Indian Davis Cup
-
ఫిన్లాండ్తో ‘డేవిస్’ పోరుకు బోపన్న
సీనియర్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న భారత డేవిస్ కప్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల అఖిల భారత టెన్నిస్ సంఘంతో ఒలింపిక్స్ విషయమై బోపన్న గొడవ పడ్డాడు. ఇది పతాక స్థాయికి చేరడంతో అతన్ని భవిష్యత్తులో జట్టులోకి ఎంపిక చేయరనే వార్తలు వచ్చాయి. అయితే సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఫిన్లాండ్ వేదికగా ఫిన్లాండ్తో జరిగే వరల్డ్ గ్రూప్–1 పోరులో పాల్గొనే భారత జట్టులో బోపన్నను ఎంపిక చేశారు. ఈ పోటీలో డబుల్స్‌లో దివిజ్ శరణ్–బోపన్న జంట ఆడుతుంది. -
సాకేత్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని పోరాటం ముగిసింది. కొరియాలో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో సాకేత్ 4–6, 5–7తో వు తుంగ్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ కేవలం ఒక్క ఏస్ మాత్రమే సంధించాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో భారత రెండో ర్యాంకర్ రామ్‌కుమార్ 4–6, 7–6 (7/5), 6–7 (6/8)తో లీ జె (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రామ్‌కుమార్ (భారత్)–బ్రెడెన్ ష్నెర్ (కెనడా) ద్వయం 6–3, 5–7, 10–6తో జీ సుంగ్ నామ్–మిన్ క్యు సాంగ్ (కొరియా) జోడీపై గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. -
‘షాంఘై’ చాంప్ యూకీ
షాంఘై (చైనా) : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ... షాంఘై ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యూకీ 3-6, 6-0, 7-6 (7/3)తో వుయ్ ది (చైనా)పై నెగ్గి టైటిల్‌ను గెలుచుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో యూకీ ఆరు ఏస్‌లు సంధించగా, వుయ్ ఒకదానితో సరిపెట్టుకున్నాడు. యూకీ కెరీర్లో ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్. -
క్వార్టర్స్‌లో యూకీ
షాంఘై : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ... ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ యూకీ 7-5, 6-3తో జీ జెంగ్ (చైనా)పై విజయం సాధించాడు. గంటా 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు స్ఫూర్తిదాయకమైన ఆటతీరును చూ పెట్టాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన యూకీ రెండుసార్లు సర్వీస్‌ను కోల్పోయాడు. ఓవరాల్‌గా యూకీ 70 పాయింట్లు సాధిస్తే.. జెంగ్ 60తో సరిపెట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో సాకేత్ మైనేని 6-3, 3-6, 2-6తో జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడాడు. డబుల్స్ క్వార్టర్స్‌లో సాకేత్-శ్రీరామ్ బాలాజీ 1-6, 1-6తో పీటర్ గోజోవిజిక్-జుర్జెన్ జాప్ చేతిలో పరాజయం చవిచూశారు. -
యూకీ జోడికి డబుల్స్ టైటిల్
కర్షి (ఉజ్బెకిస్తాన్) : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ- ఆడ్రియన్ మెనాడెజ్ మెసిరాస్ (స్పెయిన్) జోడి... ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం జరి గిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ యూకీ-ఆడ్రియన్ 5-7, 6-3, 10-8తో సెర్గి బెటోవ్ (బెలారస్)- మిఖాయిల్ ఎల్గిన్ (రష్యా)పై నెగ్గారు. మ్యాచ్ స్కోరు 5-7, 1-1 ఉన్న దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే తిరిగి మొదలైన తర్వాత భారత జోడి అద్భుతమైన పోరాటంతో విజేతగా నిలిచింది. ఈ సీజన్లో యూకీకి ఇదే తొలి టైటిల్.