indira gandi
-
Fourth lok Sabha Elections-1967: కాంగ్రెస్ కోటకు బీటలు
తండ్రి నెహ్రూ వారసురాలిగా 1966లో ప్రధాని పీఠమెక్కిన ఇందిరాగాంధీ సరిగ్గా ఏడాది తిరిగే సరికి ప్రజాతీర్పు కోరాల్సిన పరిస్థితి! రాజకీయాల్లో ముక్కుపచ్చలారకపోయినా తొలిసారి ప్రజామోదం పొందడంలో ఆమె సక్సెసయ్యారు. కానీ సొంత పార్టీలో అసంతృప్తిని చల్లార్చలేకపోయారు. ధరల పెరుగుదల, మందగించిన వృద్ధి, ఉపాధి కల్పన వంటి సమస్యలకు తోడు పార్టీని కూడా చక్కదిద్దుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి! చివరికి సొంత పార్టియే బయటకు గెంటినా తట్టుకుని నిలవడమే గాక విపక్షాల మద్దతుతో అధికారాన్ని నిలబెట్టుకుని సంకీర్ణ శకానికి తెర తీశారు ఇందిర. ఇలా 1967–70 నాలుగో లోక్‌సభ ఎన్నో సంక్షోభాలకు సాక్షిగా నిలిచింది... చివరి జమిలి ఎన్నికలు లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలపై ఇప్పుడు దేశంలో పెద్ద చర్చే నడుస్తోంది. కానీ మనకిదేమీ కొత్త కాదు. 1967 దాకా వరుసగా నాలుగు పర్యాయాలు దేశమంతటా ఇదే విధానంలో ఎన్నికలు జరిగాయి. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు దీటైన ప్రతిపక్షం లేకపోవడంతో అక్కడా, ఇక్కడా పూర్తి పదవీకాలం పాటు ఆ పార్టీ ప్రభుత్వాలే రాజ్యమేలాయి. నెహ్రూ మరణానంతరం కాంగ్రెస్ కోటకు బీటలు మొదలయ్యాయి. ఇందిర సారథ్యంలో పార్టీ అస్మదీయ, తస్మదీయ వర్గాలుగా విడిపోయింది. దాంతో 1967 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం బాగా తగ్గిపోయింది. కేవలం 283 స్థానాలకే పరిమితమైంది. ఓట్ల శాతం కూడా 44.72 నుంచి 40కి తగ్గింది. ఏకంగా ఏడుగురు కేంద్ర మంత్రులు ఓటమి పాలయ్యారు. స్వతంత్ర పార్టీ ఏకంగా 44 చోట్ల గెలిచి లోక్‌సభలో అతి పెద్ద విపక్షంగా నిలిచింది. అఖిల భారతీయ జన్ సంఘ్ కూడా ఏకంగా 21 సీట్లు అదనంగా నెగ్గి బలాన్ని 35కు పెంచుకుంది. ప్రజా సోషలిస్ట్ పార్టీ 13 సీట్లకు పరిమితమైంది. 1964లో దాన్నుంచి చీలి జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో పుట్టుకొచి్చన సంయుక్త సోషలిస్ట్ పార్టీ 23 సీట్లు గెలిచింది. సీపీఐ ఆరు సీట్లు కోల్పోయి 23కు పరిమితమైంది. సీపీఐ నుంచి ఆవిర్భవించిన సీపీఎం 19 చోట్ల గెలిచింది. 9 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు లోక్‌సభతో పాటే జరిగిన అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే సగం రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ దక్కింది. యూపీలో ఎన్నికలైన నెల రోజులకే చరణ్‌సింగ్ కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టిల మద్దతుతో తాను సీఎంగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నుంచి నేతల బహిష్కరణలు, రాజీనామాలు ప్రాంతీయ పార్టిల ఆవిర్భావానికి దారితీశాయి. పశి్చమబెంగాల్, బిహార్, ఒడిశాల్లో కాంగ్రెస్ మాజీలు వేరుకుంపటి పెట్టుకుని ఆ పార్టీని ఢీకొట్టారు. ఏకంగా 9 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి! తమిళనాట డీఎంకే అధికారంలోకి వచ్చి ఈ ఘనత సాధించిన తొలి ప్రాంతీయ పార్టిగా నిలిచింది. మిగతా 8 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇందిర బహిష్కరణ 1969 నవంబర్ 12వ తేదీకి చరిత్రలో ప్రత్యేకత ఉంది. అదే రోజున ప్రధాని ఇందిరను కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు! పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని, వ్యక్తి ఆరాధనకు కేంద్రంగా మారారనే ఆరోపణలపై కాంగ్రెస్‌లోని ఇందిర వ్యతిరేక వర్గమైన “సిండికేట్’ ఈ చర్య తీసుకుంది. హిందీయేతర నాయకులతో, ముఖ్యంగా దక్షిణాది నేతలతో కూడిన ఈ వర్గంలో కీలక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.నిజలింగప్ప తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. సిండికేట్ వర్గానికి కామరాజ్ నాయకత్వం వహించారు. ఈ చర్యతో కాంగ్రెస్ రెండు ముక్కలైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని 705 మందిలో 446 మంది ఇందిర వెంట నడిచారు. ఆమె సారథ్యంలో కాంగ్రెస్ (ఆర్), సిండికేట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ (ఓ)గా పార్టీ చీలిపోయింది. లోక్‌సభలో మెజారిటీ కోల్పోయినా సీపీఎం, డీఎంకే, సీపీఐ దన్నుతో ఇందిర సర్కారు మనుగడ సాగించింది. ఎన్నెన్నో విశేషాలు... ► 1967 లోక్‌సభ ఎన్నికల్లో 61.1 శాతం ఓటింగ్ పోలైంది. మన దేశంలో అప్పటిదాకా నమోదైన గరిష్ట పోలింగ్ ఇదే. ► ఐదేళ్ల కాలం పూర్తి చేసుకోని తొలి లోక్‌సభ కూడా ఇదే. 1970 డిసెంబర్లో 15 నెలల ముందే రద్దయింది. ► రెండు వరుస యుద్ధాలు, రెండేళ్లు వరుసగా వానలు మొహం చాటేయడంతో పంటల దిగుబడి 20 శాతానికి పైనే తగ్గి ఆహార ధాన్యాలు అడుగంటాయి. ► దిగుమతులకు చెల్లింపుల సామర్థ్యం మరింత క్షీణించింది. ఆహారం కోసం అమెరికా రుణ సాయం తీసుకోవాల్సి వచి్చంది. ► స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా డాలర్‌తో రూపాయి విలువను ఎన్నికల ముందు 4.76 నుంచి 7.5కి తగ్గించారు. ► హరిత విప్లవం ఊపందుకోవడంతో 1971 కల్లా పంటల దిగుబడి 35 శాతం పెరిగింది. ► రాష్ట్రాల సంఖ్య 27కు పెరిగింది. దాంతో లోక్‌సభ స్థానాలు 494 నుంచి 520కి పెరిగాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Union Budget 2023: అరుదైన ఘనత నిర్మలా సీతారామన్ సొంతం.. అదో రేర్ రికార్డ్!
ప్రతి ఏటా వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్రప్రభుత్వం (Central Government) ప్రవేశపెడుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ వార్షిక బడ్జెట్‌ను తయారు చేస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. అయితే ఈ బడ్జెట్‌కి సంబంధించి నిర్మలా సీతారామన్ ఓ అరుదైన ఘనత సాధించారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం! తొలి మహిళగా రికార్డ్.. ఆమె సొంతం కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను గత నాలుగేళ్లుగా ప్రవేశపెడుతున్నారు. ఆమెకు వరుసగా ఇది ఐదో బడ్జెట్. ఇంతవరకు నాలుగు బడ్జెట్లను ప్రవేశపెట్టిన మహిళ ఆర్థిక మంత్రి ఎవ్వరూ లేరు. గతంలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగా ఇందిరాగాంధీ చరిత్ర సృష్టించారు. కాగా ఈ రికార్డు కొన్నేళ్లు చెక్కు చెదరకుండా అలానే ఉండిపోయింది. అంతేకాకుండా భారత తొలి మహిళా ఆర్థిక మంత్రి ఇందిరనే. 1969లో మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా రాజీనామా చేయడంతో ప్రధాన మంత్రిగా ఉంటూ ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇంధిరా గాంధీ తర్వాత రెండో మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఎక్కువ సార్లు(నాలుగు సార్లు) బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. -
మహోజ్వల భారతి: జూన్ 12 ‘జడ్జ్’మెంట్
జూన్ 12 జడ్జ్మెంట్ 1971లో రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో రాజ్ నారాయణ్‌పై గెల్చిన ఇందిరాగాంధీ విజయాన్ని సవాలు చేస్తూ రాజ్‌నారాయణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. ఆమె ఎన్నిక చెల్లదని, తరువాత 6 సంవత్సరాల వరకు ఇందిరాగాంధీ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనరాదని అలహాబాదు హైకోర్టు జడ్జి జగ్మోహన్లాల్ సిన్హా 1975 జూన్ 12న తీర్పు ఇచ్చారు. దీనిపై ఇందిరాగాంధీ అత్యున్నత న్యాయస్థానంలో స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దాంతో ప్రతిపక్ష నాయకులు, ఆమె వ్యతిరేకులు కలిసి పెద్ద ర్యాలీని నిర్వహించాలని; పోలీసులను, అధికార యంత్రాంగాన్ని ఇందిరకు తమ అవిధేయతను తెలియజేయాల్సిందిగా కోరదలిచారు. ఈ సంగతిని పసిగట్టిన ఇందిర పరిస్థితిని చేజారనీయకుండా అదుపులోకి తీసుకురావాలని దేశంలో ఎమర్జెన్సీకి రంగం సిద్ధం చేశారు. అప్పటి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 వ ఆర్టికల్ ప్రకారం 1975 జూన్ 25న అత్యయిక స్థితిని ప్రకటించారు. జడ్జి జగ్మోహన్లాల్ సిన్హా ఆనాడు ఇచ్చిnన తీర్పు సాహసోపేతమైనదని ఇటీవల ఒక సందర్భంలో సీజేఐ రమణ ప్రశంసించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఇందిర ఎన్నికను చెల్లకుండా చేసిన ఈ తీర్పు దేశంలో ఒక కుదుపు తెచ్చిందన్నారు. అక్కడి నుంచి అనేకమంది గొప్ప న్యాయవాదులు, న్యాయమూర్తులు వచ్చారన్నారు. దీననాథ్ గోపాల్ టెండూల్కర్ రచయిత, డాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు. మహాత్మా గాంధీపై ‘లైఫ్ ఆఫ్ మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ’ అనే ఎనిమిది సంపుటాల గ్రంథాన్ని రాశారు. గాంధీజీకి సన్నిహిత అనుచరుడు, ఫిల్మ్ మేకర్ అయిన విఠల్‌భాయ్ జవేరీతో కలిసి ‘మహాత్మ : లైఫ్ ఆఫ్ గాంధీ, 1869–1948’ అనే డాక్యుమెంటరీని తీశారు. మహాత్మ గాంధీపై ఆయన గాంధీ ఇన్ చంపారన్, గాంధీజీ : హిజ్ లైఫ్ అండ్ వర్క్స్ అనే పుస్తకాలు కూడా రాశారు. దీననాథ్ 1972 జూన్ 12న మరణించారు. ఆయన జన్మస్థలం మహరాష్ట్రలోని రత్నగిరి. -
మాజీ డీజీపీ ఆనందరాం కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ, దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య కేసును ఛేదించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎస్. ఆనందరాం (97) శుక్రవారం హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలోని తన నివాసంలో కన్ను మూశారు.1950లో సివిల్ సర్వీస్‌లో చేరిన ఆనందరాం 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా సేవలందించారు.ఆనందరాం రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగంలో పనిచేసి ఎన్నో కేసులు ఛేదించారు. ఆయన ఉత్తమ సేవలకు గాను 1962లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ మెడల్, 1975లో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 1978 –81 వరకు విశాఖ షిప్‌యార్డు సీఎండీగా, అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ వైస్ చైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్‌కు సేవలందించారు. ఆయనకు 1987లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయన 1984లో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్‌గా ఢిల్లీలో పనిచేస్తున్న సమయంలో ఇందిరాగాంధీ హత్య కేసును దర్యాప్తు చేసేందుకు నియమించిన ‘సిట్’కు నాయకత్వం వహించారు. అనంతరం ఆనందరాం ‘అసాసినేషన్ ఆఫ్ ఏ ప్రైమినిస్టర్’పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించారు. కాగా ఆనందరాం మరణ వార్త తెలిసిన వెంటనే డీజీపీ మహేందర్‌రెడ్డి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.ఆనందరాం భౌతికకాయానికి శనివారం ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమారుడు శ్రీకాంత్ తెలిపారు. -
మెదక్‌తో ఇందిరాగాంధీ అనుబంధం
మెదక్ అర్బన్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1980లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొంది ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇందిరా మరణాంతరం ఆమె స్మారకార్థం ప్రభుత్వం పట్టణంలో ఓ పోస్ట్ఆఫీస్ నిర్మించి ఇందిరాగాంధీ భవన్ అని పేరు పెట్టింది. మూడు అంతస్తులతో రాతితో నిర్మితమైన ఈ భవనం మెదక్ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ అతిథి గృహంలోనే ఇందిర విశ్రాంతి.. నాటి ఎన్నికల సమయంలో ప్రచారానికి ఇందిరా వచ్చినప్పుడు ప్రస్తుత జూనియర్ కళాశాల మైదానంలో హెలికాప్టర్ దిగి.. అనంతరం దగ్గరలోని అతిథి గృహానికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. ఆ సమయంలో పటిష్టమైన భారీ బందోబస్తు ఉండడంతో ఆమెను స్థానిక నాయకులు సైతం కలవడం కష్టంగా ఉండేది. పట్టణంలోని చిల్డ్రన్స్‌పార్కులో నిర్వహించిన బహిరంగ సభలో ఇందిరా మాట్లాడారు. -
కేజ్రీవాల్‌కు ఆప్ ఎమ్మెల్యే హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ చేరితే పార్టీకి రాజీనామా చేస్తానని ఆప్ ఎమ్మెల్యే, సీనియర్ న్యాయవాది హెచ్ ఎస్ పుల్కా తెలిపారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను బహిరంగంగానే హెచ్చరించారు. కాంగ్రెస్‌కు తాను వ్యతిరేకమని తేల్చి చెప్పారు. 1984లో సిక్కులపై కాంగ్రెస్ జరిపిన దాడులు త్రీవమైన విషయమన్నారు. ఆ కేసు తనకు చాలా ముఖ్యమైనదని చెప్పారు. ఆప్ కనుక కాంగ్రెస్ కూటమిలో చేరితే తాను పార్టీకి రాజీనామా చేస్తానని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి అరవింద్ కేజ్రివాల్ హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో కలిసి కేజ్రీవాల్ వేదిక పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పుల్కా ఈ హెచ్చరిక చేశారు. 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య అనంతరం సిక్కులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో వేలాదిమంది సిక్కులు బాధితులయ్యారు. వారికి న్యాయం చేయడానికి పుల్కా పోరాటం చేశారు. ఆయన గత ఏడాది పంజాబ్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. -
ఇందిర, రాజీవ్‌కు పిండ ప్రదానం
వరంగల్ : వరంగల్ జిల్లాలోని మంగపేట పుష్కరఘాట్‌లో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు, శాప్ మాజీ డెరైక్టర్ రాజనాల శ్రీహరి పిండ ప్రదానాలు చేశారు. మంగళవారం పుష్కర స్నానానికి మంగపేట వెళ్లిన ఆయన పుష్కర ఘాట్‌లో ఇందిర, రాజీవ్ ఆత్మలకు శాంతి చేకూరాలని పిండ ప్రదానం చేసినట్లు తెలిపారు.