ప్రత్యేక హోదా త్వరగా ఇవ్వండి
కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి సీఎం చంద్రబాబు విన్నపం
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పారిశ్రామిక ప్రోత్సాహకాలు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు కోరారు. ఇటీవల అస్వస్థతకు గురైన జైట్లీని ఆయన శనివారం పరామర్శించారు. ఒక రోజు పర్యటన కోసం శనివారం ఉదయం 11.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, టీడీపీ ఎంపీలతో కలిసి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా షాజహాన్ రోడ్డులోని జైట్లీ నివాసానికి వె ళ్లారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆయనను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జైట్లీతో 15 నిమిషాలకు పైగా భేటీ అయ్యూరు. జైట్లీనే చొరవ తీసుకొని రాష్ట్ర రాజధానిపై ఆరా తీశారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని నిర్మించనున్నట్లు చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పారిశ్రామిక ప్రోత్సాహకాలు త్వరగా ఇవ్వాలని కోరగా ఈ అంశాలపై శాఖలవారీగా అధికారులకు చెబుతామని జైట్లీ చెప్పారని టీడీపీ ఎంపీలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక లోటును పూడ్చటం, పారిశ్రామిక రారుుతీల విషయంలో కేంద్ర ఏ విధంగా సహకరిస్తుందో స్పష్టత ఇవ్వాలని జైట్లీని చంద్రబాబు కోరినట్టు వారు తెలిపారు. అనంతరం చంద్రబాబు ఏపీ భవన్‌కు వచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో గెయిల్ చైర్మన్ బీసీ త్రిపాఠి ఏపీ భవన్‌కు వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపులపై చర్చించారు. ఆతర్వాత నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్ ఏకే మిట్టల్ నేతృత్వంలోని అధికారులు చంద్రబాబుతో సమావేశమయ్యారు.
చిత్తూరులోనే ‘హీరో’ ప్లాంట్!
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ద్విచక్ర వాహనాల తయూరీ ప్లాంట్ ఏర్పాటుకు హీరో మోటార్స్ కార్పొరేషన్ సుముఖత వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ ప్లాంట్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతున్నారుు. ఈనెల 16న టీడీపీ పాలనలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్లాంట్ ఏర్పాటుపై ఎంఓయూ కుదుర్చుకోనున్నట్టు సమాచారం. సీఎంతో హీరో కంపెనీ సీఈవో సమావేశమయ్యూరు.
ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో బాబు భేటీ!
సీఎం చంద్రబాబు శనివారం ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసినట్టు సమాచారం.