సెమీస్లో ప్రణయ్ ఓటమి
జకర్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో వరుసగా రెండు సంచలన విజయాలు సాధించిన భారత ఆటగాడు హెచ్ ఎస్ ప్రణయ్ పోరాటం సెమీ ఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో 25వ ర్యాంకర్ ప్రణయ్ 21-17, 26-28, 18-21 తేడాతో సకాయ్(జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు.
తొలి గేమ్ ను గెలిచి మంచి ఊపు మీద కనిపించిన ప్రణయ్.. ఆపై వరుస రెండు గేమ్లను చేజార్చుకున్నాడు. చివరి రెండు గేమ్ ల్లో ప్రణయ్ పోరాడినా ఓటమి నుంచి గట్టెక్కలేకపోయాడు. దాంతో టోర్నీ నుంచి భారంగా నిష్ర్కమించాడు.