'ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగించాలని కోరుకుంటున్నా'
హైదరాబాద్ : నేడు జరగుగుతున్న పోలీస్ మారథాన్ రన్ దేశానికే ఆదర్శమని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఫస్ట్ ఇండియన్ పోలీస్ మారథన్ మెమోరియల్ రన్‌ను నరసింహన్ ప్రారంభించారు. అనంతరం నరసింహన్ మాట్లాడుతూ... ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ రన్లో డీజీపీ అనురాగ్ శర్మ, పోలీసు ఉన్నతాధికారులతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రన్లో యువతి, యువకులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.