Indrajit
-
అప్పుడు ఆప్తుడే.. మరిప్పుడో..!!!
Chaganti Koteswara Rao: కమలములు నీటబాసిన/కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్/ తమ తమ నెలవులు దప్పిన/ తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ...అన్నాడు బద్దెన సుమతీ శతకంలో. నీళ్ళల్లో ఉన్న తామర మొగ్గ విచ్చుకోవడానికి కారణమయిన సూర్యనారాయణుడు, అదే తామరతూడును నీళ్ళల్లో నుంచి తీసి ఒడ్డున పెడితే ...ఆయన వాడివేడి కిరణాలు సోకి అది వాడిపోతుంది, కమలాప్తుడు అంటే నీళ్ళల్లో ఉన్న కమలానికి బంధువు, నీళ్ళనుంచి బయటికి వచ్చిన పిదప శత్రువయిపోయాడు. విభీషణుడు రావణునికి సోదరుడు. కానీ ఎప్పుడూ ధర్మంవైపే నిలబడతాడు. అన్నగారు అధర్మానికి పాల్పడినప్పుడల్లా హెచ్చరిస్తూ ఉంటాడు. అలా చెప్పే వారు మన శ్రేయోభిలాషులని గుర్తించకపోతే చాలా ప్రమాదకరం. హనుమ రాయబారం తరువాత రావణాసురుడు కోపంతో హనుమ కంఠాన్ని నరికేయమన్నాడు. ఆయన్ని సంహరించబోతున్నారు. విభీషణుడు జోక్యం చేసుకొన్నాడు. ‘అన్నయ్యా! నీకు తెలియని ధర్మం లేదు కదా... అతను దూత. ఎవరో చెప్పి పంపినవి ఆయన చెబుతున్నాడు. అవి దూత అభిప్రాయాలు కావు కదా. దూత పరిధి దాటాడనిపిస్తే స్వల్పంగా శిక్షించవచ్చు. అంతేకానీ సంహరిస్తానంటే ఎలా..? పైగా నీవితన్ని సంహరిస్తే నీ అభిప్రాయాలు అవతలివారికి ఎలా చేరవేయగలవు? కాబట్టి వద్దు.. అన్నాడు. రావణుడు నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అటువంటి ధర్మాత్ముడు పక్కన ఉన్నంతకాలం ... ఉపద్రవాలు ప్రాణాంతకం కాకుండా ఉన్నాయి. కానీ తరువాత జరిగిన పరిణామాలవల్ల విభీషణుడు రాముడి పక్కన చేరిపోయాడు. ఇంద్రజిత్తు రాముడిపై యుద్ధానికి బయలుదేరుతున్నాడు. బ్రహ్మగారు ఒకానొకప్పుడు ఆయనకు వరం ఇస్తూ...‘‘నికుంభిలా (దట్టమైన అడవిలో ఉన్న ఒక దేవాలయం. అక్కడికి చేరుకోవడం చాలా ప్రమాదకరం) కు వెళ్ళి హోమం చెయ్యి. దానిలోంచి వచ్చిన రథం మీద కూర్చొని యుద్ధానికి బయల్దేరితే... నువ్వు మేఘాలలో ఉండి దుర్నిరీక్షవుడవుతావు. నిన్ను యుద్ధంలో గెలవడం ఎవరికీ సాధ్యం కాదు.’’ అని వరమిస్తూనే...‘‘నువ్వు నికుంభిలా చేరకపోయినా, చేరి హోమాన్ని పూర్తి చేయలేక పోయినా, నువ్వు ఆయుధాన్ని ధరించి ఉండగా నీపై యుద్ధానికి వచ్చినవాడే నీ ప్రాణాలను హరిస్తాడని గుర్తించు’’ అని హెచ్చరించాడు. ఈ రహస్యం విభీషణుడికి తెలుసు. ఇప్పుడాయన రాముడి పక్షంలో ఉన్నాడు. అదంతా రాముడికి తెలిపి... ఇపుడు ఇంద్రజిత్తు నికుంభిలా చేరుకున్నాడు... అని కూడా చెప్పి రాముడి ఆజ్ఞతో లక్ష్మణస్వామిని తీసుకొని వెళ్ళాడు. ఇంద్రజిత్తు హోమాన్ని మధ్యలోనే ఆపేసి యుద్ధానికి వచ్చాడు. ఆ తరువాత లక్ష్మణుడి చేతిలో చచ్చాడు. అంటే విభీషణుడు స్థానం తప్పిన కారణంగా లంకకు, రావణాసురుడికి చేటు వచ్చింది. అందుకే బద్దెన చెప్పింది.. ఒక్కొక్కసారి ఒక్కొక్కస్థానంలో మిత్రుడిగా ఉన్నవాడు, స్థానం తప్పితే శత్రువయిపోతాడు. మన పక్కన ఉన్నవారిలో మన శ్రేయస్సు కోరి కొన్ని కఠినమైన సలహాలు ఇచ్చినా, వాటిని పరిశీలించి ఓర్పుతో, విచక్షణతో మసలుకొన్నప్పుడు అవాంఛిత ప్రమాదాలు మాత్రం ఎదురుకాకుండా ఉంటాయన్నదే బద్దెన ఇస్తున్న సలహా. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: మంచి మాట..: ఏది నిజమైన సంపద? -
అంగద రాయబారం...
వారధి మీదుగా వానర సైన్యంతో రాముడు లంకకు చేరుకున్న తర్వాత యుద్ధం లేకుండా ఉండేందుకు సీతను తనకు అప్పగించాలంటూ అంగదుడి ద్వారా రావణుడికి రాయబారం పంపుతాడు. రాముడి మాట మేరకు అతడు నానా విధాలుగా రావణుడికి నచ్చజెబుతాడు. రావణుడు యుద్ధంలో తలపడతానే తప్ప సీతను అప్పగించేది లేదని భీష్మిస్తాడు. స్వయంగా యుద్ధంచేసే శక్తిలేక కోతిమూకను వెంటేసుకొచ్చాడంటూ రాముడిని తూలనాడతాడు. రావణుడి వాచాలతకు తిక్క రేగిన అంగదుడు బలప్రదర్శను సిద్ధపడతాడు. రావణుడి వర్గంలో ఎవరైనా తన కాలు కదపగలిగితే చాలు, సీత లేకుండానే రామలక్ష్మణులు సహా వానర సైన్యం ఓటమిని అంగీకరించి వెనుదిరుగుతుందని సవాలు చేస్తాడు. రావణుడి కొడుకు ఇంద్రజిత్ సహా రాక్షస వీరులెవ్వరూ అంగదుడి కాలు కదపలేకపోతారు. ఇక ఉక్రోషం పట్టలేక రావణుడే అంగదుడి కాలు కదపడానికి దగ్గరకు వస్తాడు. అంగదుడు తటాలున కాలు వెనక్కు లాగేసుకొని, రావణుడి కిరీటాన్ని తన్ని గాల్లోకి ఎగురుతాడు. తన కాళ్లపై పడటం కంటే, రాముడి కాళ్లపై పడి శరణు కోరుకోమని హితవు చెబుతాడు. రాక్షస యోధులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేసేలోగానే అక్కడి నుంచి ఎగిరిపోయి, రాముడి వద్దకు చేరుకుంటాడు. ప్రత్యర్థి వద్దకు రాయబారానికి వెళ్లిన దూత సందేశాన్ని మాత్రమే చెప్పి రాకుండా, బలం రుచి చూపించి, బెదిరించి మరీ రావడం అంగద రాయబారంగా వాడుకలో స్థిరపడింది. -
గంటా శ్రీను కుమారుడికి బెయిల్ మంజూరు
తెలుగుదేశం పార్టీ నేత,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజకు బెయిల్ మంజూరైంది. రాజేంద్ర నగర్ కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసింది. రవితేజ, అతని ఇంద్రజిత్ కలిసి మద్యం సేవించి సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ అభ్యంతరకరంగా ప్రవర్తించడంతో పాటు పుష్ఫక్ బస్సు కండక్టర్‌పై దౌర్జన్యం చేయడంతో పోలీసులు ఇరువురినీ అరెస్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్జీఐఏ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. రమేష్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవితేజ, ఇంద్రజిత్‌పై ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరినీ అత్తాపూర్‌లోని మేజిస్ట్రేట్ ఇంట్లో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే, మంగళవారం నాడు రవితేజకు కోర్టు బెయిల్ మంజూరుచేసింది. -
గంటా తనయుడు రవితేజకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ, అతని స్నేహితుడు ఇంద్రజిత్‌లకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సోమవారం రాత్రి మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. కాగా రాత్రి సమయం కావడంతో వారిని మేజిస్ట్రేట్ వద్ద నుంచి శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉదయం వారిని జైలుకు తరలించే అవకాశం ఉంది. రవితేజ మద్యం సేవించి సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరంగం సష్టించాడు. తన స్నేహితుడైన ఇంద్రజిత్తో కలిసి అభ్యంతరకరంగా ప్రవర్తించడంతో పాటు పుష్ఫక్ బస్సు కండక్టర్‌పై దౌర్జన్యం చేయడంతో పోలీసులు ఇరువురినీ అరెస్టు చేశారు. ఆర్జీఐఏ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ కష్ణయ్య కథనం ప్రకారం రవితేజ తన స్నేహితుడైన పంజగుట్టకు చెందిన వ్యాపారి శ్రీనివాసులు కుమారుడు ఇంద్రజిత్తో కలిసి ఆదివారం అర్ధరాత్రి వరకు నగరంలో మద్యం సేవించారు. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మరోసారి మద్యం తాగాలని భావించిన ఇద్దరూ దానికోసం ప్రయత్నించారు. హోలీ పండుగ నేపథ్యంలో నగరంలోని మద్యం దుకాణాలన్నీ మూసేయడంతో శంషాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి ట్రాన్సిట్ ప్రీమియం ప్లాజాకు వెళ్లి మద్యం కావాలని డిమాండ్ చేశారు. అప్పటికే ఇరువురూ మద్యం మత్తులో ఉన్న విషయం గుర్తించిన బార్ సిబ్బంది అందుకు నిరాకరించారు. దీంతో బార్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన రవితేజ, ఇంద్రజిత్ పరుషపదజాలంతో దూషించారు. తీవ్రస్థాయిలో గలాభా సష్టించిన తరవాత అక్కడ మద్యం తీసుకున్న ఇద్దరూ సమీపంలోని పుష్పక్ బస్‌స్టాప్ వద్దకు వెళ్లారు. దాని సమీపంలో బస్సు కోసం వేచి ఉన్న మహిళా ప్రయాణికులు ఉన్నారు. వారిని పట్టించుకోకుండా వారు ఇద్దరూ మద్యం తాగుతూ నానా హంగామా చేశారు. ఈ విషయం గమనించిన కౌంటర్లోని కండక్టర్ రమేష్‌గౌడ్‌తో పాటు సిబ్బంది వచ్చి వీరిద్దరినీ వారించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ కౌంటర్ వద్దకు చేరుకున్నారు. ఇంద్రజిత్ తన చేతికి ఉన్న కట్టును రమేష్‌గౌడ్‌కు చూపిస్తూ, దానిపై ‘నీ పేరు రాయి’ అంటూ గద్దించాడు. పరిస్థితి చేయిదాటుతోందని ఊహించిన కండక్టర్ సమీపంలోని సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఇరువురూ కండక్టర్‌ను అభ్యంతరకర పదజాలంతో దూషించారు. తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగి కాలర్ పట్టుకుని దాడికి యత్నించారు. రమేష్‌గౌడ్ వెంటనే అక్కడే ఉన్న పోలీసు సబ్-స్టేషన్ సిబ్బంది దష్టికి తీసుకెళ్లారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్జీఐఏ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. రమేష్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవితేజ, ఇంద్రజిత్‌పై ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరినీ అత్తాపూర్‌లోని మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు.