Indias market
-
సెన్సెక్స్ మద్దతు 25,700
మార్కెట్ పంచాంగం అంతర్జాతీయంగానూ, దేశీయంగానూ గతవారం అనుకూల, ప్రతికూలాంశాలేవీ లేకపోవడంతో భారత్ మార్కెట్ పరిమితంగా కదిలింది. వరుసగా రెండోవారం స్వల్ప లాభాలతో ముగియగలిగింది. అయితే ఈ వారం వెలువడే పలు వార్తల కారణంగా మార్కెట్ కదలికలు వేగవంతం కావొచ్చు. జీడీపీ డేటా, ఆర్బీఐ పాలసీ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశం, అమెరికా ఫెడ్ చైర్మన్ యెలెన్ అక్కడి కాంగ్రెస్ సమావేశంలో ఇచ్చే ప్రెజెంటేషన్ వంటివి ప్రపంచ, దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించవచ్చు. ఇక సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు నవంబర్ 27తో ముగిసిన నాలుగు రోజుల ట్రేడింగ్ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ కనిష్టస్థాయి వద్ద పదేపదే మద్దతు పొందుతూ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 260 పాయింట్ల లాభంతో 26,128 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం మార్కెట్ పంచాంగంలో సూచించిన అంచనాలకు అనుగుణంగా ప్రస్తుతం సెన్సెక్స్ 26,100-26,200 నిరోధ శ్రేణి వద్ద నిలిచివుంది. ఈ వారం ఈ శ్రేణిపైన ముగిస్తే 26,440 స్థాయిని అందుకునే ఛాన్స్ వుంటుంది. అటుతర్వాత అక్టోబర్ 26 నాటి గరిష్టస్థాయి అయిన 26,618 స్థాయిని పరీక్షించవచ్చు. తొలి నిరోధశ్రేణిపైన ముగియలేకపోతే క్రమేపీ 25,700 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయి గత ఐదు రోజుల నుంచి వరుసగా మద్దతును అందిస్తున్న కారణంగా 25,700 పాయింట్ల లోపు ముగిస్తే తిరిగి డౌన్‌స్వింగ్ మొదలుకావొచ్చు. ఆలోపున ముగిస్తే మద్దతు స్థాయిలు 25,440, 25,100 పాయింట్లు. నిఫ్టీ మద్దతు శ్రేణి 7,810-7,860 ఎన్ఎస్ఈ నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 7,943 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో నిఫ్టీ 7,810-7,860 పాయింట్ల శ్రేణిలో మద్దతు పొందినందున, సమీప భవిష్యత్తులో ఈ శ్రేణి కీలకం. ఈ వారం ఈ శ్రేణి దిగువన ముగిస్తే గత రెండు వారాల అప్‌ట్రెండ్‌కు బ్రేక్పడవచ్చు. ఆ లోపున 7,700 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 7,600 స్థాయి వద్దకు తగ్గవచ్చు. ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగితే 8,005 పాయింట్ల సమీపంలో తొలి నిరోధం కలగవచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 8,100 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఈ స్థాయిని బ్రేక్చేస్తే తదుపరి వారాల్లో 8,336 పాయింట్ల వరకూ పెరిగే చాన్స్ వుంది. -
మద్దతు 26,200-అవరోధం 27,100
మార్కెట్ పంచాంగం గతవారం ఇతర ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత్ మార్కెట్ బాగా డీలా పడింది. తాజా క్షీణతతో అక్టోబర్ నెలలో ఆర్జించిన లాభాల్లో ఎక్కువ శాతాన్ని భారత్ సూచీలు కోల్పోయాయి. ప్రపంచ ప్రధాన దేశాల సూచీలను ప్రతిబింబించే ఎంఎస్సీఐ ఇండెక్స్‌తో సహా అమెరికా మార్కెట్లు అక్టోబర్‌లో 7 శాతంపైగా పెరిగి నాలుగేళ్ల రికార్డును సృష్టించగా, భారత్ మార్కెట్ గత నెల పెరుగుదల 1.5 శాతానికే పరిమితయ్యింది. కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు బలహీన ఆర్థిక ఫలితాలు, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇన్వెస్టర్ల ఆందోళన ఇక్కడి మార్కెట్ క్షీణతకు కారణం కావొచ్చు. ఇక సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు అక్టోబర్ 23తో ముగిసినవారం ప్రధమార్థంలో 27,575 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ ద్వితీయార్థంలో 26,585 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 814 పాయింట్ల భారీ నష్టంతో 26,657 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు 200 డీఎంఏ రేఖ సమీపానికి చేరిన తర్వాత, ఆ స్థాయిని అధిగమించలేక, సూచీ వేగంగా క్షీణించింది. పతనవేగం కారణంగా గత అప్‌ట్రెండ్‌కు ప్రతిగా డౌన్‌స్వింగ్ మొదలయ్యిందని భావించవచ్చు. సెప్టెంబర్ 8నాటి కనిష్టస్థాయి అయిన 24,833 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి జరిగిన 2,742 పాయింట్ల ర్యాలీలో సూచీ ఇప్పటికి 38.2 శాతం కోల్పోయినందున, ఈ వారం ప్రస్తుతస్థాయి