Indira Gandhi International Airport (IGIA)
-
ఎయిరిండియా విమానాల్లో ప్రయాణాలొద్దు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగే నవంబర్ 19వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ(ఐజీఐ) విమానాశ్రయాన్ని మూసివేయాలంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. అదే రోజు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని కూడా పేర్కొన్నాడు. ఈ మేరకు çపన్నూ హెచ్చరికలు చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ‘నవంబర్ 19వ తేదీన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించరాదని సిక్కులను కోరుతున్నాం. ఆరోజు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి’అని పేర్కొన్నాడు. ‘19న ఐజీఐ విమానాశ్రయాన్ని మూసివేయాలి, విమానాశ్రయం పేరును మార్చాలి’ అని కూడా డిమాండ్ చేశాడు. ఆ రోజున వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్లో జరగనున్న విషయాన్ని కూడా అతడు ప్రస్తావించడం గమనార్హం. ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం నుంచి పాఠం నేర్చుకోవాలని, లేకుంటే భారత్ కూడా అదే ప్రతిచర్యను చవిచూడాల్సి ఉంటుందని ప్రధాని మోదీని హెచ్చరిస్తూ అక్టోబర్ 10న పన్నున్ వీడియో విడుదల చేశాడు. హింసకు హింసే సమాధానం. అక్రమంగా ఆక్రమించుకుంటే పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు ప్రజల సమాధానం ఇలాగే ఉంటుందని అందులో పేర్కొన్నాడు. పంజాబ్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర చర్యలకు ఊతమిస్తున్న పన్నూను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గత ఏడాది ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించింది. అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. If this guy was a Palestinian who operated in Canada & was targeting a Western or Israeli airport, Justin Trudeau would have arrested him & banned his organisation But Khalistani terrorists can say & do what they like in Trudeau’s Canada as long as they only target India https://t.co/4ZfZyDzeOr — vir sanghvi (@virsanghvi) November 4, 2023 -
నెల రోజుల్లో రెండో ఘటన.. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మరో దారుణం ..
న్యూడిల్లీ: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దారుణం మరవకముందే అదే ఎయిర్ ఇండియా విమానంలో తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. పారిస్- ఢిల్లీ విమానంలో తాగిన మత్తులో ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విజర్జన చేశాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటన డిసెంబర్ 6న ఎయిర్ ఇండియా విమానం 142లో చోటుచేసుకుంది. విమానం ఉదయం 9.40 గంటలకు ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వడంతో ఈ విషయంపై పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. ప్రయాణికుడు మద్యం సేవించి ఉండటం వల్ల క్యాబిన్ సిబ్బంది సూచలను పాటించలేదని అతడు పేర్కొన్నారు. అనంతరం అతను తోటి మహిళా ప్యాసింజర్ దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడని తెలిపారు. విమానం దిగిన వెంటనే ఈ నీచానికి పాల్పడిన వ్యక్తిని ఎయిర్ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తన అసభ్య ప్రవర్తనపై ప్రయాణికుడు రాతపూర్వక క్షమాపణ తెలిపాడు. దీంతో ఇద్దరుప్రయాణికులు పరస్పర రాజీ కుదుర్చుకోవడంతో అతనిపై చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టారు. కాగా నెల రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు అమెరికాలోని న్యూయర్క్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడు.. సీట్లో కూర్చున్న ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో విమానంలో తనకు జరిగిన అవమానంపై బాధితురాలు ఎయిర్ ఇండియా అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అధికారులు ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వృద్ధుడిపై కేసు నమోదయ్యింది. అయితే విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత నిందితుడిని ఎయిర్ ఇండియా సిబ్బంది పట్టుకోకుండా వదిలేశారని బాధితురాలు ఆరోపించింది. ఆమెకు న్యాయం చేకూర్చేందుకు దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఎయిర్ ఇండియా నుంచి పూర్తి నివేదిక కోరామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) స్పష్టం చేసింది. నిందితుడి కోసం గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసు అధికారుల బుధవారం తెలియజేశారు. -
ఢిల్లీ విమానాశ్రయంలో హ్యుందాయ్ రోబోటిక్ ‘నమస్కారం’
హైదరాబాద్: భారత సంస్కృతిలో నమస్కారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎదుటివారిని ఆహ్వానిస్తూ.. పలకరిస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరించడం సంప్రదాయంలో భాగం. దీన్ని గుర్తిస్తూ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యందాయ్ ఇండియా ఒక వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెట్టింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 మీటర్ల ఎత్తయిన నమస్కార రోబోను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు నమస్కారంతో స్వాగతం పలుకుతుంది. ఒక మనిషి చేయి, ఒక రోబో చేయి కలిసిన ప్రతిరూపంగా ఇది కనిపిస్తుందని కంపెనీ తెలిపింది. మానవత్వం, టెక్నాలజీ ఈ రెండూ కలసి మెరుగైన భవిష్యత్తుకు ప్రతిరూపమని తెలియజేయడమే దీని ఏర్పాటులోని ఉద్దేశమని పేర్కొంది. ‘‘భారత్‌లో మనుషులు, టెక్నాలజీ మధ్య అంతరం పూడ్చడమే హ్యుందాయ్ అసలైన విజన్. దీన్ని ప్రతిబింబించే రూపమే ఈ ఏర్పాటు’’అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూకిమ్ తెలిపారు. -
ఉగాండా మహిళ పొట్టలో కేజీ కొకైన్
న్యూఢిల్లీ: ఉగాండా దేశానికి చెందిన మహిళ నుంచి సుమారు కిలో బరువున్న కొకైన్ అనే మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ) కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికురాలు కొన్ని రోజుల క్రితం ఉగాండా నుంచి ఢిల్లీకి వచ్చింది. విమానాశ్రయంలో అధికారులు ఆమె కదలికలు, ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆమె క్యాప్యూళ్ల రూపంలో ఉన్న కొకైన్‌ను మింగినట్లు ఒప్పుకుంది. వెంటనే ఆస్పత్రిలో ఆమెకు పరీక్షలు చేయించగా అనేక క్యాప్యూళ్లు పెద్ద పేగు వద్ద చిక్కుకుని ఉన్నట్లు తేలింది. దీంతో నిపుణుల పర్యవేక్షణలో వాటన్నిటినీ బయటకు తీసేందుకు కొన్ని రోజులు పట్టింది. మొత్తం 992 గ్రాముల బరువున్న 91 క్యాప్సూళ్లు బయటపడ్డాయి. వీటిల్లో ఉన్నది సుమారు రూ.14 కోట్ల విలువైన కొకైన్ అని ధ్రువీకరించుకున్నారు. ఈ మేరకు సదరు మహిళను అరెస్ట్ చేసి, ఈనెల 29వ తేదీన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈనెల మొదటి వారంలో నైజీరియా మహిళ నుంచి ఐజీఐ అధికారులు 2,838 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
రజతంతో స్వదేశంలో...
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ తొలి రోజు వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం సాధించి భారత్ గర్వపడేలా చేసిన మీరాబాయి చాను సోమవారం సొంతగడ్డపై అడుగు పెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో ఎయిర్పోర్ట్ అంతా హోరెత్తింది. మీరా రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, మీడియా తదితరులు అక్కడ చేరడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. భారత ఆర్మీ జవాన్లు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకు వెళ్లాల్సి వచ్చింది. అనంతరం మీరాబాయి కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నితీశ్ ప్రమాణిక్, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసింది. మరోవైపు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తమ ఉద్యోగి అయిన మీరాబాయికి రూ. 2 కోట్లు నజరానా ప్రకటించారు. 