యూఏఈలో భారతీయుడి ఆత్మహత్య
అబుదాబీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) లో భారతీయ కార్మిడొకరు(29) ఆత్మహత్య చేసుకున్నాడు. షార్జాలోని అల్ నహద్దాలోని తాను ఉంటున్న గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతడు రూమ్మేట్స్ విధులు ముగించుకుని సాయంత్రం గదికి వచ్చి సరికి అతడు సీలింగ్ కు వేలాడుతూ కనిపించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందుకు బంధువులు, స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.