Indywood Film Carnival
-
ఘనంగా ప్రారంభమైన ఇండీవుడ్ 2018 ఫిల్మ్ కార్నివల్
-
సాక్షి జర్నలిస్టులకు అవార్డులు
ఇండీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గతేడాది హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు సినిమా జర్నలిజమ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కొందరు పాత్రికేయులకు బుధవారం హైదరాబాద్‌లో అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పత్రిక సినిమా పేజ్ ఇన్చార్జ్ డి.జి. భవాని, ‘సాక్షి’ టీవీ ఫిల్మ్ కరస్పాండెంట్ నాగేశ్వరరావు, ‘సాక్షి’ టీవీ డిప్యూటీ బ్యూరో చీఫ్ జోయల్‌లను ఇండీవుడ్ సంస్థ నిర్వాహకులు అవార్డులతో సత్కరించారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, దర్శకుడు ఎన్. శంకర్, ‘ఇండీవుడ్’ సోహన్ రాయ్, టీఎఫ్‌సీసీ చైర్మన్ మురళీమోహన్ రావు చేతుల మీదుగా ‘సాక్షి’ ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు. ‘‘ఈ ఏడాది ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’ డిసెంబర్ 1 నుంచి 4 వరకూ హైదరాబాద్‌లో జరుగుతుంది’’ అని సోహన్ రాయ్ తెలిపారు. -
మన మార్కెట్ రేంజ్ పెరుగుతుంది!
‘‘మనదేశంలోనే అతి పెద్ద సినిమా పండుగ ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’. ఈ ఏడాది నుంచి ఈ వేడుకకు హైదరాబాద్ శాశ్వత వేదిక కావడం గర్వకారణం. ఔత్సాహికులకు నటనలో శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయనున్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోసం స్థల సమీకరణ జరుగుతోంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినీ రంగంలోని అన్ని శాఖల వారినీ ఒకే చోటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నెల 24 నుంచి 27 వరకు హైదరాబాద్‌లోని ఆర్.ఎఫ్.సిలో ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’ జరగనుంది. ఈ వేడుక నిర్వహణ విషయమై ‘కార్నివాల్’ ఫౌండర్ డెరైక్టర్, ఎరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సి.ఇ.ఓ అయిన సోహన్ రాయ్‌తో, తెలుగు సినీ ప్రముఖులతో కలసి హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో తలసాని అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో మంత్రి చర్చించి, వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ- ‘‘ఈ వేడుక నిర్వహణకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడానికి కారణం తెలంగాణ ప్రభుత్వ సహకారం, ఇక్కడి మౌలిక వసతులు, రవాణా సదుపాయాలే. ‘కార్నివాల్’ ఇక్కడ నిర్వహించడం ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమ మార్కెట్ రేంజ్ పెరుగుతుంది’’ అని పేర్కొన్నారు. సోహన్ రాయ్ మాట్లాడుతూ- ‘‘ఈ వేడుకను ఫస్ట్‌టైమ్ కోచ్చిలో నిర్వహించాం. తెలంగాణ ప్రభుత్వ విధాన నిర్ణయాలు, సహకారంతో హైదరాబాద్‌ను శాశ్వత వేదిక చేయనున్నాం. దేశంలో నిర్మించిన చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ వేడుక నిర్వహిస్తున్నాం. సుమారు 75 దేశాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు, ఇరవై వేల మంది సందర్శకులు హాజరవుతారు. 200కి పైగా స్టాల్స్‌తో మెగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు, నిర్మాత సి.కల్యాణ్, ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఐ అండ్ పీఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో అతిపెద్ద సినిమా పండుగ
హైదరాబాద్: ఆసియా ఖండంలోనే అతి పెద్ద సినిమా పండుగకు హైదరాబాద్ వేదిక కానుంది. ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్ పేరుతో సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు జరగనున్న సినీ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన తలసాని.. ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్ ద్వారా సినిమా రంగంలోని అన్ని కళలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ వేడుకలో 75దేశాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొంటారని, యూరోపియన్, చైనీస్ సినిమా రంగం నుంచి కూడా ప్రముఖులు, అతిధులు వస్తారని వివరించారు. కార్నివాల్లో భాగంగా 200కు పైగా స్టాల్స్ ద్వారా ఒక మెగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. ఎగ్జిబిషన్లో పాల్గొనేందుకు సుమారు 100 సంస్థలు ఆసక్తి చూపాయని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యానిమేషన్ సంస్థలు.. డిస్ని, ప్యారామౌంట్, డ్రీమ్‌వరల్డ్, కేన్స్, దుబాయి ఫిల్మ్ మార్కెట్ తదితర సంస్థలు స్టాళ్లను ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. ఫిలిం కార్నివాల్ లో భాగంగా 80 దేశాలకు చెందిన 200 చిత్రాలు, దాదాపు 1000 లఘు చిత్రాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 300 మంది పెట్టుబడిదారులకు.. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయతలపెట్టిన అంతర్జాతీయ ఫిలిం ఇనిస్టిట్యూట్‌ను చర్చించనున్నట్లు తెలిపారు. ఈ ఇనిస్టిట్యూట్ స్థాపన కోసం 50 నుంచి 100 ఎకరాల స్థల సేకరణను వేగవంతం చేశామన్నారు.