Indian villages
-
అడవుల్లో ఉండిపోయింది
‘ఒక సమయం వస్తుంది. ఈ నగరాలకు దూరం వెళ్లిపోవాలనిపిస్తుంది. కాకుంటే నేను ఆ పిలుపు ముందు విన్నాను’ అంటుంది 35 కావ్య. నోయిడాలో ఫ్యాషన్ ఉత్పత్తుల రంగంలో పని చేసిన కావ్య గత పదేళ్లుగా సెలవుల్లో భారతీయ పల్లెలను తిరిగి చూస్తూ తన భవిష్యత్తు పల్లెల్లోనే అని గ్రహించింది. ‘ఒరిస్సా అడవులకు మారిపోయాను. ఈ ఆదివాసీల కోసం పని చేస్తాను’ అంటోంది కావ్య. ఆమెలా బతకడం ఎందరికి సాధ్యం. చుట్టూ దట్టమైన అడవులు. అమాయకంగా నవ్వే ఆదివాసీలు. స్విగ్గి, జొమాటో, అమెజాన్‌ల గోల లేకుండా దొరికేది తిని సింపుల్‌గా జీవించే జీవనం, స్వచ్ఛమైన గాలి, స్పర్శకు అందే రుతువులు... ఇంతకు మించి ఏం కావాలి. నగరం మనిషి సమయాన్ని గాయబ్ చేస్తోంది. మరో మనిషిని కలిసే సమయం లేకుండా చేస్తుంది. కాని పల్లెల్లో? సమయమే సమయం. మనుషుల సాంగత్యమే సాంగత్యం. ‘ఆ సాంగత్యం అలవాటైన వారు అడవిని వదల్లేరు’ అంటుంది కావ్య సక్సెనా. 35 ఏళ్ల కావ్య ఇప్పుడు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ల సరిహద్దులో ఉండే కోరాపుట్ ప్రాంతంలో సెటిల్ అయ్యింది. ఒక్కత్తే. అక్కడి పల్లెల్లో ఆమె నివాసం. ఆ ఊరివాళ్లే ఆమె మనుషులు. అక్కడి ఆహారమే ఆమె ఆహారం. కాని ఆ జీవితం ఎంతో బాగుంటుంది అంటోంది కావ్య. నోయిడా నుంచి జైపూర్‌లో జన్మించిన కావ్య చదువు కోసం అనేక ప్రాంతాలు తిరిగింది. కొన్నాళ్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పని చేసింది. ఆ తర్వాత నోయిడాలో ఫ్యాషన్ ఉత్పత్తుల కార్పొరెట్ సంస్థకు మారింది. అయితే ఎక్కడ పని చేస్తున్నా పల్లెలను తిరిగి చూడటం ఆమెకు అలవాటు. ‘అందరూ అందమైన బీచ్‌లను, టూరిస్ట్ ప్లేస్‌లను చూడటానికి వెళతారు. నేను కేవలం పల్లెటూళ్లు చూడటానికి వెళ్లేదాన్ని. పల్లెల్లో భిన్నమైన జీవితం ఉంటుంది. అది నాకు ఇష్టం’ అంటుంది కావ్య. అయితే 2020లో వచ్చిన లాక్డౌన్ ఆమె కాళ్లకు బేడీలు వేసింది. అక్టోబర్‌లో ఆంక్షలు సడలింపు మొదలయ్యాక ‘మహీంద్రా’ వారితో కలిసి ‘కావ్యాఆన్క్వెస్ట్’ అనే సోలో ట్రిప్‌కు బయలుదేరింది. దీని ఉద్దేశ్యం పల్లెల్లో ఉండే హస్తకళలను డాక్యుమెంట్ చేయడమే. ఆ దారిలో ఆమె అనేక పల్లెల్లో గ్రామీణులు, ఆదివాసీలు చేసే హస్తకళలను గమనించింది. ‘కాని వాటిని మార్కెట్ చేసే ఒక విధానం మన దగ్గర లేదు. పల్లెల్లోని ఉత్పత్తులకు పట్నాల్లోని మార్కెట్‌కు చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలి అనిపించింది’ అంది కావ్యా. ఇక ఆమెకు జీవిత గమ్యం అర్థమైంది. ‘నగరానికి తిరిగి వచ్చాక నాకు ఊపిరి ఆడలేదు. జూలై 2021లో ఇక నేను శాశ్వతంగా నగరానికి వీడ్కోలు చెప్పేశాను. ఒరిస్సాల్లోని ఈ అడవులకు వచ్చి ఉండిపోయాను’ అంటుంది కావ్య. క్రాఫ్ట్ టూరిజం ఇది కొత్తమాటగా అనిపించవచ్చు. కాని హస్తకళలు ఉన్న గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా ప్రోత్సహించడమే క్రాఫ్ట్ టూరిజం. కావ్య ఇప్పుడు కోరాపుట్ ప్రాంతంలోని నియమగిరి కొండల దగ్గర నివశిస్తోంది. ఆ ప్రాంతంలో డోంగ్రియా తెగ ఆదివాసీలు ఎక్కువ. ‘వారు గడ్డితో చాలా అందమైన వస్తువులు చేస్తారు. అవి బాగుంటాయి. అంతేకాదు వారు 47 రకాల బియ్యాన్ని పండిస్తారు. వారి వంటలు మధురం. అవన్నీ నగరాల్లో ఎక్కడ తెలుస్తాయి. ఈ తెగవారు ‘కపడగంధ’ అనే శాలువాను అల్లుతారు. అది చాలా బాగుంటుంది. చెల్లెలు శాలువా అల్లి అన్నకు ఇస్తే అన్న తాను వివాహం చేసుకోదలిచిన అమ్మాయికి దానిని బహుమతిగా ఇస్తాడు. ఆ శాలువాలకు మంచి గిరాకీ ఉంది’ అంటుంది కావ్య. అయితే గ్రామీణ హస్తకళల ఉత్పత్తుల పేరుతో మార్కెట్లో డూప్లికేట్లు ఉండటం గురించి ఆమెకు బెంగ ఉంది. ‘ఒరిజినల్ ఉత్పత్తులను కస్టమర్లకు అందించడానికి ‘క్రాఫ్ట్ పోట్లీ’ అనే సంస్థ స్థాపించి పని చేస్తున్నాను. ఒక గ్రామాన్ని నా వంతుగా దత్తత చేసుకున్నాను. ఆ గ్రామంలో ఉండే 50 మంది మహిళలకు హస్తకళల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాను’ అంది కావ్య. ఈమె చేస్తున్న పని చూసి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ హస్తకళల ప్రమోషన్‌కు ఆహ్వానించింది. అక్కడి ఆదివాసీలను తరచూ కలిసి వస్తోంది కావ్య. త్వరలో ఆమె దేశంలోని అందరు ఆదివాసీలను ఒక ప్లాట్‌ఫామ్ మీదకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందరో మహానుభావులు అని మగవాళ్లను అంటారు. కాని ఎందరో మహా మహిళలు. కావ్య కూడా ఒక మహా మహిళ. -
మానా గ్రామం.. ఇది మన ఊరే!
ఓ కప్పు కాఫీ కోసం పదివేల అడుగుల ఎత్తుకు వెళ్లాలా? హిమాలయాలను చూస్తూ సిప్పు చేయాలంటే తప్పదు. సరిహద్దుకు ఈవల ఉండి ఆవలి టిబెట్‌ను చూస్తూ... టీ తాగాలంటే ఆ మాత్రం శ్రమ తప్పదు. పాండవులు స్వర్గారోహణకు వెళ్లిన దారిలో... తాపీగా ఓ టీ తాగాలంటే అంతదూరం వెళ్లాల్సిందే. టీ తాగడమే కాదు... టీ తాగుతూ చాలా చూడవచ్చు. సరస్వతి నది మీద ద్రౌపది కోసం... భీముడు కట్టిన రాతి వంతెనను చూడవచ్చు. ఇంకా... ఇంకా... చూడాలంటే... ‘మానా’ గ్రామానికి ప్రయాణం కట్టవచ్చు. మానా అనేది చాలా చిన్న గ్రామం. ఓ వంద ఇళ్లుంటాయేమో! కొండవాలులో ఉన్న ఈ గ్రామంలో ఏది నివాస ప్రదేశమో, ఏది వ్యవసాయ క్షేత్రమో అర్థం కాదు. అంతా కలగలిసి ఉంటుంది. ఇంటి ముందు క్యాబేజీ పంటలు కనిపిస్తాయి. దుకాణం వెనుక ఒక కుటుంబం నివసిస్తుంటుంది. ఓ వైపు ధీరగంభీరంగా హిమాలయాలు, మరో దిక్కున కిందకు చూస్తే నేల ఎక్కడుందో తెలియనంత లోతులో మంద్రంగా ప్రవహించే నదులు. నింగికీ నేలకూ మధ్యలో విహరిస్తున్నామనే భావన ఊహల్లో తేలుస్తుంది. నేనూ ఉన్నానంటూ సూర్యుడు తన ఉనికిని ప్రకటించే ప్రయత్నంలో ఉంటాడు. దారి చూపే బ్యాంకు ఇక్కడ రోడ్లు తీరుగా ఉండవు. భారతీయ స్టేట్ బ్యాంకు పెట్టిన బోర్డుల ఆధారంగా వెళ్లాలి. వ్యాసగుహ 150 మీటర్లు, గణేశ గుహ 30 మీటర్లు, భీమ్‌పూల్– సరస్వతి దర్శన్ 100మీటర్లు, కేశవ్ ప్రయాగ 600 మీటర్లు, వసుధారా జలపాతం ఐదు కిలోమీటర్లు అని బోర్డులుంటాయి. వసుధారా జలపాతం పాండవుల స్వర్గారోహణ ప్రస్థానంలో మానా తర్వాత మజిలీ. చాయ్ ప్రమోషన్ ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేసుకోవడం వస్తే చాలు... సముద్ర తీరాన ఇసుకని అమ్మవచ్చు, నడి సముద్రంలో ఉప్పు నీటిని అమ్మనూవచ్చు. మానా గ్రామస్థులు టీ, కాఫీలు అమ్మడం చూస్తే అలాగే అనిపిస్తుంది. ‘దేశం చివరి గ్రామం ఇది. ఇక్కడ టీ తాగిన అనుభూతిని మీ ఊరికి తీసుకెళ్లండి’ అని కొత్త ఆలోచనను రేకెత్తించడంతో ప్రతి ఒక్కరికీ టీ కానీ కాఫీ కాని తాగి తీరాలనిపిస్తుంది. ప్రతి పది మీటర్లకు ఒక చాయ్ దుకాణం ఉంటుంది. ప్రతి దుకాణం మీద ‘హిందూస్థాన్ కీ అంతిమ దుకాన్’ అనే బోర్డు ఉంటుంది. వ్యాపార నైపుణ్యం అంటే అదే. అసలైన చివరి దుకాణం ఏదనే ప్రశ్నార్థకానికి సమాధానం కూడా స్టేట్ బ్యాంకు బోర్టే. స్టేట్ బ్యాంకు జోషిమఠ్ శాఖ చివరి దుకాణం దగ్గర ‘ఇదే చివరి చాయ్ దుకాణం అనే బోర్డు ఉంటుంది. మానా గ్రామం పొలిమేర అది. ఆ తర్వాత వచ్చే దారి మానా పాస్. ఆ దారిలో ముందుకు వెళ్తే సరిహద్దు సెక్యూరిటీ వాళ్లు వెనక్కి పంపేస్తారు. మానా గ్రామం... దేశం చివరిలో సరిహద్దు వెంబడి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. భారతదేశం ఉత్తర ఎల్లలో హిమాచల్ ప్రదేశ్‌లోని చిత్కుల్ కూడా సరిహద్దు గ్రామమే. అయితే అది పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందలేదు. మానా గ్రామం భారతీయులకు సొంతూరిలాగ అనిపించడానికి కారణం ఇక్కడ మన పురాణేతిహాసాల మూలాలు కనిపించడమే. చదవండి: రంగులు మార్చే సూర్యుడు భార్య ప్రేమకు నిదర్శనం.. హుమయూన్ సమాధి -
