inflaton data
-
దిగ్గజాలకు చిన్న సంస్థల సవాల్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో దిగ్గజ కంపెనీలకు చిన్న సంస్థలు సవాళ్లు విసురుతున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గడంతో చిన్న బ్రాండ్లు మళ్లీ బలంగా పుంజుకుంటున్నాయి. పెద్ద సంస్థలకు బలమైన పోటీనిస్తున్నాయి. మార్కెట్లో వాటాను పెంచుకంటూ, పెద్ద సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించక తప్పని పరిస్థితులను కలి్పస్తున్నాయి. సబ్బులు, టీ, డిటర్జెంట్, బిస్కట్ల విభాగంలో ఈ పరిస్థితి ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), గోద్రేజ్ కన్జ్యూమర్, మారికో, బ్రిటానియా, టాటా కన్జ్యూమర్ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాల విడుదల సందర్భంగా.. చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీ కారణంగా ఉత్పత్తుల ధరలను సవరించాల్చి వచి్చనట్టు పేర్కొనడం గమనార్హం. ‘‘ద్రవ్యోల్బణం గరిష్టాల్లో ఉన్నప్పుడు చిన్న సంస్థలకు ఉత్పత్తుల తయారీపై అధిక వ్యయం అవుతుంది. దీంతో అవి పెద్ద సంస్థలకు ధరల పరంగా గట్టి పోటీనిచ్చే పరిస్థితి ఉండదు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు మార్జిన్లు ఎక్కువగా ఉండడంతో అవి అధిక డిస్కౌంట్లు ఇవ్వగలవు’’అని బ్రిటానియా ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్, ఎండీ వరుణ్ బెర్రీ ఇన్వెస్టర్ల కాల్లో పేర్కొన్నారు. ఒక్కసారి కమోడిటీల ధరలు తగ్గడం మొదలైతే, వాటి మార్జిన్లు పెరుగుతాయని, దీంతో అధిక డిస్కౌంట్లు ఇవ్వడం మొదలు పెడతాయన్నారు. కొన్ని విభాగాల్లో అధిక పోటీ ‘‘ఒకవైపు బలమైన బ్రాండ్లతో పెద్ద సంస్థలతో పోటీ పడాలి. ధరల యుద్ధంతో అవి మార్కెట్ వాటాను చిన్న సంస్థలకు కోల్పోవాల్సి వస్తోంది. మేము ఈ చట్రంలో ఇరుక్కోవాలని అనుకోవడం లేదు. రెండింటి మధ్య సమతుల్యం ఉందనుకున్న విభాగంలోనే ముందుకు వెళతాం’’అని టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ పేర్కొనడం గమనార్హం. టీ పొడి మార్కెట్లో ప్రాంతీయంగా చిన్న సంస్థల నుంచి పోటీ ఉన్నట్టు తెలిపింది. ఇతర విభాగాల మాదిరిగా కాకుండా, టీ మార్కెట్లో అన్ బ్రాండెడ్ కారణంగా చిన్న సంస్థలు ఎప్పుడూ ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో దీని కారణంగా కొంత వ్యాపారం కోల్పోవాల్సి వస్తుందంటూ.. తమ ప్రీమియం ఉత్పత్తుల వాటా పెరుగుతున్నందున ఇది తమపై ఏమంత ప్రభావం చూపబోదని వాటాదారులకు టాటా కన్జ్యూమర్ వివరించింది. ధరలు తగ్గింపు.. చిన్న సంస్థలు చాలా చురుగ్గా ఉన్నాయని, వాటి కారణంగా మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొన్నట్టు మారికో ఎండీ, సీఈవో సౌగత గుప్తా తెలిపారు. ప్రస్తుత పరిణామాల్లో కొన్ని విభాగాల చిన్న సంస్థల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరలు తగ్గించి, వినియోగదారులకు విలువను చేకూర్చే చర్యలు అమ్మకాల వృద్ధికి వచ్చే కొన్ని త్రైమాసికాల్లో దోహదపడతాయి’8అని సౌగత గుప్తా తెలిపారు. -
50 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం: పాతాళానికి పాక్ కరెన్సీ
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది. తాజాగా దేశంలో ద్రవ్యోల్బణం తారా స్తాయికి చేరి 50 ఏళ్ల గరిష్టం వద్ద కొత్త రికార్డు సృష్టించింది. తొలిసారి పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం 31.5 శాతానికి చేరింది. జూలై 1965లో డేటా-కీపింగ్ మొదలైనప్పటినుంచి ఏప్రిల్ 1975లో ఒకసారి ద్రవ్యోల్బణం భారీగా పెరిగినప్పటికీ, 29 శాతంగా ఉండట గమనార్హం. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) తాజాగా గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో వినియోగదారుల ధరల సూచీ 31.5 శాతం వద్ద మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.అటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) ప్రకారం, అమెరికా డాలర్‌తో పోలిస్తే పాక్ రూపీ గణనీయంగా పడిపోయింది.ఈ ఏడాది 20 శాతం క్షీణించి డాలర్ మారకంలో 284 వద్ద రికార్డు స్థాయికి క్షీణించింది. దీంతో దక్షిణాసియా దేశం ఇప్పుడు ప్రపంచంలో 17వ అత్యంత ఖరీదైన దేశంగా అవతరించింది.పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ విదేశీమారకద్రవ్య నిల్వలు మూడు వారాల దిగుమతులకు సరిపడా స్థాయికి పడిపోయాయి. ఇది ఇలా ఉంటే గత నెల ప్రారంభం నుండి చర్చలు జరుపుతున్నప్పటికీ ఐఎంఎఫ్ నిధుల అంశం ఒక కొలిక్కి రావడం లేదు. ఈ ఆలస్యం కరెన్సీ మార్కెట్లో అనిశ్చితిని సృష్టిస్తోందని కరాచీకి చెందిన బ్రోకరేజ్ హౌస్ టాప్‌లైన్ సెక్యూరిటీస్‌కు చెందిన మహ్మద్ సోహైల్ అన్నారు. మరోవైపు వచ్చే వారం నాటికి ఐఎంఎఫ్ ప్రాథమిక డీల్‌పై ఆర్థిక మంత్రి దార్ భారీ ఆశలు పెట్టుకున్నారు. -
Economy: ఎకానమీలో వెలుగు రేఖలు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ఆర్థిక మూలాలు పటిష్టతను ప్రతిబింబిస్తూ తాజా గణాంకాలు విడుదలయ్యాయి. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సానుకూల రీతిలో 11.9 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఆగస్టులో ఐఐపీ సూచీ 117.2 వద్ద ఉంటే, 2021 ఆగస్టులో 131.1 పాయింట్లకు ఎగసింది. వెరసి వృద్ధి 11.9 శాతమన్నమాట. ఇదిలాఉండగా, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 4.35 శాతంగా నమోదయ్యింది. పారిశ్రామిక ఉత్పత్తి తీరిదీ.. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన పారిశ్రామిక వృద్ధి గణాం కాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం ఆగస్టు 2021లో 9.7 శాతం వృద్ధిని (2020 ఇదే నెల ఉత్పత్తితో పోల్చి) నమోదుచేసుకుంది. ► మైనింగ్: ఉత్పత్తి 23.6 శాతం ఎగసింది. ► విద్యుత్: ఉత్పత్తి విషయంలో వృద్ధి రేటు 16%. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సంకేతమైన క్యాపిటల్ గూడ్స్ విభాగం 19.9 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే నెలల్లో క్షీణత 14.4 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లకు సంబంధించిన ఈ విభాగంలో 8% వృద్ధి నమోదయితే, గత ఏడాది ఇదే కాలంలో ఈ విభాగంలో 10.2% క్షీణత నెలకొంది. ► కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్: ఎఫ్ఎంసీజీ రంగానికి సంబంధించి ఈ విభాగంలో 3 శాతం క్షీణత 5.2 శాతం వృద్ధిలోకి మారింది. ► ఎనిమిది మౌలిక రంగాలు: మొత్తం సూచీలో దాదాపు 40 శాతం వాటా కలిగిన ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఆగస్టులో 11.6 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. బొగ్గు, సహయ వాయువు రంగాల ఉత్పత్తిలో 20.6 శాతం పురోగతి నమోదయ్యింది. సిమెంట్ రంగం 36.3% పురోగమించగా, స్టీల్ విషయంలో ఈ వృద్ధి శాతం 5.1 శాతంగా ఉంది. పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి 9.1 శాతం పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి 15.3 శాతం ఎగసింది. క్రూడ్ ఆయిల్ (మైనస్ 2.3 శాతం), ఎరువుల (మైనస్ 3.1 శాతం) పరిశ్రమలు మాత్రం ఇంకా వృద్ధి నమోదుకాకపోగా, క్షీణతను ఎదుర్కొన్నాయి. ఐదు నెలల్లో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్–ఆగస్టు) ఐదు నెలల కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 28.6 శాతం. గత ఏడాది ఇదే కాలంలో 28.6 శాతం క్షీణత నమెదయ్యింది. కోవిడ్ సవాళ్లతో ఒడిదుడుకుల బాట మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. కీలక గణాంకాలను పరిశీలిస్తే... బేస్ కూడా కారణమే! తాజా సానుకూల గణాంకాలకు బేస్ కూడా కారణం కావడం గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 ఆగస్టు నెలను తీసుకుంటే కరోనా కష్టాలతో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 7.1 శాతం క్షీణతను (2019 ఇదే కాలం ఉత్పత్తితో పోల్చి) నమోదుచేసుకుంది. ఇక ఎనిమిది పరిశ్రమల గ్రూప్ కూడా 2020 ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా 6.9 శాతం క్షీణతను ఎదుర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఎనిమిది రంగాల పురోగతి 19.3 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కరోనా కష్టాలతో ఈ గ్రూప్ వృద్ధి లేకపోగా 17.3% క్షీనత నమోదయ్యింది. 5 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఇక సెప్టెంబర్‌లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ప్రభుత్వం ఇస్తున్న నిర్దేశాలకు అనుగుణంగా 4.35 శాతంగా నమోదయ్యింది. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి (2021 ఏప్రిల్‌లో 4.23 శాతం). కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు తగ్గాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతం. అయితే, గత ఏడాది సెప్టెంబర్‌లో 7.27 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెలలో ధరల స్పీడ్ విషయానికి వస్తే... ఆహార ద్రవ్యోల్బణం 0.68 శాతంగా ఉంది. ఆగస్టులో ఈ రేటు 3.11 శాతం. ఒక్క కూరగాయల బాస్కెట్ 22.47 శాతం పడిపోయింది. ఆగస్టులో ఈ తగ్గుదల 11.68 శాతం. ఇంధనం, లైట్ విభాగంలో మాత్రం రిటైల్ ద్రవ్యోల్బణం 12.95 శాతం (ఆగస్టు) 13.63 శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక పటిష్టతకు రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలని కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరళరత వడ్డీరేట్ల విధానానికి సీపీఐ ఈ స్థాయిలో కొనసాగడం కీలకం.. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందన్న భరోసాతో వృద్ధే లక్ష్యంగా గడచిన ఎనిమిది ద్వైమాసిక సమావేశాల్లో ఆర్బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు – ప్రస్తుతం 4 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగలు 5.7 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలను ఈ నెల మొదట్లో ఆర్బీఐ 5.3 శా>తానికి కుదించింది. 2021–22 రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1%, 4.5%, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2% నమోదవుతుందని భావిస్తోంది. -
102 పాయింట్లు ప్లస్
* 25,576 వద్దకు సెన్సెక్స్ * ఇంట్రాడేలో 25,600పైకి * పలుమార్లు హెచ్చుతగ్గులు * ఎఫ్ఐఐల పెట్టుబడులు పలుమార్లు ఊగిసలాటకు లోనైనప్పటికీ చివరికి మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 102 పాయింట్లు లాభపడి 25,576 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 23 పాయింట్లు బలపడి 7,650 వద్ద నిలిచింది. రోజు మొత్తం 200 పాయింట్ల పరిధిలో హెచ్చుతగ్గులను చవిచూసిన సెన్సెక్స్ ఒక దశలో 25,600ను అధిగమించడం గమనార్హం. కాగా, ఏప్రిల్ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మే రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మార్కెట్లు ముగిశాక వెలువడ్డాయి. వీటిపై దృష్టితో ఇన్వెస్టర్లు కొంతమేర ఆచితూచి వ్యవహరించారని నిపుణులు పేర్కొన్నారు. ఐఐపీ మెరుగుపడటం, సీపీఐ బలహీనపడటం వంటి అంశాలు వడ్డీ రేట్ల తగ్గింపునకు రిజర్వ్ బ్యాంక్‌కు అవకాశమిస్తాయని వ్యాఖ్యానించారు. భారతీ డీలా బ్లూచిప్స్‌లో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ షేరు 4% పతనమైంది. విదేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ క్రెడిట్ స్వీస్ న్యూట్రల్ నుంచి అండర్పెర్ఫార్మ్ స్థాయికి షేరును డౌన్‌గ్రేడ్ చేయడమే దీనికి కారణం. ముకేష్ గ్రూప్ సంస్థ రిలయన్స్ జియో నుంచి పెరగనున్న పోటీ నేపథ్యంలో రేటింగ్‌ను తగ్గించింది. మిగిలిన దిగ్గజాలలో కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, భెల్, ఆర్ఐఎల్, ఐసీఐసీఐ 2-0.5% మధ్య నష్టపోయాయి. అయితే మరోవైపు హిందాల్కో 4% పుంజుకోగా, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ ద్వయం, మారుతీ, ఎన్టీపీసీ, టీసీఎస్ 3-1% మధ్య లాభపడ్డాయి. ఇక కొత్త సీఈవోను ప్రకటించిన ఇన్ఫోసిస్ 0.4% నష్టపోయింది. చిన్న షేర్లు ఓకే మెరుగుపడ్డ సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.5% స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,746 లాభపడగా, 1,356 తిరోగమించాయి. ఎఫ్ఐఐలు రూ. 652 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ సంస్థలు రూ. 742 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.