2018 నుంచి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (స్పోర్ట్స్)గా పని చేస్తున్న మీరాబాయికి పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. చైనా లిఫ్టర్ డోపింగ్ వార్తలతో అలజడి... మీరాతో పోటీ పడి స్వర్ణం సాధించిన జిహుయ్ హౌ ‘డోపింగ్’కు పాల్పడినట్లు, నిర్ధారణ అయితే మీరాకు స్వర్ణం లభిస్తుందంటూ సోమవారం ఉదయం నుంచి పలు పత్రికలు, వెబ్సైట్లలో వార్తలు చక్కర్లు కొట్టాయి. పోటీ ముగిసిన రెండు రోజుల తర్వాత జిహుయ్కు డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తుండటం అనుమానాలు రేకెత్తిస్తుందంటూ ఒక భారత మీడియా ప్రతినిధి రాసిన వార్త దీనికంతటికీ కారణమైంది. అయితే ఐఓసీ నుంచి గానీ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నుంచి గానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత ఒలింపిక్ సంఘం కూడా తమకేమీ తెలీదని స్పష్టం చేసింది. నిజానికి కనీస సమాచారం, ఆధారం లేకుండా కేవలం జిహుయ్ రెండోసారి పరీక్షకు వెళుతోంది కాబట్టి ఏదో జరిగి ఉంటుందనే అంచనాలపై ఆధారపడి ఈ వార్తను ప్రచారంలోకి తెచ్చినట్లు తర్వాత తేలింది. పోటీ ముగియగానే తీసుకున్న ‘శాంపిల్’పై అనుమానం ఉండటం వల్లే స్పష్టత కోసం రెండో ‘శాంపిల్’ తీసుకుంటున్నారని వినిపించినా... దానిపై కూడా అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. రోజూ ఐఓసీ నిర్వహించే సుమారు 5000 డోపింగ్ పరీక్షల్లో ఇది కూడా ఒక రొటీన్ పరీక్ష కూడా కావచ్చు! -
విమానాల్లోంచి టాయిలెట్ వ్యర్థాలు.. ఎన్జీటీ గట్టి వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: టాయిలెట్ వ్యర్థాలను గాల్లో వదిలి వేయకుండా చర్యలు తీసుకోవడానికి తామిచ్చిన మార్గదర్శకాలను పక్కన పడేసిన పౌర విమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్ జీతభత్యాలను నిలుపుదల చేయిస్తామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో డీజీసీఏ విఫలమయ్యారని మండిపడింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వలోని ఎన్జీటీ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. విమానాల్లో పోగైన టాయిలెట్ వ్యర్థాలు గాల్లో పడేయకుండా నిరోధించేందుకు డీజీసీఏకు ఆగస్టు 31 వరకు గడువు విధించింది. లేదంటే సెప్టెంబర్ 17 జరిగే తదుపరి విచారణకు డీజీసీ డైరెక్టర్ హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇళ్లపై గాల్లోంచి టాయిలెట్ వ్యర్థాలు.. ఢిల్లీలోని ఇందిరాగాందీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో గల నివాసాలపై విమానాల నుంచి టాయిలెట్ వ్యర్థాలు పడుతున్నాయని 2016లో సావంత్ సింగ్ దహియా అనే రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ అప్పట్లో డీజీసీయేకు మార్గదర్శకాలు జారీ చేసింది. గాల్లో మానవ వ్యర్థాలను పడేస్తున్న విమాన సంస్థలు పర్యావరణ సహాయ నిధిగా 50 వేల రూపాయల చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ విమాననాశ్రయం గుండా వెళ్లే విమాన సంస్థలకు సర్క్యులర్ జారీ చేయాలని డీజీసీఏని ఆదేశించింది. కాగా, ఎన్జీటీ నోటీసులపై స్పందించిన పౌర విమానయాన సంస్థ.. విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఎటువంటి వ్యర్థాలను పడేసే అవకాశమే ఉండదని తెలిపింది. ఫిర్యాదు దారు ఇంటిపై పక్షుల రెట్టలు పడ్డాయేమోనని పేర్కొంది. నేటి ఆధునిక కాలంలో విమానాల్లో పోగైన మానవ వ్యర్థాలను నిల్వ చేసే సదుపాయం ఉందనీ, విమానాశ్రయాల్లో మాత్రమే వాటిని పడేస్తామని సెలవిచ్చింది. మరోవైపు.. ఫిర్యాదుదారు ఇల్లు, ఆ చుట్టుపక్కల భవనాలపై పడిన వ్యర్థాల నమూనాలు సేకరించి విచారిచేందుకు ఎన్జీటీ ఒక కమిటీని నియమించింది. విమానాశ్రయం చుట్టుపక్కల ఇళ్లపై పడిన వ్యర్థాలు టాయిలెట్ వ్యర్థాలేనని సదరు కమిటీ తేల్చింది. దీంతో మరోమారు ఈ విషయంపై ఎన్జీటీ రంగంలోకి దిగింది. నోటీసులను బేఖాతరు చేసిన డీజీసీఏపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై విధంగా స్పందించింది. -
రికార్డు బ్రేక్ చేసిన ఢిల్లీ ఎయిర్పోర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల టాప్ 20 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. ఆరు స్థానాలు పైకి ఎగిసిన ఈ ఎయిర్‌పోర్టు, 2017 జాబితాలో టాప్ 20లోకి చేరింది. జీఎంఆర్ గ్రూప్ నడిపే ఈ ఢిల్లీ విమానాశ్రయం 2016లో 22వ ర్యాంకును సాధించగా.. 2017లో 16వ ర్యాంకును సాధించినట్టు ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ఏసీఐ) ప్రకటించింది. ప్రయాణికుల రద్దీలో ఈ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా ఉందని పేర్కొంది. ఈ ర్యాంకింగ్‌లను 2017లో అత్యంత ఎక్కువగా ప్రయాణించిన ఎయిర్‌పోర్ట్‌ల ప్రిలిమినరీ ప్యాసెంజర్ ట్రాఫిక్ ఫలితాలను బట్టి ఏసీఐ విడుదల చేసింది. ప్యాసెంజర్ ట్రాఫిక్‌లో ఏడాది ఏడాదికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ 14.1 శాతం వృద్ధిని నమోదుచేసిందని తెలిపింది. ప్రస్తుతం 63.45 మిలియన్ల ప్యాసెంజర్ ట్రాఫిక్‌ను(బయలుదేరడం, చేరుకోవడం రెండింట్లో) ఈ ఎయిర్‌పోర్టు కలిగి ఉన్నట్టు పేర్కొంది. ఢిల్లీ మాత్రమే కాక కోల్కత్తా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు కూడా ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టులుగా ఉన్నాయని ఏసీఐ తెలిపింది. కాగ, ఏసీఐ విడుదల చేసిన ఈ ర్యాంకింగ్‌లో తొలి స్థానంలో హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. 103 మిలియన్ ప్యాసెంజర్లతో(బయలుదేరడం, చేరుకోవడం రెండింట్లో) అగ్ర స్థానంలో ఉంది. 2016 కంటే 0.3 శాతం ట్రాఫిక్ వాల్యుమ్ తగ్గినప్పటికీ, ప్యాసెంజర్ ట్రాఫిక్‌లో ఇదే ముందంజలో ఉండటం విశేషం. ప్రపంచంలోని ఎయిర్‌పోర్టులకు ఏసీఐ ట్రేడ్ అసోసియేషన్. ప్రస్తుతం 176 దేశాల్లో 1953 ఎయిర్‌పోర్టుల నుంచి 641 మెంబర్లను ఇది కలిగి ఉంది. ప్రపంచంలో అత్యంత రద్దీ గల ఎయిర్‌పోర్టుల ర్యాంకులతో పాటు, అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా ఏయే దేశాలు ఉండబోతున్నాయో ఏసీఐ అంచనాలు వెలువరిచింది. 2020 నాటికి అమెరికా, చైనాల తర్వాత భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా ఉండబోతుందని ఏసీఐ అంచనావేస్తోంది. -
అధికారులను వణికించిన పవర్ బ్యాంక్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులను పవర్ బ్యాంక్ కాసేపు వణికించింది. లగేజీ తనిఖీ సందర్భంగా ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో హ్యాండ్ గ్రెనేడ్ తరహా వస్తువు దర్శనమిచ్చింది. దీంతో ఉలిక్కి పడ్డ భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు గో ఎయిర్ సర్వీస్ ద్వారా వెళ్లేందుకు సదరు ప్రయాణికుడు సిద్ధమయ్యాడు. ఇంతలో అతని లగేజీలో హ్యాండ్ గ్రనేడ్ షేప్‌లో ఉన్న వస్తువు ఒకదానిని గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అదొక పవర్ బ్యాంక్ అని.. కావాలంటే పరిశీలించుకోండంటూ అధికారులను ఆ ప్రయాణికుడు కోరాడు. దీంతో రంగంలోకి దిగిన సాంకేతిక నిపుణులు అదొక పవర్ బ్యాంక్ అని తేల్చటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆపై అతన్ని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించారు. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో అలర్ట్ ప్రకటించిన అధికారులు అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా విస్తృతంగా తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
అవాక్కు.. ఫ్లైట్ ఉద్యోగిని బ్యాగులో రూ.3.21కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ మహిళా ఉద్యోగినిని ఢిల్లీ అధికారులు అరెస్టు చేశారు. అక్రమంగా రూ.మూడు కోట్ల విలువైన అమెరికా డాలర్లను పట్టుకెళుతున్న ఆమెను ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హాంకాంగ్‌కు చెందిన జెట్ ఎయిర్వేస్ విమానం సోమవారం రాత్రి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. డీఆర్ఐ అధికారులు ఆ సమయంలో తనిఖీ చేయగా జెట్ ఎయిర్వేస్ సిబ్బందిలోని ఒకరి వద్ద ఉన్న సూట్ కేసులో రూ.3.21కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు లభించాయి. దీంతో ఆమెను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుపై లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. -
ప్యాసింజర్ అరెస్ట్.. 326 సిల్వర్ కాయిన్లు స్వాధీనం
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐఏ)లో సిల్వర్ కాయిన్లతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని ఎయిర్ పోర్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుడి వద్ద నుంచి 320 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) పోలీసులు తెలిపారు. జే ఖాయిద్ అనే వ్యక్తి ఇండోర్ కు వెళ్లనున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఎయిర్ పోర్టులో బ్యాగులు తనిఖీ చేసే సమయంలో అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ అతడి లగేజీని చెక్ చేశారు. 6.1 కేజీల బరువున్న 326 సిల్వర్ కాయిన్లు ఉన్నట్లు డిటెక్టర్ తో గుర్తించారు. ఆ వెంటనే ఖాయిద్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ సిబ్బంది వివరించారు.