పాక్ పోస్టులపై బీఎస్ఎఫ్ మోర్టార్ల వర్షం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత గ్రామాలు, పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న పాక్ బలగాలకు దీటుగా జవాబిస్తున్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఉన్నతాధికారి ఒకరు సోమవారం తెలిపారు. పాక్ ఆర్మీ పోస్టులే లక్ష్యంగా ఇప్పటివరకూ బీఎస్ఎఫ్ 9,000 రౌండ్ల మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించిందని వెల్లడించారు. భారత బలగాలు చాలా కచ్చితత్వంతో చేసిన దాడిలో పాక్ ఆర్మీకి చెందిన పలు పోస్టులు, మోర్టార్ లాంచింగ్ ప్యాడ్లు, ఆయుధాలు, ఇంధన డంప్‌లు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. భారత బలగాల దాడిలో పాక్ రేంజర్ల ఇంధన డంప్ ధ్వంసమవుతున్న రెండు వీడియోల్ని విడుదల చేశారు. జమ్మూ వెంట ఉన్న 190 కి.మీల అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని తెలిపారు. జమ్మూలోని మక్వాల్–కనచక్ బోర్డర్ పోస్టుల మధ్య ఉన్న చికెన్‌నెక్ ప్రాంతంపై తొలిసారి పాక్ కాల్పులు జరిపిందని వెల్లడించారు. భారత బలగాల తీవ్ర ప్రతిస్పందనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ రేంజర్లను పోత్సహించేందుకు ఆ దేశ సీనియర్ ఆర్మీ కమాండర్లు సరిహద్దుకు చేరుకోవడాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. భారత బలగాలతో చర్చలు జరిపేందుకు, ఫ్లాగ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు పాక్ రేంజర్లు విముఖత చూపుతున్నారని చెప్పారు. కాల్పుల మాటున దేశంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉండటంతో అంబుష్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. ఆగని పాక్ కాల్పులు జమ్మూ, రాజౌరీ జిల్లాల్లోని మూడు సెక్టార్లపై పాకిస్తాన్ బలగాలు సోమవారం కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఆదివారం సాయంత్రం నుంచి మొదలైన ఈ కాల్పులు సోమవారం తెల్లవారుజాము 5.45 గంటల వరకూ కొనసాగాయని ఓ బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. -
భారతీయ పల్లెల్లో దుబాయి డాక్టర్లు
దుబాయి: భారతీయ పల్లెల్లో చిన్నారులకు ఉచిత వైద్యసాయం అందించేందుకు దుబాయి డాక్టర్లు ముందుకొచ్చారు. భారత సంతతికి చెందిన దుబాయి డాక్టర్ సంజయ్ పరాశర్ నేతత్వంలోని వైద్యుల బందం గ్రహణమొర్రి, యాసిడ్ గాయాలతో బాధపడుతున్న భారతీయ గ్రామీణ చిన్నారులకు వచ్చే నెలలో శస్త్రచికిత్సలు చేయనున్నారు. సంజయ్ దుబాయిలో ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్‌గా ఉన్నారు. ఈయన ఆధ్వర్వంలోని వైద్య బందం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని గ్రామాల్లో జనవరిలో రెండు రోజుల్లో 45కు పైగా శస్త్రచికిత్సలు చేయనున్నారు. ఈ వైద్య బందంలో నాగ్‌పూర్‌కు చెందిన ఇద్దరు ప్లాస్టిక్ సర్జన్లు, ఆస్ట్రేలియా డాక్టర్ ఒకరు, దుబాయికి చెందిన మరో వైద్య నిపుణుడు ఉంటారు. ఈ విషయమై సంజయ్ మాట్లాడుతూ.. చాలా మంది గ్రామస్తులు గ్రహణమొర్రిని అలాగే వదిలేస్తారని.. నాలుగు శస్త్రచికిత్సలు ఇందుకు అవసరం కావడమే కారణమన్నారు. వీటికి అయ్యే వ్యయాన్ని భారత్‌లో భరించలేరని అందుకే తాము ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.