indian labour meeting
-
మీ ‘మన్‌కీ బాత్’ చెప్పండి!
దుబాయ్: యూఏఈ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న భారతీయ కార్మికుల కృషిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రశంసించారు. దుబాయ్‌లోని జబేల్ అలీ లేబర్ కాలనీలో సమావేశంలో భారతీయ కార్మికులతో రాహుల్ మాట్లాడారు. ‘నా మనసులో మాట(మన్ కీ బాత్) చెప్పేందుకు రాలేదు. మీరు పడుతున్న కష్టాలను మీ ద్వారానే తెలుసుకుని సాయం చేద్దామని వచ్చా’ అంటూ మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘ఇక్కడ భారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎయిర్ పోర్టులు, మెట్రో స్టేషన్లు, ఆకాశ హర్మ్యాల నిర్మాణం వంటివి మీ సహకారం లేనిదే సాధ్యం కాదు. ఈ నగరం అభివృద్ధికి మీ స్వేదం, రక్తం ధారపోస్తున్నారు. ప్రతి రాష్ట్రం, ప్రతి మతం, ప్రతి కులం ఖ్యాతిని మీరు చాటుతున్నారు. మీ కృషి భారతీయులను గర్వపడేలా చేస్తోంది’ అంటూ వారిపై ప్రశంసలు కురిపించారు. -
కనీస బోనస్ రూ.6 వేలు!
సీలింగ్ ఎత్తివేసే అవకాశం న్యూఢిల్లీ: ఫ్యాక్టరీ కార్మికులకు, ఇతర సిబ్బందికి చెల్లించే బోనస్‌పై సీలింగ్‌ను ఎత్తివేసే అవకాశం ఉంది. వచ్చేనెలలో జరిగే భారత కార్మిక సదస్సులో ఈమేరకు నిర్ణయం తీసుకుంటారు. బోనస్‌ను కనీసం రూ. 6,000 వరకు చెల్లించాలని ప్రతిపాదించారు. పరిమితిని కూడా రూ.18 వేలకు పెంచాలని నిర్ణయించనున్నారు. ప్రస్తుతం రూ.పదివేల వరకు జీతభత్యాలు తీసుకునే సిబ్బందికి మాత్రమే నెలకు రూ.3.500 బోనస్‌గా చెల్లిస్తున్నారు. ఈ పరిమితిని తొలగించాలని పలు కార్మికసంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. పలువురు ఎంపీలు కూడా ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి కనీసం కార్మికులందరికైనా బోనస్ చెల్లించాలని కోరారు. మారిన పరిస్థితుల్లో సీలింగ్ విధించడం భావ్యంకాదని చెప్పారు. అందుకని 1965 నాటి బోనస్ చట్టాన్ని సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా గత శుక్రవారం జరిగిన కార్మిక కమిటీ స్థాయీసంఘ సమావేశంలో బోనస్ సీలింగ్పరిమితిని పెంచాలని ప్రతిపాదించారు. దీంతో సుమారు మూడు కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది.