indian origin doctor
-
లేడీ డాక్టర్‌ను కాల్చిచంపిన ఇండియన్ డాక్టర్
వాషింగ్టన్ : అమెరికాలోని ఓ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన వైద్యుడు ఓ మహిళా వైద్యురాలిని కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టెక్సాస్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నపిల్లల వైద్యుడు భరత్ కుమార్ నారుమంచి(43)కు క్యాన్సర్ సోకినట్లు కొద్దిరోజుల క్రితం నిర్థారణ అయింది. అతడు ఎక్కువ రోజులు బతకడని కూడా వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అప్పటినుంచి మానసికంగా కృంగిపోయాడు. (జంట హత్యల కలకం.. రూ. 500లు మాత్రమే..) మంగళవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గన్స్‌తో తను పనిచేసే ఆస్టిన్లోని ‘‘ చిల్డ్రన్స్ మెడికల్ గ్రూపు’’ ఆస్పత్రిలోకి ప్రవేశించాడు. తనతో పాటు పనిచేసే ఓ వైద్యురాలు క్యాథరిన్ లిండ్లే డాట్సన్‌తో పాటు మరికొంతమందిని గన్స్‌తో బెదిరించి దిగ్బంధించాడు. దాదాపు 6 గంటల పాటు ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాథరిన్‌ను తప్ప మిగిలిన వారిని వదిలేసిన అతడు ఆమెను కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే హత్య చేయటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
6 లక్షల డాలర్లు లూటీ; ఎన్నారై డాక్టర్ అరెస్ట్
న్యూయార్క్ : కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో చిన్న వ్యాపారాలను ఆదుకునేందుకు ఉద్ధేశించిన ప్రభుత్వ హామీ రుణాలలో దాదాపు 6,30,000 డాలర్లు మోసపూరితంగా సంపాదించినట్లు భారత సంతతికి చెందిన నేత్ర వైద్య నిపుణుడిపై కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌లోని రైకు చెందిన అమీత్ గోయల్(57)పై ఇంతక ముందు కూడా 2019 నవంబర్‌లో ఆరోగ్య సంరక్షణ విషయాలకు సంబంధించి తప్పుడు ప్రకటనలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం అమిత్ బెయిల్‌పై ఉన్నారు. (తీరు మారని పాక్.. అమెరికా ఫైర్! ) తాజాగా డాక్టర్ అమిత్ గోయల్‌ను క్రిమనల్ నేరాలకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టు చేయనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ అటార్నీ ఆడ్రీ స్ట్రాస్ గురువారం వెల్లడించారు. కోవిడ్-19 సంబంధిత ప్రభుత్వ-హామీ రుణాలను మోసపూరితంగా పొందినందుకు పెండింగ్‌లో ఉన్న నేరారోపణల కారణంగా జూన్ 26న అతన్ని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. యూఎస్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తున్నపేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (పీపీపీ) నిధులను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు అమిత్ ఒకే వ్యాపారానికి రెండు వేరు దరఖాస్తులు రూపొందించాడు. తప్పుడు పత్రాల ద్వారా ప్రభుత్వం నుంచి అక్రమంగా డబ్బులు కాజేశాడు. అయితే పీపీపీ నిబంధనల ప్రకారం ఒకరికి ఒక లోన్ మాత్రమే అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి వ్యాపారికి తమ నెలవారీ పేరోల్ ఖర్చుల ఆధారంగానే వారికి ఇచ్చే గరిష్ట లోన్‌ను నిర్దేశిస్తారు.(భారత్‌లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు) కాబట్టి తప్పుడు పత్రాలను రూపొందించి మోసానికి పాల్పడిన ఘటనలో అమిత్‌ను పోలీసులు అరెస్టు చేయనున్నారు. ‘ఇప్పటికే రోగులకు మిలియన్ల డాలర్ల భీమాదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోయల్ కరోనా కారణంగా మరో కొత్త మోసానికి పాల్పడ్డాడు’ అని స్ట్రాస్ పేర్కొన్నారు. అమిత్‌పై ఆరు కేసులు ఉన్నాయని మొత్తం 6,30,000 డాలర్ల ప్రభుత్వ సొమ్మును దోచుకున్నట్లు ఆయన తెలిపారు. (ట్రంప్ నిర్ణయం చైనాకు వరం’ ) -
కరోనా రోగికి అరుదైన ఆపరేషన్
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతి వైద్యుడు అరుదైన సర్జరీ చేశారు. షికాగోలో కరోనాతో బాధపడుతున్న ఓ యువతికి.. రెండు ఊపిరితిత్తులను మార్పిడి చేశారు. భారత సంతతి డాక్టర్ అంకిత్ భరత్ నేతృత్వంలో షికాగోలోని నార్త్ వెస్ట్రన్ మెమోరియల్ హాస్పిటల్లో ఈ శస్త్రచికిత్స జరిగింది. అమెరికాలో కరోనా పేషెంట్‌కు ఊపిరితిత్తులను మార్చడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా డాక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. ‘నేను చేసిన కష్టతరమైన ఆపరేషన్లలో ఇది ఒకటి. ఇది చాలా సవాలుతో కూడుకున్న కేసు. కరోనా వైరస్ సాధారణంగా శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తుంది. ఫలితంగా మూత్రపిండాలు, హృదయం, రక్త నాళాలు, నాడీ వ్యవస్థ పని తీరు దెబ్బతింటుంది’ అని తెలిపారు. కరోనా పేషంట్లకు ఇది ఒక్కటే సరైన మార్గం అని ఆయన అన్నారు. ఆపరేషన్ జరిగిన యువతి ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నదని.. పూర్తి స్థాయిలో ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందన్నారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే ఆమెకు ఉన్న ఆప్షన్ అని, అందుకే ఆమెకు ఆ సర్జరీ చేసినట్లు ఆయన వెల్లడించారు. కరోనాతో బాధపడుతున్న పేషెంట్లకు చికిత్స ఇచ్చే ఆస్పత్రుల్లో ఈ సర్జరీపై దృష్టి పెట్టాలన్నారు.(‘తొలి’ పరీక్షతో తప్పుడు ఫలితాలు!) ఊపిరితిత్తులు మార్పిడి చేయించుకున్న యువతి విషయానికి వస్తే.. వైద్యులు ఆమె పేరును బహిర్గతం చేయలేదు. 20 ఏళ్ల యువతి ఇటివలే ఉద్యోగ నిమిత్తం నార్త్ కరోలినా నుంచి షికాగోకు వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ సోకడంతో ఏప్రిల్ 26వ తేదీన ఆమెను హాస్పిటల్లో చేర్పించారు. అంతకు రెండు వారాల ముందు నుంచి ఆమె అనారోగ్యంగా ఉన్నట్లు సమాచారం. తొలుత ఆమెను వెంటిలేటర్‌పై పెట్టారు. ఆ తర్వాత నేరుగా రక్తంలోకి ఆక్సిజన్ అందించారు. కొన్ని వారాలు గడిచినా ఆమె ఆరోగ్యంలో ఎటువంటి పురోగతిలేదు. చాలా రోజుల నుంచి అస్వస్థతతో ఉన్న కారణంగా.. ఛాతి కండరాలు బలహీనంగా మారాయి. ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు గ్రహించడంతో.. మార్పిడి చేయాలని నిర్ణయించి సర్జరీకి ఏర్పాట్లు చేశారు. సుమారు పది గంటల పాటు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. (మనసంతా కరోనా చింత) యువతి ఊపిరితిత్తులు ఎక్కువగా ఉబ్బడం వల్ల.. సర్జరీకి అనుకున్నదాని కన్నా ఎక్కువ సమయం పట్టినట్లు డాక్టర్ అంకిత్ తెలిపారు. నార్త్‌వెస్ట్రన్ మెడిసిన్ హాస్పిటల్లో ప్రతి ఏడాది 40 నుంచి 50 వరకు ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీలు చేస్తుంటారని.. వాటిలో ఎక్కువ తానే చేసిన్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా పరీక్షలో నెగటివ్ వచ్చిన తర్వాతనే ఆమెకు సర్జరీ చేసినట్లు చెప్పారు. మ్యాచింగ్ డోనార్‌ను గుర్తించిన కొన్ని రోజులకే శస్త్రచికిత్స చేశామన్నారు. తాను సర్జరీ చేసిన అత్యంత బలహీనమైన పేషెంట్ ఈమే అని డాక్టర్ అంకిత్ తెలిపారు. -
యూకేలో భారత సంతతి వైద్యుడి మృతి
లండన్: కరోనా సంక్షోభ సమయంలో యూకేలో ప్రజలకు సేవ చేస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ వైద్యుడు హోటల్ గదిలో మృతి చెందాడు. వివరాలు.. డాక్టర్ రాజేష్ గుప్తా ఆగ్నేయ ఇంగ్లండ్ బెర్క్‌షైర్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) ట్రస్ట్ అధ్వర్యంలో నడుస్తున్న వెక్షం పార్క్ హాస్పిటల్లో అనస్తీషియన్ కన్సల్టెంట్(మత్తుమందు)గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా పేషంట్లకు వైద్యం చేస్తుండటంతో కుటుంబ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రి సమీపంలోని ఓ హోటల్లో రాజేష్ గుప్తా ఒక్కరే ఉంటున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం రాజేష్ గుప్తా హోటల్ గదిలో మరణించాడు. అయితే ఇందుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ సందర్భంగా ఫ్రిమ్లీ హెల్త్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మా సహోద్యోగి డాక్టర్ రాజేష్ గుప్తా సోమవారం మధ్యాహ్నం వరకు మాతో కలిసి కరోనా పేషంట్లకు వైద్యం చేశారు. విధులు ముగిసిన తర్వాత ఆయన బస చేస్తున్న హోటల్‌కు వెళ్లారు. తర్వాత ఆయన మరణించినట్లు తెలిసింది. రాజేష్ అద్భుతమైన కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్, వంట బాగా చేస్తాడు. చాలా ఉత్సాహవంతడు. మంచికి మానవత్వానికి ప్రతీకలాంటి వాడు. అతను అనేక పుస్తకాలు రాశాడు.. ఇతరుల రచనలకు సహకరించాడు. అతడి ఆకస్మిక మరణం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. అతడిని చాలా మిస్ అవుతున్నాం’ అని ప్రకటనలో తెలిపింది. జమ్మూలో ఉన్నత విద్యను అభ్యసించిన రాజేష్ గుప్తాకు భార్య, కుమారుడు ఉన్నారు. ఈ వార్త వారిని ఎంతో కుంగదీస్తుందని ఫ్రిమ్లీ హెల్త్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ తెలిపింది. ప్రస్తుతం రాజేష్ మృతికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సదరు ట్రస్టు పేర్కొంది. -
లండన్‌లో భారత సంతతి వైద్యుడి మృతి
లండన్ : ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసిన వైద్య సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా పై నిరంతరం యుద్దం చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ల కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ కరోనా పేషంట్లే తమ వాళ్లు అనుకుంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ పోరాటంలో ఎందరో వైద్యులు తమ ప్రాణాలను కూడా విడిచారు. తాజాగా లండన్‌లో వైద్యుడిగా పనిచేస్తున్న రాజేష్ గుప్తా అనే భారత సంతతి వ్యక్తి హోటల్లో మృతి చెందారు. కొంతకాలంగా కరోనా సేవలకు అంకితమైన డాక్టర్ రాజేష్ గుప్తా తన ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఒక హోటల్లో నివాసముంటున్నారు. కాగా ఆయన మృతి వెనుక గల కారణాలు తెలియలేదని అతనితో పాటు పనిచేసే వైద్యులు పేర్కొన్నారు. (కరోనా టెస్టింగ్ కిట్‌ను నమిలేసిన కోతి) జమ్మూ యునివర్సిటీలో 1997లో మెడిసిన్ కంప్లీట్ చేసిన రాజేష్ 2006లో లండన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అనస్థీషియా విభాగంలో మెడిసిన్ అండ్ కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. లండన్‌లోని ఫ్రిమ్లీ హెల్త్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు రాజేష్ గుప్తా మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ' రాజేష్ గుప్తా.. లండన్‌లోని వెక్స్‌హామ్ పార్క్ ఆసుపత్రిలో మెడికల్ కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా కరోనా నేపథ్యంలో బాధితులకు చికిత్స అందించేందుకు తన ఫ్యామిలీకి దూరంగా తన కొలీగ్స్‌తో కలిసి హోటల్లో నివాసముంటున్నారు. రోజు హోటల్ నుంచే ఆసుపత్రికి వస్తూ తన విధులు నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం మధ్యాహ్నం హోటల్ రూంలో రాజేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా రాజేష్ మృతి వెనుక కారణం ఏంటో మాకు తెలియదంటూ' ట్రస్ట్ పేర్కొంది. రాజేష్ గుప్తా వైద్యుడిగానే గాక మిగతా యాక్టివిటీస్‌లోనూ చురుగ్గా ఉండేవాడని.. ముఖ్యంగా పెయింటింగ్, ఫోటోగ్రఫీ, కుకింగ్‌లో తన ప్రాభవాన్ని చూపించేవాడు. జాలి, దయ గుణం కలిగిన రాజేష్ ఎందరో పేద వాళ్లకు తనవంతుగా సాయం చేసేవాడని ట్రస్ట్ తెలిపింది. స్వతహాగా మంచి రైటర్ అయిన రాజేష్ గుప్తా చాలా పుస్తకాలు రాసేవారని, వాటిని పలు పబ్లికేషన్స్‌కు అందించేవారని తెలిపారు. -
ప్రతి ఏడుగురు వైద్యుల్లో ఒకరు భారతీయుడు
న్యూయార్క్/మాస్కో/బీజింగ్: అమెరికాలోని ప్రతి ఏడుగురు వైద్యుల్లో ఒకరు భారతీయ సంతతికి చెందిన వారని అమెరికన్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఆపీ) అధ్యక్షుడు సురేశ్ రెడ్డి తెలిపారు. వేలాది మంది భారతీయ వైద్యులు యుద్ధంలో సైనికుల మాదిరిగా ముందు వరుసలో ఉంటూ కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. ‘ఈ మహమ్మారిపై యుద్ధం అంత తొందరగా ముగిసేది కాదు. వ్యాక్సిన్, యాంటీ వైరల్ ఔషధం కనుక్కునేవరకూ ఒకటీరెండేళ్లు దీని పీడ ఉంటుంది. గేట్లు తెరిచేసినట్లు లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం సాధ్యం కాదు. జాగ్రత్తగా వ్యవహరించకపోతే వైరస్ మళ్లీ వచ్చేస్తుంది. ఈసారి నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు.భవిష్యత్తులో లాక్‌డౌన్‌ను ఎత్తివేసినప్పటికీ పరిస్థితి గతంలో మాదిరిగా ఉండదని, తరచూ చేతులు కడుక్కోవడం, బహిరంగ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కానుందని డాక్టర్ సురేశ్ రెడ్డి స్పష్టం చేశారు. 874 మంది రష్యా సైనికులకు కరోనా తమ సైనికుల్లో 874 మందికి కరోనా వైరస్ సోకినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. బాధితుల్లో సగం మందిని ఇళ్లల్లోనే స్వీయ నిర్బంధంలో ఉంచామని, మిగిలిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మొత్తంగా 87,147 మంది కోవిడ్ బారిన పడగా 794 మంది మృతి చెందారు. వూహాన్లో అందరూ డిశ్చార్జ్ వైరస్ పుట్టినిల్లు వూహాన్లో చిట్టచివరి రోగిని డిశ్చార్జ్ చేయడంతో సోమవారం అక్కడ కోవిడ్–19 బాధితుల సంఖ్య సున్నకు చేరుకుంది. ఈ మహమ్మారి బారిన పడ్డ 82,830 మందిలో 4,633 మంది ప్రాణాలు కోల్పోగా 723 మందికి చికిత్స కొనసాగుతోంది. మిగిలిన 77,474 మందికి స్వస్థత చేకూరిందని చైనా ఆరోగ్య సోమవారం ప్రకటించింది. అమెరికాపై చైనా విసుర్లు కరోనా వైరస్ పుట్టుకపై విచారణ జరపాలన్న అమెరికాపై చైనా ఎదురుదాడికి దిగింది. కరోనా వైరస్ అంశంపై చైనాపై విమర్శలు చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు అమెరికా అధికార రిపబ్లికన్ పార్టీ ప్రయత్నిస్తోందని చైనా అధికార పత్రిక షిన్హువా పేర్కొంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల వైరస్ అగ్రరాజ్యంలోని బాధితుల కష్టాలు మరింత పెరుగుతాయని తెలిపింది. కరోనా వైరస్ వంటి విషయాల్లో అంతర్జాతీయ స్థాయి విచారణ ఇప్పటివరకూ ఏ దేశంపైనా జరగలేదని తెలిపింది. -
ఎన్నారై డాక్టర్‌ను బలిగొన్న కరోనా
లండన్ : ప్రముఖ హృద్రోగ నిపుణుడు, భారతీయ సంతతికి చెందిన డాక్టర్ జితేంద్ర కుమార్ రాథోడ్ కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. హృద్రోగ నిపుణుడిగా, బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ లో సుదీర్ఘ కాలంగా అసోసియేట్ స్పెషలిస్ట్ గా విధులు నిర్వహిస్తూ, ఎందరో ప్రముఖులకు వైద్య సేవలందించిన డాక్టర్ జితేంద్ర కుమార్ రాథోడ్, కరోనా వైరస్ కారణంగా మంగళవారం ఉదయం మరణించారు. ఇదొక దుర్వార్త. కార్డియో థారోసిక్ సర్జరీలో ఎంతో అనుభవజ్ఞులైన జితేంద్ర ఇక లేరంటూ కార్డిఫ్ అండ్ వేల్స్ యూనివర్శిటీ హెల్త్ బోర్డు ఆయన మరణాన్ని దృవీకరించింది. వేల్స్ లోని యూనివర్శిటీ హాస్పిటల్ లో ఆయన తుది శ్వాస విడిచారని ప్రకటించింది. 1977లో బాంబే యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసించిన జితేంద్ర కుమార్, ఆపై యూకే కు వెళ్లి, వైద్య రంగంలో దశాబ్దాల పాటు సేవలందించారు. ఇటీవల ఆయనకు కరోనా వైరస్ సోకగా, జనరల్ ఇన్టెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్సను అందించారు. తన వద్దకు వచ్చే రోగులకు చికిత్సను అందించడంలో ఎంతో శ్రధ్ధను జితేంద్ర చూపించేవారని, ఆయన వద్దకు వచ్చి వెళ్లే వారంతా తదుపరి ఎంతో గౌరవాన్ని చూపించేవారని వర్శిటీ వ్యాఖ్యానించింది. జితేంద్రకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. యూకే లో సుమారు 15 లక్షల మంది భారత సంతతి ఉండగా, వైద్య విభాగంలో ఎంతో మంది సేవలందిస్తున్నారు. కాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. యూకేలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 51 వేలను అధిగమించగా, మరణించిన వారి సంఖ్య 5,373 కు చేరింది. -
భారతీయ వైద్యుడికి అమెరికాలో అరుదైన గౌరవం
అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన వైద్యులలో రెండోస్థానాన్ని పొంది.. భారత సంతతికి చెందిన న్యూరోసర్జన్ సంజయ్ గుప్తా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఆయనకు ట్విట్టర్లో 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నట్లు ట్విట్టర్ తెలిపింది. దేశవ్యాప్తంగా ట్విట్టర్ వాడుతున్న వైద్యుల వివరాలను పరిశీలించిన తర్వాత ఈ విషయం చెప్పింది. అట్లాంటాలోని ఎమోరీ క్లినిక్‌లో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్న గుప్తాకు ఇంతకుముందు ఎమ్మీ అవార్డు పలుమార్లు వచ్చింది. ఆయనకంటే ఎక్కువగా 31.8 లక్షల మంది ఫాలోవర్లతో డ్రూ పిన్స్కీ మొదటి స్థానంలో ఉన్నారు. ఈ వివరాలు తేల్చడానికి అగస్టానా యూనివర్సిటీ విద్యార్థులు 2006 నుంచి అమెరికా వ్యాప్తంగా వైద్యులు ఉపయోగిస్తున్న ట్విట్టర్ అకౌంట్లను విశ్లేషించారు. ఇందుకోసం మొత్తం 4,500 మంది యూజర్లను పరిగణనలోకి తీసుకున్నారు. వైద్యులు ఇతరులతో ట్విట్టర్ ద్వారా ఎలా ఎంగేజ్ అవుతున్నారో చూశామని పరిశోధనలో పాల్గొన్న పేజ్ ష్విట్టర్స్ తెలిపారు. ఎక్కువ పాపులర్ అకౌంట్లు సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్లు, టీవీ పర్సనాలిటీలకు చెందినవని చెప్పారు. గుప్తా ఇచ్చే వైద్య శిక్షణ, ప్రజారోగ్య విధానంలో ఆయన అనుభవం, యుద్ధప్రాంతాలు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆయన రిపోర్టింగ్ అన్నింటి ద్వారా ఆయన ప్రముఖుడిగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. ఇబోలా వ్యాప్తి, తలకు తగిలే గాయాలు, విపత్తుల నుంచి రక్షణ, ఆరోగ్యరంగ సంస్కరణలు, సైన్యానికి ప్రత్యేక చికిత్సలు, ఫిట్నెస్, హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి అవగాహన లాంటి విషయాల్లో కూడా సంజయ్ గుప్తా సలహాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయట. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా అన్నిరకాలుగా సలహాలు, సూచనలు ఇస్తున్నారని అన్నారు. -
'అంజలి' ఉద్యోగం ఊడింది...
అమెరికాలోని మియామీ ప్రాంతంలో పనిచేస్తున్న ఎన్నారై వైద్యురాలు అంజలీ ఉద్యోగం ఊడిపోయింది. ఉబర్ డ్రైవర్ మీద, కారు మీద ఆమె దాడి చేస్తున్న దృశ్యాల వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో ఆస్పత్రి వర్గాలు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాయి. అంజలీ అనే ఈ మహిళా వైద్యురాలు క్యాబ్ డ్రైవర్ మీద దాడి చేసిన వీడియో గత జనవరిలో బయటపడింది. అప్పటినుంచి ఆమె సెలవులో ఉన్నారు. ఆమెను ఆదివారం ఉద్యోగం నుంచి తొలగించినట్లు జాక్సన్ హెల్త్ సిస్ట్ ప్రతినిధి ఒకరు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే కావాలంటే ఆమె దీనిపై అప్పీలు చేసుకోడానికి అవకాశం ఉందని కూడా చెప్పారు. నాలుగేళ్లుగా అంజలి ఆ ఆస్పత్రిలో న్యూరాలజీ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీడియోలో ఆమె డ్రైవర్ మీద దాడి చేసినట్లు, వాహనం మీదకు ఎక్కి అందులోని వస్తువులు బయటకు విసిరేస్తున్నట్లు ఉంది. అయితే ఆ డ్రైవర్ మాత్రం ఇప్పటివరకు తానెవరన్నది బయటపెట్టలేదు, ఆమెపై ఆరోపణలు కూడా ఏమీ చేయలేదు. ఘటన జరిగిన తర్వాత అంజలి క్షమాపణ చెప్పారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఇప్పటివరకు దాదాపు 70 లక్షల మంది చూశారు.