Industrial incentives
-
రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుంటే.. టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్రచారం
-
పరిశ్రమలు తెచ్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం: సీఎం జగన్
-
గతంలో హడావుడి ఎక్కువ.. పని తక్కువ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుంటే.. టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్టైల్ పరిశ్రమలకు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాల విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పరిశ్రమలకు ప్రకటించిన రాయితీలన్నీ అమలు చేస్తున్నాం. కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేకపోతే పరిశ్రమలు మూతపడతాయి. 25 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు’ అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు, అదే రకంగా స్పిన్నింగ్ మిల్స్‌ను ఆదుకునేందుకు ఇవాళ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. తమకు తాము శ్రమ చేస్తూ మరో 10 మందికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని ఎంస్ఎంఈలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 97,423 మంది ఎంఎస్ఎంఈలు నడుపుతున్నారని మరో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని సీఎం అన్నారు. అక్కడ ఏమీ జరక్కముందే.. ‘‘ఇలాంటి రంగాన్ని ఆదుకోవడం అంటే.. రాష్ట్రం ప్రభుత్వం ఒక మాట చెప్తే.. చేస్తుంది అని నమ్మకం కల్పించడం అంటే.. పరిశ్రమలను పెట్టడానికి విశ్వాసం కల్పించడమే. మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేవారుసహా వీరందరినీ కాపాడగలిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడినట్టు అవుతుంది. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా జీడీపీకి దోహదపడతాయి. గతంలో మాదిరిగా హడావిడి ఎక్కువగా ఉంటేది. పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు, కాగితాల మీద అగ్రిమెంట్లు పెట్టుకునేవారు, ఆ రోజుల్లో అక్కడ ఏమీ జరక్కముందే.. మైక్రోసాఫ్ట్ వచ్చేసింది.. ఎయిర్‌బస్ వచ్చేసింది అని మరో రోజు, బుల్లెట్ రైలు వచ్చేసిందని మరో రోజు ఇలా హెడ్‌లైన్స్ పెట్టి రాసేవారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కనపెట్టి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకుండా నిజంగానే పరిశ్రమలను తీసుకురావడానికి అడుగులు ముందుకేస్తున్నాం. మన కళ్లముందే కనిపిస్తున్నాయి.. పరిశ్రమలు ఎక్కడ వస్తున్నాయో.. మన కళ్లముందే కనిపిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు కూడా మన కళ్లముందే కనిపిస్తున్నాయి. పరిశ్రమలు రావాలంటే... దానికి అనుకూల వాతావరణం ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ అనేదాన్ని చెప్తే.. దాన్ని ఇచ్చేలా ఉండాలి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితులను చూస్తే... ఆర్థిక వ్యవస్థ మందగమనం కనిపిస్తోంది. అనుకూలతలేని పరిస్థితులనుంచి కూడా ప్రజలను కాపాడుకోవాలి, ఒక వేళ డిమాండ్ తగ్గకుండా చూసుకుంటూ, మరోవైపు పరిశ్రమలను నిలబెట్టే కార్యక్రమాలు చేయాలి. ఇదే దిశగానే అడుగులు వేస్తూనే ముందుకు పోవడం జరుగుతుంది. పరిశ్రమలు రావడమే కాదు, కొనుగోలు శక్తి ప్రజలకు ఉన్నప్పుడే ఆ పరిశ్రమలు నిలబెడతాయి. అది లేకపోతే.. ఆ సైకిల్ దెబ్బతింటుంది, పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయి, మూతబడే పరిస్థితి ఉంటుంది. కోవిడ్ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే దాదాపు 22 సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకు వచ్చాం. దాన్ని కూడా నెగెటివ్‌గా చూపిస్తున్నారు.. ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా వివక్షకు ఆస్కారం ఇవ్వకుండా ప్రతి పేద లబ్ధిదారునికి డీబీటీ పద్ధతిలో వారి అక్కౌంట్లోకి వేస్తున్నాం. ఈ 27 నెలలకాలంలో మన ఇచ్చిన డబ్బు కుటీర, మధ్యతరహా పరిశ్రమలను నిలబెట్టగలిగాయి, అంతేకాకుండా ఉపాధిని నిలబెట్టడానికి ఉపయోగపడ్డాయి. ఇలాంటి కష్టకాలంలో కూడా ప్రజల కొనుగోలు శక్తి నిలబెట్టగలిగాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మైనస్ 5శాతం ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితులకు ఆస్కారం లేకుండా మన రైతును, మన వెనకబడ్డ వారిని నిలబెట్టుకోగలిగాం. గ్రోత్‌రేట్ చిన్నదే అయినా నిలబెట్టుకోగలిగాం. అప్పోసప్పో చేసైనా సరే అందించిన డబ్బే ఒక రాష్ట్రానికైనా, దేశానికైనా సంజీవని అవుతుందని అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు చెప్పినమాట. కాని దురదృష్టవశాత్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటివాళ్లు, తెలుగు దేశం పార్టీవాళ్లు..... ప్రజలను కాపాడుకునేందుకు అప్పోసప్పో చేసే కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కూడా నెగెటివ్‌గా చూపించే అధ్వాన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. పండే చెట్టుమీదే రాళ్లు పడతాయి... వీళ్లు ఎలాంటి నెగెటివ్ కార్యక్రమాలు చేసినా.. దేవుడి దయతో మంచి చేయాలనుకున్న కార్యక్రమాలను చేస్తాం. పరిశ్రమలు, వాటిమీద ఆధారపడ్డ కుటుంబాలకు మరింత చేయూతనిస్తున్నాం. 12 లక్షలమందికి ఉపాధినిస్తున్న పరిశ్రమలకు చేయూతనిస్తున్నాం. ఎంఎస్ఎంఈలకు రూ.450 కోట్లు, టెక్స్టైల్ స్పిన్నింగ్‌మిల్స్‌కు రూ.684 కోట్లు నేరుగా వారి అక్కౌంట్లోకి వెళ్తాయి. 27 నెలలకాలంలోనే ఇప్పటివరకూ ఈ రంగాలకు ప్రభుత్వం అందించిన మొత్తం రూ.2,087 కోట్లు ఆసరా, చేయూత, తోడు లాంటి కార్యక్రమాలు కాకుండా ఇవి అదనంగా ఇచ్చాం. గత ప్రభుత్వం 2015 నుంచి ఎంఎస్ఎంఈలకు బకాయి పెట్టిన రూ.904 కోట్లు, సిన్నింగ్మిల్స్కు పెట్టిన రూ.684 కోట్లు మొత్తంగా రూ. 1,588కోట్ల బకాయిలను మన ప్రభుత్వం చెల్లిస్తోంది. లబ్దిపొందుతున్న యూనిట్లలో 62శాతం ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఉన్నారు. 42 శాతం యూనిట్లు అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ప్రోత్సహకాలు ఇవ్వకపోతే వీళ్లు రోడ్డుమీద పడతారన్న ఆలోచన గత ప్రభుత్వం చేయలేకపోయింది. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ చట్టంచేసిన ప్రభుత్వం మనది. ఇవే కాకుండా పారిశ్రామికంగా అడుగులు ముందుకేస్తున్నాం. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో రూ.10వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి 801 ఎకరాల్లో రూ.730 కోట్లతో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్యూనిట్లను రూపొందిస్తున్నాం. వచ్చే 2 ఏళ్లలోనే దాదాపు 30వేలమందికి ఉపాధి అవకాశాలు. వైఎస్సార్ నవోదయం కింద 1,08,292 ఎంఎస్ఎంఈ బ్యాంకు ఖాతాలకు చెందిన రూ.3,236 కోట్ల రూపాయలకు పైగా రుణాలను రీషెడ్యూల్ చేశాం. 2,49,591 ఎంస్ఎంఈ బ్యాంకు ఖాతాలకు అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకం కింద బ్యాంకు రుణాలతో అదనపు వర్కింగ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేశాం. మన ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ రూ.30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. దీనిద్వారా 46,199 మందికి ఉపాధి లభించిందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇవీ చదవండి: పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం జగన్ ఆదర్శమంటే ఆయనే: సర్కారు కాలేజీలో పీవో కుమారుడు -
Andhra Pradesh: ఉపాధితో అభివృద్ధి
సాక్షి, అమరావతి: కోవిడ్ కష్ట కాలంలో అప్పో, సప్పో చేసి ప్రజల కొనుగోలు శక్తిని పెంచామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 25 సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పేదల ఖాతాలకు నేరుగా డబ్బులు అందించడం ద్వారా పరిశ్రమలు, ఉపాధిని నిలబెట్టామని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మన ఖర్మ కొద్దీ ఒక ఎల్లో మీడియా.. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5 ఉన్నాయని.. వీళ్లంతా ఒకవైపున ఉంటే, వీళ్లకు కొమ్ము కాస్తూ తెలుగుదేశమనే అన్యాయమైన పార్టీ కూడా నిందలు వేస్తోందన్నారు. ప్రజలను కాపాడుకునే కార్యక్రమాన్ని వక్రీకరించి, పెడదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ నెగెటివ్ లైన్లో చూపించే అధ్వాన పరిస్థితులు మన రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పారు. పళ్లు పండే చెట్టు మీదే రాళ్లు పడతాయన్న సామెతను తాను గట్టిగా నమ్ముతానని, వీళ్లు ఎంత నిరుత్సాహ పరిచే కార్యక్రమాలు చేసినా సరే.. దేవుడి దయతో మంచి చేయాలనుకున్నది చేస్తామని స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రోత్సాహకాలు పొందిన లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ విశ్వాసం కల్పించాం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 97,423 మంది ఎంఎస్ఎంఈలు నడుపుతున్నారు. వీరు చిన్న చిన్న పరిశ్రమలను పెట్టడమే కాకుండా, మరో 12 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలాంటి రంగాన్ని ఆదుకోవడం అంటే.. ఇలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెబితే చేస్తుందని నమ్మకం కల్పించడం. అంటే, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టానికి విశ్వాసం కల్పించమే అవుతుంది. ఎంఎస్ఎంఈలతోపాటు మధ్యతరహా పారిశ్రామిక వేత్తలనూ కాపాడ గలిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడగలుగుతుంది. వ్యవయసాయం ఏ రకంగా జీడీపీకి దోహదకారి అవుతుందో, పరిశ్రమలు కూడా అదేరకంగా తోడ్పాటును అందిస్తాయి. చిత్తశుద్ధి, అంకిత భావంతో చర్యలు గతంలో హడావిడి ఎక్కువగా ఉండేది. పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు. కాగితాల మీద అగ్రిమెంట్లు రాసుకునే వారు. ఆ రోజుల్లో మీడియా కూడా పోలరైజ్డ్‌గా ప్రచారం చేసేది. ఇవాళ కూడా మీడియా అదే పోలరైజ్డ్‌గానే ఉంది. అప్పట్లో అక్కడ ఏమీ జరక్కముందే.. మైక్రోసాఫ్ట్ వచ్చేసిందని ఒకరోజు రాసేవారు. ఎయిర్ బస్ వచ్చేసిందని మరో రోజు రాసేవారు. బుల్లెట్ రైలు వచ్చేసిందని ఇంకోసారి హెడ్‌లైన్స్‌లో వార్తలు చూశాం. ఏమీ జరక్కపోయినా, ఏమీ రాకపోయినా మీడియా హడావిడిని బాగా చూశాం. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కనపెట్టి, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకుండా.. నిజంగానే పరిశ్రమలను తీసుకురావడానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న ప్రభుత్వం మనది. వచ్చిన పరిశ్రమలు ఏంటో.. మన కళ్లముందే కనిపిస్తున్నాయి. స్థానికులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కళ్లముందే కనిపిస్తున్నాయి. ఒక పరిశ్రమ పెట్టాలంటే రాష్ట్రంలో వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. ఇన్సెంటివ్‌లు ఇస్తామని చెప్తే, ఆ ఇన్సెంటివ్‌లను ఇస్తారన్న నమ్మకం, విశ్వాసం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలమీద ఉండాలి. అప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తారు. పరిశ్రమలను నిలబెట్టే చర్యలు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను గమనిస్తే.. ఆర్థిక వ్యవస్థ మందగమనం కనిపిస్తోంది. వస్తువులకు, సేవలకు డిమాండ్ తగ్గినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి అనుకూలతలేని పరిస్థితుల్లో ఒక వైపున ప్రజలను కాపాడుకోవాలి. ఇంకోవైపున వస్తువులకున్న డిమాండ్ తగ్గకుండా చూడాలి. మరోవైపున పరిశ్రమలను నిలబెట్టే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే దిశగా అడుగులు వేస్తూనే ముందుకు పోతున్నాం. ఈ 27 నెలల కాలంలో మనందరి ప్రభుత్వం అందించిన డబ్బుతో ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా రాష్ట్రంలోని కుటీర, మధ్యతరహా పరిశ్రమలను, ఉపాధి రంగాన్ని నిలబెట్టగలిగాం. డీబీటీ ద్వారా ప్రతి కుటుంబాన్ని నిలబెట్టగలిగాం – కోవిడ్ విపత్తు నెలకొన్న ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన.. ఇలా దాదాపు 25 సంక్షేమ, అభివృద్ధి పథకాలు తీసుకొచ్చాం. – ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా ప్రతి పేద లబ్ధిదారుడి చేతికి డబ్బు అందించాం. ఒక బటన్ నొక్కగానే ఎలాంటి అవినీతికి తావులేకుండా డీబీటీ పద్ధతిలో నేరుగా వాళ్ల ఖాతాల్లోకి వేయడం ద్వారా దేవుడి దయతో మన రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని నిలబెట్టగలిగాం. – ఇలాంటి కష్టకాలంలో పేదల చేతికి ప్రభుత్వం అప్పో, సప్పో చేసైనా సరే అందించిన డబ్బే ఒక రాష్ట్రానికైనా, దేశానికైనా సంజీవని అవుతుందని అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక వేత్తలు గట్టిగా చెబుతున్నారన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడి ఎల్లో మీడియా, టీడీపీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా వారి స్వార్థం కోసం వక్రీకరిస్తుండటం దురదృష్టకరం. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు మైనస్ 5.2 శాతం ఉన్న ఈ సమయంలో కూడా, మన రాష్ట్రంలో అలాంటి వెనుకబాటుకు ఆస్కారం ఇవ్వలేదు. మన రైతును, మన పరిశ్రమను, మన పేద సామాజిక వర్గాలను మనం నిలబెట్టుకోగలిగాం. చిన్న గ్రోత్ రేటు అయినప్పటికీ, మిగతా వాళ్లంతా మైనస్‌లో ఉన్నా, మనం మాత్రం ఎంతో కొంత పాజిటివ్‌గానే అడుగులు ముందుకు వేశాం. పరిశ్రమలను రప్పించడమే కాకుండా, అవి ఉత్పత్తి చేస్తున్న వస్తువులను కొనుగోలు చేసే శక్తి ప్రజలకు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. దానివల్ల పరిశ్రమలు నిలబడతాయి. ఉపాధికి ఊతం లభిస్తుంది. అట్టడుగు వర్గాల్లోని ప్రజలకు ఆ కొనుగోలు శక్తి లేకపోతే ఆర్థిక సైకిల్‌తో పాటు, అందులో ఉన్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా దెబ్బ తింటారు. పరిశ్రమలు మూతబడే పరిస్థితి వస్తుంది. – సీఎం వైఎస్ జగన్ ఇవీ చదవండి: గతంలో హడావుడి ఎక్కువ.. పని తక్కువ: సీఎం జగన్ ఏపీ పోలీస్ శాఖకు 5 జాతీయ అవార్డులు: డీజీపీ -
ఏపీ: నేడు రీస్టార్ట్–2 ప్యాకేజీ విడుదల
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో వరుసగా రెండో ఏడాది కూడా పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదన్న లక్ష్యంతో గత ఏడాది మే 22న దేశంలోనే తొలిసారిగా రీస్టార్ట్ ప్యాకేజీ పేరుతో రూ.1,100 కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్‌తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఈ ఏడాది కూడా ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్లులకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను అందిస్తోంది. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా ఈ నిధులు విడుదల చేయనున్నారు. ఇందులో ఎంఎస్ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్లులకు రూ.684 కోట్లు ఇవ్వనున్నారు. తద్వారా పారిశ్రామికాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తూ రాష్ట్రంలో 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్స్‌కు భరోసా కలగనుంది. పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాల్లో 62 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవే ఉన్నాయి. అదేవిధంగా ప్రోత్సాహకాలు అందుకున్న యూనిట్లలో 42 శాతం మహిళలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ బకాయిలు రూ.1,588 కోట్లు చెల్లింపు గడచిన రెండేళ్లలో పరిశ్రమలకు రూ.2,086.42 కోట్ల విలువైన రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇందులో రూ.1,588 కోట్లు గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలానికి సంబంధించిన బకాయిలే కావడం గమనార్హం. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు రూ.904 కోట్లు, స్పిన్నింగ్ మిల్లులకు రూ.684 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను బకాయిపడింది. ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పటికీ గత ప్రభుత్వం పరిశ్రమలకు బకాయిలు చెల్లించలేదని, కానీ పరిశ్రమలకు ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో ప్రోత్సాహకాలు విడుదల చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత బకాయిలతో పాటు ప్రోత్సాహకాలను సకాలంలో చెల్లిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. మౌలిక వసతులకు పెద్ద పీట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందని మంత్రి మేకపాటి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు నిర్వహణ వ్యయం తక్కువగా ఉండే విధంగా మూడు పారిశ్రామిక కారిడార్లలో మౌలికవసతులు అభివృద్ధి చేస్తున్నామని, అదే విధంగా ఇచ్చిన మాట ప్రకారం రాయితీలను కూడా సకాలంలో చెల్లించడం ద్వారా రాష్ట్రంపై పారిశ్రామికవేత్తల నమ్మకాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. దీనికి నిదర్శనమే ఈ రెండేళ్లలోనే 16,311 ఎంఎస్ఎంఈ యూనిట్లు రాష్ట్రంలో రూ.5,204.09 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయని, వీటి ద్వారా 1,13,777 మందికి ఉపాధి లభిస్తోందన్నారు. కొప్పర్తిలో రెండు భారీ పారిశ్రామిక పార్కులు ఇదిలావుండగా.. రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా కొప్పర్తిలో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను 3,155 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇండస్ట్రియల్ హబ్‌లో విద్యుత్, నీరు, సీఈటీపీలు, ఎస్టీపీల వంటి అత్యున్నత మౌలిక సదుపాయాలతో బహుళ ఉత్పత్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. తద్వారా 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.10 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడానికి కొప్పర్తిలో రూ.730.50 కోట్లతో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. తద్వారా మరో 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. -
త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ : గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి : ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ (ఏపీపీ) మిల్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వెనక్కి తరలిపోతుందన్న ప్రచారాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఖండించారు. పేపర్ మిల్లు వెనక్కి వెళ్లిపోయిందని వస్తున్న కథనాలు అవాస్తవమని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించవద్దని కోరారు. త్వరలోనే పరిశ్రమల శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసి ఇలాంటి దుష్ప్రచారాలకు తెరదించి నిజానిజాలేంటో ప్రజల ముందుంచుతామన్నారు. త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానం తెస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా సౌకర్యవంతమైన ప్రదేశం అని పెట్టుబడిదారులు భావిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అవినీతిరహిత, పారదర్శక పాలన దిశగా ముందుకు తీసుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై పరిశ్రమల యాజమాన్యాలకు భరోసా ఉందన్నారు. ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఔట్ రీచ్ అవగాహన సదస్సులో దిగ్గజ పరిశ్రమలతో పాటు పలు పేరున్న సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచినట్లు మంత్రి వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల వ్యవధిలోనే ఏపీఐఐసీకి 800 పరిశ్రమల నుంచి దరఖాస్తులు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేదిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. పారదర్శక పారిశ్రామిక విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నష్టం కలిగించని రీతిలో పరిశ్రమలకు సానుకూలమైన విధానాలని ప్రవేశపెడతామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న అస్పష్టమైన విధానాలతో పరిశ్రమలశాఖ రూ.2500 కోట్లు బకాయిలు పడిందని దానివల్ల పెట్టుబడిదారులు గందరగోళంలో పడ్డారన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని గత ప్రభుత్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలని మంత్రి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఆ బకాయిలు తీర్చే బాధ్యతను భుజాన వేసుకుందని, అంతేగాక రాబోయే రోజుల్లో ఇలాంటి లోపాయికారి ఒప్పందాలను, ఆచరణయోగ్యంకాని విధానాలను సహించబోమని మంత్రి వెల్లడించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తామని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వ విధానాలు నచ్చి అదాని కంపెనీ కృష్ణపట్నం పోర్టులో రూ.5500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడమే తమ ప్రభుత్వం పట్ల పరిశ్రమలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. పరిశ్రమలకు, రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలగని రీతిలో తమ ప్రభుత్వం నూతన పాలసీ ప్రకటించేందుకు కొంత సమయం పడుతుందన్నారు. రెండు మూడు నెలల్లో ప్రకటించే కొత్త పాలసీ వల్ల ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేశారు. పరిశ్రమలకిచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతుందన్నారు. రాయితీలపై స్పష్టతనిచ్చి పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తామని చెప్పారు. ఐదేళ్లలో చేయాల్సిన పని చేయకుండా ఇప్పుడు కొందరు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాయితీలు చెల్లించకుండా రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకువచ్చిన వారే ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు, వాటికిచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలు అన్నింటిపై ఆర్థికశాఖ, పరిశ్రమల శాఖ సంయుక్తంగా సమీక్షించిన అనంతరం మార్గదర్శకాలు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. -
‘టీ–ఐడియా’ నిబంధనల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందించే ‘టీ–ఐడియా 2014’పథకం నిబంధనల్లో పరిశ్రమల శాఖ పలు మార్పులు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన నియమావళి ప్రకారం సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు చెల్లించే ప్రోత్సాహకాలను ఇకపై తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా విడుదల చేస్తారు. ప్రోత్సాహకాల చెల్లింపునకు అవసరమైన మొత్తాన్ని ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఖాతాకు పరిశ్రమల శాఖ కమిషనరేట్ బదిలీ చేస్తుంది. ఇప్పటివరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలను రాష్ట్ర స్థాయి కమిటీ (ఎస్ఎల్సీ) ఆమోదంతో దరఖాస్తుల సీనియారిటీ ఆధారంగా పరిశ్రమల శాఖ విడుదల చేస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం సవరించిన నిబంధనల ప్రకారం పరిశ్రమల శాఖ విడుదల చేసే ప్రోత్సాహకాల మొత్తంలో ఇకపై 10 శాతం సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఎస్ఐహెచ్సీఎల్) ఖాతాకు జమ చేస్తారు. ప్రోత్సాహకాల విడుదల కోసం సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఇకపై టీఎస్ఐహెచ్సీఎల్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఆయా పరిశ్రమల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి తదితరాలపై అధ్యయనం చేసి, సంబంధిత జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ)తో సమన్వయం చేసుకున్న తర్వాతే ప్రోత్సాహకాలను విడుదల చేస్తారు. గతంలో కొన్ని పరిశ్రమలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు తీసుకుని మూత పడిన నేపథ్యంలో అవకతవకలు నివారించేందుకు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌కు ప్రోత్సాహకాల విడుదల బాధ్యతను అప్పగించారు. బ్రిడ్జి రుణాలు రాబట్టుకునేందుకే! నష్టాల బాటలోఉన్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్‌ను (టీఎస్ఐహెచ్సీఎల్) రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. రాష్ట్రంలో 13,581 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఉండగా, రూ.1,018 కోట్ల పెట్టుబడితో స్తాపించిన సూక్ష్మ పరిశ్రమలు 62 వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రూ.76,286 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన చిన్న తరహా పరిశ్రమలు సుమారు 75 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానుల్లో చాలా మందికి వ్యాపార దక్షత లేకపోవడం, మార్కెటింగ్ ఒడిదుడుకులు తదితరాలతో నష్టాలబమS బాటన పయనిస్తున్నారు. నష్టాల బాటలో ఉన్న సుమారు 3,700 పరిశ్రమలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతోపాటు, వాటి పనితీరును మెరుగుపరిచేందుకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా ఉన్న ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ బ్రిడ్జి రుణాలను మంజూరు చేస్తోంది. తాజాగా సవరించిన టీ–ఐడియా నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి రుణగ్రస్త పరిశ్రమలకు విడుదలయ్యే ప్రోత్సాహకాలు ఇకపై హెల్త్ క్లినిక్ ఖాతాలో జమ అవుతాయి. తాము గతంలో ఆయా పరిశ్రమలకు ఇచ్చిన బ్రిడ్జి లోన్‌ను మినహాయించుకుని, మిగతా ప్రోత్సాహకాన్ని సంబంధిత పరిశ్రమలకు హెల్త్ క్లినిక్ విడుదల చేస్తుంది. -
ప్రత్యేక హోదా త్వరగా ఇవ్వండి
కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి సీఎం చంద్రబాబు విన్నపం న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పారిశ్రామిక ప్రోత్సాహకాలు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు కోరారు. ఇటీవల అస్వస్థతకు గురైన జైట్లీని ఆయన శనివారం పరామర్శించారు. ఒక రోజు పర్యటన కోసం శనివారం ఉదయం 11.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, టీడీపీ ఎంపీలతో కలిసి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా షాజహాన్ రోడ్డులోని జైట్లీ నివాసానికి వె ళ్లారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆయనను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జైట్లీతో 15 నిమిషాలకు పైగా భేటీ అయ్యూరు. జైట్లీనే చొరవ తీసుకొని రాష్ట్ర రాజధానిపై ఆరా తీశారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని నిర్మించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పారిశ్రామిక ప్రోత్సాహకాలు త్వరగా ఇవ్వాలని కోరగా ఈ అంశాలపై శాఖలవారీగా అధికారులకు చెబుతామని జైట్లీ చెప్పారని టీడీపీ ఎంపీలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక లోటును పూడ్చటం, పారిశ్రామిక రారుుతీల విషయంలో కేంద్ర ఏ విధంగా సహకరిస్తుందో స్పష్టత ఇవ్వాలని జైట్లీని చంద్రబాబు కోరినట్టు వారు తెలిపారు. అనంతరం చంద్రబాబు ఏపీ భవన్‌కు వచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో గెయిల్ చైర్మన్ బీసీ త్రిపాఠి ఏపీ భవన్‌కు వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపులపై చర్చించారు. ఆతర్వాత నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్ ఏకే మిట్టల్ నేతృత్వంలోని అధికారులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. చిత్తూరులోనే ‘హీరో’ ప్లాంట్! ఏపీలోని చిత్తూరు జిల్లాలో ద్విచక్ర వాహనాల తయూరీ ప్లాంట్ ఏర్పాటుకు హీరో మోటార్స్ కార్పొరేషన్ సుముఖత వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ ప్లాంట్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతున్నారుు. ఈనెల 16న టీడీపీ పాలనలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్లాంట్ ఏర్పాటుపై ఎంఓయూ కుదుర్చుకోనున్నట్టు సమాచారం. సీఎంతో హీరో కంపెనీ సీఈవో సమావేశమయ్యూరు. ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో బాబు భేటీ! సీఎం చంద్రబాబు శనివారం ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసినట్టు సమాచారం.