indian intelligences
-
వికాస్ యాదవ్ కథలో కొత్త మలుపు
న్యూఢిల్లీ: భారత నిఘా విభాగం ‘రా’మాజీ అధికారి అని అమెరికా ఆరోపిస్తున్న వికాస్ యాదవ్(39) వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్ పన్నూను అమెరికా గడ్డపై హత్య చేయడానికి జరిగిన కుట్రలో వికాస్ యాదవ్‌పై అమెరికా దర్యాప్తు అధికారులు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వికాస్‌ను సహ కుట్రదారుడిగా చేర్చారు. అయితే, ఢిల్లీలో ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన కేసులో గత ఏడాది డిసెంబర్ 18న వికాస్ యాదవ్‌ను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అతడికి బెయిల్ లభించిందని వెల్లడించాయి. ఢిల్లీ రోహిణి ప్రాంతంలో ఓ వ్యాపారిని అపహరించి, డబ్బులు ఇవ్వాలని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట వికాస్ బెదిరించాడని వివరించాయి. స్పెషల్ సెల్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం... ఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కార్యాలయం సమీపంలో 2023 డిసెంబర్ 11న తనను కలవాలని వ్యాపారవేత్తకు వికాస్ సూచించాడు. కలవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దాంతో బాధితుడు తన మిత్రుడితో కలిసి వికాస్ వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో వికాస్ వెంట అబ్దుల్లా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వికాస్, అబ్దుల్లా కలిసి వ్యాపారవేత్తను ఓ కారులోకి బలవంతంగా ఎక్కించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము బిష్ణోయ్ గ్యాంగ్ మనుషులమని చెప్పారు. ఖాళీ చెక్కుపై సంతకం చేయించుకున్నారు. తర్వాత వదిలేశారు. ఈ విషయం బయట చెబితే ప్రాణాలు దక్కవని హెచ్చరించారు. తన కార్యాలయంలో ఉంచిన రూ.50 వేల నగదును వికాస్, అబ్దుల్లా తీసుకున్నట్లు బాధితుడు గుర్తించాడు. సీసీటీవీ రికార్డింగ్‌లు సైతం తొలగించినట్లు గమనించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వికాస్ యాదవ్, అబ్దుల్లాపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి 13న వికాస్‌పై చార్జిïÙట్ దాఖలు చేశారు. కోర్టు అతడికి మార్చి 22న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 22న రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. వికాస్ యాదవ్ మాజీ ప్రభుత్వ అధికారి అని బెయిల్ ఆర్డర్లో కోర్టు పేర్కొంది. అయితే, అమెరికా దర్యాప్తు అధికారులు తమ అభియోగాల్లో వికాస్‌ను భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రెటేరియట్‌లో పనిచేసే అధికారిగా ప్రస్తావించారు. వికాస్ పరారీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. కానీ, అతడు ప్రభుత్వ అధికారి కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ స్పష్టంచేశారు. ఖలిస్తాన్ ఉద్యమం ఆగదు: పన్నూ వికాస్ యాదవ్‌పై అమెరికా అధికారులు అభియోగాలు మోపడంపై గురు పత్వంత్‌సింగ్ పన్నూ తాజాగా ‘ఎక్స్’వేదికగా స్పందించాడు. అమెరికా పౌరుడి జీవితాన్ని, స్వాతంత్య్రాన్ని, భావప్రకటనా స్వేచ్ఛ హక్కును కాపాడాలన్న ప్రాథమిక రాజ్యాంగ విధిని నిర్వర్తించడంలో అమెరికా ప్రభుత్వం మరోసారి అంకితభావం చూపిందని ప్రశంసించాడు. స్వదేశంలో గానీ, విదేశాల్లో గానీ అమెరికా పౌరుడి ప్రాణాలను అమెరికా ప్రభుత్వం కాపాడుతుందని చెప్పాడు. వికాస్ యాదవ్ ఒక మధ్యశ్రేణి సైనికుడు అని వెల్లడించాడు. పన్నూను హత్య చేయాలంటూ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోపాటు ‘రా’చీఫ్ సామంత్ గోయెల్ నుంచి వికాస్ యాదవ్‌కు ఆదేశాలు అందాయని ఆరోపించాడు. ఖలిస్తాన్ రెఫరెండమ్ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందులో భాగంగానే తనను అంతం చేయాలని కుట్ర పన్నారని విమర్శించాడు. తనపై ఎన్ని హత్యాయత్నాలు జరిగినా ఖలిస్తాన్ ఉద్యమం ఆగదని తేల్చిచెప్పాడు. భారత్‌లో ప్రత్యేక సిక్కు దేశం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగడతానని, ఇందులో భాగంగా నవంబర్ 17న న్యూజిలాండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నట్లు వెల్లడించాడు. భారత్‌కు ఇబ్బందులేనా? ఖలిస్తాన్ ఉగ్రవాది హరిదీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఇప్పటికే కెనడా, భారత్ మధ్య దూరం పెరుగుతోంది. తమ దేశ పౌరుడైన నిజ్జర్‌ను ఇండియా ఏజెంట్లు హత్య చేశారని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్నారు. మరో ఉగ్రవాది పన్నూ హత్యకు జరిగిన కుట్ర కేసులో భారతీయుడైన వికాస్ యాదవ్‌పై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారం మున్ముందు భారత ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, వికాస్ యాదవ్‌న తమకు అప్పగించాలని అమెరికా అధికారులు ఇంకా భారత్‌ను కోరలేదు. తమ భూభాగంలో తమ పౌరుడిని(పన్నూ) హత్య చేయడానికి కుట్ర చేసిన వారిని వదిలిపెట్టబోమని అమెరికా అత్యున్నత స్థాయి అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. -
పన్నూ హత్యకు కుట్ర కేసులో ‘రా’ మాజీ అధికారిపై అమెరికా కోర్టులో అభియోగాలు
వాషింగ్టన్: ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్ పన్నూను హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ అధికారి వికాస్ యాదవ్‌పై అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. పన్నూను అంతం చేయడానికి జరిగిన కుట్రలో వికాస్ యాదవ్ పాత్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు గురువారం న్యూయార్క్ కోర్టులో అభియోగ పత్రాలు సమరి్పంచారు. ఆయనను సీసీ–1(సహ కుట్రదారుడిగా) నిర్ధారించారు. పన్నూను హత్య చేయడానికి కిరాయి మనుషులను నియమించడం, మనీ లాండరింగ్‌కు పాల్పడడం అనే అభియోగాలు మోపారు. ప్రస్తుతం వికాస్ యాదవ్ ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. 39 ఏళ్ల వికాస్ యాదవ్ గతంలో భారతదేశ విదేశీ ఇంటెలిజెన్స్ సేవలు, ‘రా’ వ్యవహారాలను పర్యవేక్షించే కేబినెట్ సెక్రటేరియట్లో పనిచేశారు. పన్నూ హత్యకు కుట్ర కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తాను అమెరికా పోలీసులు గత ఏడాది చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్టు చేశారు. నిఖిల్ గుప్తా ప్రస్తుతం అమెరికాలో జైలులో ఉన్నాడు. అమెరికా గడ్డపై పన్నూను హత్య చేయడానికి భారత ఏజెంట్లు కుట్ర పన్నారని, ఈ కుట్రను తాము భగ్నం చేశామని అమెరికా దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే, అమెరికా అధికారుల ఆరోపణలను భారత ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. పత్వంత్‌సింగ్ పన్నూ ఇండియాలోని పంజాబ్ రాష్ట్రంలో జని్మంచాడు. కెనడాకు వలస వెళ్లాడు. అక్కడి నుంచే భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతడికి కెనడాతోపా టు అమెరికా పౌరసత్వం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిజ్జర్ హత్య కేసులో కెనడాలోనూవాషింగ్టన్: మరోవైపు కెనడాలో జరిగిన ఖలిస్తాన్ ఉగ్రవాది హరిదీప్ సింగ్ నిజ్జర్ అలియాస్ నిజ్జర్ హత్యతోనూ వికాస్ యాదవ్ పేరును ముడిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కెనడాలో 2023 జూన్ 18న నిజ్జర్ హత్య తర్వాత మృతదేహం తాలూకు రియల్–టైమ్ వీడియోను వికాస్ యాదవ్.. నిఖిల్ గుప్తాకు షేర్ చేశాడని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇదే సమాచారాన్ని అమెరికా ప్రభుత్వం కెనడాతో పంచుకొనే వీలుంది. దీన్నిబట్టి నిజ్జర్ హత్య కేసులో వికాస్ యాదవ్‌పై కెనడా ప్రభుత్వం కూడా అభియోగాలు నమోదు చేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భారత మేధావులను తిరిగి రప్పిస్తాం: హర్షవర్ధన్
