ఆధార్ చైల్డ్ ఇన్ఫోను వెంటనే పూర్తి చేయాలి
ఒంగోలు వన్‌టౌన్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరి వివరాలను ఆధార్ నంబర్‌కు అనుసంధానం చేసి ఆన్లైన్లో నమోదు ప్రక్రియ ఆధార్ చైల్డ్ ఇన్ఫో కార్యక్రమాన్ని 100 శాతం వెంటనే పూర్తి చేయాలని సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ వి.ఉషారాణి ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో సమావేశంలో ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అధికారులు, డీఈవోలతో మాట్లాడారు. ఆధార్ చైల్డ్ ఇన్ఫో కార్యక్రమానికి మండల విద్యాధికారులు బాధ్యత వహించాలన్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలలో, తమ విద్యార్థుల వివరాలను మండల విద్యాధికారులకు అం దజేయాలని ఉషారాణి ఆదేశించారు. పాఠశాలలకు విడుదలైన నిధులను నిబంధనల మేరకు వ్యయం చేయాల న్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు విడుదల చేసిన రూ.400 కోట్ల తో చేపట్టిన పనులను త్వరలో పూర్తి చేయాలన్నారు. విద్యార్థుల గైర్హాజరు గత ఏడాది 25 శాతం ఉండగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో అది 31 శాతంకు పెరి గిందన్నారు.
యూనిఫాంల కోసం పాఠశాలలకు విడుదల చేసిన నిధుల్లో 50 శాతం ఆప్కాబ్‌కు బదలాయించాలన్నా రు. విద్యావలంటీర్ల నియామకాలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. వీడియో సమావేశంలో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి వి.శ్రీనివాసరావు, డీఈవో బి.విజయభాస్కర్, ఎస్ఎస్ఏ సెక్టోరల్ అధికారులు, ఎంఈవోలు పాల్గొన్నారు.