మంత్రి రాజీనామా.. ప్రధాని ఆమోదం!
ఇస్లామాబాద్: న్యూస్ పేపర్ కథనంతో పాకిస్తాన్ కు చెందిన ఓ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పాక్ సమాచారశాఖ మంత్రి పర్వేజ్ రషీద్ తన రాజీనామా లేఖను ప్రధాని నవాజ్ షరీఫ్ కు అందజేయగా, రాజీనామా అంగీకరించినట్లు సమాచారం. దాన్ న్యూస్ పేపర్ లో ప్రభుత్వానికి, పాక్ ఆర్మీకి మధ్య అసలు పొసగడం లేదని కథనలు వచ్చాయి. ప్రభుత్వం, ఆర్మీ మధ్య వివాదాలు తలెత్తాయాని రషీద్ స్వయంగా న్యూస్ ఏజెన్సీకి చెప్పారని ఆరోపణలొచ్చాయి.
గత మూడు వారాలుగా రషీద్ రాజీనామా అంశంపై ప్రధాని ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. అక్టోబర్ 6న వచ్చిన వార్త కథనమే మంత్రి పదవికి ఎసరు పెట్టిందని, దాని నుంచి ఎన్నో విషయాలు బటయకు వచ్చాయి. అన్ని అంశాలపై నిర్దారణకు వచ్చిన తర్వాతే పర్వేజ్ రషీద్ ను మంత్రివర్గం నుంచి తొలగించారని ప్రచారం జరుగుతోంది.