indian pilots
-
వయసు 18 వృత్తి పైలెట్
సాక్షి కొచ్చర్‌కు ఇప్పటి దాకా స్కూటర్ నడపడం రాదు. కారు నడపడం రాదు. కాని ఏకంగా విమానం నడపడం నేర్చుకుంది. ప్రస్తుతానికి యంగెస్ట్ కమర్షియల్ పైలెట్ రికార్డ్ సాక్షి పేరున ఉంది. సంకల్పించాను... సాధించాను అంటోంది సాక్షి. మన దేశంలో అత్యంత చిన్న వయసులో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ సాధించిన రికార్డు మైత్రి పటేల్ పేరున ఉంది. ఆమె 19 ఏళ్ల లైసెన్స్ పొందింది. ఇప్పుడు 18 ఏళ్లకే సాక్షి కొచ్చర్ ఈ లైసెన్స్ పొంది మైత్రి రికార్డును బద్దలు కొట్టింది. సరిగ్గా ఆమె 18వ పుట్టిన రోజున ఈ లైసెన్స్ పొందడం విశేషం. పదేళ్ల వయసు నుంచే సాక్షి కొచ్చర్‌ది హిమాచల్ ప్రదేశ్‌కు ముఖద్వారం వంటిదైన పర్వాను టౌన్. అక్కడ తండ్రి లోకేష్ కుమార్ కొచ్చర్‌కు ఫుట్‌వేర్ వ్యాపారం ఉంది. పదేళ్ల వయసు నుంచి కుమార్తె పైలెట్ కావాలని కోరుకుంటూ ఉంటే అతడు ్ర΄ోత్సహిస్తూ వచ్చాడు. ‘పదో క్లాసు పరీక్షలు అయ్యాక నేను పైలెట్ కావాలని మళ్లీ ఒకసారి గట్టిగా చె΄్పాను. అయితే నాకు కామర్స్ లైన్లో చదవాలని ఉండేది. లెక్కలు పెద్దగా ఇష్టం లేదు. కాని పైలెట్ కావాలంటే ఎంపీసీ చదవాలని తెలిసి ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను’ అని చెప్పింది సాక్షి. ఇంటర్ అయిన వెంటనే ముంబైలోని స్కైలైన్ ఏవియేషన్ క్లబ్లో పీపీఎల్ (ప్రైవేట్ పైలెట్ లైసెన్స్)కు కావలసిన థియరీ క్లాసులను నాలుగున్నర నెలల పాటు చదవింది సాక్షి. ఈ క్లబ్‌లోనే కెప్టెన్ ఏ.డి.మానెక్ దగ్గర ఏవియేషన్ పాఠాలు నేర్చుకుంది మైత్రి పటేల్. సాక్షి కూడా కెప్టెన్ మానెక్ దగ్గరే తొలి పాఠాలు నేర్చుకుంది. ఆ తర్వాత సీపీఎల్ (కమర్షియల్ పైలెట్ లైసెన్స్) కోసం అమెరికా వెళ్లింది. 70 లక్షల ఖర్చు అమెరికాలో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ పొందాలంటే దాదాపు 70 లక్షలు ఖర్చు అవుతుంది. అయినా సరే సాక్షి కుటుంబం ఆ ఖర్చును భరించి సాక్షిని అమెరికా పంపింది. అక్కడ మూడు నెలల పాటు సాక్షి ట్రైనింగ్‌లో పాల్గొంది. ‘ఇన్స్ట్రక్టర్ సహాయంతో విమానం నడపడంలో ఒక రకమైన థ్రిల్ ఉంది. కాని ట్రైనింగ్‌లో భాగంగా మొదటిసారి సోలో ఫ్లయిట్ (ఇన్స్ట్రక్టర్ లేకుండా) ఒక్కదాన్నే విమానం నడిపినప్పుడు కలిగిన థ్రిల్, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. ఆ క్షణం నా జీవితంలో అలాగే ఉండి ΄ోతుంది’ అని చెప్పింది సాక్షి. ‘అయితే పైలెట్ కావడం అనుకున్నంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు, సమస్యలు ఉంటాయి. నా ట్రయినింగ్లో ఒకసారి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయింది. మరోసారి రేడియో ఫెయిల్ అయింది. నేను కంగారు పడకుండా అలాంటి సమయంలో ఏం చేయాలో అది చేసి సేఫ్ లాండింగ్ చేశాను’ అని తెలిపింది సాక్షి. పైలెట్‌గా ఉద్యోగం ‘మా ఊళ్లో నేను పైలెట్ అవుతానని అంటే మా బంధువులు చాలామంది ఎయిర్ హోస్టెస్ అనుకున్నారు. అమ్మాయిలు పైలెట్లు కావచ్చునని వారికి తెలియదు. ఇవాళ మన దేశంలో ఎక్కువమంది మహిళా పైలెట్లు ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. నాకు పైలెట్‌గా ఉద్యోగం రాగానే నా కోర్సు కోసం అయిన ఖర్చు మొత్తం అణాపైసలతో సహా మా అమ్మానాన్నలకు చెల్లిస్తాను’ అంది సాక్షి. ఇంత చిన్న వయసులో లైసెన్స్ పొందిన సాక్షికి ఉద్యోగం రావడం ఎంత సేపనీ. -
Women In Aviation: యూఎస్, యూకే కంటే మన దేశంలోనే అధికం!
ప్రపంచంలోని అగ్రదేశాలతో పోల్చితే మన దేశంలో మహిళా పైలట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సంఖ్యాపరంగానే కాదు... పనితీరు, ప్రతిభ విషయంలోనూ ఇతర దేశాలకు స్ఫూర్తి ఇస్తున్నారు... మూడు దశాబ్దాల వెనక్కి వెళితే... వైమానికరంగంలోకి నివేదిత భాసిన్ పైలట్‌గా అడుగు పెట్టినప్పుడు ఆమె ప్రయాణం అంత సజావుగా సాగలేదు. అడుగడుగునా అహంకారపూరిత అనుమానాలు ఎదురయ్యాయి. అయితే అవేమీ తన ప్రయాణానికి అడ్డుకాలేకపోయాయి. ‘మహిళలు విమానం నడపడం ఏమిటి!’ అనే అకారణ భయం, ఆందోళన ప్రయాణికులలో కనిపించేది. అయితే ఇప్పుడు ఆ దృశ్యం పూర్తిగా మారిపోయింది. ‘వైమానిక రంగంలో మహిళలు’ అనే అంశం ముందుకు వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు మన దేశం వైపే చూస్తున్నాయి. మన దేశంలోని స్ఫూర్తిదాయకమైన మహిళా పైలట్ల గురించి ప్రస్తావిస్తున్నాయి. తాజాగా... ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఉమెన్ ఎయిర్‌లైన్స్ పైలట్’ గణాంకాల ప్రకారం ప్రపంచంలోని ఎన్నో దేశాలతో పోల్చితే మన దేశంలో మహిళా పైలట్(కమర్షియల్, ఎయిర్‌ఫోర్స్)లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఉదా: యూఎస్–5.5 శాతం యూకే–4.7 శాతం ఇండియా–12.4 శాతం.. ‘సంస్థల ఆలోచన తీరులో మార్పు రావడం, స్ఫూర్తిదాయకమైన మహిళా పైలట్లు, కుటుంబ సభ్యుల మద్దతు, ఔట్రీచ్ ప్రోగ్రామ్స్, సోషల్ మీడియా... ఎలా ఎన్నో కారణాల వల్ల మన దేశంలో మహిళా పైలట్ల సంఖ్య పెరుగుతుంది. మహిళలు వైమానిక రంగంలో రాణించడానికి అనుకూలమైన వాతావరణం ఇప్పుడు బాగా కనిపిస్తుంది’ అంటుంది ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చిన నివేదిత భాసిన్. నిజానికి వైమానికరంగంలో మహిళల ఆసక్తి నిన్నా మొన్నటిది కాదు. వెనక్కి వెళితే... 1948లో ఏర్పాటైన యూత్ ప్రొగ్రామ్ ‘నేషనల్ క్యాడెట్స్ కాప్స్ ఎయిర్ వింగ్’ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపడంలో శిక్షణ ఇచ్చేది. మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. కొన్ని రాష్ట్రప్రభుత్వాలు, హోండా మోటర్లాంటి సంస్థలు శిక్షణ తీసుకునేవారికి ఆర్థిక సహాయం చేసేవి. వర్తమానానికి వస్తే... ఇండిగోలాంటి విమాన సంస్థలు మహిళా పైలట్లకు సంబంధించిన సదుపాయాలు, సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ప్రత్యేక సందర్భాలలో వెసులుబాటు ఇస్తున్నాయి. పికప్, డ్రాప్ కోసం గార్డ్‌తో కూడిన వాహన సౌకర్యం కలిగిస్తున్నాయి. విధి నిర్వహణలో తమను ముందుకు నడిపిస్తున్నది ‘కుటుంబ మద్దతు’ అంటున్నారు మహిళా పైలట్లు. జోయా అగర్వాల్ పైలట్ కావడానికి మొదట్లో తల్లిదండ్రులు సుముఖంగా లేరు. అయితే కూతురు పట్టుదల చూసి పచ్చజెండా ఊపారు. వైమానికరంగ చరిత్రలో జోయా సాధిస్తున్న విజయాలు వారికి గర్వకారణంగా నిలుస్తున్నాయి. చిన్నవయసులోనే బోయింగ్ విమానాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యపరిచిన జోయా నలుగురు మహిళా పైలట్లను తోడుగా తీసుకొని పదిహేడుగంటల పాటు ఉత్తరధృవం మీదుగా విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది. ‘కల కనడం ఒక్కటే కాదు ఆ కలను నిజం చేసుకోవడానికి ధైర్యంగా ముందడుగు వేయాలి. ప్రతికూలతల గురించి ఆలోచించవద్దు. విజయాలు అందించడానికి ఈ ప్రపంచమే మీకు తోడుగా ఉంటుంది’ అంటుంది జోయా అగర్వాల్. జోయాలాంటి ప్రతిభ, సాహనం మూర్తీభవించిన మహిళల వల్లే ఇప్పుడు ప్రపంచ వైమానికరంగ చరిత్రలో భారతీయ మహిళా పైలట్లకు ప్రశంసనీయమై, స్ఫూర్తిదాయకమైన ప్రత్యేకత ఏర్పడింది. చదవండి: Vidya Nambirajan: తండ్రి వారసురాలు.. ‘మా నాన్న కోసమే ఈ గ్యారేజ్‌లోకి వచ్చాను’ -
భారత్ పాకిస్ధాన్ మధ్య యుద్ధ మేఘాలు
-
పైలట్‌ను హింసించడం అమానుషం : భారత్
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌కు పట్టుబడ్డ భారత పైలట్ అభినందన్‌ను సురక్షితంగా అప్పగించాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. తమ పైలట్‌కు ఎలాంటి హాని తలపెట్టకుండా అప్పగించే బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. పైలట్ అభినందన్‌ను హింసించడం అమానుషమని పేర్కొంది. తీవ్రంగా గాయపడ్డ పైలట్‌ను చూపడం జెనీవా ఒప్పందానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్త చేసింది. ఇప్పటికే పలుమార్లు ఉగ్ర క్యాంపుల గురించి పాకిస్తాన్‌కు సమాచారమిచ్చామని, పాక్ చర్యలు తీసుకోనందునే దాడి చేశామని పేర్కొంది. తాము ఉగ్రవాదులపై దాడి చేశామే తప్ప పాక్ ప్రజలపై కాదని స్పష్టం చేసింది. (భారత పైలట్‌కు పాక్ చిత్రహింసలు!) బుధవారం ఉదయం పాక్ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. వాటిని తిప్పి కొట్టే క్రమంలో భారత పైలట్ అభినందన్ పాక్ సైన్యానికి చిక్కారు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ పాక్ ఓ విడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో స్థానికులు అభినందన్‌పై దాడి చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. భారత పైలట్ పట్ల పాకిస్తాన్ వ్యవహరించిన తీరును భారత ప్రభుత్వం తప్పుపట్టింది. యుద్దంలో చిక్కిన సైనికునిపై దాడి చేసి పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లఘించిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా బుధవారం సాయంత్రం అభినందన్‌కు సంబంధించి మరో వీడియోను పాక్ విడుదల చేసింది. వీడియోలో అభినందన్ కాఫీ తాగుతూ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ జవాన్ల ట్రీట్మెంట్ బాగుందని అభినందన్ తెలిపారు. తనపై స్థానికులు దాడి చేస్తే పాకిస్తాన్ సైన్యమే కాపాడిందని చేప్పారు. (ఎవరీ విక్రమ్ అభినందన్?) ఇది చదవండి : భారత పైలెట్ అభినందన్ క్షేమం! -
భారత పైలట్‌కు పాక్ చిత్రహింసలు!
