సూర్యాపేటకు ‘స్వచ్ఛ పురస్కార్’
సూర్యాపేట: పట్టణంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో కేంద్ర ప్రభుత్వం గుర్తించి సూర్యాపేట మున్సిపాలిటీకి స్వచ్ఛ పురస్కార్ ఇండోస్యాన్–2016 అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. అదే విధంగా శనివారం జరగనున్న వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొననున్నారు.