విదేశాల్లో ఉన్నవారిని రప్పించడానికి ప్రణాళిక సిద్ధం: కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు సగానికిపైగా తగ్గినప్పటికీ చౌక, పర్యావరణ అనుకూలమైన ఇంధన వనరుల అభివృద్ధికి భారతదేశం తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రధాని మోదీ ‘మేకిన్ ఇండియా’ పిలుపునకు శాస్త్ర, సాంకేతిక రంగాలనే ఆలంబనగా చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి హర్షవర్ధన్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయమంత్రి వై.సుజనా చౌదరి మాట్లాడారు. అమెరికాతోపాటు అనేక ధనికదేశాల్లో పరిశోధన.. అభివృద్ధి రంగాలు, పరిశ్రమల ఏర్పాటులో ఆసక్తి సన్నగిల్లుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారత సంతతి మేధావులను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విసృ్తత స్థాయి ప్రణాళికను సిద్ధం చేసిందని హర్షవర్ధన్ తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని వారు భారత్‌లోనే మెరుగైన వేతనాలతో పరిశోధనలు కొనసాగించేందుకు ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టామని వివరించారు. ముడిచమురు గతంలో కంటే చౌకగా లభిస్తున్నప్పటికీ ఎన్నటికీ తరగని ఇంధన వనరులను ముఖ్యంగా సౌర శక్తిని చౌకగా అభివృద్ధి చేసేందుకు పరిశోధనలను ముమ్మరం చేస్తామని అన్నారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ ఇటీవలి విడుదల చేసిన నివేదిక ప్రకారం... ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాకు మేధావులను అం దిస్తున్న పది నగరాల్లో ఎనిమిది భారత్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ నగరాల్లో దక్షిణాదికి చెందిన విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నైలు ఉండటం దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు శాస్త్రీయ అంశాలపై అవగాహనఅధికం అనేందుకు తార్కాణమని అన్నారు. ఇటీవల ముగిసిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో వేదకాలంలోనే విమానాలు తయారయ్యాయన్న అంశంపై పరిశోధన వ్యాసం చర్చకు రావడంపై ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ‘వైమానిక రంగంలో మాత్రమే కాదు.. వైద్య, సామాజిక రంగాల్లోనూ భారత్ గతంలో ఎన్నో అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. దానిపై ఒక పరిశోధన వ్యాసం వస్తే అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరమేమీ లేదు’ అని అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ సైన్స్ సిటీలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సైన్స్ సిటీలు, శాస్త్ర, సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి వై.సుజనా చౌదరి తెలిపారు. జనాభాలో అధికశాతమున్న యువతను ఈ రంగాలవైపునకు మళ్లించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే దేశంలోని పరిశోధన సంస్థలను మరింత మెరుగైన రీతిలో పనిచేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పరిశోధన సంస్థలను, ఇన్క్యూబేషన్ సెంటర్లను అనుసంధానించాలని అనుకుంటున్నామని, మరో నెల రోజుల్లో ఈ కసరత్తు ముగించి కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపుతామని వివరించారు.