Indo-tibet border
-
పాంగాంగ్ సరస్సు సమీపంలో చైనా పాగా!
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో చైనా మళ్లీ భారీ నిర్మాణాలు చేపట్టింది. పాంగాంగ్ త్సో సరస్సు ఉత్తరముఖాన ఏకంగా 100 పైగా నిర్మాణాలను చేపట్టింది. సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసే దిశగా చైనా ఈ నిర్మాణాలను చేపట్టిందని భావిస్తున్నారు. శిఖరాల మాటున తమ నియంత్రిత టిబెట్ భూభాగంలో నిర్మిస్తున్న ఈ సైనిక స్థావరం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. చట్టూ కొండలు ఉండటం మూలాన.. భూమి పైనుంచి దీనిపై నిఘా వీలుకాదు. చైనా సైన్యానికి ఫార్వర్డ్ బేస్ (సరిహద్దులకు సమీపంలో సైనిక మొహరింపునకు వీలు కల్పించే నిర్మాణం)గా పనికి వస్తుంది. టిబెట్– భారత్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు వద్ద 2020లో భారత్, చైనా సైన్యానికి ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ప్రతిష్టంభన నెలకొన్న ప్రదేశానికి తూర్పున 38 కిలోమీటర్ల దూరంలో చైనా 100 పైగా నిర్మాణాలను చేపట్టినట్లు ఉపగ్రహచిత్రాల్లో తేలింది. అమెరికాకు చెందిన మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ తీసిన ఈ ఉపగ్రహచిత్రాల్లో 17 హెక్టార్ల విస్తీర్ణంలో శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తక్షశిల ప్రొఫెసర్ వై.నిత్యానందం వెల్లడించారు. యెమగౌ రోడ్డులో 4,347 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దీర్ఘచతురస్రాకారంలో 150 మీటర్ల పొడవైన ఎయిర్‌స్ట్రిప్ ఉందని, దీన్ని హెలికాప్టర్ల రాకపోకలకు వాడే ఉద్దేశం ఉండొచ్చని నిత్యానందం తెలిపారు. ఒక్కో దాంట్లో ఆరు నుంచి ఎనిమిది మంది నివసించే విధంగా భవనాలను కడుతున్నారని వివరించారు. రెండు పెద్ద భవనాలు ఉన్నాయని.. వీటిలో ఒకటి పాలనా కార్యాలయంగా, మరొకటి గిడ్డంగిగా వాడే అవకాశాలున్నాయని తెలిపారు. ఒక వరుస క్రమంలో కాకుండా గజిబిజిగా ఈ నిర్మాణాలు చేపడుతున్నారని, భవిష్యత్తులో క్షిపణిదాడులు జరిగితే నష్టం తీవ్రత తగ్గించేందుకే ఇలా చేస్తుండవచ్చని వివరించారు. పాంగాంగ్ సరస్సు భారత్– టిబెట్లను వేరు చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఉప్పునీటి సరస్సు. -
దేశాన్ని రక్షించేందుకే వచ్చాం!
ఇటానగర్: ఇండో-టిబెట్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ జిల్లాలోని చునాలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ ఖండూ మూడు రోజులు పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా అరుణాచల్ స్కౌట్స్‌కు చెందిన జవాన్లుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రేమ్ ఖండూ మాట్లాడుతూ..."ఈ సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ నిమిత్తం ఇండో టిబెట్ సరిహద్దుని 2010లో దివంగత దోర్జీ ఖండూజీ ఏర్పాటు చేశారు" అన్న విషయాన్ని గుర్తు చేశారు. (చదవండి: చీరకట్టు ‘ప్రియుడు’.. ఇది ఏ ఫ్యాషనో తెలుసా?) ఈ మేరకు ప్రేమ్ ఖండూ గౌరవార్థం భారత జవాన్లు "ఉత్తర్ పురబ్ సే ఆయే హమ్ నౌజవాన్, దేశ్ కీ రక్షా కర్నే ఆయా హై(ఈశాన్య ప్రాంతాల నుంచి వచ్చిన యువతరం దేశాన్ని రక్షించేందుకు వచ్చాం)" అనే పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ చక్కటి ప్రదర్శన ఇచ్చారు. అంతేకాదు ఖండూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు భారత ఆర్మీని రకరకాలు ప్రశంసిస్తూ ట్విట్ట్ చేశారు. (చదవండి: కోతి కళ్లుజోడుని ఎలా తిరిగి ఇచ్చిందో చూడండి!) उत्तर पूरब से आए हम नौजवान देश की रक्षा करने आया है। A regimental song of #ArunachalScouts performed during my visit to Chuna in Tawang district. First raised in 2010 at the instance of former Arunachal CM late Dorjee Khandu Ji, it was established to defend Indo-Tibet border. pic.twitter.com/KVsJFdUybr — Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) October 28, 2021 -
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు..
రాఖీ పౌర్ణమి సందర్భంగా భారత జవాన్లకు రాఖీలు వెల్లువెత్తాయి. సరిహద్దు గ్రామల యువతులు పెద్ద ఎత్తున సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదరికి రక్షణగా సోదరుడు.. సోదరుడికి రక్షణగా సోదరి అనే ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగని.. దేశానికి రక్షణాగా ఉండే జవాన్లతో సరిహద్దుల సోదరిమణులు జరుపుకుంటున్నారు.15000 అడుగులో ఎత్తులో ఉన్న ఇండో-టిబెట్ బోర్డర్ లడఖ్‌లోని సైనికులకు స్థానికులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.