indian wokers
-
Maldives Fire: తొమ్మిది మంది భారతీయుల దుర్మరణం
మాలే: మాల్దీవుల రాజధాని మాలేలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదకొండు మంది దుర్మరణం చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులే ఉన్నట్లు సమాచారం. విదేశీ వలస కార్మికులు ఉంటున్న ఇరుకైన వసతి గృహాల్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వెహికిల్ రిపేర్ గ్యారేజీలో చెలరేగిన మంటలు.. పైఫ్లోర్లకు విస్తరించినట్లు అధికారులు ధృవీకరించారు. నాలుగు గంటలపాలు మంటలు చెలరేగుతూనే ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా చోటుచేసుకుందని సమాచారం. మృతుల సంఖ్యపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం మొదలుపెట్టాయి. విదేశీ కార్మికులను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నాయి. మాలే జనాభా రెండున్నరల లక్షలుగా ఉంటే.. అందులో బంగ్లాదేశ్, భారత్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక నుంచే సగం జనాభా ఉంది. Deadliest #fire broke out at #crampedlodgings of foreign workers in the #Maldives capital #Male. So far 11 bodies have been recovered. Out of 11 9 are #Indians. The bodies were recovered from the upper floor of a building destroyed in the fire. The bodies are of #migrantworkers. pic.twitter.com/Is4jw2nRZ9 — Ashmita Chhabria (@ChhabriaAshmita) November 10, 2022 We are deeply saddened by the tragic fire incident in Malé which has caused loss of lives, including reportedly of Indian nationals. We are in close contact with the Maldivian authorities. For any assistance, HCI can be reached on following numbers: +9607361452 ; +9607790701 — India in Maldives (@HCIMaldives) November 10, 2022 -
గల్ఫ్‌లో భారతీయ కార్మికులకు బీమా
గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు శుభవార్త. వారికోసం కొత్తగా బీమా సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. ఎలాగోలా అప్పో సొప్పో చేసి దుబాయ్ వెళ్లి.. నాలుగు డబ్బులు సంపాదించుకుని వద్దామనుకున్న పలువురు భారతీయులు అక్కడ నానా కష్టాలు పడటం, కొందరు అనాథల్లా మరణించడం తెలిసిందే. ఇలా విదేశాలకు వలస కార్మికులుగా వెళ్లి, ఈసీఆర్ పాస్‌పోర్టులు ఉన్నవారి కోసం భారత ప్రభుత్వం ఓ సామాజిక భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, విదేశాల్లో పనిచేసే భారతీయులు ఎవరైనా సహజంగా గానీ, ప్రమాదవశాత్తు గానీ మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా వారికి బీమా సదుపాయం అందుతుంది. మహాత్మాగాంధీ ప్రవాసీ సురక్షా యోజన (ఎంజీపీఎస్‌వై) అనే పథకం కింద ఇలాంటి కార్మికులకు వృద్ధాప్య పింఛన్లు కూడా ఇవ్వనున్నారు. వలస కార్మికులకు సాయం చేసేందుకు ఈ పథకానికి ప్రభుత్వం కూడా తనవంతు వాటా అందిస్తోంది. 18-50 సంవత్సరాల మధ్య వయసుండి, ఈసీఆర్ (ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్) పాస్‌పోర్టు కలిగి ఉన్న భారత జాతీయులు దుబాయ్‌లో తగిన వర్క్ పర్మిట్ లేదా ఉద్యోగ కాంట్రాక్టు కలిగి ఉంటే, వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులవుతారు. వాళ్లు పెన్షన్ లబ్ధి కోసం ఏడాదికి రూ. 1000-12,000 మధ్య ఆదా చేయాల్సి ఉంటుంది. అలాగే, తిరిగి వచ్చాక స్థిరపడేందుకు ఏడాదికి రూ. 4వేలు ఆదా చేయాలి. జీవిత బీమా కోసం మాత్రం ఎలాంటి ప్రీమియం చెల్లించనక్కర్లేదు. దుబాయ్‌లోని భారతీయ కార్మికులకు ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ బరోడా సేవలు అందిస్తుంది.