Indian Cricket players
-
క్రికెట్ సెలబ్రిటీస్ ఫ్యామిలీ ఫొటోలు
-
టీమిండియా ప్లేయర్‌కు కరోనా.. బీసీసీఐ అలర్ట్!
లండన్: విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 23 మంది ఆటగాళ్ల బృందంలో ఒకరికి కరోనా సోకింది. ఆటగాడి పేరు బయటకు వెల్లడించకపోగా.. ప్రస్తుతం అతను తన బంధువుల ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే స్వల్ఫ గొంతు నొప్పిగా ఉండడంతో ఆ ఆటగాడికి పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ ఆటగాడితో సన్నిహితంగా ఉన్న జట్టు సభ్యులను, సిబ్బందిని మూడురోజుల పాటు ఐసోలేషన్ వెళ్లమని వైద్య సిబ్బంది సూచించగా.. ఆ గడువు ముగిసింది. దీంతో గురువారం ఆ ఆటగాడు మినహా.. మిగతా వాళ్లంతా డర్హమ్‌కు బయలుదేరనున్నారు. ఇక బుధవారం బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కోల్‌కతాలో సమావేశంకాగా, ఏం చర్చించారనే విషయంపై గోప్యతను ప్రదర్శించారు. మరోవైపు 20 రోజుల బ్రేక్ దొరికినప్పటికీ టీమిండియా ఆటగాళ్లను బయటకు వెళ్లొద్దని బీసీసీఐ సూచించినప్పటికీ.. కొందరు ఏకంగా వింబుల్డన్ టోర్నీకి హాజరయ్యారు కూడా. ఇక ఆటగాడు వైరస్ బారినపడ్డ(అసింప్టోమెటిక్ లక్షణాలు) విషయం తెలిశాక.. బీసీసీఐ సెక్రెటరీ జై షా అప్రమత్తంగా ఉండాలని మిగతా ఆటగాళ్లను ఉద్దేశించి ఓ మెయిల్ లేఖను పంపారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో డెల్టా వేరియెంట్ కేసులు పెరుగుతుండడంతోనే ఇలా సూచించినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఆ ఆటగాడికి వైరస్ ఎలా సోకిందనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆగష్టు 5వ తేదీ నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈమధ్య పాకిస్థాన్‌లో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ క్యాంప్‌లో కరోనా వైరస్ కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. -
మన క్రికెటర్లకు ఢోకా లేదు
ముంబై: కోవిడ్–19 కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది. ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినడంతో సహజంగానే ఆ ప్రభావం అన్ని రంగాలపై పడింది. దాదాపుగా అన్ని టోర్నీలు, సిరీస్‌లు రద్దు కావడం లేదంటే వాయిదా పడటంతో క్రికెట్ బోర్డుల ఆదాయం ఆగిపోయింది. కరోనా కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్ల వేతనాల్లో కోత పడటం ఖాయమైంది. అయితే ఇలాంటి స్థితిలో కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆర్థికపరంగా తమ బలమేమిటో చూపిస్తూ భారత కాంట్రాక్ట్ క్రికెటర్లకు ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా వారి వేతనాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది తొలి మూడు నెలల వరకు మన ఆటగాళ్లకు ఇవ్వాల్సిన బాకీలన్నీ చెల్లించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ‘కష్టకాలంలో మన క్రికెటర్లు ఎవరూ సమస్యలు ఎదుర్కోరాదు. మార్చి 24 నుంచి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించగానే జరగబోయే పరిణామాలను బీసీసీఐ అంచనా వేసి దానికి అనుగుణంగా సిద్ధమైంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒక్క రూపాయి బాకీ కూడా లేకుండా బోర్డు కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లకు చెల్లింపులు జరిపేశాం. దీంతో పాటు ఈ మధ్య కాలంలో భారత్, భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడిన ప్లేయర్లకు కూడా మ్యాచ్ ఫీజులు ఇచ్చేశాం’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తన ఆటగాళ్ల చెల్లింపులను వాయిదా వేయగా, ఇంగ్లండ్ క్రికెటర్లు ప్రభుత్వం సహకారం అందించే పథకం (ఫర్లాఫ్ స్కీమ్)కు దరఖాస్తు చేసుకున్నారు. ‘ప్రపంచం మొత్తం జీతాల కోత గురించే వినిపిస్తోంది. అయితే ఇన్నేళ్లుగా చేస్తున్నట్లే ఇప్పుడు కూడా బీసీసీఐ తమ ఆటగాళ్ల బాగోగులు అందరికంటే ఎక్కువ చూసుకుంటుంది. మా పరిధిలోని ఒక్క అంతర్జాతీయ లేదా దేశవాళీ క్రికెటర్ కూడా బాధపడే పరిస్థితి రాకూడదు’ అని సదరు అధికారి వ్యాఖ్యానించారు. ఐపీఎల్ జరగాల్సిందే... మరోవైపు ఐపీఎల్‌తో ముడిపడి ఉన్న డబ్బును బట్టి చూస్తే ఈ ఏడాది చివర్లోనైనా టోర్నీ జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. అయితే ఇప్పటికే నిర్ణయమైపోయిన ఇతర టోర్నీలు, దేశవాళీ క్రికెట్ షెడ్యూల్‌లను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితిలో ఏమీ చెప్పలేం. అసలు ప్రపంచం సాధారణస్థితికి ఎప్పుడో వస్తుందో ఎవరికీ తెలియనప్పుడు ఐపీఎల్ తేదీల గురించి ఎలా మాట్లాడగలం. అయితే సెప్టెంబర్‌లో ఆసియా కప్‌తో మొదలు పెడితే స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్, ఆ తర్వాత టి20 ప్రపంచకప్ కూడా ఉన్నాయి. మన దేశవాళీ టోర్నీల సమయం కూడా అదే. కాబట్టి చాలా అంశాలు ఆలోచించాల్సి ఉంది’ అని బోర్డు అధికారి స్పష్టం చేశారు. -
సెక్యూరిటీ ప్రాబ్లం!
వీళ్లైదుగురూ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఉన్నారు. భర్తలు టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే తోడుగా ఉండేందుకు వచ్చారు. ఇండియా–దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్ నిన్నటితో ముగిసింది. ఆ తర్వాత జనవరి 13 నుంచి సెంచ్యూరియన్లో రెండో మ్యాచ్ మొదలౌతుంది. అయితే రెండో మ్యాచ్‌కు కూడా వీళ్లను భర్తలతో ఉండేందుకు అనుమతిస్తారా అన్నది చివరి నిమిషం వరకు తేలలేదు! ఇంకొకటి కూడా తేలలేదు... దక్షిణాఫ్రికాలో భారతీయ క్రికెటర్ల భార్యల బాగోగులు ఎవరు చూడాలన్నది. వీళ్లకు సంరక్షణగా మయాంక్ పారిఖ్ అనే ఆయన్ని పంపాలని తొలి మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ముంబైలో జరిగిన బీసీసీఐ సమావేశంలో అనుకున్నారు. ‘‘అబ్బెబ్బే.. ఎందుకు?! ఆల్రెడీ అక్కడ రిషికేశ్ ఉపాధ్యాయ అనే ఆయన ఉన్నాడు కదా’ అని అందులోనే కొందరు అన్నారు. చివరికి ఈయనా వెళ్లలేదు. అక్కడున్న ఆయనకూ విషయం తెలీదు. ఇలా ఉంటారు మనవాళ్లు! భార్యను వెనక వదిలేసి, ముందు నడుస్తుంటారు కొంతమంది భర్తలు. అలా, బీసీసీఐ క్రికెటర్లకు సెక్యూరిటీ ఇచ్చి, ‘వారి భార్యలకు సెక్యూరిటీ అవసరమా..’ అన్నట్లు వెనకా ముందూ ఆలోచిస్తోంది. -
సఫారీ పర్యటనకు టీమిండియా
-
భారత క్రికెటర్లు లేకుండా వరల్డ్ ఎలెవన్ జట్టా..?
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచ అత్యత్తుమ ఆటగాళ్లైన భారత క్రికెటర్లు లేకుండా వరల్డ్ ఎలెవన్ జట్టే లేదని మాజీ ఐసీసీ ప్రెసిడెంట్ ఎహ్సాన్ మణి అభిప్రాయపడ్డారు. జట్టులో భారత క్రికెటర్లు లేకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు. భారత్ ఆసీసీతో లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ఆడుతుందని తెలుసు కానీ ఈ సిరీస్‌లో ఆడని ప్లేయర్లను వరల్డ్ ఎలెవన్ జట్టులో భాగస్వామ్యులు చేయవచ్చని ఈషాన్ వ్యాఖ్యానించారు. క్రికెట్ దేశాల మధ్య బంధాన్ని బలపరుస్తుందన్నారు. ‘భారత్-పాక్‌లు అంతర్జాతీయ వేదికలపై అనేక మ్యాచ్‌లు ఆడుతాయి కానీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడవు. ఇరు దేశాల మధ్య వ్యాపారా లావాదేవీలు కూడా జరుగుతాయి. కానీ క్రికెట్ విషయం కొచ్చే సరికి రాజకీయాలు ప్రస్తావిస్తారు. ఇరు దేశాలు క్రికెట్‌ను రాజకీయాలు వాడుకుంటున్నాయి. ఇది చాల తప్పు’ అని ఎహ్సాన్ మణి పేర్కొన్నారు. భద్రతా కారాణాల దృష్ట్యా పాక్‌లో క్రికెట్ ఆడకపోవడం దారుణమని, ప్రమాదాలు అన్ని దేశాల్లో సంభవిస్తాయన్నారు. ఎలాంటి ముప్పు లేకున్నా పాక్, వరల్డ్ ఎలెవన్ జట్టుకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిందని, అంత భద్రతా అవసరం కూడా లేదని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే సామర్థ్యం ఉందని ఈ ఐసీసీ మాజీ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు.