Indra service
-
ఆధునిక సౌకర్యం..సురక్షిత ప్రయాణం..
కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీవారు ఆధునిక సౌకర్యాలతో కూడిన అమరావతి, ఇంద్ర సర్వీస్‌లను నడుపుతూ ప్రయాణికుల మన్ననలు పొందుతున్నారు. కడప డిపో నుంచి బెంగుళూరుకు విజయవంతంగా ‘అమరావతి’ బస్సు సర్వీస్‌ను 2016 జనవరి నుంచి నడుపుతున్నారు. అమరావతి బస్సు సర్వీస్ కడప – బెంగళూరు అమరావతి బస్సు సర్వీస్‌లో ఆధునిక సౌకర్యాలున్నాయి.సెమీస్లీపర్ సీట్ల అమరిక, ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించే విధంగా వుంది. ♦ ప్రతి రోజూ కడప నుంచి అమరావతి సర్వీస్ మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరుతుం ది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు నుంచి కడపకు మరో బస్సు బయలుదేరుతుంది. ♦ ప్రతి రోజూ రాత్రి కడప నుంచి బెంగళూరుకు 11:45 గంటలకు బయలుదేరుతుంది. బెంగుళూరు నుంచి కడపకు రాత్రి 11:30 గంటలకు బయలుదేరుతుంది. ♦ ఈ సర్వీస్‌లో ఛార్జి రూ.638గా చెల్లించాలి. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం వుంది. రిజర్వేషన్ చేయించుకున్న వెంటనే సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ వస్తుంది. సర్వీస్ బయలు దేరు సమయానికి అరగంట నుంచి గంటలోపు కండక్టర్/డ్రైవర్ సెల్ నెంబర్లు సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి. ఏదైనా సమస్యలు తలెత్తినా, ఆయా సెల్ఫోన్లకు సమాచారం ఇవ్వవచ్చును. ఇంద్ర బస్సు సర్వీస్‌లు ♦ ఏపీఎస్ ఆర్టీసీ వారు ఆధునిక సౌకర్యాలతో కడప నుంచి ఇంద్ర బస్సులను 2012 నుంచి ప్రారంభించారు. ♦ కడప– విజయవాడకు రాత్రి 9:00 గంటలకు బయలుదేరుతుంది. ఛార్జి రూ. 685గా చెల్లించాలి. ♦ కడప– బెంగళూరుకు ఉదయం 10:30, రాత్రి 11:00 గంటలకు బయలుదేరుతుంది. ఈ బస్సులో ఛార్జి రూ. 460గా వసూలు చేస్తున్నారు. ♦ కడప –చెన్నైకి రాత్రి 11:45 గంటలకు వెళుతుంది. ఛార్జి రూ. 387గా చెల్లించాలి. ♦ కడప– హైదరాబాద్ (మియాపూర్)– రాత్రి 10:30 గంటలకు వెళుతుంది. ఛార్జి రూ. 741గా చెల్లించాలి. ప్రయాణికుల సురక్షితమే ధ్యేయంగా సర్వీస్‌లు : ప్రైవేట్ బస్సు సర్వీస్‌లకు ధీటుగా ఆధునిక సౌకర్యాలతో అమరావతి, ఇంద్ర సర్వీస్‌లను విజయవంతంగా నడుపుతున్నాం. పుష్ఆప్ బ్యాక్ సెమీస్లీపర్ సీట్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా వున్నాయి. ప్రయాణికుల ఆహ్లాదం కోసం, ఎల్ఈడీ టీవీల్లో చలనచిత్రాల ప్రదర్శన రెగ్యులర్‌గా ఉంటుంది. ఏసీ సౌకర్యం ఉంటుంది. ప్రయాణికుల్లో ఆదరణ పెరుగుతోంది. ప్రతీ రోజూ ఈ రెండు బస్సులలో ఉన్న సీట్లన్నీ నిండుతాయన్నారు. ఏవైనా అసౌకర్యాలు కలిగినచో వెంటనే కడప ఆర్టీసీ బస్టాండ్ విచారణ కేంద్రం ఫోన్ నెంబర్: 08562– 244160కు సమాచారం ఇవ్వాలి. – గిరిధర్ రెడ్డి, కడప డిపోమేనేజర్ -
జాతీయ రహదారిపై మంటల్లో ‘ఇంద్ర’
విజయవాడ(బస్‌స్టేషన్): జాతీయ రహదారిపై ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సుకు నిప్పంటుకుంది. సేకరించిన వివరాల ప్రకారం చిలకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇంద్రా సర్వీసు (ఏపీ 07 జెడ్ 0101) చిలకలూరిపేట నుంచి గుంటూరు మీదుగా విజయవాడకు ఉదయం 40 మంది ప్రయాణికులతో బయల్దేరింది. గుంటూరులో సుమారు 30 మంది దిగిపోగా అక్కడ నుంచి సుమారు పదిహేను మంది ప్రయాణికులతో బస్సు నగరానికి వచ్చింది. వారధి సమీపంలో మరికొంతమంది దిగిపోగా, ఏడుగురు ప్రయాణికులతో పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు చేరుకోవాల్సి ఉంది. డ్రైవర్ ఎం.ఎస్.నాయక్ బస్సులో వాసన రావడంతో బస్టాండ్ గ్యారేజీలో చూపాలని బస్సును పోనిచ్చాడు. కృష్ణలంక స్వర్గపురి సమీపంలోకి చేరుకోగానే బస్సులో పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై ఇంజన్‌ను ఆఫ్‌చేసి ప్రయాణికులను కిందకు దిగమని చెప్పాడు. చూస్తుండగానే బస్సులో మంటలు రేగి ఎదుటభాగం అగ్నికి ఆహుతయ్యింది. అది శీతలీకరణ బస్సు కావడంతో సిలిండర్లు ఉన్నందున పేలుతుందన్న భయంతో ఫైర్సర్వీసుకు ఫోన్ చేశారు. వారు సంఘటానా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.45వేల నష్టం సంభవించినట్లు అంచనా వేశారు. సంఘటనా స్థలానికి అధికారులు... ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి ఆర్టీసీ అధికారులు ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్లు ఎన్.వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, ఇన్చార్జ్ రీజనల్ మేనేజర్ నాగేంద్రప్రసాద్, సీటీఎంలు శ్రీరాములు, జాన్‌సుకుమార్, కృష్ణలంక సీఐ మూర్తి, ఎస్ఐ రమేష్ చేరుకుని పర్యవేక్షించారు. -
మంటల్లో ‘ఇంద్ర’
చిలకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ ఇంద్ర బస్సు రోడ్డుపై దగ్ధమైంది. గుంటూరు మీదుగా విజయవాడ వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది విజయవాడ(బస్‌స్టేషన్) : జాతీయ రహాదారిపై ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సుకు నిప్పంటుకుంది. సేకరించిన వివరాల ప్రకారం చిలకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇంద్రా సర్వీసు (ఏపీ 07 జెడ్ 0101) చిలకలూరిపేట నుంచి గుంటూరు మీదుగా విజయవాడకు ఉదయం 40 మంది ప్రయాణికులతో బయల్దేరింది. గుంటూరులో సుమారు 30 మంది దిగిపోగా అక్కడ నుంచి సుమారు పదిహేను మంది ప్రయాణికులతో బస్సు నగరానికి వచ్చింది. వారధి సమీపంలో మరికొంతమంది దిగిపోగా, ఏడుగురు ప్రయాణికులతో పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు చేరుకోవాల్సి ఉంది. డ్రైవర్ ఎం.ఎస్.నాయక్ బస్సులో వాసన రావడంతో బస్టాండ్ గ్యారేజిలో చూపాలని బస్సును పొనిచ్చాడు. కృష్ణలంక స్వర్గపురి సమీపంలోకి చేరుకోగానే బస్సులో పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై ఇంజన్‌ను ఆప్‌చేసి ప్రయాణికులను కిందకు దిగమని చెప్పాడు. చూస్తుండగానే బస్సులో మంటలు రేగి ఎదుటభాగం అగ్నికి ఆహుతయ్యింది. అది శీతలీకరణ బస్సు కావడంతో సిలిండర్లు ఉన్నందున పేలుతుందన్న భయంతో ఫైర్సర్వీసుకు ఫోన్ చేశారు. వారు సంఘటానా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.45వేల నష్టం సంభవించినట్లు అంచనా వేశారు. సంఘటనా స్థలానికి అధికారులు... ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి ఆర్టీసీ అధికారులు ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్లు ఎన్.వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, ఇన్చార్జ్ రీజనల్ మేనేజర్ నాగేంద్రప్రసాద్, సీటీఎంలు శ్రీరాములు, జాన్‌సుకుమార్, కృష్ణలంక సీఐ మూర్తి, ఎస్ఐ రమేష్ చేరుకున్నారు.