ఫ్యాక్టరీ కార్మికులకు, ఇతర సిబ్బందికి చెల్లించే బోనస్‌పై సీలింగ్‌ను ఎత్తివేసే అవకాశం ఉంది. వచ్చేనెలలో జరిగే భారత కార్మిక సదస్సులో ఈమేరకు నిర్ణయం తీసుకుంటారు
సీలింగ్ ఎత్తివేసే అవకాశం
న్యూఢిల్లీ: ఫ్యాక్టరీ కార్మికులకు, ఇతర సిబ్బందికి చెల్లించే బోనస్‌పై సీలింగ్‌ను ఎత్తివేసే అవకాశం ఉంది. వచ్చేనెలలో జరిగే భారత కార్మిక సదస్సులో ఈమేరకు నిర్ణయం తీసుకుంటారు. బోనస్‌ను కనీసం రూ. 6,000 వరకు చెల్లించాలని ప్రతిపాదించారు. పరిమితిని కూడా రూ.18 వేలకు పెంచాలని నిర్ణయించనున్నారు. ప్రస్తుతం రూ.పదివేల వరకు జీతభత్యాలు తీసుకునే సిబ్బందికి మాత్రమే నెలకు రూ.3.500 బోనస్‌గా చెల్లిస్తున్నారు. ఈ పరిమితిని తొలగించాలని పలు కార్మికసంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. పలువురు ఎంపీలు కూడా ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి కనీసం కార్మికులందరికైనా బోనస్ చెల్లించాలని కోరారు.
మారిన పరిస్థితుల్లో సీలింగ్ విధించడం భావ్యంకాదని చెప్పారు. అందుకని 1965 నాటి బోనస్ చట్టాన్ని సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా గత శుక్రవారం జరిగిన కార్మిక కమిటీ స్థాయీసంఘ సమావేశంలో బోనస్ సీలింగ్‌పరిమితిని పెంచాలని ప్రతిపాదించారు. దీంతో సుమారు మూడు కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది.