Indian parents
-
చిన్ననాటి పుస్తకాలనే చిన్నారులకు వినిపిస్తున్నారు
న్యూఢిల్లీ: భారతీయ తల్లిదండ్రుల్లో చాలామంది తాము చిన్నతనంలో చదివిన పుస్తకాలనే తమ పిల్లలకు చదివి వినిపిస్తారట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) చేసిన ఓ అధ్యయనం ఈ మేరకు తేల్చింది. కోవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు కలిసి గడపడం, భాష ప్రాముఖ్యతను చాటడంతో పాటు పఠనాసక్తిని ప్రోత్సహించేందుకు ఓయూపీ ప్రయత్నించింది. అందులో భాగంగా ‘గిఫ్ట్ ఆఫ్ వర్డ్స్’ పేరుతో భారత్, బ్రిటన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, చైనాల్లో ఇటీవల ఓ సర్వే చేసింది. అందులో పాల్గొన్న తల్లిదండ్రుల్లో దాదాపు సగం మంది తాము చిన్ననాడు చదివిన పుస్తకాలనే పిల్లలకు చదివి విన్పిస్తుంటామని చెప్పారు. తమ పిల్లలు కూడా దాన్నే ఇష్టపడతారని 56% మంది వెల్లడించారు. 48% మందేమో చిన్నప్పుడు తాము చదివిన పుస్తకాలనే చదివేందుకు తమ పిల్లలు ఇష్టపడుతున్నారని చెప్పారు. తాజాగా వచ్చే పుస్తకాలను ఎలా కనుక్కోవాలో 37% మందికి తెలియదని తేలింది. ఆన్లైన్, ఆడియో బుక్స్ కంటే ముద్రిత ప్రతులను చదివేందుకే ఇష్టపడతామని 70% మంది భారతీయ తల్లిదండ్రులు చెప్పారు. ఇలా పిల్లలకు పుస్తకాలు చదివి విన్పించడం ద్వారా వారితో తమ బంధం మరింత గట్టిపడుతుందని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు. పిల్లలకు పుస్తకాలు చదివి విన్పించేందుకు తమకు మరింత సమయం అందుబాటులో ఉంటే బాగుండేదని 85 శాతం మంది బాధపడుతున్నారట! పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ది పైరేట్ మమ్స్, ది పర్ఫెక్ట్ ఫిట్, స్టెల్లా అండ్ ది సీగల్, ఎ సాంగ్ ఇన్ ది మిస్ట్, ఎవ్రీబడీ హాజ్ ఫీలింగ్స్, మ్యాక్స్ టేక్స్ ఎ స్టాండ్, ది సూప్ మూమెంట్, బేర్ షేప్డ్, ఎవ్రీబడీ వర్సీస్ వంటి ఆసక్తికరమైన పుస్తకాలను ఓయూపీ సూచించింది. -
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన.. క్రికెట్‌పై ఎఫెక్ట్?
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ అనంతరం భారతీయ కుటుంసభ్యుల ఆలోచనల్లో మార్పులు వచ్చాయంటోంది కమ్యూనిటీ ప్లాట్‌ఫాం ‘లోకల్ సర్కిల్స్’ సర్వే. అధిక శాతం కుటుంబసభ్యులు తమ పిల్లలు, మనుమలు మనవరాళ్లు ఎవరైనా క్రికెట్ కాకుండా ఇతర క్రీడను కెరియర్‌గా ఎంచు కొంటే మద్దతిచ్చి ప్రోత్సహిస్తామని స్పష్టం చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ అనంతరం దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 18 వేల మందితో ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మొత్తం ఏడు పతకాలు వచ్చిన విషయం తెలిసిందే. నీరజ్ చోప్రా (జావెలిన్ త్రోలో స్వర్ణం), మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం), హాకీ తదితర క్రీడల్లో భారతీయ క్రీడాకారుల రాణించిన నేపథ్యంలో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న కోణంలో సర్వే నిర్వహించింది. 71 శాతం కుటుంబ సభ్యులు క్రికెట్ కాకుండా ఇతర క్రీడల్లో పిల్లలకు మద్దతిస్తా మని పేర్కొన్నారు. దేశంలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబసభ్యులు క్రికెట్ కాకుండా మరో క్రీడ వల్ల ఆర్థికాభివృద్ధి ఉండదని, స్థిరమైన ఆదాయం ఉండదని భావిస్తారని... అయితే ఒలింపిక్స్ అనంతర సర్వేలో క్రికెట్‌యేతర క్రీడలకు మద్దతు ఉందని తేలిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఒలింపిక్స్ సమయంలోనే సర్వే నిర్వహించగా.. భారతీయ క్రీడాకారులు పాల్గొన్న క్రీడలను వీక్షించారా అన్న ప్రశ్నకు 51 శాతం అవునని, 47 శాతం మంది కాదని, రెండు శాతం ఎలాంటి అభిప్రాయం చెప్పలేదని సర్వే తెలిపింది. 51 శాతం మందిలో కుటుంబంలో ఎవరో ఒకరు ఒలింపిక్స్ వీక్షించారని తెలిపింది. 2016 ఒలింపిక్స్ సమయంలో 20 శాతం మందే భారతీయ క్రీడాకారుల పాటవాలను వీక్షించామని చెప్పగా తాజా సర్వేలో రెట్టింపునకు పైగా వీక్షించామని చెప్పడాన్ని బట్టి గణనీయమై స్థాయిలో మార్పులు వస్తున్నట్లుగా సర్వే అభివర్ణించింది. చిన్నారులు క్రికెట్ కాకుండా వేరే క్రీడను కెరియర్‌గా ఎంచుకుంటే మీ వైఖరి ఏంటి అని ప్రశ్నించగా.. 71 శాతం ప్రోత్సహిస్తామని చెప్పగా 19 శాతం మంది క్రికెట్‌కే ఓటు వేశారని, పది శాతం మంది ఎలాంటి అభిప్రాయం వెలుబుచ్చలేదని తెలిపింది. దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 18వేల మంది కుటుంబసభ్యులు సర్వేలో పాల్గొన్నట్లు ‘లోకల్ సర్కిల్స్’ తెలిపింది. వీరిలో 9,256 మంది ఒలింపిక్స్ వీక్షించామని చెప్పారని తెలిపింది. 66 శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు పాల్గొన్నారని, టైర్–1 జిల్లాల నుంచి 42 శాతం, టైర్–2 నుంచి 29 శాతం, గ్రామీణ ప్రాంతాల నుంచి 29 శాతం మంది పాల్గొన్నారని లోకల్ సర్కిల్స్ వివరించింది. -
నాన్నా.. పిల్లలు ఎలా పుడతారు?
భారతీయ తల్లిదండ్రులను బెంబేలెత్తించే అత్యంత భయంకరమైన ప్రశ్న ఇదే. ముద్దుముద్దు మాటలు నేర్చుకున్న తమ చిన్నారులు ఈ ప్రశ్న అడగ్గానే.. కాంతి కంటే వేగంగా వారు టాపిక్ మార్చేస్తారు. అది చెప్పి.. ఇది చెప్పి పిల్లల దృష్టి మరలుస్తారు. తెలుసుకోవాలన్న కుతూహలంతో చిన్నారుల అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు. సంప్రదాయబద్ధమైన భారతీయ సమాజంలో సహజంగానే లైంగిక విషయాలు పిల్లలకు గోప్యంగా ఉంచబడతాయి. పిల్లల్లో కొన్నిసార్లు తలెత్తే ప్రశ్నలు వారిలో ఎంత ఆసక్తిని రేకెత్తించినా.. తల్లిదండ్రులు వాటిని తేలికగా కొట్టిపారేస్తారు. ఇబ్బందికరమైనవి అనుకుంటే.. వాటి నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి ఒక విభిన్నమైన అంశాన్ని తీసుకొని వై ఫిలిమ్స్ సంస్థ ‘సెక్స్ చాట్ విత్ పప్పు అండ్ పాపా’ పేరిట కొత్త వెబ్ సిరీస్‌ను ప్రారంభిస్తున్నది. ఇందులో ఏడేళ్ల కొడుకు పప్పు చిత్రవిచిత్రమైన వికృత ప్రశ్నల అడుగుతూ.. తండ్రిని ఇబ్బంది పెడుతుంటాడు. ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. త్వరలో యూట్యూబ్‌లో సిరీస్‌గా రానున్న ఈ ఎపిసోడ్స్‌లో అబిష్ మాథ్యూ తండ్రిగా, 7 ఏళ్ల కబీర్ సాజిద్ కొడుకుగా నటించనన్నారు. -
హ్యాకర్స్ చేతిలో కీలుబొమ్మలు అవుతారా...?
న్యూఢిల్లీ: తమ పిల్లల ఆన్ లైన్ చేష్టలు ఇంటికి చేటు తేస్తాయేమోనని ఇండియన్ పేరేంట్స్ ఆందోళన చెందుతున్నారట. తమ అమ్మాయ/అబ్బాయి ఎవరైనా సైబర్ నేరాలలో భాగంగా హ్యాకర్స్ చేతికి చిక్కి బాధితులుగా మిగిలిపోతారని టీనేజర్స్ తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్ లోనే ఈ భయాలు కాస్త ఎక్కువ మోతాదులో ఉన్నట్లు కొన్ని సర్వేలలో తేలింది. 17 దేశాలలోని 18 అంతకంటే ఎక్కువ వయసున్న 17,125 మంది నెటిజన్లపై నార్టన్ సైబర్ సెక్యూరిటీ గ్రూపు తమ సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. ఈ సర్వేలో భాగంగా భారత్ లో 1000 మంది యూజర్ల తల్లిదండ్రులను ప్రశ్నించి ఈ వివరాలను తెలుసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ప్రతి 100 మందిలో 92 శాతం పేరేంట్స్ తమ పిల్లల ఆన్ లైన్ యాక్టివిటీస్ గురించి ఏదో ఒక రకంగా తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన 'నార్టన్ సైబర్ సెక్యూరిటీ ఇన్ సైట్స్ రిపోర్టు' లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విదేశాలతో పోల్చితే ఇండియన్ పేరేంట్స్ తమ చిన్నారుల ఆన్ లైన్ యాక్టివిటీస్ 20 శాతం నియంత్రిస్తున్నారని తేలింది. తమ పిల్లులు చేసే పనులతో కుటుంబం మొత్తం దోషులుగా నిలబడాల్సి వస్తుందా.. ఇంటి పరువుకు భంగం వాటిల్లే అవకాశం ఉందని 57 శాతం పేరేంట్స్ భావిస్తున్నారు. హ్యాకర్స్ చేతిలో తమ పిల్లలు కీలు బొమ్మలుగా మారిపోతారని 54 శాతం పేరేంట్స్ టెన్షన్ పడుతున్నారని తాజా సర్వేలో బయటపడింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే విషయాలపై 55 శాతం మంది తమ పిల్లలపై కొన్ని లిమిట్స్ విధిస్తున్నట్లు తెలిసింది. బయట వాడే కామన్ కంప్యూటర్స్ కంటే కూడా పర్సనల్ సిస్టమ్స్ వాడటం మంచిదని 49శాతం పేరేంట్స్ అనుకుంటున్నారట. -
అంతా నువ్వే చేశావ్... నాన్నా!
న్యూఢిల్లీ: అంతా నువ్వే చేశావ్... నాన్నా! చిన్నప్పటి నుంచి నేను ఏ డ్రెస్సు వేసుకోవాలో, ఏం చదవాలో, ఏం తినాలో.. నువ్వే నిర్ణయించావు. నాకేది ఇష్టమో అడగలేదు... బొమ్మరిల్లు సినిమాలో తండ్రి ప్రకాశ్‌రాజ్‌తో కుమారుడు సిద్ధార్థ్ డైలాగ్ ఇది. భారతీయుల్లో చాలామందికి ఇది అనుభవమే. భారతీయ తల్లిదండ్రుల్లో 82 శాతం మంది తమ పిల్లలు ఏ రంగాన్ని తమ కెరీర్‌గా ఎంచుకోవాలో నిర్ణయించేస్తున్నారని లింకెడిన్ సర్వేలో తేలింది. చదువు తర్వాతా పిల్లల కెరీర్లో తల్లిదండ్రుల జోక్యం ఉంటోంది. తల్లిదండ్రులే పిల్లల కెరీర్‌ను నిర్ణయించే ధోరణిలో బ్రెజిల్ ఏకంగా 92 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానం చైనా(87 శాతం)ది. మూడో స్థానంలో భారత్ ఉంది. తమ పిల్లలు రోజూ ఏం చేస్తున్నారో తమకు తెలుసని 84 శాతం మంది భారతీయ తల్లిదండ్రులు చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 77 శాతం.