నాన్నా.. పిల్లలు ఎలా పుడతారు? | Presenting A New Web Series About Indian Parents Worst Nightmare | Sakshi
Sakshi News home page

నాన్నా.. పిల్లలు ఎలా పుడతారు?

Published Thu, Jun 30 2016 7:42 PM | Last Updated on Mon, Jul 23 2018 9:11 PM

Presenting A New Web Series About Indian Parents Worst Nightmare

భారతీయ తల్లిదండ్రులను బెంబేలెత్తించే అత్యంత భయంకరమైన ప్రశ్న ఇదే. ముద్దుముద్దు మాటలు నేర్చుకున్న తమ చిన్నారులు ఈ ప్రశ్న అడగ్గానే.. కాంతి కంటే వేగంగా వారు టాపిక్ మార్చేస్తారు. అది చెప్పి.. ఇది చెప్పి పిల్లల దృష్టి మరలుస్తారు. తెలుసుకోవాలన్న కుతూహలంతో చిన్నారుల అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు.


సంప్రదాయబద్ధమైన భారతీయ సమాజంలో సహజంగానే లైంగిక విషయాలు పిల్లలకు గోప్యంగా ఉంచబడతాయి. పిల్లల్లో కొన్నిసార్లు తలెత్తే ప్రశ్నలు వారిలో ఎంత ఆసక్తిని రేకెత్తించినా.. తల్లిదండ్రులు వాటిని తేలికగా కొట్టిపారేస్తారు. ఇబ్బందికరమైనవి అనుకుంటే.. వాటి నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి ఒక విభిన్నమైన అంశాన్ని తీసుకొని వై ఫిలిమ్స్‌ సంస్థ ‘సెక్స్‌ చాట్‌ విత్ పప్పు అండ్ పాపా’  పేరిట కొత్త వెబ్‌ సిరీస్‌ను ప్రారంభిస్తున్నది. ఇందులో ఏడేళ్ల కొడుకు పప్పు చిత్రవిచిత్రమైన వికృత ప్రశ్నల అడుగుతూ.. తండ్రిని ఇబ్బంది పెడుతుంటాడు. ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. త్వరలో యూట్యూబ్‌లో సిరీస్‌గా రానున్న ఈ ఎపిసోడ్స్‌లో అబిష్‌ మాథ్యూ తండ్రిగా, 7 ఏళ్ల కబీర్ సాజిద్‌ కొడుకుగా నటించనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement