infant girl
-
కవల ఆడపిల్లల్ని కాదనుకున్న తల్లి
సాక్షి, కోదాడ: నెలల నిండకముందే పుట్టిన ఆ కవల ఆడ పిల్లలను ఆ తల్లి వద్దనుకుంది. వైద్యశాలకు వచ్చిన అత్త చేతిలో పెట్టి తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ఈలోగా కవలల్లో ఒకరు.. మరికొంతసేపటికి మరొకరు.. ఇద్దరూ మృతిచెందారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరానికి చెందిన ఆరోగ్యానికి చిలుకూరుకు చెందిన నాగరాజుతో ఏడాది క్రితం వివాహమైంది. ఏడో నెల గర్భిణిగా ఉన్న ఆరోగ్యానికి నొప్పులు రావడంతో మంగళవారం ఉదయం కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చేరింది. ఆమెకు సాధారణ ప్రసవంలో కవల ఆడపిల్లలు జన్మించారు. బరువు తక్కువతో అనారోగ్యంగా ఉండటంతో వైద్యులు చికిత్స కోసం ఖమ్మం వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించారు. చదవండి: క్లాసులంటూ పిలిచి.. పసిమొగ్గలపై అఘాయిత్యం విషయం తెలుసుకున్న భర్త, అతని తల్లి వైద్యశాలకు వచ్చారు. అంతలో ఆరోగ్యం.. తనకు పిల్లలు వద్దంటూ వారిని అత్త చేతిలో పెట్టి తల్లి గారింటికి వెళ్లిపోయింది. దీంతో భర్త, అత్త కలిసి కవలలతో కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా, అప్పటికే ఇద్దరిలో ఒకరు మృతి చెందారని వైద్యులు చెప్పారు. మృతశిశువుతో పాటు బతికున్న శిశువును తీసుకొని వెళ్తున్న క్రమంలో రెండో బిడ్డ కూడా కన్నుమూసింది. ఇద్దరినీ స్వగ్రామంలో ఖననం చేశారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని కోదాడ రూరల్ పోలీసులు చెప్పారు. -
ముళ్లపొదల్లో ఆడ శిశువు
సాక్షి, శెట్టూరు: తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఆడశిశువు ముళ్లపొదల పాలైంది. మంగంపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన మహిళలకు ముళ్లపొదల్లో ఆడశిశువు కనిపించింది. వెంటనే ఆ పాపను అక్కున చేర్చుకుని సపర్యలు చేసి అనంతరం ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. అంగన్వాడీ కార్యకర్త సుధారాణి, సూపర్ వైజర్ చంద్రమ్మ, ఏఎన్ఎం జయమ్మలు ఆ శిశువును ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యాధికారి ముషీరాబేగం వైద్య పరీక్షలు నిర్వహించి ఆడ శిశువు ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఎవరైనా దంపతులు తమకు శిశువు కావాలని వస్తే నింబంధనల ప్రకారం అప్పగిస్తామని ఐసీడీఎస్ అధికారులు చెప్పారు. -
వైద్య శాస్త్రంలో అరుదైన సంఘటన
న్యూఢిల్లీ: వైద్య శాస్త్రంలో అరుదైన, వింతైన సంఘటన జరిగింది. అసోంలో జన్మించిన ఓ ఆడ శిశువుకు.. గుండె శరీరంలో కాకుండా ఛాతీపైన ఉంది. దుబ్రి జిల్లా పుట్కిబరి గ్రామంలో గురువారం రాత్రి ఈ పాప జన్మించింది. స్థానిక వైద్యులు సూచన మేరకు తల్లీబిడ్డను తొలుత దుబ్రి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి గౌహతి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి (జీఎంసీహెచ్) తరలించారు. ఈ వివరాలను కుటుంబ సభ్యులు, వైద్యులు వెల్లడించారు. జీఎంసీహెచ్ ఐసీయూలో శిశువును పరిశీలనలో ఉంచారు. బెంగళూరులోని ప్రఖ్యాత నారాయణ హృదయాలయ ఆస్పత్రితో జీఎంసీహెచ్కు వైద్య సహకార సంబంధాలున్నాయి. జీఎంసీహెచ్ వైద్యులు శిశువుకు శస్త్రచికిత్స విషయంపై బెంగళూరు ప్రఖ్యాత నారాయణ హృదయాలయ వైద్యులతో సంప్రదించారు. ఈ శిశువును ప్రభుత్వ ఖర్చులతో బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి సర్జరీ చేయించాలని అసోం వైద్య శాఖ భావిస్తోంది.