క్వార్టర్స్‌లో యూకీ | Yuki in quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో యూకీ

Published Thu, Sep 10 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

క్వార్టర్స్‌లో యూకీ

క్వార్టర్స్‌లో యూకీ

షాంఘై : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ... ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ యూకీ 7-5, 6-3తో జీ జెంగ్ (చైనా)పై విజయం సాధించాడు. గంటా 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు స్ఫూర్తిదాయకమైన ఆటతీరును చూ పెట్టాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన యూకీ రెండుసార్లు సర్వీస్‌ను కోల్పోయాడు. ఓవరాల్‌గా యూకీ 70 పాయింట్లు సాధిస్తే.. జెంగ్ 60తో సరిపెట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో సాకేత్ మైనేని 6-3, 3-6, 2-6తో జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడాడు. డబుల్స్ క్వార్టర్స్‌లో సాకేత్-శ్రీరామ్ బాలాజీ 1-6, 1-6తో పీటర్ గోజోవిజిక్-జుర్జెన్ జాప్ చేతిలో పరాజయం చవిచూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement