inferior goods
-
చంద్రన్న సంక్రాంతి: బూజుపట్టిన బెల్లం, పురుగుల పిండి
-
చంద్రన్న సంక్రాంతి: బూజుపట్టిన బెల్లం, పురుగుల పిండి
సాక్షి, నంద్యాల(కర్నూలు) : ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న చంద్రన్న సంక్రాంతి కానుకల పట్ల ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఉచితం అంటూ పండుగకు పురుగులు పట్టిన సరకులు పంపిణీచేస్తున్నారని రాష్ట్రమంతటా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలో రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు సిద్దం చేసిన సరుకులన్నీ నాసిరకంగా ఉండటంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పురుగులు పట్టిన పిండి, బేడలు, బూజుపట్టిన బెల్లం ఇస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవి తింటే పండుగ రోజున ఆస్పత్రిలో చేరాల్సివస్తుందని భయాందోళనలకు గురవుతున్నారు. ఉచితం అంటూ సంక్రాంతి పండుగకు ఇలా పురుగులు, బూజు పట్టిన నాసిరకం సరుకులు ఇస్తారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న కానుకలతో కాంట్రాక్టు పొందిన వ్యక్తులకే మేలు కలుగుతోందని.. కార్డుదారులు నాసిరకం వస్తువులతో ఇబ్బంది పడుతున్నారని విమర్శిస్తున్నారు. పెద్ద మొత్తంలో కాంట్రాక్టు పొందిన వ్యక్తులు తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులు సరఫరా చేశారనే ఆరోపణలు కార్డుదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
ప్రకాశం జిల్లా చంద్రన్న కానుకల్లో నాసిరకం సరుకులు
-
నాసిరకం ‘కానుకలు’
కర్నూలు (అగ్రికల్చర్): చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకలు నాసిరకంగా ఉన్నాయి. ఏ మాత్రమూ నాణ్యత లేనివి పంపిణీ చేసి రూ.కోట్లు కొల్లగొట్టడానికి టీడీపీ మద్దతుదారులైన సరఫరాదారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో కమీషన్ల పర్వం కూడా జోరుగా నడుస్తోంది. నాణ్యత లేని వీటిని తాము రేషన్‌కార్డుదారులకు ఇవ్వలేమని అధికారులే కుండబద్దలు కొడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. క్రిస్మస్, సంక్రాంతిని పురస్కరించుకొని కార్డుదారులందరికీ చంద్రన్న కానుకలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో చౌకధరల దుకాణాలు 27,847 ఉన్నాయి. వీటి పరిధిలో 1,38,88,547 రేషన్ కార్డులు ఉన్నాయి. వివిధ జిల్లాలకు వచ్చిన గోధుమ పిండి, నెయ్యిలో నాణ్యత లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు.. వాటిని తిరస్కరించడం కలకలం రేపుతోంది. గుజరాత్ నుంచి గోధుమ పిండి.. నాణ్యత లేని గోధుమ పిండి కర్నూలు జిల్లాతోపాటు కోస్తా జిల్లాలకు చేరింది. కర్నూలు జిల్లాకు 963 టన్నుల గోధుమ పిండి ప్యాకెట్లు మంగళవారం వచ్చాయి. కాసుల కక్కుర్తితో గుజరాత్ నుంచి నాసిరకం గోధుమ పిండిని దిగుమతి చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్యాకింగ్ తేదీ నుంచి వ్యాలిడిటీ మూడు నెలలు ఉండాలి. కానీ కొన్ని ప్యాకెట్లపైన వ్యాలిడిటీ 2 నెలలు ఉండగా, కొన్నిటికి తయారీ తేదీ, వ్యాలిడిటీ డేట్ లేకపోవడం గమనార్హం. నిబంధనలు పాటించకపోవడం, నాసిరకంగా ఉండటంతో మొత్తం ప్యాకెట్లను అధికారులు వెనక్కి పంపారు. కోస్తా జిల్లాల్లో కూడా తిప్పిపంపినట్టు సమాచారం. కంపుకొడుతున్న నెయ్యి.. కర్నూలు, అనంతపురం జిల్లాలతోపాటు కోస్తా జిల్లాలకు సరఫరా