దుబాయి: భారతీయ పల్లెల్లో చిన్నారులకు ఉచిత వైద్యసాయం అందించేందుకు దుబాయి డాక్టర్లు ముందుకొచ్చారు. భారత సంతతికి చెందిన దుబాయి డాక్టర్ సంజయ్ పరాశర్ నేతత్వంలోని వైద్యుల బందం గ్రహణమొర్రి, యాసిడ్ గాయాలతో బాధపడుతున్న భారతీయ గ్రామీణ చిన్నారులకు వచ్చే నెలలో శస్త్రచికిత్సలు చేయనున్నారు. సంజయ్ దుబాయిలో ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్‌గా ఉన్నారు. ఈయన ఆధ్వర్వంలోని వైద్య బందం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని గ్రామాల్లో జనవరిలో రెండు రోజుల్లో 45కు పైగా శస్త్రచికిత్సలు చేయనున్నారు. ఈ వైద్య బందంలో నాగ్‌పూర్‌కు చెందిన ఇద్దరు ప్లాస్టిక్ సర్జన్లు, ఆస్ట్రేలియా డాక్టర్ ఒకరు, దుబాయికి చెందిన మరో వైద్య నిపుణుడు ఉంటారు.
ఈ విషయమై సంజయ్ మాట్లాడుతూ.. చాలా మంది గ్రామస్తులు గ్రహణమొర్రిని అలాగే వదిలేస్తారని.. నాలుగు శస్త్రచికిత్సలు ఇందుకు అవసరం కావడమే కారణమన్నారు. వీటికి అయ్యే వ్యయాన్ని భారత్‌లో భరించలేరని అందుకే తాము ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.