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టే క్రమంలో ఆ దేశ ఆర్మీకి చిక్కిన భారత పైలట్‌ను పాక్ చిత్రహింసలకు గురిచేస్తోంది. యుద్ద ఖైదీలను హింసించరాదన్న జెనీవా ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పాకిస్తాన్ భూభాగంలో మిగ్-21 విమానం కూలిపోయినప్పుడు పారాచ్యూట్ ద్వారా భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ పాక్ భూభాగంలో దిగారు. దీంతో అభినందన్‌ను పట్టుకున్న పాక్ ఆర్మీ విచక్షణారహితంగా దాడి చేశారు. అభినందన్ ఛాతి భాగంలో పిడిగుద్దులు గుద్దుతూ రక్తం వచ్చేలా కొట్టారు. పారాచ్యూట్ ద్వారా దిగినప్పుడు అభినందన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ పాక్ రిలీజ్ చేసిన వీడియోలో ఆయన ఒంటిపై గాయాలు కనిపిస్తున్నాయి. అయితే అభినందన్‌పై దాడి చేసింది పాక్ సైనికులా లేదా ఉగ్రవాదులా తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ కూడా ధృవీకరించలేదు. (ఎవరీ విక్రమ్ అభినందన్?) యుద్దంలో చనిపోతే వీరమరణం పొందొచ్చు.. కానీ శత్రువులకు దొరికితే నరకం కనిపిస్తుంది. దీన్ని నివారించేందుకే ప్రపంచ దేశాలు జెనీవా ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఒప్పందం ప్రకారం యుద్ధంలో చిక్కిన శత్రు సైనికులను హింసించరాదు. కానీ పాక్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అభినందన్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. కాగా తనపై పాక్ ఆర్మీ దాడి చేయలేదని అభినందన్ తెలిపారు. స్థానికులు తనపై దాడి చేస్తుంటే పాకిస్తాన్ సైన్యమే తనను కాపాడిందని అబినందన్ చెబుతున్న ఓ వీడియోను పాక్ విడుదల చేసింది. మరో వైపు అభినందన్ పాక్‌కు పట్టుబడడాన్ని భారత్ అధికారికంగా ధృవీకరించలేదు. మిగ్-21 విమానం కూలిపోయిందని, ఒక పైలట్ తప్పిపోయారని మాత్రమే భారత్ వెల్లడించింది. -
ఆ పాటలతో పైలట్లు గజగజా వణికిపోతున్నారు
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని విమానాశ్రయాల్లో విమానాలు దించాలంటేనే భారత పైలట్లు భయపడుతున్నారు. వారికి ఆ అనుభవాలు నిద్రలేని రాత్రులుగా మిగులుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్లంట. జమ్మూకశ్మీర్ లోని విమానాశ్రయాల్లో విమానాలు ల్యాండింగ్ చేసే సమయంలో తొలుత పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంభాషిస్తారు. వారు క్లియరెన్స్ ఇచ్చాకే విమానాన్ని దించుతారు. అయితే, ఇలా ఎప్పుడైతే విమానం దించే అనుమతి కోసం పైలెట్లు ఏటీసీని సంప్రదిస్తారో పాక్ కు చెందిన హ్యాకర్లు వెంటనే వారి ఫ్రీక్వెన్సీని హ్యాక్ చేయడమే కాకుండా పాక్ కు చెందిన దేశభక్తి గీతాలు వారికి వినిపిస్తున్నారంట. ఇలా అవసరం లేకుండానే, పాక్ దేశభక్తి గీతాలను భారత పైలట్లు కాక్ పీట్ లో వినాల్సి వస్తుందని, అది నరకంగా ఉండటమే కాకుండా పై అధికారులు ఎలా స్పందిస్తారో కూడా అర్ధంకానీ పరిస్థితి నెలకొందట. 'దిల్ దిల్ పాకిస్థాన్, జాన్ జాన్ పాకిస్థాన్'వంటి పాక్ దేశభక్తి గీతాలు పదేపదే తమకు విమానం ల్యాండింగ్ సమయంలో వినిపిస్తున్నాయని వారు ఆందోళన చేస్తున్నారు. ఈ తరహా గీతాలు హ్యాకింగ్ చేసి వినిపిస్తూ శత్రువుపై పగ తీర్చుకునే ఒక ఆయుధంగా పాక్ వీటిని ఉపయోగించుకుంటోందని వారు చెప్తున్నారు. సైనికులు నడిపే విమానాల్లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందట.