెనాలి చెంచుపేటకు చెందిన పావులూరి సత్యన్నారాయణ, గాయత్రిదేవి దంపతులకు పావని, రాజేష్ అనే ఇద్దరు పిల్లలున్నారు. పావని ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం నాలుగేళ్ల క్రితం జర్మనీ వెళ్లింది. అక్కడ ఆమె పనిచేసే కంపెనీలో జర్మనీకి చెందిన లెన్జ్ కొన్రాడ్ ష్విష్టన్ బర్గ్ కడా ఉద్యోగం చేస్తున్నాడు. పావనిని చూసిన ష్విష్టన్ బర్గ్ ఆమెతో జీవితాంతం కలిసి నడవాలని భావించాడు. తన అభిప్రాయాన్ని ఆమెకు తెలియజేశాడు. తన తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని పావని తెలిపింది. వెంటనే బర్గ్ తన తల్లిదండ్రులైన క్లవ్స్ ష్విష్టన్ బర్గ్, మార్టిన్ ఎఫ్ మర్ట్లకు ముందుగా తెలియజేశాడు. ఒక్కగానొక్క కుమారుడి కోరికను మన్నించిన వారు తెనాలిలోని పావని తల్లిదండ్రులను సంప్రదించారు. వారితో మాట్లాడి వారిని పెళ్లికి ఒప్పించారు. ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో స్థానిక చెంచుపేటలోని చావాస్ గ్రాండ్లో శనివారం తెల్లవారుజామున 2.39 నిమిషాలకు హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేయించేందుకు నిశ్చయించారు. దీంతో అబ్బాయి తల్లిదండ్రులు తెనాలి వచ్చి వేదమంత్రాల నడుమ వారిని ఒక్కటిగా చేశారు. వివాహం కనుల పండువగా జరిగింది.