Indian captain Mahendra Singh Dhoni
-
నిబంధనలు మార్చాలి: ధోని
మెల్బోర్న్: వన్డేల్లో బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువ అనుకూలంగా ఉన్న ప్రస్తుత నిబంధనలు మార్చాలని భారత కెప్టెన్ ధోని అన్నాడు. ఐసీసీ అనుసరిస్తున్న నలుగురు ఫీల్డర్ల వ్యూహం వల్ల 50 ఓవర్ల ఫార్మాట్లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుందన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ మండలి నిబంధన ప్రకారం మ్యాచ్ మొత్తంలో 30 యార్డ్ సర్కిల్ బయట నలుగురికంటే ఎక్కువ మంది ఫీల్డర్లను ఉంచరాదు. ఈ నిబంధన భారత్ బౌలింగ్‌పై తీవ్ర ప్రభా వం చూపిందని చెప్పిన మహీ సరైన సీమర్ ఆల్‌రౌండర్ లేకపోవడం సెమీస్‌లో దెబ్బతీసిందన్నాడు. ‘ఈ నిబంధనలను మార్చాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. వన్డేల్లో గత చరిత్రను పరిశీలిస్తే డబుల్ సెంచరీలను చూడలేదు. కానీ ఇప్పుడు మూడేళ్ల వ్యవధిలో మూడు ద్విశతకాలు నమోదయ్యాయి. ఎక్స్ట్రా ఫీల్డర్‌ను సర్కిల్ లోపలికి తీసుకురావడంతో చాలా డాట్ బాల్స్ నమోదవుతున్నాయని చాలా మంది అంటున్నారు. అదే లాజిక్ అయితే మరి 11 మందిని సర్కిల్లోనే ఉంచితే మరిన్ని డాట్ బాల్స్ వస్తాయి కదా’ అని ధోని విమర్శించాడు. వన్డేల్లో ఎక్కువ ఫోర్లు, సిక్సర్లు ఉంటే ఆట బోరింగ్‌గా ఉంటుందన్నాడు. ‘తొలి, చివరి 10 ఓవర్లలో ఎలాగూ టి20ల మాదిరిగా ఆడతాం. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్‌పైనే వన్డేలు ఆధారపడి ఉండాలి. కాబట్టి ప్రస్తుత నిబంధన చాలా కఠినంగా ఉంది. స్పిన్నర్లకు ఇది మరింత భారంగా మారింది. ప్రతి బ్యాట్స్‌మన్ స్వీప్, రివర్స్ స్వీప్‌లతో పాటు ఇతరత్రా షాట్స్ అన్నీ అడుతున్నారు’ అని మహీ వ్యాఖ్యానించాడు. -
‘ధోని’ సినిమా చూపిస్తున్నాడు!
- తెరపై భారత క్రికెట్ కెప్టెన్ బయోగ్రఫీ - ధోని పాత్ర పోషిస్తున్న సుశాంత్ రాజ్‌పుత్ ముంబై: క్రికెట్ ప్రపంచంలో సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఇప్పుడు సినిమాగా తెరకెక్కనుంది. సాధారణ కుటుంబ నేపథ్యంనుంచి వచ్చి భారత క్రికెట్ అత్యుత్తమ కెప్టెన్‌గా ఎదిగిన అతను ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతని జీవితంలోని అనేక మలుపులు, విశేషాలతో ‘ఎం.ఎస్. ధోని - ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో సినిమా రూపొందుతోంది. ధోని గురించి క్రికెట్ వీరాభిమానులకు కూడా తెలియని ఎన్నో విషయాలు ఈ చిత్రంలో చూపించనున్నారు. ‘ఎ వెడ్నస్ డే’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నీరజ్ పాండే దీనికి దర్శకత్వం వహిస్తుండగా...‘కై పో చే’ చిత్రంలో వెలుగులోకి వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. ధోని నాయకత్వంలో భారత జట్టు టి20 ప్రపంచ కప్ గెలిచి సరిగ్గా ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ధోనికే చెందిన ఇన్స్పైర్డ్ ఎంటర్టైన్మెంట్- రితి స్పోర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. క్రీడాకారుల జీవిత చరిత్రతో ఇటీవల రూపొందించిన భాగ్ మిల్కా భాగ్, మేరీకోమ్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. వచ్చే ఏడాది ధోని సినిమా విడుదలవుతుంది. గతంలోనే ధోనిపై సినిమా నిర్మాణంలో ఉందని, అయితే బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసిందని వార్తలు వచ్చాయి. అయితే దీనిని కొట్టిపారేసిన బోర్డు, ధోని ప్రొఫెషనల్ కెరీర్‌కు సమస్య రానంత వరకు అతని సినిమాపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.