సేవతోనే ప్రజలకు చేరువ : బాలకృష్ణ
నిమ్మకూరు(గుడివాడ), న్యూస్‌లైన్ : సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతానని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ చైర్మన్, సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా రూ.3లక్షల వ్యయంతో నిర్మించిన మంచినీటి ఆర్వో ప్లాంటును ఆయన శనివారం ప్రారంభించారు.
శుక్రవారం రాత్రి స్వగ్రామం నిమ్మకూరు చేరుకున్నారు. ఆయన బంధువు గ్రామ ఉపసర్పంచి నందమూరి శివరామకృష్ణ ఇంట్లో ఉన్నారు. శనివారం ఉదయం 8గంటల సమయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గ్రామంలో శ్రీపద్మావతి,గోదాదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో ఆయన పూజలు నిర్వహించారు. బాలకృష్ణ తల్లిదండ్రులు, ఆయన భార్యతోపాటు కుమారుడు మోక్షజ్ఞ తారకరామతేజ, అల్లుళ్లు- కూతుర్లు లోకేష్, బ్రాహ్మణి, శ్రీభరత్, తేజశ్వినీ, బావ చంద్రబాబునాయుడు, భువనేశ్వరీ పేర్లతో పూజలు జరిపారు.
ఎన్టీఆర్, బసవతారకంల విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. రానున్న కాలంలో అభిమానులను సేవా కార్యక్రమాల్లో నిమగ్నం చేసేందుకు గానూ తన ఆధ్వర్యంలో ఎన్బీకే ట్రస్టును ప్రారంభించనున్నట్లు వివరించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి వీ రామయ్య, ఎన్టీఆర్ ట్రస్టు సీఈఓ చల్లా కొండయ్య, విజయవాడ టీడీపీ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, బందరు మున్సిపల్ మాజీ చైర్మన్ బచ్చుల అర్జునుడు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పొట్లూరి కృష్ణబాబు, గుడివాడ టీడీపీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు, టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకటగురుమూర్తి, తెలుగు రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, నాయకులు మండపాక శంకరబాబు, గొట్టిపాటి లక్ష్మీదాసు, ఈడ్పుగంటి వెంకట్రామయ్య, నందమూరి శివరామకృష్ణ. గ్రామసర్పంచి జంపాని వెంకటేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పామర్రు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుత్తికొండ పద్మ, కుదరవల్లి ప్రవీణ్‌కుమార్, జిల్లా బీసీ నాయకులు పొనిపిరెడ్డి శ్రీహరి, పామర్తి విజయశేఖర్, ఎన్.కిరణ్‌కుమార్, అనగాని మురళి పాల్గొన్నారు.