ఇది ఓ సోలార్ సముద్రం!
సముద్రపు నీళ్లతో ఏం చేయగలమో తెలియదు గానీ.. ఈ సోలార్ సముద్రం మాత్రం కావల్సినంత విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. హైదరాబాద్ శివార్లలోని పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో 6.6 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఆ సంస్థ సీఈవో, ఎండీ విశాల్ సిక్కా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సువిశాల ప్రదేశంలో ఏర్పాటుచేసిన సోలార్ ప్యానళ్ల వద్ద ఫొటో తీయించుకుని, ఇది పోచారంలోని తమ సోలార్ ప్యానళ్ల సముద్రమంటూ ట్వీట్ చేశారు. నీలి ఆకాశం నవ్వుతోందని కూడా చెప్పారు. ఇప్పటికే పోచారం క్యాంపస్‌లో 0.6 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంటు ఉంది. దీంతో కలిపితే మొత్తం 7.2 మెగావాట్ల సామర్థ్యం ఉన్నట్లయింది.
తమ క్యాంపస్ అవసరాలకు కావల్సిన మొత్తం విద్యుత్తు ఈ సోలార్ ప్లాంటు నుంచే వస్తుందని విశాల్ సిక్కా తెలిపారు. దీంతో.. ఇలా తమకు కావల్సిన విద్యుత్తు అంతటినీ పునరుత్పాదక ఇంధనవనరుల నుంచి పొందే మొట్టమొదటి కార్పొరేట్ క్యాంపస్‌గా పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ నిలిచింది. ఇక్కడి ప్లాంటును విజయవంతంగా గ్రిడ్‌తో అనుసంధానం చేశారు. ఏడాదికి 12 మిలియన్ల కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు. తద్వారా కార్బన్ ఉద్గారాలను 9,200 టన్నుల మేర తగ్గించినట్లవుతుంది. దీంతో కలిపి దేశవ్యాప్తంగా ఇన్ఫోసిస్ 12 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను నెలకొల్పినట్లయింది. రాబోయే రెండు నెలల్లో మరో 3 మెగావాట్ల ప్లాంట్లను పెడతామని చెబుతున్నారు.
A sea of solar panels in our gorgeous @Infosys Hyderabad campus. Blue skies smiling at us... pic.twitter.com/iuVWI4ioGu
— Vishal Sikka (@vsikka) December 28, 2015
The @Infosys Hyderabad campus is now 100% off the grid, thanks to our 7.2MW solar farm & our incomparable infra team https://t.co/iHsRwpaA13
— Vishal Sikka (@vsikka) December 28, 2015
Congrats Vishal https://t.co/B9hPx5Vmks
— KTR (@KTRTRS) December 29, 2015