నుంచి మార్కెట్ కోలుకోలేకపోతే 50 శాతం డౌన్వర్డ్ రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 26,200 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఆ లోపున ముగిస్తే 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 25,880 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని సైతం నిలబెట్టుకోలేకపోతే తిరిగి 24,800 పాయింట్ల సమీపస్థాయికి తగ్గవచ్చు. ఈ వారం రికవరీ జరిగితే 27,100 పాయింట్ల నిరోధస్థాయిని చేరవచ్చు. ఆపైన ముగిస్తే 27,200 పాయింట్ల వరకూ పెరగవచ్చు. సెన్సెక్స్ తిరిగి బుల్ కక్ష్యలోకి ప్రవేశించాలంటే 27,660 పాయింట్ల స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదించాల్సివుంటుంది. నిఫ్టీ నిరోధం 8,180-మద్దతు 7,940 గతవారం తొలుత 8,336 పాయింట్ల గరిష్టంవరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ, వారం చివర్లో 8,044 పాయింట్ల కనిష్టం వరకూ పతనమయ్యింది. చివరకు 229 పాయింట్ల నష్టంతో 8,066 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ కోలుకుంటే క్రమేపీ 8,180 పాయింట్ల నిరోధస్థాయికి చేరవచ్చు. అటుపైన ముగిస్తే 8,230 స్థాయికి చేరే అవకాశం వుంది. ఈ రెండు స్థాయిల్ని అధిగమించి, స్థిరపడితేనే ఇటీవలి గరిష్టస్థాయి అయిన 8,336 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. ఈ వారం ప్రస్తుత స్థాయి వద్ద నిఫ్టీ నిలదొక్కుకోలేకపోతే క్రమేపీ 7,940 పాయింట్ల మద్దతుస్థాయివరకూ తగ్గవచ్చు. ఆ లోపున ముగిస్తే 7,840 పాయింట్ల వరకూ తగ్గే ప్రమాదం వుంది. ఏదైనా అనూహ్యవార్త కారణంగా ఈ రెండో మద్దతును కూడా కోల్పోతే రానున్న రోజుల్లో తిరిగి 7,540 పాయింట్ల వరకూ పతనం కావొచ్చు. 8,375 పాయింట్ల స్థాయిని దాటితేనే నిఫ్టీ తిరిగి బుల్లిష్‌గా మారే ఛాన్స్ వుంటుంది. -
నిరోధ శ్రేణి 28,420-28,580
మార్కెట్ పంచాంగం రుతుపవనాల బలహీనత, సంస్కరణల బిల్లుల స్తంభన వంటి ప్రతికూల అంశాల్ని ఎదుర్కొంటూ గరిష్టస్థాయిలో మన మార్కెట్ స్థిరపడినా, నాటకీయంగా చైనా తన కరెన్సీని డీవాల్యూ చేయడంతో అన్ని ప్రపంచ సూచీలతో పాటు సెన్సెక్స్, నిఫ్టీలు కూడా పడిపోయాయి. అయితే వారాంతంలో ఒక్క భారత్ మార్కెట్ మాత్రమే పటిష్టంగా కోలుకోవడం విశేషం. కానీ చాలా వారాల తర్వాత క్రితం వారం విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకాలు జరపడం ఆందోళనకరం. వీరు తిరిగి నికర కొనుగోళ్లకు ఉపక్రమిస్తేనే మార్కెట్ మరింత పెరిగే అవకాశం వుంటుంది. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... గత మార్కెట్ పంచాంగంలో సూచించిన 28,130 పాయింట్ల స్థాయిని దిగువవైపుగా ఛేదించిన బీఎస్ఈ సెన్సెక్స్ అంచనాలకు అనుగుణంగా 27,480 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరిరోజైన శుక్రవారం పెద్ద ర్యాలీ జరపడంతో వారంలో నష్టాలను చాలావరకూ పూడ్చుకున్న సెన్సెక్స్ తుదకు 28,067 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగితే 28,420 పాయింట్ల వద్ద తొలి అవరోధం ఏర్పడవచ్చు. అటుపైన ముగిస్తే వేగంగా 28,580 వద్దకు చేరవచ్చు. గతవారం సెన్సెక్స్‌ను నిరోధించిన 28,420 పాయింట్లు, కొద్ది నెలలుగా అవరోధిస్తున్న 28,580 పాయింట్ల మధ్య శ్రేణిని బలంగా ఛేదిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఆపైన స్థిరపడితే కొద్ది రోజుల్లో 29,095 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. ఈ వారం ప్రస్తుత స్థాయి నుంచి లేదా పైన పేర్కొన్న నిరోధ శ్రేణి నుంచి వెనుదిరిగితే వెనువెంటనే 27,790 పాయింట్ల మద్దతుస్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున తిరిగి 27,400 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ నిరోధశ్రేణి 8,620-8,655 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,338 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమై, అటుతర్వాత వేగంగా 8,500 స్థాయిపైకి కోలుకోగలిగింది. చివరకు 46 పాయింట్ల నష్టంతో 8,519 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు నెలలుగా 8,300 పాయింట్ల సమీపంలో పలుదఫాలు మద్దతును 8,620-8,655 పాయింట్ల శ్రేణి వద్ద పదే పదే నిరోధాన్ని చవిచూస్తున్నందున, రానున్న వారాల్లో ఈ స్థాయిలు నిఫ్టీ దీర్ఘకాలిక ట్రెండ్‌కు ముఖ్యమైనవి. ఈ వారం ప్రస్తుత స్థాయి వద్ద నిఫ్టీ నిలదొక్కుకుంటే 8,620 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. అటుపైన 8,655 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. సమీప భవిష్యత్తులో ఈ స్థాయిని అధిగమిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ స్థాయిని దాటితే 8,760 పాయింట్ల స్థాయికి వేగంగా పెరగవచ్చు. అటుపైన స్థిరపడితే ఏప్రిల్ 15నాటి గరిష్టస్థాయి 8,845 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ప్రస్తుత స్థాయి వద్ద నిఫ్టీ స్థిరపడలేకపోతే 8,430 పాయింట్ల వద్దకు ఈ వారం క్షీణించవచ్చు. ఆ లోపున తిరిగి 8,320-8,370 పాయింట్ల మద్దతు శ్రేణి వద్దకు పతనం కావొచ్చు. ఆ లోపున 8,195 స్థాయికి క్షీణించే ప్రమాదం వుంది. -
సెన్సెక్స్ నిరోధ శ్రేణి 27,345-27,570 పాయింట్లు
మార్కెట్ పంచాంగం భారత్ మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గిందన్న సంకేతాల్ని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) డెరివేటివ్స్ డేటా వెల్లడిస్తున్నది. చాలా నెలల తర్వాత మే నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్‌కు రోలోవర్స్ పరిమితంగా జరిగాయి. ఈ విభాగంలో చురుగ్గా వ్యవహరించే విదేశీ ఇన్వెస్టర్లు వారి పొజిషన్లను తగ్గించుకోవడమే ఇందుకు కారణం. అయితే వారు లాంగ్ పొజిషన్లతో (పెరుగుతాయనే అంచనాలతో తీసుకునేవి) పాటు షార్ట్ పొజిషన్లను (తగ్గుతాయన్న అంచనాలతో తీసుకునేవి) కూడా తగ్గించుకున్నట్లు ఆ డేటా ద్వారా వెల్లడవుతోంది. కానీ ఇప్పటికే వారు భారత్ మార్కెట్లో భారీగా నగదు పెట్టుబడులు చేసివున్నందున, త్వరలో డెరివేటివ్స్ విభాగంలో కూడా వారు పొజిషన్లను పెంచుకోకతప్పదు. విదేశీ ఇన్వెస్టర్లు రాబోయే కొద్దిరోజుల్లో తీసుకోబోయే పొజిషన్లకు అనుగుణంగా మార్కెట్ భారీగా పెరగవచ్చు. లేదా తీవ్రంగా పతనం కావొచ్చు. ఇక సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఏప్రిల్ 30తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్ వారంలో గత మార్కెట్ పంచాంగంలో అంచనాలకు అనుగుణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 26,897 పాయింట్ల కనిష్టస్థాయివరకూ పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 427పాయింట్ల నష్టంతో 27,011 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ పెరిగిన కారణంగా ఈ వారం గ్యాప్‌అప్‌తో ఇక్కడి మార్కెట్ మొదలైతే 27,345 పాయింట్ల నిరోధస్థాయిని చేరవచ్చు. అటుపైన స్థిరపడితే 27,570 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఈ వారం సెన్సెక్స్‌కు 27,345-27,570 పాయింట్ల నిరోధశ్రేణి కీలకం. ఈ శ్రేణిని బలంగా ఛేదిస్తే వేగంగా 27,830 స్థాయికి పెరగవచ్చు. సెన్సెక్స్ తిరిగి అప్ట్రెండ్లోకి ప్రవేశించాలంటే 28,090 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సివుంటుంది. ఈ వారం తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే మరోదఫా 26,880 స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున క్రమంగా 26,470 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ నిరోధ శ్రేణి 8,270-8,335 ఎన్ఎస్ఈ నిఫ్టీ గత శుక్రవారం 8,145 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత, చివరకు 123 పాయింట్ల నష్టంతో 8,182 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే తొలుత 8,270 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 8,335 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఈ రెండు స్థాయిలూ...అంటే...8,270-8,335 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి ముఖ్యమైన అవరోధం. ఈ వారం ఈ శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటితే 8,420 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 8,505 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం తొలి అవరోధాన్ని అధిగమించలేకపోతే మరోదఫా 8,145 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున 8,080 స్థాయికి క్షీణించవచ్చు. ఈ లోపున ముగిస్తే 7,960 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు.