Indian Cellular Association
-
అమెరికాకు ఎల్రక్టానిక్స్ ఎగుమతులు రెండు రెట్లు
న్యూఢిల్లీ: భారత్ నుండి అమెరికాకు ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 2023 జనవరి–సెపె్టంబర్ మధ్య వార్షిక ప్రాతిపదికన రెండు రెట్లు పెరిగి 6.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఇండస్ట్రీ బాడీ– ఐసీఈఏ (ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్) తెలిపింది. 6.6 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు భారత్ నుంచి ఆల్ టైమ్ గరిష్ట స్థాయని ఐసీఈఏ చైర్మన్ మహీంద్రూ తెలిపారు. ఆయన తెలిపిన సమచారం ప్రకారం, చైనా నుండి అమెరికా మార్కెట్లోకి దిగుమతి అయ్యే ఎల్రక్టానిక్స్ ప్రొడక్టుల వాటా తగ్గింది. ఇటీవలి గణాంకాల ప్రకారం, భారతదేశ ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల నమోదయ్యింది. 2021–22 జనవరి–సెపె్టంబర్ మధ్య అమెరికాకు భారత్ ఎల్రక్టానిక్స్ ఎగుమతుల విలువ 2.6 బిలియన్ డాలర్లు. 2022–23 ఇదే కాలంలో ఈ విలువ సుమారు 253 శాతం పెరిగి 6.6 బిలియన్లకు చేరుకుంది. 2018లో ఈ విలువ 1.3 బిలియన్ డాలర్లయితే, 2022లో 4.5 బిలియన్ డాలర్లని మహీంద్రూ వెల్లడించారు. భారత్–అమెరికాల మధ్య మధ్య ద్వైపాక్షిక ఎల్రక్టానిక్స్ వాణిజ్యం కూడా 84 శాతం మేర రికార్డు స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. 2021–22 జనవరి–సెపె్టంబర్ మద్య ఈ విలువ 4.9 బిలియన్ డాలర్లయితే, 2022–23 ఇదే కాలంలో ఈ విలువ 9 బిలియన్ డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు. 2023లో ద్వైపాక్షిక ఎల్రక్టానిక్స్ వాణిజ్య విలువ 8.4 బిలియన్ డాలర్లుకాగా, దశాబ్ద కాలంలో ఈ విలువను 100 బిలియన్ డాలర్లు చేర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ బాటలో ఇండో–అమెరికా టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీ లక్ష్యం సాధనే ధ్యేయం కాగా, భారత్–అమెరికా టాస్క్ ఫోర్స్ ఫర్ ఎల్రక్టానిక్స్ కేవలం స్వల్ప కాలిక ప్రయోజనాలకు సంబంధించినది కాదని టాస్క్ ఫోర్స్ ఆన్ ఎల్రక్టానిక్స్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు. భారీ ఎగుమతులకు సంబంధించి ఒక లక్ష్యాన్ని నెలకొల్పడానికి ఉద్దేశించినదని వివరించారు. ‘‘ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం 9 నెలల్లో 9 బిలియన్ డాలర్లుగా అంచనా. ఇది చక్కటి అభివృద్ధిగా మేము పరిగణిస్తున్నాము. ఇప్పుడు మా లక్ష్యం ఈ వేగాన్ని మరింత పెంచడం. అమెరికా ఎల్రక్టానిక్స్ మార్కెట్లో భారత్ స్థానాన్ని గణనీయంగా మెరుగుపరచాలన్నది మా లక్ష్యం‘ అని మీడియాతో ఆయన అన్నారు. అమెరికాకు భారత్ ఎల్రక్టానిక్స్ ఎగుమతుల పెరుగుదల ప్రపంచ ఎల్రక్టానిక్స్ మార్కెట్లో మన దేశ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రపంచ ఎల్రక్టానిక్స్ వాణిజ్యంలో భారత్ ప్రాముఖ్యతను వెల్లడిస్తోందన్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ ఎగుమతులపై భారత్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. ఈ విభాగంలో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో 5 రెట్లు వృద్ధిని భారత్ సాధించగలమని తాము భావిస్తున్నట్లు తెలిపారు. చైనా నుంచి భారీగా తగ్గుదల చైనా నుండి అమెరికాకు మొత్తం దిగుమతుల్లో ఎల్రక్టానిక్స్ వాటా 2018లో 46 శాతం. జనవరి–సెపె్టంబర్ 2023లో ఇది 24 శాతానికి తగ్గింది. 2018 అనేక చైనా వస్తువులపై 25 శాతం సుంకాలను (ట్రంప్ టారిఫ్‌లు) అమెరికా విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు వియత్నాం, తైవాన్‌ల నుంచి అమెరికాకు 2018 నుంచి 2022 మధ్య భారీగా ఎల్రక్టానిక్స్ ఎగుమతులు పెరగడం గమనార్హం. ఆయా దేశాల నుంచి వరుసగా ఎగుమతులు 420 శాతం, 239 శాతం మేర పెరిగాయి. క్లిష్టమైన భౌగోళిక రాజకీయ సమస్యలు, సరఫరా గొలుసులను వైవిధ్యం వంటి అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటుండడం గమనార్హం. 4 ఏళ్లలో భారీ వృద్ధి దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరికరాల వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో విడిభాగాల ఎగుమతిదారుగా ఎదిగే సామర్థ్యం ఉంది. మొబైల్ రంగానికి ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంతో అదనంగా 5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయి. రాబోయే అయిదేళ్లలో ఇది మరింతగా పెరుగుతుంది. దేశీయంగా డిజైన్ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నాం. ఇది దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ కూడా వృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో మొబైల్ ఫోన్ల తరహాలోనే మనం విడిభాగాలను కూడా గణనీయంగా ఎగుమతి చేయబోతున్నాం. – అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి -
ఈ-కామర్స్ కంపెనీలపై స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు ఫిర్యాదు
-
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై కఠిన చర్యలు?
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు ఆపిల్, నోకియా, వివో వంటి కంపెనీలు ఫిర్యాదు చేశాయి. మొబైల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఈ-కామర్స్ కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయని ఈ హ్యాండ్సెట్ తయారీదారుల లాబీ ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్(ఐసీఏ), వాణిజ్య మంత్రి సురేష్ ప్రభుకు ఫిర్యాదు చేసింది. విదేశీ మూలధనాన్ని భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేయడానికి వాడుతున్నాయని ఐసీఏ ఆరోపిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీఏ కోరుతోంది. ఇన్వెస్టరీని పెట్టుకుని, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలను ప్రభావితం చేస్తూ.. ఎఫ్డీఐలోని ప్రెస్ నోట్ 3 కిందనున్న నిబంధనను కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయని ఐసీఏ పేర్కొంటోంది. దీంతో ఆఫ్‌లైన్ రిటైలర్ల రెవెన్యూలు హరించుకుపోతున్నాయని, దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని ఐసీఏ తెలిపింది. ఈ పరిస్థితిపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా మొబైల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తుల ధరలను ఇవి ప్రభావితం చేస్తున్నాయని సురేష్ ప్రభుకు తెలియజేసింది. ప్రెస్ నోట్ 3 నిబంధనలను, ఇతర చట్టాలను ఉల్లంఘించే వారిపై మనీ లాండరింగ్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కోరుతోంది. ఈ కంపెనీలను దేశానికి వ్యతిరేకంగా ఎకనామిక్ టెర్రరిజం చేపడుతున్నాయని భావించాలని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను అమెజాన్ కొట్టిపారేసింది. తాము దేశీయ చట్టాలకు, నిబంధనలకు కట్టుబడి ఉన్నామని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు. విక్రయదారులు నిర్ణయించిన ధరలను అమెజాన్.ఇన్ మార్కెట్‌ప్లేస్‌లో ఆఫర్ చేస్తున్నాని పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్ మాత్రం దీనిపై స్పందించలేదు. ఐసీఏ, హ్యాండ్సెట్ తయారీదారులు ఆపిల్, మైక్రోమ్యాక్స్, నోకియా, వివో, లావా, మోటోరోలా, లెనోవా వంటి కంపెనీల లాబీ సంస్థ. -
హైదరాబాద్‌లో మొబైల్స్ తయారీ హబ్
-
హైదరాబాద్‌లో మొబైల్స్ తయారీ హబ్
⇒ 1,000 ఎకరాలిచ్చేందుకు ప్రభుత్వం ఓకే ⇒ ప్లాంట్ల ఏర్పాటుకు సెల్కాన్, కార్బన్ రెడీ ⇒ ఆసక్తి చూపుతున్న మరిన్ని కంపెనీలు సాక్షి, హైదరాబాద్/బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీకి హైదరాబాద్ కేంద్రం కానుంది. మొబైల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను పరిశీలించిన ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్(ఐసీఏ) భాగ్యనగరిపై మొగ్గు చూపుతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి హబ్‌ను ప్రతిపాదించగా దానికి పూర్తి మద్దతిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. అన్నీ అనుకూలిస్తే భారత్‌లో మొబైల్స్ తయారీకి తొలి కేంద్రంగా హైదరాబాద్ నిలువనుంది. హబ్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు సెల్కాన్, కార్బన్‌తోపాటు చైనాకు చెందిన రెండు మూడు కంపెనీలు ప్రస్తుతం రెడీగా ఉన్నాయి. నెలకు 10 లక్షల మొబైల్స్ తయారీ సామర్థ్యంతో ప్లాంటు నెలకొల్పుతామని సీఎంను కలిసిన అనంతరం సెల్కాన్ సీఎండీ వై.గురు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ఐసీఏ చొరవతో.. భారత్‌లో మొబైల్స్ తయారీకి హబ్ ఉండాలన్న తలంపుతో కొన్ని నెలలుగా ఐసీఏ తీవ్రంగా యత్నిస్తోంది. ఇందుకు సహకరించాలని పలు రాష్ట్రాలను సంప్రదించింది. మేలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును సైతం కంపెనీల ప్రతినిధులు కలిశారు. మంగళవారం ఇదే విషయమై కేసీఆర్‌ను ఐసీఏ ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ, సెల్కాన్ సీఎండీ వై.గురు, ఈడీ మురళి రేతినేని, కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజ, ఫాక్స్‌కాన్ ఇండియా ఎండీ జోష్ ఫూల్జే, వాటర్ వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి టోని కలిశారు. హబ్ వస్తే 2 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు సీఎంకు తెలిపారు. ఐసీఏ ప్రతిపాదనను స్వాగతిస్తూ హైదరాబాద్ ప్రాంత విశిష్టతలను, రానున్న రోజుల్లో తెలంగాణ రూపురేఖలు ఏ విధంగా మారనున్నాయో ఈ సందర్భంగా సీఎం వారికి వివరించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని రాయితీల్ని తామిస్తామని స్పష్టం చేశారు. ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతోనూ ఐసీఏ ప్రతినిధులు చర్చించారు. హబ్ కార్యరూపం దాల్చేందుకు వెన్నంటి ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. భారీ ఆఫర్.. కేంద్ర తయారీ విధానం-2012 ప్రకారం ప్లాంటుపై పెట్టే పెట్టుబడిలో 25 శాతాన్ని కేంద్రం రిఫండ్ చేస్తుంది. జూలైతో ముగియనున్న ఈ స్కీంను కొన్నాళ్లు పొడిగించేలా కేంద్రాన్ని కోరాలని ఐసీఏ ప్రతినిధులు సీఎంకు విన్నవించారు. సీఎం వెంటనే స్పందించి ఈ మేరకు కేంద్రానికి లేఖను పంపాలని అధికారుల్ని కోరారు. హబ్ ఏర్పాటుకు 200 ఎకరాలు అవసరమవుతాయని కంపెనీలు ప్రతిపాదించగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా 1,000 ఎకరాలు కేటాయించేందుకు సీఎం సిద్ధపడ్డారు. మొబైల్స్‌పై వ్యాట్ విషయంలో నెలకొన్న అస్పష్టతను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లగా 5 శాతానికే పరిమితం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఎం చొరవ భేష్ అంటూ పంకజ్ మొహింద్రూ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి, మహేశ్వరం, రావిర్యాల్ ప్రాంతాల్లో భూములను కంపెనీల ప్రతినిధులు పరిశీలించారు. -
మొబైల్ ఫోన్ల తయారీ కోసం టాస్క్‌ఫోర్స్
4 ఏళ్లలో 50 కోట్ల హ్యాండ్సెట్ల తయారీ లక్ష్యం న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల తయారీ జోరు పెంచడానికి కేంద్రం ఒక సంయుక్త టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 2019 కల్లా 50 కోట్ల మొబైల్ ఫోన్లు భారత్‌లో తయారు చేయడం (వార్షిక ఉత్పత్తిని రూ.1,50,000 కోట్ల నుంచి రూ.3,00,000కోట్లకు పెంచడం) లక్ష్యంగా ఈ ఫాస్ట్‌ట్రాక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత భారీ స్థాయి ఉత్పత్తి కారణంగా 15 లక్షల మందికి ఉద్యోగవకాశాలు వస్తాయని అంచనా. ఇండియన్ సెల్యులర్ ఆసోసియేషన్(ఐసీఏ) నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ మోహింద్రూ ఈ టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. శామ్సంగ్, మైక్రోసాఫ్ట్ డివెసైస్, లావా, మైక్రోమ్యాక్స్, ఎల్జీ, సోనీ తదితర కంపెనీల ప్రతినిధులకు కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌లో స్థానం కల్పించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(డైటీ) డెరైక్టర్లు ఎస్కె. మార్వా, ఆశా నంగియాలు టాస్క్ ఫోర్స్ లో ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది భారత మొబైల్ మార్కెట్ 32 శాతం వృద్ధితో 1,200 కోట్ల డాలర్లకు పెరుగుతుందని, దీంట్లో దిగుమతుల వాటా మూడొంతులని అంచనా. నోకియా ప్లాంట్ మూసివేత కారణంగా దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ 29 శాతం క్షీణించింది.