చేసిన నెయ్యి కంపు కొడుతోంది. కర్నూలు జిల్లాకు 6.13 లక్షల ప్యాకెట్లు వచ్చాయి. ఇందులో ఏ ఒక్కటీ నాణ్యతతో లేదని అధికారులే నిర్ధారించారు. నెయ్యి ప్యాకెట్లను వాపసు తీసుకొని.. తిరిగి మంచివి ఇవ్వాలని కోరారు. అయితే.. అధికారులు మాత్రం ఆవు నెయ్యి వచ్చింది.. అందువల్లే తిరస్కరించామని బయటికి చెబుతున్నారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా బెల్లం నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. అర కిలో బెల్లం ప్రత్యేకంగా ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఇస్తున్నారు. ఇది బంకలా సాగుతోంది. అది కూడా నల్లగా సారాయి బెల్లాన్ని తలపిస్తోంది. శనగ, కందిపప్పుల్లోనూ కల్తీ స్పష్టంగా కనిపిస్తోంది. నాసిరకం సరుకులనే పంచాలి! చంద్రన్న కానుకల పేరుతో జిల్లాకు వచ్చిన సరుకులనే పంచాలని, వాటి స్థానంలో వేరేవి ఇచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చిచెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్వాకంతో పండగ పూట కార్డుదారుల నుంచి తాము తిట్లు తినాల్సి వస్తుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్న కానుకల సరఫరా బాధ్యతను అధికార పార్టీ నేతలు తీసుకున్నట్లు సమాచారం. ‘మేం పంపిన వాటినే తిరస్కరిస్తారా? అక్కడ మీరు ఎలా పనిచేస్తారో చూస్తాం’ అని అధికారులను బెదిరిస్తున్నారు. కాగా, క్రిస్మస్ సందర్భంగా కార్డుదారులకు ఏడు రకాల సరుకులను పంపిణీ చేస్తున్నారు. 500 గ్రాముల బెల్లం, కిలో చొప్పున కందిపప్పు, శనగపçప్పు, గోధుమ పిండి, 500 ఎం.ఎల్ పామోలిన్ ఆయిల్ ప్యాకెట్, 100 ఎం.ఎల్ నెయ్యి ఇవ్వాల్సి ఉంది. నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలనేది లక్ష్యం క్రిస్మస్, సంక్రాంతి కానుకలను నాణ్యమైనవి పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన గోధుమ పిండి, నెయ్యి తిరస్కరించాం. జిల్లాకు ఆవు నెయ్యి వచ్చింది. గోధుమ పిండి ప్యాకెట్లపై వ్యాలిడిటీ డేట్ లేదు. కొన్నిటికి ఉన్నా తక్కువగా ఉంది. వ్యాలిడిటీ 3 నెలలు ఉండాలి. గోధుమపిండి ప్యాకెట్లను తిరస్కరించాం. బెల్లం, ఇతర సరుకుల నాణ్యత బాగానే ఉంది. – ప్రసన్న వెంకటేశ్, జేసీ, కర్నూలు -
నాసిరకం కానుకలు..!
* కందిపప్పులో రాళ్లు, పురుగులు * నెయ్యి,బెల్లం తూకంలో అవకతవకలు * రెండు డిపోలకు చేరని సరుకులు * అందని సంచులు * అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు లక్కవరపుకోట: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న క్రిస్మస్,సంక్రాంతి కానుకల్లో నాసిరకం సరుకులను అందజేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. పేదలే కదా ఇచ్చింది తీసుకుంటారు,..అదికూడా ఉచితంగానే కదా ఎలాంటి సరుకులు ఇస్తే ఏమిటి అనుకున్నారో ఏమో.పురుగులు పట్టి,పుచ్చిపోయిన కందిపప్పు.నాసిరకమైన బెల్లం అందజేస్తున్నారని లబ్ధిదారులు అవేదన చెందుతు న్నారు. ప్రతి తెల్లరేషన్ కార్డు దారుడికి కేజీ గోధుమపిండి,వంద గ్రాముల నెయ్యి,అరకేజీ బెల్లం,కందిపప్పు, శనగపప్పు,పంచదార అరకేజీ చొప్పున అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వస్తువులను వాటి తూకాల ప్రకారం ప్యాకింగ్ చేసి కోట్లు రూపాయలు వెచ్చించి చంద్రబాబు ఫొటోతో ముద్రించిన సంచుల్లో అబ్ధిదారులకు అందజేస్తున్నారు. అయితే ఈ సరుకుల్లో బెల్లం అరకేజీకి బదులు 450 గ్రాములు,వంద గ్రాముల నెయ్యికి 90 గ్రాముల నెయ్యి మాత్రమే వస్తున్నట్లు పలువురు వాపోతున్నారు.అలాగే కందిపప్పులో రాళ్లు, పెంకిపురుగులతో పూర్తిగా నాసిరకం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని చెబుతున్నారు.ఈ సరుకులు అందజేసే సంచులు మాత్రం ఒక్కో డిపోకు కేవలం 50 చొప్పున అందజేశారు. ఆ సంచుల్లో ఎవరికి ఇవ్వాలో తెలియక డీలర్లు అయోమయంలో ఉన్నారు. క్రిస్మస్ పూర్తయినా అందని సరుకులు ప్రస్తుతం అదికారులు ముందస్తుగా క్రైస్తవ మతస్తులకు చంద్రన్న సంక్రాంతి కానుకలను క్రిస్మస్ పర్వదినానికి అందజేసేందుకు సిద్ధమయ్యారు. కాగా నేటికీ వేపాడ మండలంలోని చిన్నదుంగాడ,వేపాడ డిపోలకు సరుకుల సరఫరా జరగేదు.మరికొన్ని డిపోల్లో సర్వర్ పనిచేయకపోవడంతో సరుకుల పంపిణీ జరగలేదు. లక్కవరపుకోట మండలంలోని 15,834కార్డులు,వేపాడ మండలంలో 14,633కార్డులు ఉన్నాయి. సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో శుక్రవారం నాటికి కేవలం 5శాతం మందికి మాత్రమే సరుకులను అందజేశారు. లబ్ధిదారుల్లో అసహనం ప్రభుత్వం అందజేస్తున్న సరుకుల్లో తూకాలు సక్రమంగా లేవని అదికూడా నాసిరకమైన సరుకులు అందజేయడంతో పలువురు లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రచారం తప్ప సరుకుల్లో నాణ్యత లేదని వాపోతున్నారు. ఇచ్చింది గోరంత అయితే ప్రచారం మాత్రం కొండంతగా ఉందని అంటున్నారు. దీపావళికి కేజీ పంచదార అందజేస్తామని ప్రకటించారు. కాగా ఆరకేజీ చొప్పునే అందజేశారని పలువురు వాపోతున్నారు. ఈ విషయమై సీఎస్‌డీటీ రామచంద్రారెడ్డిని వివరణ కోరగా..సరుకుల కొలతలో తేడాలు వస్తున్నట్లు,నాణ్యత విషయంపై పలువురి దగ్గరనుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అంగీకరించారు. ఈ విషయాలను పై అధికారులకు తెలియజేశామని చెప్పారు. మేము చేసిన ప్యాకింగ్‌లు కావు చంద్రన్న కానుకకు సంబంధించిన సరుకులు మేము ప్యాకింగ్ చేయలేదు. ప్యాకింగ్ చేసిన వస్తువులే మాకు అందజేశారు.ఆసరుకులే లబ్ధిదారులకు అందజేస్తున్నాం. తూకంలో కొద్దిపాటి తేడాలు రావడము వాస్తవమే. - ఐ.ముత్యాలు,ఆర్.జి.పేట డీలర్ సరుకులు బాగోలేవు ప్రస్తుతం కోటాలో ఇస్తున్న పండగ సరుకులు బాగోలేవు. బెల్లం,నెయ్యి తూకం వేస్తే తక్కువ వస్తున్నాయి.డీలర్లను అడిగితే వారు ఇచ్చిందే పంచుతున్నామంటున్నారు. -ఆర్.సత్యవతి,శ్రీరాంపురం -
కానుకలోనూ కక్కుర్తి
నెల్లూరు(రెవెన్యూ): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న సంక్రాంతి కానుక ప్రచార ఆర్భాటం తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదని తేలిపోయింది. సంక్రాంతి పండగ వేడుకలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన చంద్రన్న సంక్రాంతి కానుక వస్తువులు పూర్తిస్థాయిలో ఇంకా చేరనే లేదు. చేరిన వస్తువులను కూడా అరకొరగా పంపిణీ చేశారు. అనేక ప్రాంతాల్లో పంపిణీ చేసిన సరుకులు తక్కువగా వస్తున్నాయి. తూకాల్లో వ్యత్యాసం ఉంది. మరి కొన్నిచోట్ల నాసిరకమైన సరుకులు పంపిణీ చేశారు. మొత్తంగా చూస్తే రాష్ట్రప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన చంద్రన్న సంక్రాంతి కానుక ప్రచారం కోసం తప్ప పేదల కోసం కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 8.24 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. రేషన్ సరఫరా చేయడానికి 17 ఎంఎల్ఎస్ పాయింట్లు, 1,872 చౌక దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా కందిపప్పు, పామాయిల్, బెల్లం, గోధుమపిండి, శనగలు, నెయ్యి పంపిణీ చేయాల్సి ఉంది. అన్ని ఎంఎల్ పాయింట్లకు సరుకులు అరకొరగా దిగుమతి చేసి ఉన్నారు. వచ్చిన సరుకులకు అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతన ఉండటం లేదు. జిల్లాకు రావాల్సిన సరుకులన్నీ ఆదివారం రాత్రికే పూర్తిస్థాయిలో చేరాల్సి ఉంది. ఆ సరుకులను పండగకు ఒకరోజు ముందే పంపిణీ చేయాల్సి ఉంది. అయితే పూర్తిస్థాయిలో సరుకులు రాకపోవటంతో సోమవారం అనేక మండలాల్లో చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులు పంపిణీ కాకపోవటం గమనార్హం. తూకాల్లో మోసం.. చంద్రన్న సంక్రాంతి కానుక కింద పంపిణీ చేస్తున్న ఆరు రకాల వస్తువులు ప్రభుత్వం ప్రకటించిన తూకం కంటే తక్కువగా ఉందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. నెల్లూరుకు చెందిన రమణమ్మకు మూడు వస్తువులు మాత్రమే ఇచ్చారు. వాటిల్లో గోధుమపిండి 50 గ్రాములు, శనగలు 50 గ్రాముల తక్కువగా ఉందని ఆమె తెలిపింది. ఇలా జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పంపిణీ చేసిన సరుకుల్లో 50 నుంచి 150 గ్రాముల వరకు తక్కువగా ఉన్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా గోధుమపిండి, శనగలు, బెల్లం నాసిరకంగా ఉందని కార్డుదారులు వాపోతున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో గోధుమపిండి, బెల్లం, శనగలు, కందిపప్పు బస్తాల్లో దిగుమతి చేశారు. అలా వచ్చిన సరకులు దాదాపు నాసిరకంగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా బస్తాల్లో నుంచి తూకాలు వేసి ప్యాక్చేస్తున్నారు. అందులోనే తేడాలు వస్తున్నాయి. నెల్లూరు, నెల్లూరు రూరల్ కలపి 150 చౌకదుకాణాలకు పైగా ఉన్నాయి. నెల్లూరులోని చౌకదుకాణాలకే పూర్తిస్థాయిలో సంక్రాంతి కానుక సరఫరా కాలేదు. డీలర్లు మాత్రం మాకు మూడు వస్తువులే సరఫరా చేశారని తెలుపుతున్నారు. మిగిలిన మూడు వస్తువులు వస్తే పంపిణీ ప్రారంభిస్తామని డీలర్లు తెలుపుతున్నారు. సూళ్లూరుపేట, ఆత్మకూరు, ఉదయగిరి తదితర ప్రాంతాలకు సంక్రాంతి కానుక పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. దీంతో అనేక చోట్ల డీలర్లు వచ్చిన అరకొర సరుకులను కూడా పంపిణీ చేయలేదు. అదేవిధంగా వెయ్యి రేషన్కార్డులపైన ఉన్న చౌకదుకాణాల్లో ప్రతి 300ల కార్డులకు ఒక ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని జేసీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాలో ఎక్కడా అది అమలు కాలేదు. చంద్రన్న సంక్రాంతి కానుక సరుకుల అరకొర అందటం, నాణ్యత లేకపోవటంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. అధికారులు పరిస్థితి ఇలా ఉంటే... టీడీపీ నాయకులు మాత్రం కొంతమంది కార్డుదారులకు చంద్రన్న సంక్రాంతి కానుక ప్యాకెట్లు సరఫరా చేసి పండగ చేసుకోండంటూ గొప్పలు చెప్పుకోవటం గమనార్హం. ఈ విషయంపై సంబంధిత అధికారులు విలేకరులు అడిగిన ప్రశ్నలకు అన్ని వస్తువులను సరఫరా చేస్తామని చెబుతున్నారు. వస్తువు పేరు అవసరమైన (మెట్రిక్ టన్నుల్లో) వచ్చింది రావాల్సినవి 1. బెల్లం 412 246 166 2. కందిపప్పు 824 633 191 3. గోధుమపిండి 824 341 483 4. పామాయిల్ 412 401 011 5. నెయ్యి 824 626 198 6. శెనగపప్పు 412 198 214